'స్టేట్ లెవల్ ఫార్మర్స్ కమిషన్ ఏర్పాటు చేయండి'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. స్టేట్ లెవల్ ఫార్మర్స్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని రెండు ప్రభుత్వాలను కోర్టు ప్రశ్నించింది.
కమిషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గడువు కోరింది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ప్రభుత్వం తెలిపడంతో దీనికి పిటిషనర్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలు తగ్గలేదని చెప్పారు. దీంతో రైతు ఆత్మహత్యల వివరాలు, కారణాలు తెలపాలని కోర్టు పిటిషనర్ తరపు లాయర్ను ఆదేశించింది.
రైతు ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రామకృష్ణ కమిషన్ నివేదిక తర్వాత చర్యలు చేపడతామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.