వృత్తిలో ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకుంటే వెనుకబడిపోతాం. రోజువారీ విధుల్లో నెగ్గుకురాలేం. ఈ ఆవశ్యకతను హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్ గుర్తించారు. పనిలో ముందుకెళ్లేందుకు తోడ్పాటు కోసం అన్వేషిస్తున్నారు.
ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్‌ఇన్ కొత్త పరిశోధన ప్రకారం, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 93 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ వృత్తిలో ముందుకెళ్లేందుకు మరింత మార్గదర్శకత్వం, తోడ్పాటు కోసం చూస్తున్నారు. కొత్త కొత్త మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు తమ విధుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మిలితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో 63 శాతం మంది తమ కెరీర్‌లో ముందుకు సాగడం కోసం ఏఐపై ఆధారపడటం సౌకర్యంగా ఉంటుందని నమ్ముతున్నారు.
ఫలితంగా ఏఐ ఆప్టిట్యూడ్‌తో కూడిన లింక్డ్‌ఇన్ లెర్నింగ్ కోర్సుల వినియోగం గత సంవత్సరంలో నాన్-టెక్నికల్ ప్రొఫెషనల్స్‌లో 117 శాతం పెరిగింది. అనుభవం ఒక్కటే సరిపోదని నిపుణులు గుర్తిస్తున్నారు. నగరంలోని 69 శాతం మంది ప్రొఫెషనల్స్ నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. 41 శాతం మంది కెరీర్ వృద్ధికి నైపుణ్యం అవసరమని నమ్ముతున్నారు. వర్క్ ప్లేస్ మార్పును ఎదుర్కొంనేందుకు 60 శాతం మంది అవసరమైన నైపుణ్యాలపై మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు.
ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?
చాలా మంది సాంకేతిక పురోగతి (51 శాతం), సెక్టార్-నిర్దిష్ట మార్కెట్ విశ్లేషణ (42 శాతం), సామాజిక పోకడలు (34 శాతం) గురించి తెలుసుకొని భవిష్యత్తు అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారు. విషయ పరిజ్ఞానం కోసం హైదరాబాద్‌లోని 46 శాతం మంది నిపుణులు షార్ట్-ఫామ్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు. 45 శాతం మంది నిర్దిష్ట నైపుణ్యాలను అందించే లాంగ్-ఫామ్ వీడియో కోర్సులను అత్యంత సహాయకరంగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment