guidance
-
నిపుణులమైనా నేర్చుకుంటాం..
వృత్తిలో ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకుంటే వెనుకబడిపోతాం. రోజువారీ విధుల్లో నెగ్గుకురాలేం. ఈ ఆవశ్యకతను హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్ గుర్తించారు. పనిలో ముందుకెళ్లేందుకు తోడ్పాటు కోసం అన్వేషిస్తున్నారు.ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ కొత్త పరిశోధన ప్రకారం, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 93 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ వృత్తిలో ముందుకెళ్లేందుకు మరింత మార్గదర్శకత్వం, తోడ్పాటు కోసం చూస్తున్నారు. కొత్త కొత్త మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు తమ విధుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మిలితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో 63 శాతం మంది తమ కెరీర్లో ముందుకు సాగడం కోసం ఏఐపై ఆధారపడటం సౌకర్యంగా ఉంటుందని నమ్ముతున్నారు.ఫలితంగా ఏఐ ఆప్టిట్యూడ్‌తో కూడిన లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల వినియోగం గత సంవత్సరంలో నాన్-టెక్నికల్ ప్రొఫెషనల్స్‌లో 117 శాతం పెరిగింది. అనుభవం ఒక్కటే సరిపోదని నిపుణులు గుర్తిస్తున్నారు. నగరంలోని 69 శాతం మంది ప్రొఫెషనల్స్ నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. 41 శాతం మంది కెరీర్ వృద్ధికి నైపుణ్యం అవసరమని నమ్ముతున్నారు. వర్క్ ప్లేస్ మార్పును ఎదుర్కొంనేందుకు 60 శాతం మంది అవసరమైన నైపుణ్యాలపై మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు.ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?చాలా మంది సాంకేతిక పురోగతి (51 శాతం), సెక్టార్-నిర్దిష్ట మార్కెట్ విశ్లేషణ (42 శాతం), సామాజిక పోకడలు (34 శాతం) గురించి తెలుసుకొని భవిష్యత్తు అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారు. విషయ పరిజ్ఞానం కోసం హైదరాబాద్‌లోని 46 శాతం మంది నిపుణులు షార్ట్-ఫామ్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు. 45 శాతం మంది నిర్దిష్ట నైపుణ్యాలను అందించే లాంగ్-ఫామ్ వీడియో కోర్సులను అత్యంత సహాయకరంగా భావిస్తున్నారు. -
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
పిల్లలు హోంవర్క్ చేయకుండా మొండికేస్తున్నారా? ఇలా చేయండి
సాధారణంగా చాలామంది పిల్లలు ఆడుకోవడంలోనూ, ఫోన్లో వీడియోలు చూడటంలోనూ, వీడియో గేమ్‌లు లేదా ఆటలు ఆడుకోవడంలోనూ చూపినంత శ్రద్ధ చదువుకోవడంలో, హోంవర్క్ చేయడంలో చూపించరు. కొందరు సిసింద్రీలు మాత్రం హోం వర్క్ చేయడానికి మొండికేస్తుంటారు. అలాంటి గడుగ్గాయిలతో హోం వర్క్ చేయించడానికి తంటాలు పడలేక అదేదో మనమే చేసేస్తే పోలా... అనుకుని కొందరు పేరెంట్స్ పిల్లలకిచ్చిన హోమ్ వర్క్‌ను తామే చేసేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. మీ చిన్నారి హోంవర్క్ చేయడానికి మొండికేస్తుంటే.. ఈ చిట్కాలు పాటించి చూడండి! పని వాతావరణాన్ని సృష్టించండి.. పిల్లల చదువులో హోంవర్క్ కీలకమైన అంశం. ఇది క్లాస్ రూమ్ అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది, అధ్యయన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, బాధ్యతను అలవాటు చేస్తుంది. అందువల్ల మీ పిల్లల హోమ్‌వర్క్‌ను మీరు చేయొద్దు. దానిబదులు వాళ్లు హోంవర్క్ చేయడానికి తగిన వాతావరణాన్ని సృష్టించండి. వారికి అవసరమైన పెన్నులు, బుక్స్, పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ వంటివాటిని అందుబాటులో ఉంచండి. అప్పుడు వారే హోమ్‌వర్క్ చేయడానికి ఇష్టపడతారు. దండించ వద్దు సాధారణంగా చాలామంది పేరెంట్స్ చేసే పని.. పిల్లలు హోంవర్క్ చేయనని మొండికేస్తే తిట్టడం లేదా కొట్టడం. ఇలా చేస్తే పిల్లలు దారికి రారు సరికదా, మరింత మొండిగా తయారవుతారు కాబట్టి వారిని తిట్టి లేదా నాలుగు దెబ్బలు వేసి బలవంతానా హోం వర్క్ చేయించడానికి బదులు ప్రేమగా మాట్లాడుతూనే ఇంటి పని పూర్తి చేసేలా చూడటం చాలా మేలు చేస్తుంది. అలవాటుగా మార్చేయండి! చాలామంది పిల్లలు హోం వర్క్ అనగానే ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్న తర్వాత చేస్తాం, పొద్దున్నే లేచి పూర్తి చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. హోమ్ వర్క్‌ను వాయిదా చేయకుండా.. రోజూ ఒకే పద్ధతి ఫాలో అయ్యేలా తయారు చేయడం మంచిది. కొందరు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు, కొందరు ఆడుకున్న తర్వాత హోం వర్క్ చేయాలనుకుంటారు. మీ పిల్లలకు నచ్చిన సమయంలోనే వర్క్ చేసుకునేలా సెట్ చేయండి. రోజూ దీనినే అనుసరిస్తుంటే అదే అలవాటుగా మారిపోతుంది. తేలికవి ముందుగా... స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవగానే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకోండి. ఆ మాటల్లోనే హోం వర్క్ ఏమిచ్చారో కనుక్కోండి. తేలిగ్గా లేదా తక్కువగా ఉన్న వర్క్‌ని ముందుగా చేసేయమని చెప్పండి. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే పనులను మెల్లగా చేయించండి. సాయం చేయండి కానీ... మీరు చేయద్దు! పిల్లలు హోం వర్క్ చేయకపోతే రేపు బడికెళ్లగానే టీచర్లు కొడతారని కొంతమంది తల్లులే చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు హోం వర్క్ చేయడానికి ఆసక్తి చూపించరు. వాళ్లలో నేర్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. వాళ్లకు సహాయం కావలిస్తే చేయాలి గానీ మీరు మాత్రం చేయవద్దు. ఏ రోజుది ఆ రోజే! హోమ్‌వర్క్ ఏమీ ఇవ్వకపోతే రీడింగ్ వర్క్ చేయించండి. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే కలిగే లాభాల గురించి తెలియజెప్పి ఎప్పటి పాఠం అప్పుడు చదువుకునేలా చేయండి. -
కాంగ్రెస్ కోసం బహిరంగంగా పని చేస్తున్న టీడీపీ
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
సాక్షి, అమరావతి: 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్ ప్రొబేషనర్స్‌కు మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్‌లు ఉన్నారు. ఇదీ చదవండి: మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిన సీఎం. pic.twitter.com/7VIDUFBpz9 — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 7, 2022 -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
Sakshi Webinar: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..
సాక్షి, ఎడ్యుకేషన్: పబ్లిక్ పరీక్షలు ముగియగానే ప్రతీ ఇంటర్ విద్యార్థి మదిలో మెదిలేది.. ఇం టర్ తర్వాత ఏమి చేయాలి? ఏ కోర్సు చేస్తే కెరీర్ బాగుంటుంది..? ఎలాంటి కోర్సును ఎం పిక చేసుకోవాలి? ఏఏ కోర్సు పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగం వస్తుంది? చదువు తర్వాత ఉద్యోగం రావాలంటే ఏమి చేయాలి? ఇలాం టి ఎన్నో సందేహాలకు సరైన సమాధానాలను ఇచ్చేలా సాక్షి ఎడ్యుకేషన్ ఆ«ధ్వర్యంలో మే 18వ తేదీ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు వెబినార్ నిర్వహిస్తున్నాము. మీ సందేహాలకు ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు సమాధానాలు చెబుతారు. అలాగే, మీకు ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సబ్జెక్ట్ నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ‘విట్ యూనివర్సిటీ’ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. https://www.arenaone.in/webinar/ లింక్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 040–23322330 నంబర్‌పై సంప్రదించవచ్చు. ఈ వెబినార్‌లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రత్యేక కమిషనర్ వి.రామకృష్ణ పాల్గొంటారు.విట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బెనర్జీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషా శేషాద్రి విద్యార్థులకు సూచనలు–సలహాలు ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ బంగారు భవిష్యత్‌కు సరైన బాట వేసుకోండి. ఆల్ ది బెస్ట్.. -
సోషల్ మీడియా మార్గాన్వేషణ
సోషల్ మీడియా అనగానే మీకు మొదట గుర్తొచ్చేది ఏంటి? డొల్గొనా కాఫీ, కొవిడ్ టైమ్స్, క్వారంటైన్ టైమ్స్. ఇవి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ట్రెండీ ఛాలెంజ్‌లు. ఇవన్నీ గమనిస్తుంటే నాకేం అనిపిస్తోందో నేను చెప్తాను. ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు టీఎస్ ఎలియట్ ఒక మాటన్నారు. డిస్ట్రాక్షన్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్ బై డిస్ట్రాక్షన్ (పరధ్యానం పరధ్యానం ద్వారా పరధ్యానం నుంచి) ఈ మాట అసలు సానుకూలమైనదా? వ్యతిరేక భావం కలిగించే వాక్యమా? అన్న అనుమానం రావొచ్చు. నిజానికి ఇది తటస్థ భావం కల్పించే అర్థవంతమైన వాక్యం. ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఆలోచిస్తుంటే కూడా ఇలాంటి సందర్భమే గుర్తుకుతెస్తుంది. గందరగోళ పరిచే ఒక సందేహాత్మక రీతిలోనే సోషల్ మీడియా కూడా కనబడుతుంది. దానిని మంచి లేదా చెడు రెండింటిలో దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా మనకు ఎందుకోసం అవసరమో ముందుగా అర్థం చేసుకుని ఉండటం ముఖ్యం. ఆ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించడంలో సమతుల్యత అవసరం. ఆ సమతుల్యత ఎలా పాటించాలన్నది రోజూ క్రమం తప్పకుండా ఆ వేదికలను వినియోగించే వారు తప్పనిసరిగా తెలుకోవాలి. (హైపవర్ కమిటీతో సోషల్ మీడియా ప్రక్షాళన!) సాధారణంగా ఒక మనిషి తినడానికి రోజులో ఎంత సమయాన్ని వెచ్చిస్తారు? రెండు గంటలు లేదా మూడు గంటలు. నేను సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నానో తెలుసుకోవాలని నా మొబైల్లో చెక్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. తినడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో దాదాపు అంతే సమయం లేదా అంతకన్నా ఎక్కువ సమయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చూడటానికి వినియోగిస్తున్నాం. కావాలంటే ఎవరికి వారు తమ మొబైల్లో ఈ విషయాన్ని చెక్ చేసుకుంటే ఎవరెంత సమయం వెచ్చిస్తున్నారో తెలిసిపోతుంది. 70 శాతం మంది కెనడియన్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. వారిలో చాలామంది చిన్న చిన్న విషయాలను కూడా ట్రెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, వాటిలో కొన్ని మాత్రమే పనికొచ్చేవి కావొచ్చు. చాలా వరకు అనవసరమైనవే ఉండొచ్చు. ప్రతి రోజూ వారు చేసిన, చేస్తున్న ప్రతి పనినీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో మంచిమంచి ఫోటోలను పెడుతుంటారు. అలా ఎందుకు చేస్తారు? అలాపెట్టే ప్రతి పోస్ట్, ప్రతి ఫోటో సోషల్ మీడియాలో ఉండే వారిని ప్రభావితం చేస్తుంది అని అనుకుంటున్నారా? నిజానికి అలా ఎప్పటికీ జరగదు. కానీ ఈ 2020 లో ప్రతి ఒక్కరు అలానే అనుకుంటున్నారు. వారు పెట్టే చిన్న పోస్ట్ కూడా ఎంతో మందిని ప్రభావితం చేస్తోందని భావిస్తున్నారు. అది ఒక అపోహ, ఒక భ్రమ అని తెలిసినా సోషల్ మీడియాలో చూడగానే మనం దాన్ని నిజమని నమ్మేస్తున్నాం. ఇలాంటి విషయాలు ప్రశాంతగా ఉన్న మన మొదడులో లేనిపోని అలజడలు రేకెత్తిస్తాయి. ఆ పరిస్థితిని మనం సరిగా అర్థంకూడా చేసుకోలేం. దాంతో మనం సోషల్ డిటాక్స్‌లు హాష్‌ట్యాగ్‌లను కనిపెడతాం. డిటాక్స్ గురించి మాట్లాడే ముందు, సోషల్ మీడియా కారణంగా మనపై విష ప్రభావం చూపించే నాలుగు విధాలైన ఒత్తిడుల గురించి ఒకసారి తెలుసుకుందాం. (లాక్డౌన్ వాట్సప్ చాలెంజెస్) మొదటిది - పోల్చకోవడం : సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌ను మన నిజ జీవితంతో పోల్చుకుంటూ ఉంటాం. అదివరకు కేవలం ప్రముఖులను (సెలెబ్రిటీస్) చూసి వారి జీవితాలతో పోల్చకుంటూ ఆత్మన్యూనతతో కొంచెం నిరాశకు గురయ్యేవాళ్లం. ఇప్పుడేమో, సోషల్ మీడియాలో కనిపించే పెట్టే ప్రతి చిన్నా చితకా పోస్ట్‌ను కూడా మన జీవితాలతో పోల్చుకుంటూ ఆందోళనకు గురవుతున్నాం. విహార యాత్రకు సంబంధించి ఎవరి ప్రణాళికలు బాగున్నాయి? ఎవరు ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నారు? ఎవరు మంచిమంచి దుస్తులు ధరిస్తున్నారు? ఇలా ఆన్లైన్లో దర్శనమిచ్చే ప్రతి విషయాన్ని పోల్చుకొని మనకు మనం ఆత్మన్యూనతా భావంతో కూడిన ఒకరకమైన ఒత్తిడికి లోనవుతున్నాం. రెండవది - సోషల్ కరెన్సీ : ఈ విషయాన్ని సింపుల్‌గా చెప్పాలంటే సోషల్ మీడియాలో మనల్ని మనం మార్కెట్ చేసుకుంటున్నాం అని అర్థం. కేవలం ఒకటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడానికి మనం 100 సెల్ఫీలు తీసుకుంటున్నాం. అయితే, మనం లైక్‌ల కోసం కామెంట్స్ కోసం ప్రయత్నించడం. ఆశించినన్ని లైకులు రాకపోవడంతో సోషల్ మీడియాను వినియోగించే చాలా మంది డిప్రెషన్లోకి వెళుతున్నారు. ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఇలాంటి అనుభవాలను చవిచూసినవారే. ఇక మూడోది చాలా ఫేమస్ అదే ఫోమో : ఫోమో ( ఎఫ్ఓయమ్ఓ) ఇది మనకి తెలియని వారి కోసం చేస్తూ ఉంటాం. ఎవరైనా, కారు కొన్నాం అని స్టేటస్ పెట్టగానే కొన్నది మన వయసు వాడేనా? నాతోటిదేనా ఇలా ఆలోచిస్తాం. వేరే వారు పెట్టిన ఫోటోకి చాలా లైక్‌లు వచ్చాయి. కానీ నేను పెట్టిన పోస్టుకు రాలేదే! అని తెలియకుండానే తీవ్రంగా మథనపడుతాం. ఈ రకంగా సోషల్ మీడియా ఒక విధమైన ఒత్తిడికి గురిచేస్తూ చాలా ప్రమాదకరమైన వేదికగా పరిణమించింది. ఇక చివరిది ముఖ్యమైనది - ఆన్లైన్ వేధింపులు : సోషల్ మీడియాలో వేధింపులకు కొదవే లేదు. ఒక పరిశోధన ప్రకారం 40 శాతం మంది పెద్దలు పలు రకాల వేధింపులకు గురవుతున్నారు. 73 శాతం మంది ఏదో రకమైన వేధింపులకు సాక్షి భూతాలుగా నిలుస్తున్నవారే. ఒక మహిళా సెలెబ్రిటీ లేదా ఒక గే లేదా వైకల్యం కలిగిన వారు ఎదుర్కొంటున్న వేధింపులు అంతా ఇంతా కాదు. అంతెందుకు, సోషల్ మీడియాలో చెడుగా కామెంట్స్ వచ్చాయన్న కారణంగా కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ రచయిత మార్క్ మాన్సన్ చెప్పినట్టుగా " చాలా సందర్భాల్లో మనస్తాపానికి గురయ్యే భావనకు రావడానికి ప్రజలు బానిసలయ్యారు. ఎందుకంటే అది వారిలో ఒకరకమైన ఆనందాన్ని నింపుతుంది " ఆ కోవలోనే మరే ఇతర సంఘటనలు జరిగినట్టుగానే ఇక్కడకూడా ప్రజలు చావడానికి సిద్ధపడుతున్నారు. దీన్ని బట్టి ఆన్లైన్ వేధింపులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర ఒత్తిడులకు గురిచేసే వేదికలుగా మారాయి. ఈ రకంగా మనిషిపై అనేక ఒత్తిడులకు గురిచేసే సాధనంగా సోషల్ మీడియా కనబడుతున్నప్పటికీ, నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టుగానే సోషల్ మీడియా వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పైగా సోషల్ మీడియా వల్ల అనేకానేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకోవచ్చు. చాలా వినోదాన్ని, మానసిక ఆనందాన్ని పొందవచ్చు. అయితే, ముందుగా సోషల్ మీడియాను అర్థం చేసుకోవాలి. ఏది అవసరం ఏది అనవసరం అన్న అంశాలపై నిశిత పరిశీలన అవసరం. సోషల్ మీడియాలో సానుకూల, వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్న అంశాలను గుర్తించగలిగితే మనం ఎన్నో ఉపయోగాలు పొందగలం. ముఖ్యంగా ఈ వేదిక కారణంగా ఒత్తిళ్లకు గురవుతున్న వారు దీన్ని ఆనందకరమైన సోషల్ మీడియాగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకు అత్యంత కీలకమైన నాలుగు అంశాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. సోషల్ మీడియా ఒత్తిడిని అధిగమించాలంటే ముఖ్యంగా ఆచరించాల్సినవి ఏమంటే... సోషల్ మీడియా గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడ ఒత్తిడికి గురవుతున్నామో గ్రహించాలి. ఏ కారణం లేకుండానే మనం ఒత్తిడికి గురవుతున్నామన్న నిజం తెలుసుకోవాలి. సోషల్ మీడియా కోసం వినియోగిస్తున్న సమయాన్ని తగ్గించుకోవాలి. దానికి బానిస కాకూడదు. అదే సర్వస్వం కాదన్న విషయాన్ని ఒక మామూలు మనిషిలా ఆలోచించండి. కచ్చితంగా ఈ రెండింటినీ అనుసరిస్తే మీరు మంచి ఆన్లైన్ అనుభవాన్ని పొందగలరు. సోషల్ మీడియాలో మిమల్ని ఎవరైనా విసిగిస్తుంటే వారిని రిమూవ్ చేసేయండి. ఎవరైనా మీ ఆలోచనలకు వ్యతిరేకంగా భంగం కలిగిస్తుంటే వారిని ఆన్‌ఫాలో అవ్వండి. ఇలాంటి విషయాల్లో మీకు మీరు సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. సోషల్ మీడియా వేదికల్లో జరిగే ఎలాంటి వాదనల్లో పాల్గొనవలసిన అవసరం అంతకన్నా లేదని గమనించండి. ఏదో యుద్ధంలో మాదిరిగా సోషల్ మీడియా వేదికల్లో జరిగే వాదనల్లో పాల్గొని తలపోట్లు తెచ్చుకోవలసిన అవసరం, అగత్యం ఎంతమాత్రం లేదు. ఇలాంటి పాటించడం ద్వారా అత్యుత్తమమైన సోషల్ మీడియా మాడల్‌ను మీరు ఎంచుకున్నట్టు లెక్క. ఇలా చేయడం ద్వారా సోషల్ మీడియా కారణంగా ఎదురవుతున్న ఎలాంటి ఒత్తిళ్లు మీపై పనిచేయవు. దరిచేరవు. నేను ఈ విషయాలను పంచుకోవడానికి ప్రధాన కారణమేమంటే.. ! ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించి, సోషల్ మీడియాలో ఉండే చీకటి కోణం ఏంటో గ్రహించాలి. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని విషయాలు విషతుల్యంగా, పైశాచికంగా ఎందుకుంటాయి? అందులో చెడు ఎందుకు చేరింది? అది సోషల్ మీడియా వేదికల వల్లా? లేక అందులో భాగస్వామ్యమయ్యే వ్యక్తుల కారణంగానా? మీకు కథ నచ్చలేదని మాక్‌బుక్‌ను నిందించడం సరైంది కాదు. అలాగే ఏవో కొన్ని అంశాల కారణంగా మీరు సోషల్ మీడియా తప్పు అన్న భావనకు రావలసిన అవసరం లేదు. అలాంటి ఆలోచనలను మీ మనసు నుంచి తీసేయండి. సోషల్ మీడియా అన్నది మిమ్మల్ని మీ నిజ జీవితం నుంచి వేరే వైపుకు మళ్లించదు. మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయదు. పైగా మీకు చాలా అనుభవాల్ని ఇస్తుంది. అనేక విధాలుగా మీలో స్ఫూర్తిని నింపుతుంది. అలాగే మీకు ఎన్నో ఫన్నీ మీమ్స్‌ని అందిస్తుంది. దీనిలో దేనిని పొందాలి అనేది మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో మీరే నిర్ణయించుకోండి. సరైన కోణంలో వినియోగిస్తే సోషల్ మీడియా ఒక సంతోషకరమైన పరిణామంగా మానసికంగా ఆరోగ్యకరమైన వేదికగా ఉపయోగపడుతుంది. ఆర్. మౌనికా రెడ్డి (అనలిస్టు) -
ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలంతా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పనిచేయాలనీ, గత ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయని ప్రజల మనసులను కూడా గెలుచుకుని, వచ్చే ఎన్నికల్లో వారంతా బీజేపీకే ఓటు వేసేలా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఓటు వేయని వారిపై లేదా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడిన వారిపై ద్వేష భావం వద్దనీ, అందరినీ కలుపుకుని పోతూ, అందరి మన్ననలూ పొందుతూ తర్వాతి ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయం చేసుకునేలా ప్రవర్తించాలని తమ ఎంపీలకు మోదీ మార్గ నిర్దేశం చేశారు. అన్ని చోట్లా ప్రజలతోపాటే క్యూల్లో నిలబడాలనీ, జనంతో కలిసిపోయి మనుషులందరితో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. 380 మందికి పైగా బీజేపీ ఎంపీలకు శిక్షణనివ్వడం కోసం బీజేపీ శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముగింపు సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలం నుంచి ఇప్పుడు ప్రధానిగా రెండోసారి గెలిచేంత వరకు, దాదాపు రెండు దశాబ్దాలుగా తాను ఎప్పుడూ అధికారంలోనే ఎలా ఉంటున్నదీ మోదీ వివరించారు. ఎంపీలు కూడా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ ఎంతో నిబద్ధతతో ఉండాలనీ, నియోజకవర్గంలోని ప్రజలను ఎప్పుడూ కలుస్తూ, వారి మధ్యనే ఎక్కువ కాలం గడపాలని ఆయన సూచించారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించవద్దనీ, రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు, నియోజకవర్గానికి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఏయే పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు సరిగ్గా పడలేదో గుర్తించి, ఆ బూత్‌ల పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిపై ద్వేషం పెంచుకోవడానికి బదులు మంచి చేస్తూ వారి ఆశీర్వాదం పొందాలంటూ ఎంపీలకు మోదీ పలు కిటుకులు చెప్పారు. కాగా, మోదీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు కచ్చితంగా చేరేలా చేసేందుకు ఎంపీలను ఉపయోగించుకోవాలని మంత్రులకు బీజేపీ సూచించింది. ఎంపీలతో ప్రతి నెలా మంత్రులు సమావేశమై పథకాల గురించి వారికి చెబుతుండాలనీ, ఈ భేటీలకు అన్ని పార్టీల ఎంపీలనూ ఆహ్వానించాలని తెలిపింది. -
టెన్త్ విద్యార్థులకు గైడెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆపై చదువుల కు ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంటారు. పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులపైనే విద్యార్థుల కెరీర్ ఆధారపడి ఉంటుంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కోర్సుల ఎంపికపై గైడెన్స్ ఇచ్చే వారు ఉండరు. దీంతో విద్యార్థులకు కెరీర్‌పై గైడెన్స్ ఇప్పించే బాధ్యతలను స్వయాన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తీసుకుంది. విద్యార్థుల మేథస్సు, ఆసక్తి, అభిరుచిల ఆధారంగా పై చదువులకు సంబంధించిన కోర్సుల ఎంపికలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించనున్నారు. పదో తరగతి ఫలితాలు ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకెళ్లడానికి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఈ మేరకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ప్రొఫెసర్ గార్డెనర్ హోవర్డ్ ప్రతిపాదించిన మేథస్సు సిద్ధాంతం ప్రకారం ప్రజల్లో ఉండే వివిధ రకాల మేథస్సులు, వాటికి అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సిన కెరీర్‌కు సంబంధించిన చార్టులను అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించింది. ► ఉదాహరణకు వాక్చాతుర్యం, భాష మీద పట్టు గల వారు న్యాయవాది, కమెడియన్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, క్యూరేటర్, సంపాదకుడు, జర్నలిస్టు, చరిత్రకారుడు, లైబ్రేరియన్, మార్కెటింగ్ కన్సల్టెంట్, కవి, రాజకీయ నేత, పాటల రచయిత, టీవీషో హోస్ట్, ఉపాధ్యాయుడు, భాషా అనువాదకుడు, రచయిత కాగలరు. ► తార్కిక, గణిత నైపుణ్యం గలవారు అకౌంటెంట్, ఆడిటర్, కంప్యూటర్ అనలిస్ట్, కంప్యూటర్ టెక్నీషియన్, కంప్యూటర్ ప్రొగ్రామర్, డేటాబేస్ డిజైనర్, డిటెక్టివ్, ఆర్థికవేత్త, ఇంజనీర్, గణితవేత్త, నెట్వర్క్ అనలిస్ట్, ఫార్మాసిస్ట్, ఫిజిషియన్, ఫిజీసిస్ట్, పరిశోధకుడు, స్టాటిస్టిషియన్, బుక్ కీపర్ కాగలరు. ► దృశ్య నైపుణ్యం గల వారు 3డీ మోడలింగ్, సిమ్యూలేషన్, ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్, కంప్యూటర్ ప్రొగ్రామర్, ఇంజనీర్, ఫిల్మ్ యానిమేటర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, ఇంటీరియర్ డెకరేటర్, ఫొటో గ్రాఫర్, మెకానిక్, నావిగేటర్, ఔట్ డోర్ గైడ్, పైలట్, శిల్పుడు, వ్యూహకర్త, సర్వేయర్, అర్బన్ ప్లానర్, వెబ్‌మాస్టర్ కాగలరు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం 35% అప్
ముంబై: చిన్న తరహా ప్రైవేట్ రంగ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 35 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.141 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.190 కోట్లకు పెరిగిందని ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.553 కోట్లకు, ఇతర ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.326 కోట్లకు పెరిగాయని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ విశ్వవీర్ అహుజా తెలిపారు. కీలకమైన ఫీజు ఆదాయం 58 శాతం వృద్ధి చెందగా, నిర్వహణ ఆదాయం 39 శాతం వృద్ధితో రూ.432 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం, నిర్వహణ ఆదాయాలు బాగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4 శాతం రేంజ్లో... రుణాలు 36 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్ అర శాతం విస్తరించి 4.04 శాతానికి చేరడంతో నికర వడ్డీ ఆదాయం మంచి వృద్ధి సాధించినట్లు అహుజా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంతా నికర వడ్డీ మార్జిన్‌ను 4 శాతానికి మించి కొనసాగిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రుణాలు 36 శాతం వృద్ధితో రూ.42,198 కోట్లకు, డిపాజిట్లు 27 శాతం వృద్ధితో రూ.44,960 కోట్లకు ఎగిశాయని చెప్పారు. తగ్గిన మొండి బకాయిలు.. గత క్యూ1లో 1.46 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.40 శాతానికి తగ్గాయని అహుజా తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. కేటాయింపులు రూ.94 కోట్ల నుంచి 49 శాతం వృద్ధి (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే, 24 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 57.99 శాతం నుంచి 60.41 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. బీఎస్ఈలో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్ 1.6 శాతం నష్టంతో రూ.556 వద్ద ముగిసింది. -
వృద్ధి గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నాం: ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ: ప్రాజెక్టులను కొనసాగించేందుకు కొంత మంది క్లయింట్లు భారీ డిస్కౌంట్లు అడుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది ఆదాయ వృద్ధికి సంబంధించి ఇచ్చిన 6–5–8.5 శాతం గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నామని ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఐటీ బడ్జెట్ పూర్వ స్థాయిల్లోనే కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు 3–5 ఏళ్ల రెన్యువల్ డీల్స్ విషయంలో 30–40 శాతం తక్కువకే ప్రాజెక్టులు చేయాలని కోరవచ్చని సంస్థ సీవోవో యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. తద్వారా మిగిలే నిధులను వేరేవాటిపై ఇన్వెస్ట్ చేయాలని క్లయింట్లు భావిస్తున్నారని మోర్గాన్ స్టాన్లీ నిర్వహించిన 19వ భారత వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఇక మరికొన్ని కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకుని, ఇన్వెస్ట్ చేసేందుకు సమయం తీసుకోవచ్చని రావు చెప్పారు. డీల్స్ పరిమాణం తక్కువ కావడానికి ఇలాంటి అంశాలే కారణమన్నారు. -
ఇన్ఫీ గైడెన్స్ మళ్లీ తగ్గింది!
• 2016–17 పూర్తి ఏడాదికి అదాయ అంచనాల్లో కోత • క్యూ3 లాభం రూ.3,708 కోట్లు; 7% వృద్ధి • ఆదాయం 8.6% అప్; రూ.17,273 కోట్లు బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆదాయ అంచనాలు(గైడెన్స్) మాత్రం నిరుత్సాహపరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేషన్ నికర లాభం రూ.3,708 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,465 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం రూ.15,902 కోట్ల నుంచి రూ.17,273 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే 8.6 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా మిశ్రమ ధోరణి... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 2.8 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం 0.2 శాతం తగ్గింది. ఇక డాలరు రూపంలో చూస్తే సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.4% దిగజారి క్యూ3లో 2.53 బిలియన్ డాలర్లను తాకింది. గడిచిన ఏడు క్వార్టర్లలో డాలరు ఆదాయం తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీజనల్‌గా బలహీన క్వార్టర్ కావడంతోపాటు ఆర్బీఎస్ డీల్ రద్దు కావడం కూడా ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా, యూరప్‌లలో పనిదినాలు తక్కువగా ఉండటంతో సాధారణంగా భారత ఐటీ కంపెనీల పనితీరు డిసెంబర్ క్వార్టర్లో కాస్త బలహీనంగా ఉంటుంది. కాగా, క్యూ3లో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,569 కోట్లు, ఆదాయం రూ.17,313 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. గైడెన్స్ ప్చ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇన్ఫోసిస్ ఆదాయ అంచనా(గైడెన్స్)లను మళ్లీ తగ్గించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి అంతక్రితం 8–9 శాతంగా అంచనా వేయగా ఇప్పుడు దీన్ని 8.4–8.8 శాతానికి సవరించింది. దీని ప్రకారం చూస్తే.. డాలర్ల రూపంలో గైడెన్స్ 7.5–8.5% నుంచి 7.2–7.6 శాతానికి తగ్గినట్లు లెక్క. ఇక రూపాయిల్లో ఆదాయ గైడెన్స్ కూడా 10.9–11.9 శాతం నుంచి 10–10.4 శాతానికి తగ్గింది. గత తొమ్మిది నెలల్లో ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను తగ్గించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ అక్టోబర్–డిసెంబర్ వ్యవధిలో ఇన్ఫీ కొత్తగా 77 క్లయింట్లను జతచేసుకుంది. ఇందులో 75 మిలియన్ డాలర్ల ఆదాయ విభాగంలో రెండు కాంట్రాక్టులు ఉన్నాయి. ⇔ క్యూ3లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ వ్యాపార సీక్వెన్షియల్‌గా 0.8 శాతం దిగజారింది. అయితే, ఆర్బీఎస్ కాంట్రాక్టు రద్దయినప్పటికీ స్థిర కరెన్సీ(డాలరుతో రూపాయి మారకం విలువ) ప్రాతిపదికన 0.2 శాతం వృద్ధి చెందింది. ⇔ ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా వ్యాపారం సీక్వెన్షియల్‌గా 0.6%, యూరప్ వ్యాపారం 2.5 శాతం చొప్పన తగ్గాయి. భారత్‌లో వ్యాపారం1% తగ్గింది. మిగతా దేశాలకు చెందిన వ్యాపారంలోనూ 3.2 శాతం తగ్గుదల నమోదైంది. ⇔ 2016 డిసెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,763కు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,829గా ఉంది. అంటే నికర నియామకాలు 66 తగ్గాయి. 2015 డిసెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది సంఖ్య 1,93,383. క్యూ3లో ఉద్యోగుల వలసలు(అట్రిషన్ రేటు) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 1.6 శాతం(సీక్వెన్షియల్‌గా) తగ్గింది. 20 శాతం నుంచి 18.4 శాతానికి చేరింది. ⇔ ఇక ఇదే నెలాఖరుకు ఇన్ఫీ వద్దనున్న మొత్తం నగదు, తత్సంబంధ నిల్వలు రూ.35,697 కోట్లకు చేరాయి. గైడెన్స్ తగ్గింపు ప్రభావంతో శుక్రవారం ఇన్ఫోసిస్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 2.5 శాతం దిగజారింది. రూ.975 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ ఒక్కరోజులో రూ.5,718 కోట్లు దిగజారి రూ. 2,23,987 కోట్లకు చేరింది. 2016 క్యాలెండర్ ఏడాదిలో ఇన్ఫీ 10 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించడం చాలా ఆనందం కలిగిస్తోంది. మానసికంగా, భావోద్వేగపరంగా ఇది మాకు చాలా కీలకమైన మైలురాయి. అయితే, 2020కల్లా మార్జిన్ల స్థాయిని 30 శాతానికి పెంచుకోవడం, 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయ లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యంగా మేం ముందుకెళ్తున్నాం. సీజనల్‌గా బలహీన ధోరణి, ఆర్బీఐ కాంట్రాక్టు రద్దు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. క్యూ3లో మేం మెరుగైన పనితీరునే నమోదు చేశాం. మార్జిన్లు కూడా మెరుగయ్యాయి. క్యూ4పై ఆశాజనకంగా ఉన్నాం. ఇక ఒక్క ఇంధన రంగం మినహా వచ్చే ఏడాది చాలా రంగాలకు సంబంధించి మా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నాం. మొత్తంమీద చూస్తే గడిచిన తొమ్మిది నెలల్లో కంపెనీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. – విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ ట్రంప్ విధానాలు సానుకూలంగానే..! అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగ వీసాలను భారీగా తగ్గించేస్తారన్న అంచనాలపై ఇన్ఫీ చీఫ్ విశాల్ సిక్కా మాట్లాడుతూ.. తమ క్లయింట్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఆందోళనలూ వ్యక్తం కాలేదని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం వ్యాపారాలకు స్నేహపూర్వకంగానే ఉంటుం దని, అదేవిధంగా ఎంట్రప్రెన్యూర్షిప్, నవకల్పనలను ప్రోత్సహిస్తుందనే భావిస్తున్నట్లు సిక్కా పేర్కొన్నారు. అయితే, అమెరికాలో వీసా, వలసలకు సంబంధించిన విధానాలు మారొచ్చని... ఏం జరుగుతుందనేది వేచిచూడాల్సి ఉందని చెప్పారు. -
సామర్థ్యంతోనే రాణింపు!
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సీఈవో సిక్కా మార్గదర్శనం బెంగళూరు: ‘‘గొప్ప విలువను సృష్టించడంలో ఉదాసీనత తగదు. ఆటోమేషన్ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోండి. ముందున్న మార్గం తేలికైనది కాదు. చాలా సుదీర్ఘమైనది. ఆ దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి’’ అంటూ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఆ కంపెనీ సీఈవో విశాల్ సిక్కా నూతన సంవత్సర సందేశం అందించారు. నిర్వహణ సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరికీ అనివార్యమని గుర్తుంచుకోవాలన్నారు. చురుగ్గా, వేగవంతంగా ఉత్తమ పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. ‘‘ఉద్యోగ బృందాలు సాధారణంగా చెప్పిన మేరకే చేస్తారు. అంతకు మించి చేయగలమని ఆలోచించరు. విలువను సృష్టించే విషయంలోనూ ఉదాసీనతతో ఉంటారు. కానీ ఇది ఎక్కువ కాలం నిలవదు’’ అని పేర్కొన్నారు. -
ఇన్ఫీ లాభం అప్.. గైడెన్స్ డౌన్
• క్యూ2లో అంచనాలు మించిన లాభం • రూ. 3,606 కోట్లు; 6.1 శాతం వృద్ధి • ఆదాయం రూ.17,310 కోట్లు; 10.7% వృద్ధి • ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలు 8-9 శాతానికి కుదింపు • షేరుకి రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ అన్న రీతిలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ నికర లాభం ఇన్వెస్టర్ల అంచనాలను మించినప్పటికీ.. పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ప్రధానంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిని ఇందుకు కారణంగా పేర్కొంది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,606 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,398 కోట్లతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 10.7 శాతం ఎగసి రూ.17,310 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.15,635 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గానూ వృద్ధి... ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభం రూ.3,436 కోట్లతో పోలిస్తే(క్యూ1, సీక్వెన్షియల్ ప్రాతిపదికన) కూ2లో 4.9 శాతం వృద్ధి చెందింది. ఆదాయం కూడా రూ.16,782 కోట్ల నుంచి 3.1 శాతం పెరిగింది. ఇక డాలరు రూపంలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.4 శాతం వృద్ధితో 2.587 బిలియన్ డాలర్లుగా నమోదైంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ వృద్ధి 3.9 శాతంగా ఉంది. అగ్రగామి టీసీఎస్‌తో పోలిస్తే(1 శాతం, 1.3 శాతం చొప్పున ఉన్నాయి) ఇన్ఫీ మెరుగైన పనితీరునే సాధించింది. కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ.3,500 కోట్ల లాభాన్ని, రూ.17,150 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. డాలరు ఆదాయం 2.559 బిలియన్ డాలర్లు ఉండొచ్చని లెక్కగట్టారు. గైడెన్స్ తగ్గింపు... ప్రస్తుత పూర్తి ఏడాది(2016-17)కి ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) ఇన్ఫోసిస్ భారీగా తగ్గించి 8-9 శాతానికి పరిమితం చేసింది. అంతక్రితం గైడెన్స్ 10.5-12 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి అంచనాలను వరుసగా రెండో క్వార్టర్లోనూ తగ్గించడం గమనార్హం. ప్రధానంగా సమీపకాలంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో ద్వితీయార్ధంలో పనితీరు అంచనాలను దృష్టిలోపెట్టుకొని కంపెనీ తాజా ప్రకటన చేసింది. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ క్యూ2లో కంపెనీ మార్జిన్లు సీక్వెన్షియల్‌గా 80 బేసిస్ పాయింట్లు ఎగబాకి 24.9 శాతంగా నమోదయ్యాయి. ⇔ జూలై-సెప్టెంబర్ కాలంలో 78 కొత్త క్లయింట్లను సంపాదించింది. ⇔ ఉత్తర అమెరికా వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా 2.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. యూరప్ 3.7%, భారత్ 28.7 శాతం, మిగతా ఇతర దేశాలకు సంబంధించి వ్యాపారం 5.2% వృద్ధి చెందింది. ⇔ సెప్టెంబర్ చివరినాటికి రూ.35,640 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ⇔ రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.11 చొప్పున(220 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ⇔ క్యూ2లో కంపెనీ స్థూలంగా 12,717 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 2,779 మంది వలసపోవడంతో నికర నియామకాలు 9,938గా నమోదయ్యాయి. సెప్టెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,829కు చేరింది. ⇔ ఫలితాలు అంచనాలను మించినప్పటికీ.. గెడైన్స్ తగ్గింపు కారణంగా ఇన్ఫీ షేరు దిగజారింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకనాకొక దశలో ఏడాది కనిష్టానికి(రూ.996) పడిపోయింది కూడా. చివరికి 2.34 శాతం నష్టంతో రూ.1,027 వద్ద ముగిసింది. ⇔ ప్రధానమైన ఐటీ సర్వీసుల కాంట్రాక్టుల సమర్థ నిర్వహణపై దృష్టిసారించడం ద్వారా క్యూ2లో మంచి పనితీరును సాధించగలిగాం. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితిలోనే మరికొన్నాళ్లు పయనించాల్సి ఉంటుంది. దీంతో గెడైన్స్‌ను సవరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు అనుసరిస్తున్న ‘సాఫ్ట్వేర్ ప్లస్ సర్వీసెస్’ విధాన వ్యూహాన్ని మరింత పటిష్టంగా అమలు చేయనున్నాం. 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించాలన్న లక్ష్యానికి కట్టుబడిఉన్నాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు 24-25 శాతం మేర ఉండొచ్చని భావిస్తున్నాం. క్యూ2లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన ఆరు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్నాం. రానున్న కొద్ది క్వార్టర్లపాటు బీఎఫ్ఎస్ఐ విభాగంలో ఆదాయ వృద్ధి ఉండకపోవచ్చనేది మా అంచనా. అయితే, దీర్ఘకాలానికి చూస్తే ఇబ్బందులేవీ లేనట్టే. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ నాస్కామ్ ఐటీ వృద్ధి అంచనాల్లో కోత! న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఏడాది దేశీ ఐటీ రంగం వృద్ధి అంచనాలను తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ చాంబర్ నాస్కా మ్ సంకేతాలిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశీ సాఫ్ట్వేర్ ఎగుమమతుల ఆదాయం 10-12% ఉంటుందనేది నాస్కామ్ అంచనా(గెడైన్స్). ‘ఇన్ఫీ, టీసీఎస్ మాదిరిగానే ఇతర ఐటీ కంపెనీలు కూడా అనిశ్చితిపై ఆందోళనలు వ్యక్తం చేస్తే.. ప్రస్తుత గెడైన్స్‌ను సవరించే అంశాన్ని పరిశీలించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా తగ్గించాలా వద్దా... ఎంతకు చేర్చాలి అనేది చెప్పడం కష్టమే’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ పేర్కొన్నారు. మిగతా కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు కూడా వెలువడ్డాకే(ఈ నెల చివరికి లేదా నవంబర్‌లో) వృద్ధిపై నాస్కామ్ తాజా అభిప్రాయాలను వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. -
మరోసారి షాకివ్వబోతున్న ఇన్ఫోసిస్
సాప్ట్వేర్ సేవల రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మళ్లీ గైడెన్సు షాకివ్వబోతోంది. రెవెన్యూ గైడెన్స్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ సీఈవో విశాల్ సిక్కా వెల్లడించారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో సవాళ్లు, ప్రాజెక్టుల రద్దు తదితర కారణాలు గైడెన్స్ కోతకు దోహదం చేయొచ్చని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో కంపెనీ ఆదాయ అంచనాలు తారుమారు అవుతూ ఈ నష్టాలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కాగ, ఇన్ఫోసిస్ తన గైడెన్సు తగ్గించుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. కన్సల్టింగ్‌లో క్లయింట్ల వ్యయాల్లో తగ్గుదల, ప్రపంచ వ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చిత కారణంగా మొదటి క్వార్టర్ ఫలితాల ప్రకటన సమయంలో ఇన్ఫోసిస్ తన డాలర్ గైడెన్సును తగ్గించి 10.5-12 శాతానికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మళ్లీ తన ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను మరోమారు తగ్గించే అవకాశాలున్నట్టు విశాల్ సిక్కా పేర్కొన్నారు. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, జూలై-సెప్టెంబర్‌లో మెరుగైన ప్రదర్శనను కనబరుస్తామని విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. క్యూ1 వృద్ధి కంటే క్యూ2 వృద్ధి బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గైడెన్సు తగ్గింపుకు ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా ఎదుర్కోబోతున్న సవాళ్లేనని తెలిపారు. క్యూ2 ప్రారంభంలోనే కంపెనీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఇన్ఫోసిస్‌కు కేటాయించిన ప్రాజెక్టును రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాట్లాండ్ రద్దు చేసుకోవడం కంపెనీ ఆదాయాలకు గండికొడుతుందని విశాల్ సిక్కా వివరించారు. ఈ ప్రాజెక్టు రద్దుతో 3వేల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారండంతో పాటు, 40 మిలియన్ డాలర్ల రెవెన్యూలకు కూడా ప్రమాదం వాటిల్లనుందని మార్కెట్ విశ్లేషకులు ముందుగానే అంచనావేశారు. ఈ నష్టం కంపెనీ గైడెన్సు తగ్గించుకునేందుకు దారితీస్తుందని కూడా వెల్లడించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మరోమారు గైడెన్స్ కోత పెట్టే అవకాశాలున్నట్టు సీఈవో తెలపడం గమనార్హం. కొన్ని అంతర్గత వ్యవహారాలు కంపెనీ తొలి క్వార్టర్ ఆదాయాలపై ప్రభావం చూపినప్పటికీ, ప్రస్తుతం అవి పరిష్కారమైనట్టు సిక్కా తెలిపారు. అక్టోబర్‌లో కంపెనీ ఇన్ఫోసిస్ తన రెండో క్వార్టర్(జూలై-సెప్టెంబర్) ఫలితాలను విడుదలచేయనుంది. గైడెన్సు తగ్గించే అవకాశాలున్నట్టు విశాల్ సిక్కా తెలుపడంతో, మార్కెట్లో మళ్లీ ఇన్ఫోసిస్ షేరు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
ఇన్ఫీ ‘గెడైన్స్’ షాక్!
ఈ ఏడాది ఆదాయవృద్ధి అంచనాల్లో కోత... ♦ డాలర్ గెడైన్స్ 13.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు... ♦ క్యూ1లో నికర లాభం 3,436 కోట్లు; 13 శాతం వృద్ధి ♦ ఆదాయం 17 శాతం అప్; రూ.16,782 కోట్లు షేరు 11 శాతం క్రాష్... బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డాలర్ల రూపంలో అంతక్రితం ఆదాయ వృద్ధి గెడైన్స్‌ను 11.5-13.5 శాతంగా పేర్కొనగా.. దీన్ని ఇప్పుడు 10.5-12 శాతానికి పరిమితం చేసింది. ప్రధానంగా కరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులను ఇందుకు కారణంగా పేర్కొంది. మరోపక్క, తొలి త్రైమాసిక ఫలితాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ పరిణామాల కారణంగా శుక్రవారం ఇంట్రాడేలో ఇన్ఫీషేరు 11 శాతం మేర క్రాష్ అయింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(2016-17, క్యూ1)లో ఇన్ఫీ రూ. 3,436 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,030 కోట్లతో పోలిస్తే 13.4 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం 16.9 శాతం వృద్ధితో రూ. 16,782 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 14,354 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో నికర లాభం 7.4 శాతం వృద్ధి చెంది 51.1 కోట్ల డాలర్లకు, ఆదాయం 10.9 శాతం వృద్ధితో 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. సీక్వెన్షియల్‌గా లాభం డౌన్... గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లో లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) ఇన్ఫీ లాభం క్యూ1లో 4.5 శాతం దిగజారింది. ఆదాయం కూడా రూ.16,550 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.4 శాతం మాత్రమే పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫోసిస్ రూ.3,447 కోట్ల నికర లాభాన్ని, రూ. 17,089 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, రూపాయి ప్రాతిపదికన చూస్తే... ఈ ఏడాది ఆదాయం వృద్ధి అంచనాలను ఇన్ఫీ స్వల్పంగా 13.7-15.21 శాతానికి(జూన్ 30 నాటి డాలరుతో రూపాయి మారకం విలువ 67.53 ప్రకారం) పెంచడం గమనార్హం. అంతక్రితం ఈ గెడైన్స్‌ను 12.7-14.7 శాతంగా(మార్చి 31 నాటి రూపాయి విలువ 66.26 ప్రకారం) పేర్కొంది. ‘ప్రపంచంలో ప్రధాన కరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు తీవ్ర ప్రభావం చూపినప్పటికీ.. మేం అనుసరిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలు క్యూ1లో తోడ్పాటును అందించింది’ అని కంపెనీ సీఎఫ్ఓ ఎం.డి. రంగనాథ్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ క్యూ1లో ఇన్ఫోసిస్ కొత్తగా 34 కాంట్రాక్టులను దక్కించుకుంది. 10 కోట్ల డాలర్ల విభాగంలో 3 కాంట్రాక్టులు ఉన్నాయి. ⇒ జూన్ క్వార్టర్లో స్థూలంగా 13,268 మంది ఉద్యోగులను నియమించుకుంది. 10,262 మంది వలసపోవడంతో(అట్రిషన్) నికర నియామకాలు 3,006కు పరిమితమయ్యాయి. ⇒ మరోపక్క, క్యూ1లో అట్రిషన్ రేటు ఏకంగా 21%కి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో అట్రిషన్ రేటు 19.2% కాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో 17.3 శాతంగా నమోదైంది. ⇒ జూన్ చివరినాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.97 లక్షలకు చేరింది. ⇒ నిరుత్సాహకరమైన ఫలితాలు, గెడైన్స్ కోతతో కంపెనీ షేరు కుప్పకూలింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో ఒకానొక దశలో 11 శాతం మేర క్షీణించి రూ.1,052 కనిష్టాన్ని తాకింది. చివరకు 8.85 శాతం నష్టపోయి రూ.1,072 వద్ద స్థిరపడింది. ‘కన్సల్టింగ్ సేవలు, ప్యాకేజ్‌ల అమలుకు సంబంధించి క్లయింట్ల వ్యయంలో అనుకోని ప్రతికూలతలు క్యూ1లో అంచనాలకంటే వృద్ధి తగ్గడానికి కారణమైంది. మరోపక్క, గడిచిన త్రైమాసికాల్లో మేం దక్కించుకున్న భారీ కాంట్రాక్టుల అమలు మందకొడిగా సాగడం కూడా ప్రభావం చూపింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన(బ్రెగ్జిట్) ప్రభావాన్ని ఈ ఏడాది గెడైన్స్‌లో మేం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుత మార్కెట్‌పై మా సొంత అంచనాల మేరకు తాజా గెడైన్స్ ఇచ్చాం. ప్రధానంగా కన్సల్టింగ్‌లో క్లయింట్ల వ్యయాల్లో తగ్గుదల, ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగానే డాలర్ గెడైన్స్‌ను తగ్గించాం’. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
'స్టేట్ లెవల్ ఫార్మర్స్ కమిషన్ ఏర్పాటు చేయండి'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. స్టేట్ లెవల్ ఫార్మర్స్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని రెండు ప్రభుత్వాలను కోర్టు ప్రశ్నించింది. కమిషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గడువు కోరింది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ప్రభుత్వం తెలిపడంతో దీనికి పిటిషనర్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలు తగ్గలేదని చెప్పారు. దీంతో రైతు ఆత్మహత్యల వివరాలు, కారణాలు తెలపాలని కోర్టు పిటిషనర్ తరపు లాయర్‌ను ఆదేశించింది. రైతు ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రామకృష్ణ కమిషన్ నివేదిక తర్వాత చర్యలు చేపడతామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. -
ప్రక్షాళనకు మార్గం
ఎవరి అజమాయిషీ లేకుండా, ఎవరికీ జవాబుదారీకాకుండా కొందరు పెద్దల ఇష్టారాజ్యంగా సాగుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని కమిటీ కొరడా ఝళిపించింది. నిలువెల్లా లోపాలతో లుకలుకలాడుతున్న బోర్డు సమూల ప్రక్షాళనకు విలువైన సూచనలు చేస్తూ సుప్రీంకోర్టుకు సవివరమైన నివేదికను సమర్పించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బయటపడి సంచలనం రేపిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు నిరుడు జనవరిలో ఈ కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన 159 పేజీల నివేదిక అనేక అంశాలను స్పృశించింది. క్రియకొచ్చేసరికి వీటిలో ఎన్ని సిఫార్సులు అమల్లోకొస్తాయి...ఏమేరకు బోర్డు బాగుపడుతుందన్న సంగతలా ఉంచితే కమిటీ ప్రస్తావించిన అనేక అంశాలు విస్తృతమైన చర్చకు దోహదపడతాయి. వాటిలో కొన్నయినా అమలు చేయగలిగితే ఆ క్రీడకు విశ్వసనీయత లభిస్తుంది. అయితే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న సిఫార్సు వివాదాస్పదమైనదే. ‘మర్యాదస్తుల ఆట’గా మన్నన పొందిన క్రికెట్ క్రీడలోకి ప్రతిభావంతుల్ని ఆకర్షించి అంతర్జాతీయంగా మన దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకు రావడానికి కృషి చేయాల్సిన బోర్డు పెద్దలు...నిరంతరం ఎత్తులూ పెయైత్తులతో తమ తమ పీఠాలను పటిష్టం చేసుకోవడానికే శ్రమిస్తున్నారన్నది వాస్తవం. ఒక్కమాటలో దేశం పరువుతో వారు ఇష్టానుసారం ఆడుకుంటున్నారు. ఫలితంగా కుంభకోణాలు గుప్పుమంటున్నాయి. బోర్డును ముసురుకున్న అనేకానేక ఆరోపణలపై లోధా కమిటీ దృష్టిసారిం చింది. వాటికి దారితీసిన పరిస్థితులను మార్చడానికి అనువైన విధివిధానాలను సూచించింది. బీసీసీఐలోగానీ, రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాల్లోగానీ 70 ఏళ్ల వయసు పైబడినవారి సారథ్యం ఉండరాదన్నది ముఖ్యమైన సిఫార్సు. ఒక రాష్ట్రానికి ఒక సంఘం ఉండాలి తప్ప నగరం పేరిటో, ప్రాంతం పేరిటో సంఘాలు, వాటికి ఓటింగ్ హక్కులూ కుదరవని చెప్పింది. బోర్డు కార్యనిర్వాహక పదవుల్లో దేనికైనా ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే ఎన్నిక కావొచ్చుననీ, కానీ ప్రతి దఫాకూ విరామం పాటించాలనీ సూచించింది. అధ్యక్ష పదవికి సంబంధించినం తవరకూ ఆ పదవిలో మూడేళ్ల చొప్పున రెండు దఫాలు మాత్రమే ఎవరైనా ఉండొచ్చునని, ఆ తర్వాత వారు మరే పదవీ చేపట్టరాదని పేర్కొంది. ఒక వ్యక్తి బహుళ పదవుల్ని ఏకకాలంలో చలాయించడం చెల్లదని చెప్పింది. మంత్రులుగా ఉండేవారూ, ఇతరత్రా ప్రభుత్వ పదవుల్లో ఉండేవారూ బీసీసీఐలో ఎలాంటి పదవులూ స్వీకరించరాదని తెలిపింది. జాతీయ ఎంపిక కమిటీలో ముగ్గురు సభ్యు లుండాలనీ, వారు మాజీ టెస్ట్ క్రికెటర్లే అయి ఉండాలనీ స్పష్టం చేసింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. బోర్డు నిర్వ హణ కంపెనీ స్థాయిలో ఉండాలని, రోజువారీ వ్యవహారాల కోసం సీఈఓను నియమించాలన్నది. అధ్యక్షుడికి ఇప్పుడుండే మూడు ఓట్లకు బదులు రెండు ఓట్లే ఉండాలనీ...తాను ప్రాతినిధ్యంవహించే సంఘం తరఫున ఉండే ఓటు కాక ఫలితం టై అయినప్పుడు మరో ఓటు వినియోగించుకోవచ్చునని తెలిపింది. అధ్యక్షత వహించినందుకుండే ఓటు రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ సిఫార్సులన్నీ ఎంతో కీలకమైనవి. వీటిల్లో చాలా భాగం ఇప్పుడు పీఠాధిపతులుగా ఉంటున్న వారికి ఎసరు తెచ్చేవే. 70 ఏళ్ల వయో పరిమితిని ఒప్పుకుంటే శరద్ పవార్, శ్రీనివాసన్, నిరంజన్ షా, ఐఎస్ బింద్రా వంటివారు బోర్డు వైపు కన్నెత్తి చూడలేరు. రాష్ట్రానికొక క్రికెట్ సంఘం ఉండాలనడమూ ముఖ్యమైనదే. అలాగే ఇంతవరకూ బీసీసీఐకి కలలోనైనా రాని ఆలోచనను కమిటీకి తెరపైకి తీసుకొచ్చింది. బోర్డులో మహిళలకు కూడా తగిన స్థానం ఇవ్వాలని సిఫార్సు చేసింది. మన మహిళా క్రికెటర్లు ఆటలో ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. దేశానికి పేరుప్రతిష్టలు తీసు కొస్తున్నారు. అయినా మహిళా క్రికెటర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించీ, అందు కవసరమైన చర్యలగురించీ దృష్టిపెట్టే దిక్కులేదు. అయితే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న కమిటీ చేసిన ప్రతిపాదన వివా దాస్పదమైనది. ఇది అమలైనంత మాత్రాన మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటివి పోతాయనుకోవడం భ్రమే. బెట్టింగ్‌లవల్ల ఫిక్సింగ్‌లు పోవడం మాట అటుంచి అవి మరింత వికృతరూపం తీసుకోవచ్చుకూడా. ఇప్పటికే గుర్రప్పం దాలూ, లాటరీల వంటి బెట్టింగ్‌లవల్ల కొంపలు గుల్లవుతున్నాయని అనేకులు ఆందోళనపడుతున్నారు. వాటిని నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్‌లాంటి జనాకర్షణ క్రీడకు దాన్ని అంటిస్తే మధ్యతరగతి, పేద జనం అందులో కొట్టుకుపోవడం ఖాయం. రాత్రికి రాత్రే శ్రీమంతులం కావాలన్న పేరాశతో అనేకులు తమ ఆదాయాన్ని కాస్తా అందులో తగలేసి కుటుంబాల్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉంటుంది. దావూద్ ఇబ్రహీంవంటి డాన్లు తమ ముఠాలద్వారా బుకీలనూ, వారి మనుషుల్ని జిల్లాల్లో నడిపిస్తూ బెట్టింగ్‌ల్లో ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారన్నది నిజమే. అలాంటి ఆర్ధిక నేరాల వెన్ను విరగాలంటే బహుళవిధ చర్యలు అవసరమవుతాయి. ఫిక్సింగ్‌లకు పాల్పడి క్రికెట్‌కు కళంకం తెచ్చే క్రీడాకారులు మొదలుకొని ఈ నేరానికి దోహదపడే ప్రతి ఒక్కరిపైనా పటిష్టమైన నిఘా వేయడం అవసర మవుతుంది. అలాంటి నేరాలపై సత్వర విచారణ జరిగి కఠినమైన శిక్షలుపడేలా చేయగలగాలి. బెట్టింగ్‌ను నిరోధించలేం గనుక దాన్ని చట్టబద్ధం చేయాలను కోవడం సరైన ఆలోచన కాదు. ఏదేమైనా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అందులో ఆచరణయోగ్యమైన సిఫార్సులను అమలు చేసి బీసీసీఐ పనితీరులో పారదర్శకత తీసుకురాగలిగితే, వృత్తి నైపుణ్యం పెరగడంతోపాటు క్రికెట్‌కు మళ్లీ విశ్వసనీయత కలుగుతుంది. దేశంలో క్రీడా సంస్కృతి వెల్లివిరుస్తుంది. -
అద్దాల ‘రంగు’ వదలాల్సిందే!
సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కాగా అమలు మరోసారి ‘ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్’ నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్‌డ్రైవ్ ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా హైదరాబాద్: ‘కార్లు తదితర వాహనాల అద్దాలపై ఉంటున్న రంగు ఫిల్మ్‌లు, ఇతరాలను తొలగించండి. వాహనాల లోపలి ప్రాంతం స్పష్టంగా బయటకు కనిపించేలా చర్యలు తీసుకోండి’ అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నగర ట్రాఫిక్ విభాగం అధికారులు పక్కగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు చెదురుమదురుగా కేసులు నమోదు చేసిన పోలీసులు దీనిపై శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తున్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా అద్దాలు కలిగి ఉన్న వాహనచోదకులకు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాహనాల్లో జరుగుతున్న నేరాలు, ప్రమాదాలు నిరోధానికి మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 100 నిర్దేశించినట్లు కార్లు వంటి వాహనాలకు ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క తలుపులకు ఉన్న అద్దాలు 50 శాతం కాంతి ప్రసారకాలుగా (విజువల్ లైట్ ట్రాన్స్మిషన్) ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు గతంలో స్పష్టం చేసింది. దీన్ని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ ఏడాది అక్టోబర్ నుంచి అమలులో పెట్టారు. ఈ మూడేళ్లల్లో చెదురుమదురుగా కేసులు నమోదు చేస్తున్నా... అనేక వాహనాలు ఇంకా నల్లరంగు అద్దాలతో తిరుగుతున్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుంచి స్పెషల్‌డ్రైవ్ చేపడుతున్నారు. కార్లు తదితర వాహనాల ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క అద్దాలు 50 శాతం పాదర్శకంగా ఉండాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ పారద్శకతతో కూడిన ఫిల్మ్‌లు సైతం ఆ అద్దాలపై ఉండకూడదు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100 ఈ అంశాలనే స్పష్టం చేస్తోంది. కేవలం జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వారు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలకే మినహాయింపు. నగరంలోని కొన్ని కార్ డెకార్స్, విడిభాగాల విక్రేతలు ‘ఆర్టీఏ అప్రూవ్డ్’ పేరుతో ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న గ్లాస్లు, ఫిల్మ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కూడదని ట్రాఫిక్ విభాగం ఆయా దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ దృష్టికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కొన్ని వాహనాలు సన్ షేడ్స్, కర్టెన్లు వినియోగించడాన్నీ పోలీసు విభాగం గమనించింది. వీటిని వినియోగించడమూ నిబంధనలకు విరుద్ధమేనని అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలూ తదితరాలనూ ఉపేక్షించమని, వాహనచోదకులు తక్షణం లాంటివి తొలగించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. -
రుణాలపై యువతకు మార్గనిర్దేశం చేయాలి...
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ ముంబై: రుణాల చెల్లింపుల విషయంలో మంచి ధోరణులను అవలంభించేలా యువతకు తగిన మార్గనిర్ధేశం(కౌన్సిలింగ్) చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పేర్కొన్నారు. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ(సీఐసీ)లు దీనికి నడుంబిగించాలన్నారు. మంగళవారమిక్కడ సిబిల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో విద్యా రుణాల విభాగంలో మొండిబకాయిలు భారీగా పెరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాధాన్య రంగ రుణాల విభాగంలో రూ.4 లక్షల లోపు విద్యా రుణాల్లో మొండి బకాయిలు గతేడాది మార్చి నాటికి 7.54 శాతానికి ఎగబాకాయన్నారు. సగటు ఎన్పీఏలు 4 శాతంతో పోలిస్తే ఈ పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. పీఎస్‌బీలు సొంతంగా నిధులను సమీకరించుకోవాలి ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు ప్రభుత్వ మూలధన నిధులపైనే ఆధారపడకుండా రానున్న రోజుల్లో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సొంతంగా నిధులను సమీకరించడంపై దృష్టిపెట్టాలని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘భవిష్యత్తులో బ్యాంకులకు మరింత మూలధనం అవసరమవుతుంది. ఈ నిధుల కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వంపైనే ఆధారపడటం సరికాదు’ అని గాంధీ అభిప్రాయపడ్డారు. -
ధర్మనిర్ణయ గీత
(రేపు గీతాజయంతి) భగవద్గీత... సన్మార్గ దర్శిని... సాక్షాత్తూ భగవంతుని ముఖత వెలువడిన అమూల్యమైన గ్రంథం. జీవితాన్ని ఎలా నడుపుకోవాలో చెప్పే మార్గదర్శక మణిదీపం. గాంధీజీ వంటివారు కూడా నిరంతరం పఠించి, చేతితో పట్టుకు తిరిగిన గ్రంథం. అసలు భగవద్గీత ఎందుకు పుట్టింది? మంచితనంతో పాండవులు రాజ్యాన్ని చేసుకోనిస్తే దాన్ని హస్తగతం చేసుకోదలచీ- ధర్మంగా సంపాదించిన రాజ్యంగా ప్రకటించుకోదలచీ జూదాన్ని ఆడించాడు దుర్యోధనుడు. తెరవెనుక నిలబడ్డాడు ధృతరాష్ట్రుడు. అధర్మంగానూ వంచనతోనూ ఎదుటి వ్యక్తులు శత్రువులుగా మారి యుద్ధానికి దిగినప్పుడు వీళ్లు మా అన్నలు తమ్ముళ్లు తాతలు గురువులు- అనుకుంటూ కూచోకు! ఇది వెనుకడుగు వేయాల్సిన సందర్భం కాదు! అందుకే ఈ దశలో హృదయ దౌర్బల్యాన్ని విడువు! తెగబడి యుద్ధం చేసి విజయుడనే పేరుని సార్థక పరచుకో- అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునునితో. కాబట్టి గీత అనేది ధర్మసంకటం వచ్చినప్పుడు తీర్చగల చక్కటి న్యాయగ్రంథమన్నమాట. అందుకు పుట్టింది గీత. ఇది రెండవ అంశం. అందరం మానవజాతికి చెందినవాళ్లమే అయినప్పుడూ కులాలనేవి మనం ఏర్పాటు చేసుకున్నవే అయినప్పుడు కులాంతర వివాహం చేసుకోవడం నేరమా? అలా చేసుకున్నవాళ్లని చాటుగా మరోలా అనుకోవడం ధర్మమా? అనేది మరో ధర్మసందేహం. కులాంతరంలాగానే మంతాంతర వివాహం చేసుకున్నాడు. మరొకరు దేశాంతర స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ పరస్పరం ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆచారాలూ విధానాలూ అంటూ ఎందుకు తప్పుపట్టాలనేది మరో సందేహం! దీనికి భగవద్గీత చక్కటి సమాధానం చెప్తుంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి నిదానంగా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి కూడ. ఉదాహరణకి ఓ బ్రాహ్మణుడు మరో కులపు స్త్రీని వివాహం చేసుకున్నాడనుకుందాం. ముందుగా తేడా వచ్చేది భోజనం వద్ద. ఈయన శాకాహారి. ఆమె, ఆమెవైపు బంధుమిత్ర జనం మాంసాహారులు. వంటింటి వద్ద పేచీ ప్రారంభమవుతుంది. ఇక ఎవరైనా మరణించిన సందర్భంలో జరిగే క్రియాకలాపాలూ ఆ మీదట చేయవలసిన మాసిక సాంవత్సరిక శ్రాద్ధాది క్రియాలూ స్నానాలూ మంత్రాలూ విధివిధానాలూ ఆమెకి అలవాటు లేక... వీటి ప్రాశస్త్యం తెలియక... నిరాసక్తతతో చేస్తుంటే చూసేవారికి మరోలా అనిపించవచ్చు. ఇలా ఆచార వ్యవహారాలు ధ్వంసమయ్యే అవకాశాన్ని ముందే పసిగట్టిన గీత ఇలాంటి వివాహాలు ఈ కారణంతో వద్దు - అంది. ఇది నిజమే కదా! ఆ స్త్రీ ఇంట్లో కొన్ని ఆచారాలుంటాయి. వాటిని ఇతడు పాటించకపోతే వాళ్లకీ కష్టమే కదా! కాబట్టి గీత అనేది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని అందునా కుటుంబానికి సంబంధించిన వాటిని కూడా ముందుచూపుతో పరిష్కరిస్తుందన్నమాట. భగవంతుణ్ణి చూడాలంటే... భగవంతుడుంటే అందరికీ కన్పించాలి కదా! అని వాదిస్తుంటారు కొందరు. ఏదైనా ఓ విషయాన్ని నిరూపించాలంటే కొన్నిటిని ప్రత్యక్షంగా నిరూపించవచ్చు. కొన్ని అనుభవం ద్వారానే సాధ్యం. ఉదాహరణకి మనోబాధ, వాయుప్రసారం, నిప్పువేడిమి వంటివన్నీ అనుభవం ద్వారా తెలుసుకోదగినవే తప్ప నిరూపించలేం. ఈ దృష్టితో చూస్తే భగవంతుడున్నాడా? అనే ప్రశ్నకి సాక్ష్యం అనుభవమే. మరణానికి భయమా?... కొంతమంది మరణమనేదానికి చాల భయపడుతూ కన్పిస్తారు. మరణానికి దుఃఖించాల్సింది ఎప్పుడంటే- వస్త్రం జీర్ణం (శిథిలం) అయినప్పుడెలా విడిచి కొత్తదాన్ని ధరిస్తామో అలా శరీరం కూడ వృద్ధాప్య దశ దాకా వచ్చి శిథిలమై విడవనప్పుడు - మాత్రమే. ఏ అపమృత్యువో సంభవించినట్లయితే దుఃఖించే అంశమే అంటున్న ఆ భగవంతుడెంతటి హేతువాది! రహస్యాల స్థావరం ఆకాశం: ఈ రోజున నాసా వంటి సంస్థలన్నీ ఆకాశాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు బహిరంగ పరిశోధనాలయం, ప్రయోగవేదిక అని చెప్తున్నారుకానీ, ఈ విషయాన్ని భగవంతుడు తన గీతలో ఏనాడో చెప్పాడు ఆకాశాన్ని గూర్చి. ఆః అంటే ఆశ్చర్యమంది సంస్కృతం. ఆకాశం పేరు వినగానే అలాగే ఆశ్చర్యంతో చూస్తాట్ట ప్రతివ్యక్తీ. ఇలా ఆశ్చర్యమాశ్చర్యమంటూండ టమే తప్ప ఎవరికీ ఏమీ తెలియనంత ఉంది ఆకాశంలో... అన్నాడు గీతలో భగవంతుడు. అన్ని రహస్యాలున్నాయి కాబట్టే అది కనిపించకుండా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా ఎన్నెన్నో కుటుంబం- సంఘం నడవడికల గురించిన అనేక ధర్మసందేహాలను తీర్చగల ధర్మనిర్ణయ శాస్త్ర గ్రంథంగా కనిపించే ఈ గీత పుట్టింది మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు. ఆ రోజున శిరఃస్నానాన్ని చేసి భగవద్గీతను పూజించి 10, 11 అధ్యాయాలని చదివి శ్రీకృష్ణునికి షోడశోపచారాలు చేయాలి. - డా. మైలవరపు శ్రీనివాసరావు నువ్వు ముందు ఏదైనా నేర్చుకోవాలంటే మంచి విద్యార్థివి కావాలి. నా బోధనల్ని కంఠతా పడితే ఉపయోగం లేదు. ఆచరణ లేని బోధ వంటబట్టదు. నా లీలల్ని చదివి నువ్వు ఆశ్చర్యం చెందాలన్నది నా అభిమతం కాదు. వాటిని చిత్తశుద్ధితో ఆచరించాలన్నదే నా సంకల్పం. అందుకే జీవితాంతం మంచి విద్యార్థిగా ఉండు. - శ్రీ షిరిడీ సాయిబాబా -
అంబేద్కర్ ఆలోచనా విధానాలు అనుసరణీయం
కవాడిగూడ, న్యూస్‌లైన్ : అంబేద్కర్ ఆలోచనా విధానాలు అందరికీ అనుసరణీయమని, పేదవారి అభ్యున్నతికి ఆయన భావజాలం మార్గదర్శకంగా నిలుస్తుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2012 టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఆదివా రం లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ స్కాలర్షిప్లు అందించారు. ముఖ్య అతిథులుగా ప్రవీణ్‌కుమార్, ఆధార్ కేంద్రాల అడిషనల్ డెరైక్టర్ జనరల్ పీఎస్ఎన్ మూర్తి, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ దయాసాగర్‌లు హాజరయ్యారు. దళిత, బడుగు, బలహీన వర్గాల వారి కోసం అనేక త్యాగాలు చేసి వారికి ఒక గమ్యాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. జీవితంలో క్రమశిక్షణతో బతకటం కార్ల్‌మార్క్స్, ప్లేటో, అంబేద్కర్ల నుంచి నేర్చుకోవాలని సూచించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అన్వయిస్తే సమాజంలో మార్పు తథ్యమన్నారు. ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇండియా చాప్టర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిద్ధోజీరావు, ప్రధాన కార్యదర్శి జయవర్ధన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సుమారు రూ.6 లక్షల నగదు చెక్కులు అందజేశారు.