తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బ‌దిలీలు: కొత్త ఎస్పీలు, కమిషనర్లు | Telangana govt notifies transfers and postings of ias and ips officers | Sakshi
Sakshi News home page

తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బ‌దిలీలు: కొత్త ఎస్పీలు,కమిషనర్లు

Published Fri, Oct 13 2023 4:23 PM | Last Updated on Fri, Oct 13 2023 5:24 PM

Telangana govt notifies transfers and postings of ias and ips officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అన్ని పోస్టుల నియామకాలపై ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్‌, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

యాదాద్రి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌గాగౌతం, ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా వాణీ ప్ర‌సాద్, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా సునీల్ శ‌ర్మ‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్‌గా క్రిస్టినా  నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్‌ కమిషనర్‌గా క‌ల్మేశ్వ‌ర్‌ని ఎంపిక చేశారు.  

కాగా రానున్న తెలంగాణా ఎ‍న్నికల నేపథ్యంలో రాష్ట్రంలో  ఈసీ  ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను  బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ సహా నలుగురు జిల్లాల కలెక్టర్ల, 13 మంది IPS అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది.

పోలీసు క‌మిష‌న‌ర్లు, ఎస్పీల జాబితా వివరాలు 
►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్
►కామారెడ్డి- సింధు శర్మ
►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్
►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్
►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
►జోగులాంబ గద్వాల్- రితిరాజ్
►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్
►నారాయణపేట - యోగేష్ గౌతమ్
►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్
►సూర్యాపేట-  బీ.కే.రాహుల్ హెడ్గే

►వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్-అంబ‌ర్ కిషోర్ ఝా
►నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ -కల్మేశ్వ‌ర్ సింగేనేవ‌ర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement