ఢిల్లీ: రాష్ట్రాల వారీగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను శుక్రవారం కేంద్రం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 53 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు కేటాయించగా.. అందులో మహారాష్ట్రకు 11.57 లక్షలు, ఏపీకి 2.35 లక్షలు, తెలంగాణకు 1.45 లక్షల ఇంజక్షన్లను కేటాయింపులు చేసింది. రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇంజక్షన్లు అందేలా చూడాలని.. గుర్తింపు పొందిన ప్రైవేటు డిస్టిబ్యూటర్ల ద్వారా కూడా తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస‍్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడికి ప్రయత్నాలు ఫలించడం లేదు. దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు నమోదు కాగా, 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,76,12,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,34,083 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 36,45,164 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌లోనే 49 శాతం కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
చదవండి: వ్యాక్సినేషన్ నెమ్మదించొద్దు.. రాష్ట్రాలకు ప్రధాని సూచన
Comments
Please login to add a commentAdd a comment