సాక్షి, అమరావతి: 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర‍్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్ ప్రొబేషనర్స్‌కు మార్గనిర‍్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు.
ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్‌లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్‌లు ఉన్నారు.
ఇదీ చదవండి: మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిన సీఎం. pic.twitter.com/7VIDUFBpz9
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 7, 2022
Comments
Please login to add a commentAdd a comment