Allocation
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఒరిగిందేమీ లేదు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఒరిగిందేమీ లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో ఏపీకి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇచ్చామంటున్న రూ.15 వేల కోట్లు రుణంగానే ఇస్తున్నారు. రూ.15 వేల కోట్ల రుణంపై వడ్డీ కూడా ఏపీనే భరించాలి. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఏపీకి అన్యాయం జరిగినట్టే.. కేంద్రం నిధులు దోచుకోవడానికే పోలవరాన్ని చంద్రబాబు చేపట్టారు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.‘‘ఎన్డీఏ హయాంలో ఏపీ హింసకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఇది జరుగుతోంది. టార్గెట్‌గా హత్యలు, దాడులు జరుగుతున్నాయి. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుంది. ఏపీలో ఒక వర్గం మీడియా ఎల్లో జర్నలిజం నడిపిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయాలి. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని విజయసాయిరెడ్డి కోరారు.పునర్విభజన చట్టానికి కట్టుబడ్డామన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను విస్మరించింది. పార్లమెంట్లో వాగ్దానం చేసిన కేంద్రం ప్రత్యేక హోదాను ఏపీకి ఇచ్చి తీరాల్సిందే’’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
Budget 2024: సబ్సిడీలకు కోతలు.. తగ్గిన కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది. ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది. -
ఏపీలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదని, అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బిహార్ మాజీ సీఎం బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఆ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామమని చెప్పారు. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీలతో మహాధర్నా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా.. కులాల వారీగా జనాభా ఎంత ఉందో స్పష్టత వచ్చేలా జనగణన చేయాలన్నారు. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో ఫీజులు పెరిగి పోవడం వల్ల కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలు చదువుకోవడంకష్టమేనన్నారు. జనాభా లెక్కలు తేల్చకుండా కేంద్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసిందని విమర్శించారు. చదవండి: కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు: రేవంత్ రెడ్డి -
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్‌గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్‌లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్‌షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
మహారాష్ట్రకు ‘కోచ్’.. తెలంగాణకు తూచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామంటూనే రిక్తహస్తం చూపిన రైల్వేశాఖ, అదే సమయంలో మహారాష్ట్రకు దానిని కేటాయించి వేగంగా పూర్తిచేస్తోంది. తెలంగాణ ఎదురుచూస్తున్న కోచ్ ఫ్యాక్టరీపై ఆశలను ఆవిరి చేస్తూ, మహారాష్ట్రలోని లాతూరుకు దానిని కేటాయించి దాదాపు పూర్తి చేసింది. ఈ ఏడాది డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేర్చేపనిలో నిమగ్నమైంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త రవికుమార్ వివరాలు అడుగగా రైల్వే శాఖ పలు విషయాలు వెల్లడించింది. ఇదీ సంగతి.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రం ఇదివరకు పేర్కొంది. ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో దీన్ని పొందుపరచటంతో కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమోనని యావత్తు రాష్ట్రం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది. కానీ, దేశవ్యాప్తంగా ప్రస్తుత రైల్వే అవసరాలను ఇప్పటికే ఉన్న కోచ్ ఫ్యాక్టరీలే తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని ఏడాదిన్నర క్రితం రైల్వే శాఖ తేల్చి చెప్పింది. అప్పట్లోనే సమాచార హక్కు చట్టం రూపంలో రైల్వే శాఖ ఆలోచన లిఖితపూర్వకంగా స్పష్టమైంది. కానీ, కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదన్న రైల్వే శాఖ, 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూరులో దాని ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించింది. కేవలం ఐదు నెలల్లోనే రూ.625 కోట్లతో మంజూరు చేసింది. ఆ వెంటనే పనులు ప్రారంభించి, ఇప్పటికే రూ.587 కోట్లు ఖర్చు చేసింది. ఈఏడాది చివరి నాటికి దానిని పూర్తి చేయనున్నట్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుల మంజూరు, తిరస్కరణలన్నీ రాజకీయ కారణాల ఆధారంగానే జరుగుతున్నాయని రవికుమార్ ఆరోపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును కూడా తెలంగాణ నేతలు సాధించలేకపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. -
Remdesivir: ఏపీకి 2.35 లక్షలు; తెలంగాణకు 1.45 లక్షలు
ఢిల్లీ: రాష్ట్రాల వారీగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను శుక్రవారం కేంద్రం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 53 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు కేటాయించగా.. అందులో మహారాష్ట్రకు 11.57 లక్షలు, ఏపీకి 2.35 లక్షలు, తెలంగాణకు 1.45 లక్షల ఇంజక్షన్లను కేటాయింపులు చేసింది. రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇంజక్షన్లు అందేలా చూడాలని.. గుర్తింపు పొందిన ప్రైవేటు డిస్టిబ్యూటర్ల ద్వారా కూడా తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడికి ప్రయత్నాలు ఫలించడం లేదు. దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు నమోదు కాగా, 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,76,12,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,34,083 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 36,45,164 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌లోనే 49 శాతం కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. చదవండి: వ్యాక్సినేషన్ నెమ్మదించొద్దు.. రాష్ట్రాలకు ప్రధాని సూచన -
మొదట విడత డిగ్రీ సీట్ల కేటాయింపు: కన్వీనర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్(దోస్త్) మొదటి విడత సీట్లను కేటాయించినట్లు ‘దోస్త్’ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం వెల్లడించారు. కాగా మొత్తం1,71,275 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,53,323 మంది విద్యార్థులు ఆప్షన్స్‌ను ఎంచుకున్నారు. వీరిలో 1,41,340 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్లు లింబాద్రి పేర్కొన్నారు. కేటాయింపులు పూర్తయిన అనంతరం 2,66,050 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వ తేదీ వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆయన సూచించారు. ఆ తర్వాత రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. మరోవైపు రెండో విడత రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం(నేటి) నుంచి మొదలైందని లింబాద్రి పేర్కొన్నారు. -
మండల, జిల్లా, పరిషత్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం తలసరి నిధుల్లో గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా నిధులను కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా.. వాటిని జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది రూ.1,847 కోట్లు ఖరారు చేయగా.. ఇందులో మొదటి విడత (తొలి త్రైమాసికం)గా రూ.308 కోట్లు విడుదల చేసింది. జెడ్పీ 5%, ఎంపీపీలకు 10% నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2014–15లో అమలు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడింది. కేవలం సీనరేజీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులపైనే ఆధారపడాల్సి వచ్చింది. నిధుల కటకటతో నీరసించిన జెడ్పీ, ఎంపీపీలకు కూడా కొంతమేర కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో వీటికి ఊరట లభించింది. గ్రామ పంచాయతీలకు 75 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం నిష్పత్తిలో నిధులు పంచాలని నిర్ణయించింది. దీంతో తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.461.75 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసిన కేంద్రం.. టైడ్ గ్రాంట్ కింద రూ.308 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా పరిషత్‌లకు రూ.1,026.11 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.2,052.20 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.27,721.67 లక్షలను నిర్దేశించింది. వీటిని సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులతో తాగునీటి సౌకర్యాల కల్పన, వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, డోర్‌టుడోర్ చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ సేకరణ, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఆదేశించారు. -
సాగును పండుగ చేసేందుకే..
సాక్షి, మెదక్/సిద్దిపేట: వ్యవసాయాన్ని పండుగ చేసేందుకే సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల సాగు ప్రణాళికను రూపొందించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేస్తే రైతులకు మరింత లాభం వస్తుందన్న ఉద్దేశంతో నియంత్రిత పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో జరిగిన నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దాదాపు బడ్జెట్లో సగం అన్నదాతలకే వెచ్చిస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అని, దాన్ని మానుకొని రైతులు కంప్యూటర్ నేర్చుకోవాలన్న మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో మొదటి విడత కింద రూ.1,200 కోట్లు రుణ మాఫీ చేస్తామని, ఇందులో భాగంగా ఇప్పటికే రూ.25 వేల రుణాలున్న రైతులకు మాఫీ చేశామని తెలిపారు. అలాగే రూ.1 లక్ష రుణం ఉన్న రైతులకు విడతల వారీగా చేస్తామని పేర్కొన్నారు. రైతుబంధు కోసం రూ.10 వేల కోట్లు వెచ్చించామని, జూన్ 10వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రైతులు దొడ్డు రకం సాగు తగ్గించి, సన్న రకం వరి సాగు చేయాలని, ఇందుకు క్వింటాలుకు రూ.2,000 నుంచి 2,100 వరకు చెల్లించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అంతకు ముందు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో నియంత్రిత వ్యవసాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో రైతులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. సూచించిన పంటే వేస్తాం.. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలోని 45 గ్రామాల రైతులు పంట మార్పిడి, నియంత్రిత సాగును తు.చ. తప్పకుండా పాటిస్తామని ఆదివారం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులకు తీర్మానాల కాపీలను అందజేశారు. జిల్లా రైతులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. -
లైన్లకే గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కొత్త రైళ్ల బాధ్యతను ప్రైవేటుకు అప్పగించి మౌలిక వసతుల కల్పనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. వీలైనన్ని ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వేకు సంబంధించి 11మార్గాలను గుర్తించింది. ఆ మార్గా ల్లో ప్రైవేటు రైళ్లను పరుగు పెట్టించేందుకు కావాల్సిన ప్రణాళికలను రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. సొంతంగా నిర్వహించే ఒక్క కొత్త రైలు ప్రస్తావన కూడా లేకుండానే తాజా బడ్జెట్‌ను రూపొందించారు. అయితే ఇప్పటికే మొదలైన కొత్త లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ల నిర్మాణాలకు భారీగానే నిధులు కేటాయించారు. తాజా బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.6,846 కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.922 కోట్లు ఎక్కువ. ప్రారంభమైన లైన్లు పూర్తి చేశాకే కొత్తవి మొదలుపెట్టాలన్న ప్రధాని మోదీ ఆలోచన బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. తాజా బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వే జోన్‌కు కేటాయింపుల వివరాలను బుధవారం జీఎం గజానన్ మాల్యా రైల్ నిలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు ఇక పరుగు పెట్టినట్టే... మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.235 కోట్లు.. హైదరాబాద్‌తో కరీంనగర్ పట్టణాన్ని రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు మనోహరాబాద్–కొత్తపల్లికి రూ.235 కోట్లు కేటాయించారు. ఈ మార్చినాటికి గజ్వేల్ వరకు ఈ మార్గంలో రైలును నడిపేందుకు సిద్ధమైన అధికారులు, భూసేకరణ సమస్యలను అధిగమించి సిద్దిపేట వరకు వేగంగా పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నారు. 2006–07లో మంజూరైన 151 కి.మీ. ఈ ప్రాజెక్టు గత రెండేళ్లుగా పరుగుపెడుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ఇది ప్రారంభమైంది. మునీరాబాద్–మహబూబ్‌నగర్: రూ.240 కోట్లు ఈ ప్రాజెక్టుకు రూ.240 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ మార్గంలో కాచిగూడ నుంచి జక్లేర్ వరకు డెమో రైలు నడుస్తోంది. ఆ తర్వాత భూసేకరణలో జరిగిన జాప్యంతో పనుల్లో కొంత ఆటంకం ఏర్పడింది. 243 కి.మీ. ఈ మార్గం పనులు రూ.1,723 కోట్ల అంచనాతో మొదలయ్యాయి. ఇందులో 66 కి.మీ. పరిధి తెలంగాణలో ఉండగా, మిగతాది కర్ణాటక పరిధిలో ఉంది. ద.మ. రైల్వే పరిధికి సంబంధించి జక్లేర్–మక్తల్, కృష్ణ–మాగనూరు మధ్య పనులు జరుగుతున్నాయి. భద్రాచలం–సత్తుపల్లి: రూ.520 కోట్లు దక్షిణమధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు అయిన బొగ్గు తరలింపుపై ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త గనులతో రైల్వేను అనుసంధానించే క్రమంలో భద్రాచలం–సత్తుపల్లి కొత్త లైను నిర్మాణం చివరి దశకు వచి్చంది. గత బడ్జెట్లో రూ.405 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.115 కోట్లు ఎక్కువగా కేటాయించింది. ఈ సంవత్సరం పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. 54 కి.మీ.ల ఈ మార్గంలో భూసేకరణ వ్యయాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు (రూ.704 కోట్లు)ను సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. ఎంఎంటీఎస్‌కు రూ.40 కోట్లు... ఈ ఆర్థిక సంవత్సరం ఎంఎంటీఎస్ రెండో దశకు మరో రూ.40 కోట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.450 కోట్ల వరకు అందజేయవలసి ఉంది. ఈ నిధుల విడుదలలో జాప్యంతో సికింద్రాబాద్–»ొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ తదితర మార్గాల్లో లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, స్టేషన్ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ రైళ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక రూ.150 కోట్ల అంచనాలతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి టర్మినల్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయించవలసి ఉంది. ఇప్పటి వరకు ఆ భూమి ఇవ్వకపోవడంతో రైల్వేకు ఉన్న 50 ఎకరాల్లోనే రూ.80 కోట్లతో గత ఏడాది టరి్మనల్ విస్తరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం రూ.5 కోట్లు కేటాయించారు. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.412 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం మాత్రం ఈ బడ్జెట్లో రూ.10 లక్షలతో సరిపెట్టింది. డబ్లింగ్, మూడో లైన్లకు మహర్దశ... రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు లైను నిర్మాణం రైల్వేకు పెద్ద సవాలు. కాజీపేట–బల్లార్షా మూడోలైన్‌కు తాజా బడ్జెట్లో ఏకంగా రూ.483 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.118 కోట్లు ఎక్కువ. రెండు లైన్లు ఉన్నప్పటికీ సామర్థ్యం కంటే 130 శాతం అధికంగా రైళ్లను నడుపుతున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రాఘవాపురం–పోట్కపల్లి, బిసుగిర్షరీఫ్–ఉప్పల్, విరూర్–మాణిక్‌ఘర్ మధ్య మూడోలైన్ చివరి దశలో ఉండటంతో త్వరలో పూర్తి చేయనుంది. మిగతా చోట్ల పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఇప్పుడు భారీగా నిధులు కేటాయించింది. ఇక కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులకోసం రూ.404 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చింది రూ.110కోట్లే. ఫలితంగా ఈ సారి పనుల్లో వేగం పెరగనుంది. ఈ మార్గంలో కొంతమేర భూసేకరణ సమస్య ఉన్నందున దీన్ని తొందరగా పరిష్కరించాలని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు గాను రూ.185 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.200 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. షాద్‌నగర్–గొల్లపల్లి మధ్య 29 కి.మీ. మార్గం పూర్తి కావచి్చంది. త్వరలో దాన్ని అందుబాటులోకి తెచ్చి రైళ్లను నడిపే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాజీపేట వర్క్‌షాపు అంతేనా.. కాజీపేటలో నిర్మించతలపెట్టిన పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ పరిస్థితి డోలాయమానంలో పడ్డట్టు కనిపిస్తోంది. గత బడ్జెట్లో రూ.కోటిన్నర మంజూరు చేసిన రైల్వే ఈసారి నయాపైసా ప్రకటించకపోవటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, భూ సమస్య పరిష్కారం కాగానే పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పటం విశేషం. ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టరి్మనల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి–శ్రీకాకుళం, చర్లపల్లి–వారణాసి, చర్లపల్లి–పన్వేల్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గౌహతి, చర్లపల్లి–చెన్నై, చర్లపల్లి–షాలిమార్, విజయవాడ–విశాఖ, తిరుపతి–విశాఖ తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి–గుంటూరు, ఔరంగాబాద్–పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహా్వనించనున్నారు. -
సివిల్స్ కేటాయింపులో మార్పులకు యోచన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో సాధించిన ర్యాంకుల అధారంగా అభ్యర్థులకు సర్వీస్ కేటాయిస్తున్నారు. అనంతరం మూడు నెలల ఫౌండేషన్ కోర్సును పూర్తిచేశాక అభ్యర్థులు తమతమ సర్వీసుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాతే అభ్యర్థులకు సర్వీసుల్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సంబంధిత విభాగాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) కోరింది. సివిల్స్, ఫౌండేషన్ కోర్సులో పొందిన ఉమ్మడి మార్కుల ఆధారంగా సర్వీసుల్ని కేటాయించే అంశాన్ని సమీక్షించాలంది. సివిల్స్ విజేతలను ఇండియన్ రెవిన్యూ సర్వీస్, ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ వంటి ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయించే అంశంపై అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత విభాగాలను కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆన్లైన్ శ్రీవారి సేవా టికెట్లు విడుదల
తిరుమల : జూలై నెలకు సంబంధించిన 58,419 అన్ లైన్ శ్రీవారి సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. ఆన్లైన్ లక్కీ డిప్ కేటగిరిలో 9,619 టిక్కెట్లను ఉంచారు. జనరల్ కేటగిరిలో మిగతా 48, 800 టిక్కెట్లు కేటాయించారు. తోమాల(110 టిక్కెట్లు), అర్చన(110 టిక్కెట్లు), అష్టదళ పాద పద్మారాధన(120 టిక్కెట్లు), సుప్రభాతం(6,979 టిక్కెట్లు), నిజపాద దర్శనం(2,300 టిక్కెట్లు) సేవలకు సంబంధించి సేవా ఎలక్ట్రానిక్ డిప్ నమోదు శుక్రవారం(ఈ నెల 6న) ఉదయం 10 నుంచి ప్రారంభమౌతుంది. జనరల్ కేటగిరిలోని వైశేషపూజకు(1000 టిక్కెట్లు). కల్యాణానికి(12,350 టిక్కెట్లు), దోలోత్సవం(3,900 టిక్కెట్లు), ఆర్జిత బ్రహ్మోత్సవం(7,150 టిక్కెట్లు), వసంతోత్సవం(8,800 టిక్కెట్లు), సహస్ర దీపోత్సవానికి(15,600 టిక్కెట్లు) కేటాయించారు. -
అభివృద్ధి బాట
పెద్దశంకరంపేట(మెదక్): ఉమ్మడి జిల్లాలైన సంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా వెళ్తున్న 161వ జాతీయ రహదారి (సంగారెడ్డి–నాందేడ్– అకోలా)ని నాలుగు వరుసలుగా చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా భూ సేకరణ పనులను అధికారులు ముమ్మురం చేశారు. రూ.2500 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతూ 140 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారిని విస్తరించనున్నారు. మెదక్ జిల్లాలో టేక్మాల్ , అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న విధంగా భారత్‌మాలలో భాగంగా 2018–19 సంవత్సరంలో 4,500 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 367 కిలోమీటర్ల మేరకు 5 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్లను పిలిచింది. మిగతా 529 కిలోమీటర్ల జాతీయ రహదారిని భారత్‌మాల ఫేజ్–1 ప్రాజెక్టు కింద చేపట్టేందుకు నిర్ణయించింది. వీటిని 2021–22 కల్లా పూర్తిచేయాలని సంకల్పించింది. పూర్తయిన విస్తరణ సర్వే పెద్దశంకరంపేట మండలం మీదుగా వెళ్తున్న రహదారిలో భాగంగా జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ నుంచి టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి, పేట మండలంలోని జంబికుం వరకు 27 కిలోమీటర్ల వరకు విస్తరణలో రైతులు, ఇతర వాణిజ్య, వ్యాపారస్థులు నష్టపోనున్నారు. ఈ మండలాల పరిధిలో 266 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అల్లాదుర్గంలో 144.08 ఎకరాలు, టేక్మాల్ మండలంలో 21.9 ఎకరాలు, పేట మండలంలో 100.17 ఎకరాలను సేకరిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల 100 ఫీట్ల రహదారిని విస్తరించనున్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా.. ఈ జాతీయ రహదారిపై ఎనిమిది చోట్ల బైపాస్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సంగారెడ్డి, అందోల్–జోగిపేట, పెద్దశంకరంపేట, నిజాంపేట, పిట్లం, పెద్దకొడుపుగల్, మేనూరు, మద్నూర్ గ్రామాల పరిధిలో బైపాస్‌లను నిర్మించనున్నారు. జిల్లాలో కేవలం పేట మండలంలోనే బైపాస్ ఏర్పాటు కానుంది. అల్లాదుర్గం, టేక్మాల్ పరిధిలో బైపాస్‌లు లేవు. పేటలో కట్టెల వెంకటాపూర్ శివారులోని రాఘవానితాండా నుంచి కమలాపూర్ వరకు 2.5 కిలోమీటర్ల దూరం బైపాస్‌ను ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణలో భాగంగా భూములు నష్టపోతున్న వారు ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే అల్లాదుర్గం, టేక్మాల్, పేట మండలాలకు చెందిన భూ నిర్వాసితులతో ఆర్డీఓ నగేష్, అధికారులు సమావేశం నిర్వహించారు. మరో రెండు సార్లు సమావేశం కూడా నిర్వహించనున్నారు. నష్టపరిహారం పెంచాలి జాతీయరహదారి విస్తరణలో భూములు కొల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్‌ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ప్రభ్తుత్వం చర్యలు చేపట్టాలి. మాకు ముందుగానే నష్టపరిహారం చెల్లించాలి. నష్టపోతున్న వారికి ఉపాధి సైతం చూపించాలి. –యాదగిరి, కమలాపూర్, పెద్దశంకరంపేట -
విభజన పంచాయతీ..!
ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. సాక్షి, మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్‌లో మెదక్ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా 2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు. వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు. ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఫోర్‌మెన్(గ్రేడ్ 1), సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్‌మెన్(ఎంఆర్టీ గ్రేడ్1), ఫోర్‌మెన్(ఎంఆర్టీ గ్రేడ్ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సబ్ ఇంజినీర్ మొదలు ఫోర్‌మెన్ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేటలో హుస్నాబాద్ డివిజన్లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్‌కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మరోమారు పరిశీలించాలి.. పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్ జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్ఈ శ్రీనాథ్ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్‌కో సీజీఎం, సంగారెడ్డి ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఈ శ్రీనాథ్ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు. -
డీఎస్పీలకు వాహనాల కేటాయింపు
ఖమ్మం బుర్హాన్‌పురం : పోలీస్‌శాఖ ప్రజలకు మరింత మైరుగైన సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణలో భాగంగా తొమ్మిది నూతన వాహనాలను జిల్లాలోని ఎనిమిది సబ్డివిజన్లకు చెందిన డీఎస్పీలకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓఎస్డీ ఆర్.భాస్కరన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లడుతూ జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం అదేశానుసారం శాంతి భద్రతల పరిరక్షణలో ఆధునిక ప్రమాణాలతో కూడిన పోలీస్ వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా పోలీస్ శాఖ అధికారులు నడుం బిగించారన్నారు. పోలీస్ అధికారుల అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహిండం, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాల కదలికలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల అంశాలపై పర్యవేక్షణకు వీలుండే విధంగా వాహనాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.సంజీవ్ ఆర్ఐలు విజయబాబు, కృష్ణ, ఎంటీఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వెలగపూడిలో 3 నుంచి పూర్తి స్థాయి విధులు
* భవనాలు, అంతస్తులు, గదుల వారీగా శాఖలకు కేటాయింపు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంతో పెనవేసుకున్న అనుబంధం వచ్చే నెల 3వ తేదీ నుంచి తెగిపోతోంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తూ వెలగపూడి సచివాలయంలో పనిచేసేందుకు వెళ్లిపోతున్న ఉద్యోగులు.. ఇందులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పూర్తి స్థాయి విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ జీవోతోపాటు వెలగపూడి సచివాలయ భవనాల్లో శాఖల వారీగా గదులను అధికారులకు కేటాయించారు. వివరాలివీ.. ఒకటో భవనం గ్రౌండ్ ఫ్లోర్: సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం గ్రౌండ్ ఫ్లోర్: మున్సిపల్, హోం, ఇంధన-మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం తొలి అంతస్తు: ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు, ఉద్యోగులు మూడో భవనం గ్రౌండ్ ఫ్లోర్: టెలికం, ప్లే స్కూలు, మీ-సేవ, పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, అసోసియేషన్స్, ఐటీ డేటా సెంటర్, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఏపీటీఎస్, లైబ్రరీలు మూడో భవనం తొలి అంతస్తు: బీసీ, మైనార్టీ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, యువజన సర్వీసు శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం తొలి అంతస్తు: ఉన్నత విద్య, ఐటీ, మాధ్యమిక విద్య, జలవనరులు, ఆర్ఎస్ఏడీ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం తొలి అంతస్తు: రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, డిప్యూటీ పే అండ్ అకౌంట్ ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు -
నేడు నీట్, ఐఐటీల్లో రెండో రౌండ్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో రెండో దశ సీట్లకేటాయింపు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అధారిటీ (జోసా) చర్యలు తీసుకుంది. గత నెల 30వ తేదీన మొదటి రౌండ్లో సీట్లు కేటాయించారు. బుధవారం రెండోరౌండ్లోసీట్లు పొందిన వారి జాబితాను ప్రకటించనున్నది. సీట్లు పొందినవారు ఈ నెల 7వతేదీ నుంచి 9వ తేదీ మధ్య సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. మొదటి దశ యాక్సెప్టెన్సీ, ప్రవేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. -
న్యాయాధికారుల కేటాయింపులో కుట్ర
న్యాయం చేయాలంటూ ఏసీజేకు తెలంగాణ న్యాయవాదుల వినతి సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో పెద్ద కుట్ర దాగి ఉందని హైకోర్టు తెలంగాణ న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీలు గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు నివేదించాయి. హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని, ఈ విషయం తెలిసి కూడా వారిని తెలంగాణకే కేటాయిస్తూ ప్రాథమిక జాబితాను తయారు చేశారని వివరించారు. ఈ జాబితాను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్ కోర్ట్ మెజారిటీ అభిప్రాయం మేరకు రూపొందించినట్లు తెలిసిందని, మార్గదర్శకాలు ఉన్నప్పుడు వాటి ఆధారంగానే కేటాయింపులు ఉండాలే తప్ప మెజారిటీ ఆధారంగా కాదని వారు తెలిపారు. ఫుల్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులతో పోలిస్తే తెలంగాణ న్యాయమూర్తులు మైనారిటీ అని, ఈ విషయం తెలిసి కూడా కేటాయింపుల వ్యవహారాన్ని ఫుల్ కోర్టుకు నివేదించడం కుట్రేనని వారు ఏసీజేకు వివరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ న్యాయవాదులు ఏసీజేకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఉపసంహరణకు ఆదేశాలివ్వండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన ప్రాథమిక జాబితాను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని జేఏసీ నేతలు ఏసీజేను కోరారు. కేటాయింపుల సందర్భంగా న్యాయాధికారులు తమ సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న సొంత ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారన్నారు. తెలంగాణలో జిల్లా జడ్జీల కేడర్ సంఖ్య 94 కాగా 95 మందిని తెలంగాణకు కేటాయించారని, ఇందులో 46 ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారు ఉన్నారని ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో జిల్లా జడ్జీల కేడర్‌లో 140 పోస్టులంటే 110 మందినే కేటాయించారని, ఇంకా 30 ఖాళీలున్నాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 31 మంది సీనియర్ సివిల్ జడ్జీలను, 53 మంది జూనియర్ సివిల్ జడ్జీలను తెలంగాణకు కేటాయించారని వివరించారు. దీని వల్ల తెలంగాణ న్యాయవాదులకు, న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణకు చెందిన హైకోర్టు జడ్జి పోస్టులను ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారులు సొంత చేసుకునేందుకే ఈ కుట్ర జరిగిందని వారు వివరించారు. తమ అభ్యర్థనలను సావధానంగా విన్న ఏసీజే తమకు తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గండ్ర మోహనరావు, రాజేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం వారు ప్రాథమిక కేటాయింపుల జాబితాపై తమ అభ్యంతరాలను రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్‌కు అందచేశారు. -
గ్రామీణ మౌలిక అభివృద్ధికి ముందడుగు
ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పడటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు రైతులకు వ్యవసాయ రుణాలకు అత్యధికంగా 9 లక్షల కోట్లు, ఎంఎన్ ఆర్ ఈజీఏ కి అత్యధికంగా 38,500 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకానికి 19,000 కోట్లు కేటాయించడం.. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముందడుగు వేసినట్లేనంటూ రాజ్ నాథ్.. అరుణ్ జైట్లీ బడ్జెట్ ను అభినందించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలంగా ఉందని, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. అంతేకాక రహదారుల అభివృద్ధికి 55 వేల కోట్లు కేటాయించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులతోపాటు, రైల్వేలో మూలధన వ్యయం కలిపి 2.2 లక్షల కోట్లు అధిగమిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఈ ఏడు బడ్జెట్ ముఖ్యంగా పేదల పెన్నిధిగా ఉందని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 2,87,000 కోట్లు కేటాయించడం పంచాయితీరాజ్ సంస్థల బలోపేతానికి దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని అన్నారు. తయారీ రంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రయోజనాలు కల్పించిందని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
లెక్క తేలింది
కృష్ణా జలాల్లో తెలంగాణకు 20, ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు * లభ్యతగా ఉన్న 30 టీఎంసీల పంపకంపై బోర్డు సమక్షంలో కుదిరిన అవగాహన * వాస్తవ వినియోగ లెక్కలు సరిచూసుకున్నాక తుది నిర్ణయం * ఇప్పటివరకు వినియోగించిన జలాలు సుమారు 152 టీఎంసీలు * అందులో తెలంగాణ 47, ఏపీ 105 టీఎంసీల వాడకం * వినియోగించిన, ప్రస్తుత లభ్యత జలాలు కలిపి ‘36.8 : 63.2’ నిష్పత్తిన పంపకం... కృష్ణా డెల్టాకు విడుదల చేయనున్న 4 టీఎంసీలు * ఏపీ వాటాలోంచి..తెలంగాణ కేటాయింపుల్లోంచి హైదరాబాద్‌కు 1.2 టీఎంసీలు * బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేవడంపై చర్చ వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో నీటి పంపకాల లెక్కతేలింది. ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకున్నదీ, ఇంకా ఎంత నీటి వాటా ఉన్నదీ కృష్ణా బోర్డు భేటీలో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 30 టీఎంసీల్లో 20 టీఎంసీలు తెలంగాణకు, 10 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు అందేలా ప్రాథమికంగా అవగాహన కుదిరింది. తుంగభద్ర జలాలతో సహా ఇప్పటివరకూ కృష్ణా పరీవాహకంలో ఏపీ ఎక్కువగా నీటిని వాడుకోగా... ప్రస్తుత లభ్యత జలాల్లో తెలంగాణకు ఎక్కువగా నీటి వాటా వస్తోంది. ఇప్పటివరకు జరిగిన నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు వాస్తవ లెక్కలను బోర్డుకు సమర్పించిన తర్వాత... లభ్యత జలాల పంపిణీపై బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తెలిపారు. నాలుగు గంటల పాటు చర్చ కృష్ణా జలాల వినియోగం, లభ్యత జలాల పంపిణీ, బోర్డు పరిధి, పరిపాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో భేటీ అయింది. ఈ భేటీకి బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులతో పాటు తెలంగాణ తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా నదిలో నీటి లభ్యత, వాటాల మేరకు వినియోగం, అవసరాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ చెబుతున్న లెక్కల కంటే అదనంగా మరో 7 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు తెలంగాణ పేర్కొంది. కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని.. లభ్యత నీటిని ‘36.8 : 63.2’ నిష్పత్తిన పంచుకోవాల్సి ఉందని తెలిపింది. ‘‘ఇప్పటివరకు మొత్తంగా ఇరు రాష్ట్రాలు కలిపి 152 టీఎంసీలు వినియోగించుకోగా.. తెలంగాణ 47, ఏపీ 105 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. ఏపీ కేవలం శ్రీశైలం, సాగర్ల కింది నీటి వినియోగ లెక్కలను మాత్రమే చెబుతోంది. బేసిన్లోనే ఉన్న తుంగభద్ర నీటి వినియోగాన్ని ఇందులో కలపడం లేదు. అది కూడా కలిపితే ఏపీ అదనంగా మరో 7 టీఎంసీలు వాడుకున్నట్లు తేలుతోంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం లభ్యతగా ఉన్న 30 టీఎంసీల్లో 7 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలి. ఇవి తీసేయగా మిగిలిన 23 టీఎంసీలను పంచాలి. తొలుత వాడుకున్న అదనపు జలాలతో సహా మొత్తం నీటిని ‘36.8 : 63.2’ వాటా నిష్పత్తి మేరకు లెక్కిస్తే... ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 20 టీఎంసీలు (అదనపు 7 టీఎంసీలు+వాటా 13 టీఎంసీలు), ఏపీకి 10 టీఎంసీలు దక్కుతాయి. ఈ విధంగానే పంపకం జరగాలి..’’ అని వివరించింది. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు కేటాయించిన 4 టీఎంసీలను ఏపీ వాటాగా వచ్చే 10 టీఎంసీల్లోంచే తీసుకోవాలని... హైదరాబాద్ అవసరాలకు 1.2 టీఎంసీలను తమ వాటాలోంచే తీసుకుంటామని స్పష్టం చేసింది. తెలంగాణ వాదనలపై సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన ఏపీ... వాస్తవ వినియోగ లెక్కలను సరిచూసుకున్నాక తుది నిర్ణయం చెబుతామని తెలిపింది. నికరంగా దక్కేది 17 టీఎంసీలే.. తెలంగాణకు దక్కే 20 టీఎంసీల్లో 3 టీఎంసీల మేర ఆవిరి నష్టాలుంటాయని... అవి తీసేస్తే నికరంగా దక్కేవి 17 టీఎంసీలు మాత్రమేనని సమావేశం అనంతరం నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ 17 టీఎంసీల నీటిని జూలై దాకా హైదరాబాద్‌కు 9 టీఎంసీలు, ఏఎంఆర్పీకి 3 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 5 టీఎంసీల చొప్పున వినియోగించుకుంటామని పేర్కొన్నారు. శ్రీశైలం భద్రతపై కమిటీ శ్రీశైలం డ్యామ్ భద్రతపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో కృష్ణాకు వరదలు వచ్చిన సందర్భంగా డ్యామ్ దిగువన ఉన్న కొండ చరియలు కొట్టుకుపోయాయి. దానివల్ల డ్యామ్ కొద్దిమేర బలహీనపడిందని... ప్లంజ్‌పూల్, కాపర్ డ్యామ్ దెబ్బతిన్నాయని నిపుణులు తేల్చిన దృష్ట్యా బలోపేతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గేట్ల నిర్వహణ, పూడికతీత కూడా భద్రతా చర్యల్లో భాగంగా ఉండాలని.. వరద ఉధృతికి తగినట్లుగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిపై తక్షణమే స్పందించిన బోర్డు... భద్రతా చర్యలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తామని స్పష్టం చేసింది. దీంతోపాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) అధికారులతో కమిటీ వేయాలని, వారి సూచనల ప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. నియంత్రణపై జరగని చర్చ.. పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశం ప్రస్తావనకు వచ్చినా చర్చ మాత్రం జరగలేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపనందున.. నియంత్రణ అవసరం లేదని తెలంగాణ నోటిమాటగా తెలిపింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని వివరించింది. అయితే ఈ అంశాలపై తదుపరి సమావేశంలో చర్చిద్దామని బోర్డు అధికారులు పేర్కొనగా... దానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక బోర్డు నిర్వహణ నిమిత్తం రూ.11.4 కోట్లు కేటాయించాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. అధికారుల జీతాలకే రూ. 5.70 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చును ఇరు రాష్ట్రాలు చెరిసగం భరించాలని సూచించగా... ఇరు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. -
‘బీ కేటగిరీ’లో స్కామ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో భారీ కుంభకోణానికి తెరలేపాయి! ఈ సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ముందే కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని యాజమాన్యాలు ఆ సీట్లను ‘కొనుగోలు’ చేసిన వారికే కట్టబెట్టేందుకు వీలుగా ఎన్నారై కోటాలోకి మార్చుకునేందుకు కుట్రకు రంగం సిద్ధం చేశాయి!! కౌన్సిలింగ్లో ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులను సైతం తప్పించేందుకు తెగించాయి. ఏదైనా కారణంతో కాలేజీ యాజమాన్యం సీటు కోల్పోతే ఆ సీటును ఎన్నారై కోటాలోకి మార్చుకోవచ్చన్న ప్రభుత్వ ఉత్తర్వును అనుకూలంగా మలచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఎక్కువ మంది మధ్య తరగతి విద్యార్థులే ఉన్నప్పటికీ వారి స్తోమతకు మించి ఎంబీబీఎస్‌కు మొదటి ఏడాది ఫీజు రూ. 9 లక్షలతోపాటు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపాలని ఒత్తిడి తెస్తున్నాయి. పన్నురెండ్రోజుల క్రితం ప్రభుత్వం నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీని ఏడాదికి కుదిస్తూ జీవో జారీచేసినా అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఈ నెలాఖరుకే గ్యారంటీ గడువు ముగుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపింది కొందరే... రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ కింద ఉన్న 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 బీడీఎస్ సీట్లకు ఇటీవల ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో ఎంబీబీఎస్ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ బీడీఎస్‌లో మాత్రం 200కుపైగా సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు సీటు సాధించినప్పటికీ బ్యాంకు గ్యారంటీ వారికి అడ్డుగా మారింది. ఈ నెలాఖరు నాటికి నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు ఉంటుందని లేకుంటే వదులు కోవాల్సిందేనని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన ‘ఏడాదికి బ్యాంకు గ్యారంటీ’ జీవోతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నాయి. దీంతో 505 ఎంబీబీఎస్ సీట్లల్లో చేరిన విద్యార్థుల్లో శుక్రవారం నాటికి కేవలం 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపినట్లు తెలిసింది. యాజమాన్యాల నిబంధన వల్ల కనీసం 300 ఎంబీబీఎస్ సీట్లకు చెందిన విద్యార్థులు నాలుగేళ్ల బ్యాంకు చూపని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. వీటిని ఎన్నారై కోటా కింద మార్చుకోవాలన్న కుట్రలో ప్రైవేటు మెడికల్ యాజమాన్నాలు ఉన్నాయి. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. బ్యాంకు గ్యారంటీకి వచ్చే నెల 4 వరకు అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా బహిరంగ ప్రకటన ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. సవరణ జీవో ఏకపక్షం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకెక్కాయి. యాజమాన్య కోటా కింద ప్రవేశం పొందే తేదీ లోపు మొదటి ఏడాది ఫీజుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు తమకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సర్కారు సవరించడాన్ని సవాల్‌చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరాయి. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సాధారణ పద్దతిలోనే పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, సవరణ జీవో మేరకు ఓ ఏడాదికి బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు తమకూ గడువునివ్వాలంటూ పలువురు విద్యార్థులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారికి వారం గడువునిచ్చింది. -
సిండికేట్లదే గెలుపు
- 328 మద్యం షాపులకు లాటరీ - అనుకున్నది సాధించిన సిండికేట్లు - చేయి కలిపిన రియల్టర్లు, అధికారులు? - ఆందోళన చేసిన మహిళలు అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రకారం సోమవారం మద్యం షాపుల కేటాయింపు జరిగింది. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన లాటరీ ప్రక్రియ తెల్లవారు జాము వరకూ సాగింది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్,జాయింట్ కలెక్టర్ జె.నివాస్, ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణలు కైలాసపురంలోని డాడ్ లేబర్ బోర్డ్ కళ్యాణమండపంలో మద్యం దుకాణాలకు లాటరీ తీశారు. ప్రభుత్వ తీరకు నిరసనగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోనే గతేడాది మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టించిన విశాఖ జిల్లా కేటాయింపుల్లోనూ అదే ఒరవడి కొనసాగించింది. 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించి మిగతా 367 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 328 షాపులకు 5835 దరఖాస్తులు దాఖలయ్యాయి. 39 షాపులకు ఒక్క దరఖాస్తు దాఖలు కాలేదు. దీంతో 328 షాపులకు సోమవారం కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి 8 గంటల ప్రాంతానికి దాదాపు 200 షాపులకు లాటరీ తీశారు. అన్ని షాపులకు లాటరీ తీయడానికి అర్ధరాత్రి దాటిపోతుందని డీసీ వెల్లడించారు. రెడ్డి సీతారాం అనే వ్యక్తి గెజిట్ నెం.118,119లకు సింగిల్ టెంటర్లు వేశారు. లాటరీకి అటెండ్ కాకపోవడంతో అతనికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తామని కలెక్టర్ ప్రకటించారు. సిండికేట్లు, రియల్టర్లదే హవా: మద్యం షాపులకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి లాటరీ పూర్తయ్యే వరకూ సిండికేట్లు చక్రం తిప్పారు. అనుమానం రాకుండా వారు అనుకున్నది చేయగలిగారు. సింగిల్ టెండర్లు, డబుల్ టెండర్లు, మూడు నుంచి 10 టెండర్లు..ఇలా వచ్చిన దరఖాస్తులన్నీ సిండికేట్ల మాయాజాలమేనంటే నమ్మకతప్పదు. 59 షాపులకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ సిండికేట్ల కనుసన్నల్లో వచ్చినవేనంటున్నారు. గాజువాకలో 30, అనకాపల్లిలో 16, విశాఖలో 13 షాసులు సిండికేట్ల చేజిక్కిట్లేనని భావించవచ్చు. మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కొందరు రియల్టర్లు, ఉన్నతాధికారులు తమ పెట్టుబడులను మద్యం దుకాణాలవైపు మళ్లించినట్లు తెలుస్తోంది. పలువురు ఉన్నతాధికారులు తాము వెనకుండి బినామీలతో దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. గ్రామీణ, ఏజెన్సీ పరిధి లోని షాపులకోసం 4665 దరఖాస్తులు రాగా కేవలం సిటీ పరిధిలోని 60షాపులకు 1170దరఖాస్తులు రావడంతో ఆ విషయం స్పష్టమవుతోంది. సిటీని ఆనుకుని ఉన్న గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లోని షాపులకు ఇవే డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వామే వత్తాసు పలికితే ఎలా? ఐద్యా, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. మంచినీళ్లు ఇవ్వండి బాబూ, మద్యం వద్దు అంటూ నినాదాలు చేశారు. షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలు ఏంటని నిలదీశారు.డిఎల్‌బి కళ్యాణమండపంలోకి దూసుకువెళ్లి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వారించి వెనక్కు పంపాలని చూశారు. కుదరకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. డిఎల్‌బీకి కిలో మీటరు దూరంలోనే మహిళలను అడ్డుకున్న పోలీసులు వారిని నిర్ధాక్షిణ్యంగా ఈడ్చిపాడేశారు. -
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు నిలిపి వేయండి : సుప్రీం
-
లాటరీ పద్ధతిలోనే షాపులు
-
లాటరీ పద్ధతిలోనే షాపులు
- పాత ఎక్సైజ్ విధానంలోనే కేటాయింపు - ఈ నెల 21వరకు దరఖాస్తుల స్వీకరణ - 23న కలె క్టర్ ఆధ్వర్యంలో డ్రా - ఒక్కో దరఖాస్తుకు రూ.25 వేల ఫీజు మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఈ మారూ మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ పద్ధతిలోనే కొనసాగనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు పరుస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ఉత్తర్వులు శనివారం జిల్లాకు చేరాయి. ఈ మేరకు అధికారులు షాపుల కేటాయింపు విధానానికి కసరత్తు చేయనున్నారు.ప్రస్తుతం జిల్లాలో 184 మద్యం షాపులు, ఏడు బార్లున్నాయి. వీటిని 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించనున్నారు. అప్పట్లో 50 వేల నుంచి 3లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక్కో మద్యం దుకాణానికి రూ.42 లక్షలు,50 వేలకు పైగా ఉన్న ప్రాంతాలకు 34 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలలో 32.5 లక్షలు లెసైన్స్ ఫీజులను శ్లాబ్‌ల వారీగా నిర్ణయించారు. ఈనెల 30 తో మద్యం దుకాణాలకు లెసైన్స్‌ల గడువు తీరనుంది. 194 మద్యం దుకాణాలకు.... 2014-15 సంవత్సర ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఎక్సైజ్‌శాఖా మంత్రి పద్మారావ్ ప్రకటించారు.గతంలో జిల్లాలో194 మద్యం షాప్‌లకు గాను 184 మద్యం షాప్‌లకు అధికారులు లాటరీ పద్దతిన వైన్‌షాప్‌లను ఎంపిక చేశారు.అప్పుడు మిగలిన 10 షాప్‌లతో కలిపి జూలైలో కొత్త విధానం ప్రకారం వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ పరిధిలో మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో వనపర్తి, అచ్చంపేట, ఆమన్‌గల్, కల్వకుర్తి, కొల్లాపూర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పరిధిలో 57 వైన్ షాపులు ఉన్నాయి. గద్వాల డివిజన్ పరిధిలో కొత్తకోట, కొడంగల్, ఆత్మకూర్, నారాయణపేట, అలంపూర్‌లలో ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో 62 వైన్ షాపులు, రెండు బార్లున్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో షాద్‌నగర్, కొడంగల్, జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో 65 వైన్ షాపులు, ఏడు బార్లున్నాయి. 2012 సంవత్సరంలో డ్రా పద్ధతిన దుకాణాలను కేటాయించారు. ఏడాది తర్వాత అవే దుకాణాలను రెన్యువల్ చేశారు. ఈనెల 30 తో వాటి గడువు ముగుస్తుంది. టెండర్ల సమయంలో జిల్లా నుంచి 55 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గతంలో నిర్వహించిన మాదిరిగానే 7 విడతలలోనే మద్యాన్ని సరఫరా చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కొత్త పాలసీ ప్రక్రియను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీసీ గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రతీ దరఖాస్తుకు 25వేల ఫీజును నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. 23న లాటరీ పద్ధతిన కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.