
ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం, గల్లా జయదేవ్
రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్
దివిటిపల్లిలో 4 పరిశ్రమలకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో అధునాతన టెక్నాలజీతో రూ.3,225 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాను న్న నాలుగు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.
వీటికి అవసరమ య్యే లిథియం అయాన్ గిగా బ్యాటరీలను తయా రు చేసే అమరరాజా కంపెనీకి దివిటిపల్లిలో మహి ళా దినోత్సవం రోజే శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈసారి కేంద్ర బ డ్జెట్‌లో తెలంగాణకు రైల్వేశాఖ పరంగా రూ.5,337 కోట్లు కేటాయించామని, గత పదేళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అని తెలిపారు. అలాగే గత 11 సంవత్సరాల్లో మహిళలకు 10 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చామని, 14 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, 54 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని వివరించారు.
ఇక్కడి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివిటిపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆయన అశ్వినీవైష్ణవ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇవే..
రూ.1,900 కోట్లతో నిర్మించే అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1 మూడో దశ యూనిట్, రూ.800 కోట్లతో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్‌ఎఫ్‌పీ) టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందించే (అల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్) ఫ్యాక్టరీ, రూ.502 కోట్లతో చేపట్టే వ్యర్థాల ప్రాసెసింగ్ (లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ, రూ.23 కోట్లతో తలపెట్టిన ప్రత్యేక క్యాన్, క్యాప్‌లను తయారు చేసే (సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment