జిల్లాలో గల క్రీడా సంఘాలు జిల్లా ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో గల ఏవీ హాల్‌లో ఆదివారం జిల్లా ఒలింపిక్ స ంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన జరిగింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జిల్లాలో మినీ ఒలింపియాడ్‌ను నిర్వహించాలని, తిరిగి జిల్లా సర్వ సభ్య సమావేశాన్ని డిసెంబర్‌లో రాజమండ్రిలో
ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలి
Published Sun, Oct 23 2016 7:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
రామచంద్రపురం :
జిల్లాలో గల క్రీడా సంఘాలు జిల్లా ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో గల ఏవీ హాల్‌లో ఆదివారం జిల్లా ఒలింపిక్ స ంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన జరిగింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జిల్లాలో మినీ ఒలింపియాడ్‌ను నిర్వహించాలని, తిరిగి జిల్లా సర్వ సభ్య సమావేశాన్ని డిసెంబర్‌లో రాజమండ్రిలో నిర్వహించాలని తీర్మానం చేశారు. క్రీడా సంఘాలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మ¯ŒSగా వై. తాతబ్బాయి, కన్వీనర్‌గా కృష్ణమూర్తి, సభ్యులుగా రాజు తదితరులు ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మ¯ŒSగా రామరాజు, కన్వీనర్‌గా సృజనారాజు, సభ్యులుగా కనకాల వెంకటేశ్వరరావు, వై. బంగార్‌ారజు, రమణలతో కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజుతో పాటు ప్రధాన కార్యదర్శి కె. పద్మనాభం, కోశాధికారి వై. తాతబ్బాయి, పి. సీతాపతిలను సత్కరించారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, కొప్పాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
23ఆర్‌సీపీ02: మాట్లాడుతున్న జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవిందరాజు
Advertisement
Advertisement