
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్‌గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్‌లో చేరనున్నారు.
కేంద్ర సర్వీసులకు రజత్‌షైనీ
రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్‌ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు