ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.
నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్‌లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..)
Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq
— Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023
Comments
Please login to add a commentAdd a comment