చేసి చూపాలనే తపన.. | YS Jagan meeting with IAS, IPS officers | Sakshi

చేసి చూపాలనే తపన..

Published Tue, May 28 2019 6:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఎంతో నమ్మకంతో వైఎస్సార్‌ సీపీకి అఖండ మెజార్టీ  అందించిన ప్రజలకు అత్యుత్తమ, ప్రజారంజక పాలన అందించడంపై కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పుడే దృష్టి సారించారు. ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై ఆయన కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలసి పరిస్థితిని వివరించి రాష్ట్ర ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు. ఢిల్లీ నుంచి సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన జగన్‌ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కలిశారు.  ఈ సందర్భంగా పరిపాలనలో తేవాల్సిన సంస్కరణలపై సీనియర్‌  ఐఏఎస్‌లతో ప్రాథమికంగా సమీక్షించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement