అద్దాల ‘రంగు’ వదలాల్సిందే!
- సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కాగా అమలు
- మరోసారి ‘ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్’
- నేటి నుంచి ట్రాఫిక్
- పోలీసుల స్పెషల్‌డ్రైవ్
- ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా
- సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ పారద్శకతతో కూడిన ఫిల్మ్‌లు సైతం ఆ అద్దాలపై ఉండకూడదు.
- మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100 ఈ అంశాలనే స్పష్టం చేస్తోంది.
- కేవలం జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వారు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలకే మినహాయింపు.
- నగరంలోని కొన్ని కార్ డెకార్స్, విడిభాగాల విక్రేతలు ‘ఆర్టీఏ అప్రూవ్డ్’ పేరుతో ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న గ్లాస్‌లు, ఫిల్మ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
- ఇలాంటి కూడదని ట్రాఫిక్ విభాగం ఆయా దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ దృష్టికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
- కొన్ని వాహనాలు సన్ షేడ్స్, కర్టెన్లు వినియోగించడాన్నీ పోలీసు విభాగం గమనించింది. వీటిని వినియోగించడమూ నిబంధనలకు విరుద్ధమేనని అధికారులు చెప్తున్నారు.
- ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలూ తదితరాలనూ ఉపేక్షించమని, వాహనచోదకులు తక్షణం లాంటివి తొలగించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్: ‘కార్లు తదితర వాహనాల అద్దాలపై ఉంటున్న రంగు ఫిల్మ్‌లు, ఇతరాలను తొలగించండి. వాహనాల లోపలి ప్రాంతం స్పష్టంగా బయటకు కనిపించేలా చర్యలు తీసుకోండి’ అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నగర ట్రాఫిక్ విభాగం అధికారులు పక్కగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు చెదురుమదురుగా కేసులు నమోదు చేసిన పోలీసులు దీనిపై శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తున్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా అద్దాలు కలిగి ఉన్న వాహనచోదకులకు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
వాహనాల్లో జరుగుతున్న నేరాలు, ప్రమాదాలు నిరోధానికి మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 100 నిర్దేశించినట్లు కార్లు వంటి వాహనాలకు ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క తలుపులకు ఉన్న అద్దాలు 50 శాతం కాంతి ప్రసారకాలుగా (విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్) ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు గతంలో స్పష్టం చేసింది. దీన్ని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ ఏడాది అక్టోబర్ నుంచి అమలులో పెట్టారు. ఈ మూడేళ్లల్లో చెదురుమదురుగా కేసులు నమోదు చేస్తున్నా... అనేక వాహనాలు ఇంకా నల్లరంగు అద్దాలతో తిరుగుతున్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుంచి స్పెషల్‌డ్రైవ్ చేపడుతున్నారు.
కార్లు తదితర వాహనాల ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క అద్దాలు 50 శాతం పాదర్శకంగా ఉండాలి.