notified
-
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు: కొత్త ఎస్పీలు, కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్:తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్గాగౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ని ఎంపిక చేశారు. కాగా రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్ల, 13 మంది IPS అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు ►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్ ►కామారెడ్డి- సింధు శర్మ ►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్ ►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్ ►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ►జోగులాంబ గద్వాల్- రితిరాజ్ ►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్ ►నారాయణపేట - యోగేష్ గౌతమ్ ►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్ ►సూర్యాపేట- బీ.కే.రాహుల్ హెడ్గే ►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా ►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్ -
2020-21 ఐటీ రిటర్న్ ఫారమ్‌ల నోటిఫై!
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను (ఐటీఆర్ ) తెలియజేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఐటీఆర్ ఫారమ్‌ల ఫైలింగ్‌లో కూడా ఎటువంటి మార్పులూ చేయలేదని వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ ఫామ్స్‌ను నోటిఫై చేసింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) గురువారం ఒక ప్రకటన చేస్తూ, కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది ఐటీఆర్‌ఫారమ్‌లలో ఎటువంటి కీలక మార్పులూ చేయకుండా, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా తాజా ఫారమ్‌లను నోటిఫై చేసినట్లు వివరించింది. నోటిఫైడ్ ఐటిఆర్ ఫారాలు ఇ-గెజిట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఐపీవోకు సెవెన్ ఐలాండ్స్.. న్యూఢిల్లీ: సముద్ర రవాణా కంపెనీ సెవెన్ ఐలాండ్స్ షిప్పింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందింది. ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. దీనికి అదనంగా మరో రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. కాగా.. 2003లో ప్రారంభమైన కంపెనీ ఇంతక్రితం 2017లోనూ ఐపీవో ప్రయత్నాలు చేయడం గమనార్హం! -
క్షయని నోటిఫై చేయకుంటే జైలు శిక్ష
న్యూఢిల్లీ: క్షయ కేసుల వివరాలను వైద్యులు ఇకపై తప్పనిసరిగా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఔషధ విక్రేతలకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయాలతో గెజిట్ ప్రకటన జారీచేసింది. వైద్యులు, ఫార్మసీలు తప్పకుండా క్షయ వ్యాధి కేసులను నోటిఫై చేయాలని ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. -
ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలి
రామచంద్రపురం : జిల్లాలో గల క్రీడా సంఘాలు జిల్లా ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో గల ఏవీ హాల్లో ఆదివారం జిల్లా ఒలింపిక్ స ంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన జరిగింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జిల్లాలో మినీ ఒలింపియాడ్‌ను నిర్వహించాలని, తిరిగి జిల్లా సర్వ సభ్య సమావేశాన్ని డిసెంబర్లో రాజమండ్రిలో నిర్వహించాలని తీర్మానం చేశారు. క్రీడా సంఘాలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మ¯ŒSగా వై. తాతబ్బాయి, కన్వీనర్‌గా కృష్ణమూర్తి, సభ్యులుగా రాజు తదితరులు ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మ¯ŒSగా రామరాజు, కన్వీనర్‌గా సృజనారాజు, సభ్యులుగా కనకాల వెంకటేశ్వరరావు, వై. బంగార్‌ారజు, రమణలతో కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజుతో పాటు ప్రధాన కార్యదర్శి కె. పద్మనాభం, కోశాధికారి వై. తాతబ్బాయి, పి. సీతాపతిలను సత్కరించారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, కొప్పాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 23ఆర్సీపీ02: మాట్లాడుతున్న జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవిందరాజు