IAS officials
-
ఏపీలో IASల బదిలీలు..
-
తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్ ల బాగోతం
-
తెలంగాణలో 9మంది ఐఏఎస్‌లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్‌లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు. తాజా పోస్టింగ్‌లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్‌గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదివరన్ ఐఏఎస్‌లను నియమించారు. అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్‌గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్‌లను నియమిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. -
తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు: కొత్త ఎస్పీలు, కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్:తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్గాగౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ని ఎంపిక చేశారు. కాగా రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్ల, 13 మంది IPS అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు ►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్ ►కామారెడ్డి- సింధు శర్మ ►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్ ►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్ ►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ►జోగులాంబ గద్వాల్- రితిరాజ్ ►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్ ►నారాయణపేట - యోగేష్ గౌతమ్ ►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్ ►సూర్యాపేట- బీ.కే.రాహుల్ హెడ్గే ►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా ►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్ -
తెలంగాణ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె. హరిత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ములుగు జిల్లా కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మీ టూరిజం డైరెక్టర్‌గా కె. నిఖిల ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి నియమించారు. ఇక తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. చదవండి: కవిత, కేటీఆర్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్‌కు మరో లేఖ హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహ శబారిష్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న కే స్వర్ణలతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్‌ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మను చౌదరిని, టీఎస్ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్‌గా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. -
ఏపీ సీఎస్‌పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్‌లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్‌రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
హైకోర్టు తీర్పు గుబులు.. ఆ 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితేంటి?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినందున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ రాష్ట్రానికే వెళ్లాలని మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నతాధికారుల్లో గుబులు రేపుతోంది. హైకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ తీర్పుతో మిగిలిన ఉన్నతాధికారులంతా విధిగా ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా అలాగే తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి) -
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్‌గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్‌లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్‌షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ
-
టీ–హబ్‌ను సందర్శించిన ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం నగరంలోని టి–హబ్‌ను 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. టి–హబ్‌లోని పలు ఇన్నోవేషన్ హబ్‌లైన వి–హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), రీసర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణ (రిచ్), ఇమేజ్, తదితర కేంద్రాలను, వారు రూపొందించిన ఆవిష్కరణలను ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. టి–హబ్ ఇప్పటివరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను అందించిందని, స్టార్టప్‌లు, ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు టి–హబ్‌ను సందర్శించినవారిలో ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
సాక్షి, అమరావతి: 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్ ప్రొబేషనర్స్‌కు మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్‌లు ఉన్నారు. ఇదీ చదవండి: మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిన సీఎం. pic.twitter.com/7VIDUFBpz9 — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 7, 2022 -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. లిక్కర్ పాలసీపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎ.గోపీకృష్ణ, ఆనంద్‌కుమార్ తివారీని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా, ఆనంద్‌కుమార్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఈ ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు -
పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్‌గా ఉన్న చదలవాడ నాగరాణిని సాంకేతిక విద్య డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పోలా భాస్కర్‌ను సాంకేతిక విద్య డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్‌ను హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆప్కో ఎండీ, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల శాఖ సీఈఓ బాధ్యతల నుంచి చదలవాడ నాగరాణిని రిలీవ్ చేశారు. ఇక బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్ మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే, బి. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాసరావుకు రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. -
ట్రెండింగ్‌లో ‘కుక్క’.. ఆ జంటను ఆడేసుకుంటున్నారు
పెంపుడు కుక్కను ఈవినింగ్ వాక్ కోసం స్టేడియంలోకి తీసుకెళ్లడం, ఆ ఐఏఎస్ జంట కోసం నిర్వాహకులు అథ్లెట్లను ఖాళీ చేయించడం.. నిన్నంతా ఈ వ్యవహారం దేశ రాజధానిలో హీట్ పుట్టించింది. విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగగా.. ఆ జంటపై ఆఘమేఘాల మీద ‘బదిలీ’ చర్యలు తీసుకుంది కేంద్ర హోం శాఖ. అయితే ఈ జంట వ్యవహారం ఇప్పుడు ట్విటర్లో కొత్త ట్రెండ్‌కు దారి తీసింది. ఈ ఉదయం నుంచి #Kutta హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఐఏఎస్ జంట అయిన సంజీవ్ ఖీరావర్, రింకూ దుగ్గను చెరో ప్రాంతానికి బదలీ చేసింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ. ఖీరావర్‌ను లడఖ్, దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌ను బదిలీ చేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగానూ శిక్ష విధించింది. Karmo ka fal babu-bhaiya.#Ladakh 🤝 #ArunachalPradesh ❤️ Kutta kiske sath jayega????😉#Delhi #IASCouple #Dog pic.twitter.com/bEh1qpI7qB — Roshan Singh🚩 (@Yogi_Bhkt) May 27, 2022 ఈ తరుణంలో.. నెట్లో కుక్క మీమ్స్ నవ్వులు పూస్తున్నాయి. పూల్ ఔర్ కాంటే సినిమాలోని అజయ్ దేవగణ్ ఫేమస్ స్టంట్‌ను ఈ జంటపై ప్రయోగించాడు ఓ నెటిజన్. అక్కడి నుంచి మొదలైన.. కుక్క ట్రెండ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. Kutta right now -:#IASOfficer pic.twitter.com/OAO7A4JNCp — 𝙆𝘼𝙆𝘼𝙎𝙃𝙄𝙄 (@_meherbaaa_) May 27, 2022 ఇద్దరూ చెరోవైపు వెళ్లారని, పాపం ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందని ఫన్ పుట్టిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే.. త్యాగరాజ్ స్టేడియంలో ఈ జంట కోసం అథ్లెట్లను వెళ్లగొట్టిన ఘటనపై ఢిల్లీ సీఎస్ దగ్గరి నుంచి నివేదిక తెప్పించుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఆపైనే బదిలీ చర్యలు తీసుకుంది. Meanwhile dog #Kutta #IASOfficer pic.twitter.com/uDejS64GUO — Hardev Singh (@hardevsingh93) May 27, 2022 #WhereWillTheDogGo #Kutta #8Years_Of_Disaster Actually what was the problem, IAS couple providing security cover for the dog, or the dog not getting SPG cover😂😂 pic.twitter.com/gL1DtyNZLQ — Anoasku (@Anoasku) May 27, 2022 సంబంధిత వార్త: స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. -
హైకోర్టులో ఆ ఐఏఎస్‌లకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారులు వై. శ్రీలక్ష్మీ, బి. రాజశేఖర్, చినవీరభద్రుడు, జె. శ్యామలరావు, జి. విజయ్‌కుమార్, ఎంఎం నాయక్‌లకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది. ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహంలో నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సామాజిక సేవ చేయాలంటూ సింగిల్ జడ్జి విధించిన శిక్షను హైకోర్టు ధర్మాసనం ఎనిమిది వారాలపాటు నిలిపివేసింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక సేవకు ఐఏఎస్‌ల అంగీకారం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలను తొలగించాలన్న ఆదేశాలను సకాలంలో అమలుచేయకపోవడాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కోర్టు ధిక్కారంగా పరిగణించారు. ఇందుకు పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి. విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్‌లను బాధ్యులుగా చేశారు. కోర్టు ధిక్కారం కింద వారికి నెలరోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అయితే.. వారు క్షమాపణ కోరడంతో పాటు వారి అభ్యర్థన మేరకు ఆ శిక్షను సామాజిక సేవగా మార్చారు. ఈ తీర్పును పునః సమీక్షించాలంటూ శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కొట్టేశారు. దీంతో సామాజిక సేవ చేయాలన్న తీర్పును సవాలు చేస్తూ ద్వివేదీ, గిరిజా శంకర్లు ఇటీవల ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లకు విధించిన సామాజిక సేవ శిక్ష అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు ఐఏఎస్ అధికారుల అప్పీళ్లు ఈ నేపథ్యంలో.. మిగిలిన ఐఏఎస్ అధికారులు కూడా సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలో, ఎంత కాలపరిమితితో విధించాలో కోర్టు ధిక్కార చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఇదే వ్యవహారంలో సీజే ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో శ్రీలక్ష్మీ తదితరులు దాఖలు చేసిన ఈ అప్పీళ్లలో కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
AP: ముగ్గురు ఐఏఎస్‌లకు స్పెషల్ సీఎస్‌లుగా పదోన్నతి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేడర్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ), ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న కే. విజయా నంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బి. రాజశేఖర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మరుగుదొడ్లను శుభ్రం చేసిన ఐఏఎస్‌లు
నెల్లూరు (టౌన్)/నెల్లిమర్ల: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇద్దరు ఐఏఎస్‌లు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) కిశోర్‌కుమార్ నెల్లిమర్ల రెల్లివీధిలో ఉన్న బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డిలోకి ప్రవేశించి బ్రష్‌ను చేతబట్టి, యాసిడ్ పోసి మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. అనంతరం తరగతి గదిలోకి ప్రవేశించి, మరుగుదొడ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. అలాగే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మరుగుదొడ్డిని శుభ్రపరిచారు. పాఠశాలల ఆవరణలో మొక్కలను నాటారు. రాజశేఖర్ మాట్లాడుతూ..పారిశుధ్య కార్మికులు, ఆయాలను చిన్న చూపు చూడకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రతకు రూ.450 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయాలు ఆర్.సుమతి, సీహెచ్ గాయత్రి, బుజ్జమ్మ, సీహెచ్ రాజేశ్వరిలను సన్మానించారు. -
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది తామిచ్చిన ఆదేశాలను అధికారులు ఇప్పటివరకు అమలుచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిర్మాణాలు చేపట్టకుండా కిందిస్థాయి అధికారులకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదని ప్రశ్నించింది. ఇప్పటికైనా అధికారులకు తగిన ఆదేశాలిస్తే, కోర్టు ధిక్కార వ్యాజ్యాలను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామంది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అన్యాయం గురించి ఎవరికి చెప్పుకుంటారని నిలదీసింది. ఐఏఎస్ అధికారుల్లో అత్యధిక శాతం మంది కోర్టు ఆదేశాలను అమలుచేయాల్సిన అవసరంలేదన్న భావనలో ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఇచ్చిన ఆదేశాలు ఇప్పటివరకు అమలుకాకపోవడానికి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ అధికారులు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు కొంత గడువునివ్వాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌లు అభ్యర్థించడంతో అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను 31కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకూ ఎనిమిది మంది అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కోర్టు ఎదుట ఉన్నతాధికారుల హాజరు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలతో సహా ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై తాజాగా పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత ఏడాది ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు అమలుచేయకపోవడంతో అధికారుల చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, పలు శాఖల ఉన్నతాధికారులను న్యాయమూర్తి కోర్టు ముందుకు పిలిపించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్ విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్‌లు హైకోర్టు ముందు హాజరైన వారిలో ఉన్నారు. పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. -
అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు
సాక్షి, బంజారాహిల్స్: తాజా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు సంపన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే బడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారని అంతా భావిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తున్న తాజా, మాజీ బ్యూరోక్రాట్లు మాత్రం తమ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు అందుకు సంబంధించిన మందులను కూడా వీరంతా ఈ బస్తీ దవాఖానాలోనే పొందుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అధికారి సురేష్ చందా.. 2018 మార్చిలో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న సౌకర్యాలతో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆకర్షితులయ్యారు. సమీపంలోనే కార్పొరేట్ వైద్యం లభిస్తుండటంతో మెల్లమెల్లగా అధికారులంతా ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మంది అధికారులు ఇక్కడ షుగర్, బీపీ పరీక్షలతో పాటు లివర్ ఫంక్షన్ టెస్టులు, రెనాల్ ప్రొఫైల్ టెస్టులు, సీరం కాల్షియం, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. దీంతో బస్తీ దవాఖానా కాస్తా కాలనీ దవాఖానాగా వరిపోయింది. ఇక్కడ సామాన్యులతో పాటు సంపన్నులు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటుండటంతో బస్తీ దవాఖానా కార్పొరేట్ ఆస్పత్రి తరహాగా సేవలు అందిస్తోంది. బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకుంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ అన్ని పరీక్షలూ ఇక్కడే.. డ్రైవర్లు, పని మనుషుల కోసం మాత్రమే ఏర్పాటైన బస్తీ దవాఖానాలో లభిస్తున్న వైద్య సేవలు సంపన్నులను సైతం ఆకర్షిస్తున్నాయి. నాణ్యమైన మందులతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరీక్షల కోసం వస్తున్నారు. ప్రతి వైద్య పరీక్షను ఇక్కడే చేయించుకుంటున్నారు. వీరితో పాటు కాలనీకి చెందిన పని మనుషులు, డ్రైవర్లు, సమీప బస్తీల నుంచి ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. – డాక్టర్ అమూల్య, ప్రశాసన్‌నగర్ బస్తీ దవాఖానా -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉన్న జె. నివాస్ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా హౌసింగ్ జేసీగా వెంకటేశ్వర్, అనంతపురం జిల్లా హౌసింగ్ జేసీగా నిశాంతి, పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా హౌసింగ్ జేసీగా కేఎస్ విశ్వనాథన్, వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్ జేసీగా ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ జేసీగా జాహ్నవి, కర్నూలు జిల్లా హౌసింగ్ జేసీగా మౌర్య, కృష్ణా జిల్లా హౌసింగ్ జేసీగా అజయ్‌కుమార్, గుంటూరు జిల్లా హౌసింగ్ జేసీగా అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా హౌసింగ్ జేసీగా విధే ఖారే, పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్ జేసీగా సూరజ్ ధనుంజయ్, విశాఖ జిల్లా హౌసింగ్ జేసీగా కల్పనకుమారి, విజయనగరం జిల్లా హౌసింగ్ జేసీగా మయూర్ అశోక్, శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జేసీగా హిమాన్షు కౌశిక్ , ఏపీ ఆగ్రోస్ ఎండీగా కృష్ణమూర్తి బదిలీ అయ్యారు. -
ఇద్దరు ఐఏఎస్‌లకు వారెంట్లు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తామిచ్చిన ఆదేశాల మేరకు తమ ముందు హాజరు కానందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేసి ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావులను తమ ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీలను ఆదేశించింది. ఈ నెల 19లోపు వారెంట్లను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా పరిధిలోని బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళికి పదోన్నతి కల్పించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ చంద్రమౌళి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఇందులో ప్రవీణ్‌కుమార్, రామారావులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గతంలో దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులను మార్చి 5న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. ఈ ధిక్కార వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా ప్రవీణ్‌కుమార్, రామారావు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేసిన న్యాయమూర్తి.. ఇద్దరు అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఇదే వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్లాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తిలను ఏప్రిల్ 6న తమ ముందు హాజరవ్వాలని ఆదేశించారు. విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం "ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా" మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. "చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని" వారు లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ "మీరు ... పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడింది" అని పేర్కొన్నారు. "ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయి" అని వారు లేఖలో తెలిపారు. "స్వేచ్ఛగా బతకాలనుకునే భారతీయు పౌరులు హక్కుకు వ్యతిరేంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్డినెన్స్‌ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యమైనది ఈ నెల ప్రాంరభంలో రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగిన సంఘటన. దీనిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. బాధితుల్లో ఓ వ్యక్తి పెళ్లి పేరుతో బలవంతంగా ఓ హిందూ యువతిని మతం మారేలా చేశాడని ఆరోపించారు. పోలీసులు సదరు వ్యక్తుల మీద ఈ ఆర్డినెన్స్ కింద కేసు నమోదు చేశారని ఐఏఎస్ అధికారులు లేఖలో తెలిపారు. అలానే మరి కొన్ని ఘటనల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. మరో ఘటనలో దంపతులను వేధించగా.. గర్భవతిగా ఉన్న యువతికి అబార్షన్ అయ్యిందంటూ ఓ ఆంగ్ల న్యూస్ పేపర్లో వచ్చిన ఉదంతాన్ని ఐఏఎస్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అలానే గత వారం బిజ్నోర్‌లో జరిగిన మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఇక సదరు ఆర్డినెన్స్ భారతీయ ముస్లిం యువకులు హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకువచ్చిన సదరు యాంటీ లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకించారు. వీరిలో జస్టిస్ మదన్ బీ లోకూర్ సదరు ఆర్డినెన్స్‌ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఎస్బిఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించారు. -
ని‘వారించండి’...
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో యువతను దుష్టశక్తులు ఉగ్రవాదంపైపు ఆకర్షిస్తూ ఉగ్ర గ్రూపుల్లో చేర్చుకుంటున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాద భూతంతో విలవిల్లాడుతు న్న జమ్మూకశ్మీర్‌లో యువత ‘తప్పుడు బాట’పట్టకుండా నివారించేందుకు మహిళా పోలీసు అధికారులు ఆయా పిల్లల తల్లులను చైతన్యపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూ చించారు. మహిళా అధికారులకు ఆ సామ ర్థ్యం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 2018 బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో మాట్లాడిన మోదీ... వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కశ్మీర్లో యువత పరిస్థితిని ప్రస్తావించడంతోపాటు టెక్నాలజీ వాడకం, శిక్షణ, నైపుణ్యం వంటి అంశాలపై ప్రొబేషనర్లకు కీలక సూచనలు చేశారు. కశ్మీరీలు ప్రేమపూర్వక ప్రజలు... ఓ మహిళా ప్రొబేషనర్‌కు బదులిస్తూ కశ్మీరీలు ఎంతో ప్రేమపూర్వక ప్రజలని మోదీ కితాబిచ్చారు. కొత్త విషయాలను నేర్చుకొనే ప్రత్యేక సామర్థ్యం వారిలో ఉందన్నారు. ‘‘వారితో నేను ఎంతగానో మమేకమయ్యాను. వారు మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తారు. కశ్మీరీ యువత తప్పుడు బాటలో పయనించకుండా ఆపేలా మనందరం కలసికట్టుగా కృషి చేయాలి. దీన్ని మహిళా పోలీసు అధికారులు ఎంతో సమర్థంగా నిర్వహించగలరు. అలాంటి పిల్ల ల తల్లులను వారు చైతన్యపరిచి యువత వెనక్కి వచ్చేలా చేయగలరు. దీన్ని తొలి దశలోనే చేయగలిగితే మన పిల్లలు తప్పుడు మా ర్గంలోకి వెళ్లకుండా నివారించగలమని గట్టిగా నమ్ముతున్నా’’అని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ వాడకమే కీలకం... సమర్థ పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుంది. అది సీసీటీవీ ఫుటేజీ కావొచ్చు లేదా మొబైల్ ట్రాకింగ్ కావచ్చు. అది మీకు ఎంతగానో దోహదపడుతుంది. క్షేత్రస్థాయి సమాచారానికి ప్రాధాన్యమిస్తూనే బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి వాటిని మెరుగైన పోలీసింగ్‌లో ఆయుధాలుగా ఉపయోగించవచ్చు’’అని మోదీ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా ఉపయోగించేలా పోలీసు అధికారులు ప్రజలకు శిక్షణ ఇవ్వాలన్నారు. పోలీసులు ఎలాంటి తప్పులు చేయరాదన్న మోదీ.. ఒకవేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వారిని పట్టిస్తుందని హెచ్చరించారు. ‘సింగం’ పాత్రల ప్రభావానికి లోనుకావొద్దు.. ‘‘పోలీసు అకాడమీ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం పరిస్థితి మారిపోతుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. మొదటి అభిప్రాయమే చివరి వరకు ఉంటుంది. మీ బదిలీతోపాటు మీ ఇమేజ్ మీ వెంట వస్తుందన్న విషయం మరువరాదు. మీకు పోస్టింగ్ లభించిన ప్రతి ఠాణాతో అనుబంధ భావనను పెంచుకొంటూ దానిని గర్వకారణంగా భావించాలి’’అని ప్రధాని కోరారు. ప్రజలను భయపెట్టి అదుపు చేయడంకన్నా వారిపై దయ, జాలిని చూపించి వారి మనసులను గెలుచుకొంటే అది చిరకాలం నిలిచిపోతుందన్నారు. ‘సింగం’లాంటి సినీ వీరోచిత పోలీసు పాత్రల ప్రభావానికి లోనుకారాదని మోదీ సూచించారు. ‘‘ఎన్నటికీ మీ ఖాకీ దుస్తులపై గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. పోలీసులు చేసిన మంచి పనుల కారణంగా ప్రత్యేకించి ప్రస్తుత కరోనా కాలంలో పోలీసులు ప్రదర్శించిన మానవత్వం కారణంగా ఖాకీ యూనిఫారం ప్రజల జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసుకుంది’’అని ప్రధాని కొనియాడారు. శిక్షణను శిక్షగా భావించొద్దు.. ‘‘శిక్షణ అనేది శిక్షతో కూడిన పోస్టింగ్‌గా భావించే మనస్తత్వం నుంచి మీరంతా బయటపడాలి. శిక్షణకు ప్రాధాన్యమిచ్చేందుకు ‘మిషన్ కర్మయోగి’కి కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఏడు దశాబ్దాల చరిత్రగల సివిల్ సర్వీసులో సామర్థ్యాల పెంపు పరంగా చూసినా, పనిపట్ల ప్రదర్శించే వైఖరిపరంగా చూసినా ఇది ఒక పెద్ద సంస్కరణ. ప్రతిభను గుర్తించడంలో, ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడంలో మిషన్ కర్మయోగి సాయపడుతుంది. దీంతో సరైన పాత్రలో సరైన వ్యక్తిని నియమించడం సాధ్యమవుతుంది’’అని మోదీ చెప్పారు. గత కొన్నేళ్లలో విపత్తు సంభవించిన సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించిన తీరు పోలీసు సేవకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిందని ప్రధాని ప్రశంసించారు. మీరంతా యువతలో స్ఫూర్తి నింపగలరు: అమిత్ షా ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారుల చిత్తశుద్ధి యువతరం మరింతగా ఐపీఎస్ బాట పట్టేలా చేయడంలో స్ఫూర్తినింపుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ భద్రత, సమగ్రతలను కాపాడటంలో రాజీపడొద్దని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సూచించారు. ప్రొబేషనరీ అధికారులంతా ప్రధాని నిర్దేశించినట్లు స్మార్ట్ పోలీస్ విజన్ లక్ష్యా లను చేరుకొని ముందుకు సాగాలన్నారు. ఆల్‌రౌండర్ ప్రొబేషనర్‌గా కిరణ్ శ్రుతి.. పాసింగ్ అవుట్ పరేడ్‌లో 71 ఆర్ఆర్ (2018) బ్యాచ్ నుంచి 121 మంది ప్రొబేషనరీ అధికారులు, 70 ఆర్ఆర్ (2017) బ్యాచ్ నుంచి మరో 10 మంది ప్రొబేషనరీ అధికారులు పాల్గొన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రొబేషనరీ అధికారులకు జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అతుల్ కార్వా ల్ ట్రోఫీలను బహూకరించారు. 2018 బ్యాచ్ ఆల్‌రౌండర్ ప్రొబేషనరీ అధికారిగా నిలిచిన డి.వి. కిరణ్ శ్రుతి పరేడ్‌కు నాయకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఈసారి ట్రైనీ అధికారుల కుటుంబ సభ్యులు, అతిథులు, మీడియాను లోపలకు అనుమతించలేదు. -
సీఎం సహాయ నిధికి కియా భారీ విరాళం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ గురువారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు. (భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం) రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన శ్రీ సీటీ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన శ్రీ సిటీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర.. విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఏపీ ఐఏఎస్‌లు.. కరోనా నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ విరాళాలకు సంబంధించిన వివరాలు అందించారు. రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన జీఎల్ మంధానీ గ్రూప్ కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఎంబీజీ కమొడిటీస్ తరఫున జీఎల్ మంధానీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని జీఎల్ మంధానీ గ్రూప్ ట్రస్టీ బిజయ్ మంధానీ ఆన్లైన్ ద్వారా సీఎం సహాయ నిధికి బదిలీ చేశారు.