Remdesivir
-
ఠాగూర్ సినిమాను తలపించే సీన్.. అస్సలు తగ్గేదే లే!
సాక్షి, మీర్‌పేట: వైద్యం పేరుతో మోసం చేసి తన భర్త మృతికి కారణమయ్యారని మృతుడి భార్య మీర్‌పేట పోలీసులకు రైజ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట హుడాకాంప్లెక్స్‌కు చెందిన పాశం సైదులు గౌడ్ ఏప్రిల్ 26వ తేదీన కరోనా బారిన పడి హస్తినాపురంలోని రైజ్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేరాడు. సైదులు పరిస్థితి విషమంగా ఉందని.. హెల్త్‌కార్డు తీసుకోమని రూ.50వేలు నగదు రూపంలో చెల్లిస్తేనే చేర్చుకుంటామని చెప్పడంతో ముందుగా రూ.50వేలు చెల్లించి ఆ తరువాత బెడ్ కోసం ప్రతి రోజు రూ.40వేలు, మాత్రలు, పరీక్షలకు వేర్వేరుగా నగదు చెల్లించారు. మరుసటి రోజు వైద్యులు 6 రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అవసరమని.. రూ.30వేలకు బ్లాక్ మార్కెట్లో శంకర్ అనే వ్యక్తి వద్ద దొరుకుతాయని చెప్పి ఇంజెక్షన్లు ఇప్పించారని తెలిపారు. ఇదిలా ఉండగా సైదులుకు ప్లాస్మా కావాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు రూ.20వేలు చెల్లించారు. ఏప్రిల్ 30వ తేదీన మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని అందుకు రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పి నగదు చెల్లించాక 14 గంటల తరువాత సైదులు పరిస్థితి విషమించిందని తెలిపారన్నారు. వెంటిలేటర్ అత్యవసరమని లక్ష రూపాయలు చెల్లించాలని తెలిపారు. మే 2వ తేదీన సైదులుకు నాలుగు యూనిట్ల ప్లాస్మా, మందులు అవసరమని, చెప్పి ఐదు రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. అనంతరం మే 8వ తేదీన సైదులు మృతి చెందాడు. వైద్యం పేరుతో రైజ్ ఆసుపత్రి యాజమాన్యం లక్షల్లో డబ్బు వసూలు చేసి, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు తన భర్తకు వేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని మృతుడి భార్య పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అమ్ముకున్న మేనేజర్ శ్రీధర్‌రెడ్డితో పాటు వైద్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రఘుదీప్, మనోహర్‌రెడ్డి, డైరెక్టర్ శిల్పపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పిల్లల్లోనూ ప్రభావం చూపిస్తోంది. చిన్నారులు సైతం వైరస్ బారినపడుతున్నారు. అయితే, వారిలో లక్షణాలు అంతగా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కోవిడ్ చికిత్సలో భాగంగా పెద్దలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, పిల్లలకు ఈ ఇంజక్షన్ ఇవ్వొద్దని డీజీహెచ్ఎస్ తేల్చిచెప్పారు. అంతేకాకుండా సీటీ స్కాన్ విషయంలోనూ హేతుబద్ధత ఉండాలని వెల్లడించారు. అంటే అవసరం మేరకు పరిమితంగానే సీటీ స్కాన్ చేయాలని పేర్కొన్నారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనా కేసుల్లో స్టెరాయిడ్ల వాడకం హానికరమని హెచ్చరించారు. హాస్పిటల్లో చేరిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్న బాధితులకే స్టెరాయిడ్లు ఇవ్వొచ్చని సూచించారు. అదికూడా సీనియర్ వైద్యుడి పర్యవేక్షణలోనే స్టెరాయిడ్లు ఇవ్వాలన్నారు. సరైన సమయంలో, సరైన డోసు, సరైన కాల వ్యవధిలోనే స్టెరాయిడ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. డీజీహెచ్ఎస్ మార్గదర్శకాలు ►18 ఏళ్లలోపు వారికి రెమ్‌డెసివిర్ వాడకం, అది చూపించే ప్రభావం, భద్రతపై ఇప్పటిదాకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అందుకే వారికి కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్‌ను సూచించడం లేదు. ►అధిక తీవ్రత కలిగిన సీటీ (హెచ్ఆర్సీటీ) స్కాన్ వాడకంలో హేతుబద్ధత అవసరం. ►కోవిడ్–19 అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీని నియంత్రణలో యాంటీమైక్రోబయల్స్ ఉపయోగం పెద్దగా ఉండదు. ►లక్షణాలు, తక్కువ తీవ్రత కలిగిన కేసుల్లో యాంటీమైక్రోబయల్స్ అవసరం లేదు. ►పిల్లలకు కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోతే ప్రత్యేకంగా చికిత్స ఏదీ అక్కర్లేదు. వారికి బలవర్థకమైన ఆహారం, పోషకాహారం అందజేయాలి. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి. ►స్వల్పంగా లక్షణాలు ఉంటే పారాసెటమాల్ మాత్రలు ప్రతి 4–6 గంటలకోసారి ఇవ్వాలి. దగ్గు ఉంటే సిరప్ వాడొచ్చు. ►ఇన్ఫెక్షన్ కొంత ఎక్కువ మోతాదులో ఉంటే వెంటనే ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలి. ►స్వల్ప మోతాదులో ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు కారి్టకోస్టెరాయిడ్లు ఇవ్వొద్దు. ►ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటేనే యాంటీమైక్రోబయల్స్ ప్రయత్నించవచ్చు. ►12 ఏళ్లు దాటి కరోనా సోకిన పిల్లల వేలికి పల్స్ ఆక్సీమీటర్ అమర్చి, ఆరు నిమిషాలపాటు నడిపించాలి. వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఏ మేరకు ఉందన్నది దీని ద్వారా తెలుసుకోవచ్చు. దాన్నిబట్టి చికిత్స చేయొచ్చు. -
ఈ యాంటీ వైరల్ డ్రగ్ వాడాలంటే సీనియర్ వైద్యుడే చెప్పాలి
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ విషయంలో హేతుబద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసింది. చికిత్సతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సీనియర్ వైద్యుడు సూచిస్తేనే రోగికి ఈ డ్రగ్ వాడాలని నిర్దేశించింది. ఇకపై రెమ్‌డెసివిర్‌ను ఆసుపత్రులే సమకూర్చాల్సి ఉంటుంది. బయటి నుంచి తీసుకురావాలంటూ రోగి సంబంధీకులను ఒత్తిడి చేయడానికి వీల్లేదు. రెమ్‌డెసివిర్ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాత్రిపూట, సీనియర్ వైద్యుడు అందుబాటులో లేని సమయంలో రోగికి ఈ డ్రగ్ ఇవ్వాల్సి వస్తే డ్యూటీ డాక్టర్ సీనియర్ వైద్యుడిని ఫోన్లో సంప్రదించాలి. స్పెషలిస్టును లేదా యూనిట్ ఇన్చార్జిని కూడా సంప్రదించవచ్చు. వారి సలహాతోనే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి. వారు రాతపూర్వకంగా తమ సమ్మతిని తెలియజేయాలి. ఇందులో వారి స్టాంప్, సంతకం ఉండాలి. రెమ్‌డెసివిర్ వాడకాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రతి ఆసుపత్రి యాజమాన్యం స్పెషల్ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. (చదవండి: ఓటు ఎక్కడో.. వ్యాక్సిన్ అక్కడే ) -
రాష్ట్రాలకు రెమిడెసివిర్ పంపిణి నిలిపేసిన కేంద్రం
-
రెమ్‌డెసివిర్ బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్రం
న్యూఢిల్లీ : రెమ్‌డెసివిర్ ఔషధం పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ప్రస్తుతం రెమ్‌డెసివిర్ రోజువారీ ఉత్పత్తులు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మందావియా ప్రకటన చేశారు. ఇకపై రెమ్‌డెసివర్ పంపిణీ బాధ్యతలను పర్యవేక్షించాల్సిందిగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ ఏజెన్సీ, సీడీఎస్‌సీవోలను ఆయన ఆదేశించారు. అప్పుడు కీలకం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం కీలకంగా మారింది. ఏప్రిల్ 15 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ రోజు 33,000 రెమ్‌డెసివిర్ వాయిల్స్ తయారయ్యేవి. మరోవైపు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో మే 8 నుంచి రెమ్‌డెసివర్ తయారీ కంపెనీల నుంచి కేంద్రం నేరుగా ఔషధాలను కొనుగోలు చేసేది. కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపిణీ చేస్తూ వచ్చింది. పెరిగిన ఉత్పత్తి రెమ్‌డెసివిర్ కొరత అధిగమించేందుకు ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్యను 20 నుంచి 60కి పెంచారు. దీంతో రెమ్‌డెసివిర్ ఔషధాల ఉత్పత్తి రోజుకు 33 వేల నుంచి 3.50 లక్షల వాయిల్స్‌కి పెరిగింది. దీంతో రెమ్‌డెసివిర్ పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ఇప్పటి వరకు కేంద్రం 53 లక్షల వాయిల్స్‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. ఇటీవల కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ మందును ఐసీఎంఆర్ తొలిగించింది. -
యాంటీ కోవిడ్ డ్రగ్స్ సెలబ్రిటీల వద్ద ఎలా ఉన్నాయి : హైకోర్టు
ముంబై : కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తున్న బాలీవుడ్ సినీ నటుడు సోనూసూద్‌కు ముంబై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఎంతో మందికి సోనూసూద్ సహా పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవా కార్యక్రమాలపై జస్టిస్ అమ్జాద్ సయీద్, గిరీష్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోవిడ్ డ్రగ్స్‌పై కేంద్రానికి మాత్రమే అథారిటీ ఉందని, అలాంటప్పుడు సెలబ్రిటీలకు కోవిడ్ మందులు, ఇంజెక్షన్లు ఎలా వస్తున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న వారి ఆలోచన మంచిదే కానీ, సెలబ్రిటీలకు ఈ స్థాయిలో కోవిడ్ డ్రగ్స్ ఎలా అందుబాటులో ఉంటున్నాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందులో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందా? అఫీషియల్‌గానే వీరు మందులు సమకూరుస్తున్నారా అన్న విషయాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెమిడిసివర్ సహా మరికొన్ని కంపెనీలు కేవలం కేంద్రానికే మందులు చేస్తున్నాయని, సెలబ్రిటీలకు సరఫరా చేయడం లేదని కేంద్రం తరుపు న్యాయవాది కోర్టుకు తెలపగా, మరి కేంద్రానికి తెలియకుండా వారి వద్దకు మందులు ఎలా వచ్చాయని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికే సోనూసూద్ సహా, ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, ఇతర సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చదవండి :ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్ ప్రశంసలు.. కారణమిదే.. హైదరాబాద్‌వాసికి నటుడు సోనూసూద్ సాయం -
ఎంజీఎంలో ఇంటిదొంగలు!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సరఫరా చేసిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆస్పత్రిలో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం ఘటనలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నారు. అయితే, ఎంజీఎం మాజీ పరిపాలనాధికారి ఇంజెక్షన్లను బయటకు తరలించారని, దీనిపై ఆరోగ్యశాఖ మాజీ మంత్రిని సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం కేటాయించిన రెమ్‌డెసివిర్‌లను ప్రైవేట్ క్లినిక్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఆ క్లినిక్ కాంపౌండర్ కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. కమిటీ వేశాం: సూపరింటెండెంట్ ఈ ఘటనపై విచారణ కోసం సీనియర్ ప్రొఫెస ర్లతో కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. సదరు కమిటీ రెండు నెలలుగా ఆస్పత్రికి వచ్చిన ఇంజక్షన్లు, వినియో గంపై ఆరా తీస్తుందన్నారు. ఇక ఎంజీఎం ఆస్ప త్రిలో ఫ్లోమీటర్లు కూడా చోరీకి గురయ్యాయని పరి పాలనాధికారులు నిర్ధారణకు వచ్చారు. చోరీ బాధ్యులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. -
‘కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉంది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 23,685.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18,094 రెమిడెసివిర్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాబోయే మూడురోజులు ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సింఘాల్ తెలిపారు. అలాగే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌కు అవసరమైన మందులను జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. -
కొనసాగుతున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్‌మార్కెట్ దందా
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్ష బ్లాక్‌మార్కెట్ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్‌డెసివర్‌ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉప్పల్ నర్సింగ్‌హోమ్‌లో హెచ్ఆర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెమ్‌డెసివర్‌కు మార్కెట్లో కొరత ఉండడంతో బ్లాక్‌లో అమ్ముకుంటే డబ్బులు బాగా సంపాదించొచ్చని అనిల్ భావించాడు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.25 వేలకు కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. అయితే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అనిల్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాలుగు రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. -
WHO: రెమ్‌డెసివర్‌ను కరోనా చికిత్సకు వాడొద్దు
జెనీవా: కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. రెమ్‌డెసివర్ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్వో స్పష్టం చేసింది. అందుకే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక భారత్‌లోనూ కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని.. కరోనా బాధితులెవరికి ఆ ఇంజక్షన్ వాడొద్దని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశంలో, పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా జోరుగా నడుస్తుంది. చదవండి: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్ తీసుకోవద్దు -
రెమ్‌డెసివిర్ మాఫియా ముఠా గుట్టు రట్టు
ఏలూరు టౌన్: కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే నాలుగు ముఠాలను అరెస్టు చేయగా తాజాగా ఏలూరులోని ఆశ్రం కోవిడ్ ఆస్పత్రికి చెందిన 10 మంది సిబ్బందిని బుధవారం అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె.నారాయణనాయక్ బుధవారం వివరాలు వెల్లడించారు. ఏలూరు ఆశ్రం కోవిడ్ హాస్పిటల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు, నలుగురు టెక్నీషియన్లు, ముగ్గురు సిబ్బంది ముఠాగా ఏర్పడి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను దారి మళ్లిస్తున్నారు. బయట మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.15 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేసులో ఏలూరు కొత్తపేట నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్టాఫ్‌నర్స్ వేల్పూరి రేఖాదేవి, పెదవేగికి చెందిన స్టాఫ్‌నర్స్ గారపాటి సులోచన, దెందులూరుకు చెందిన స్టాఫ్‌నర్స్ చిగురుపల్లి అరుణ, ఏలూరు వెంకటాపురం చెంచుకాలనీకి చెందిన వార్డ్బాయ్ నకినాల రమేష్, ఏలూరు తంగెళ్లమూడి బీడీ కాలనీకి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ గూడపాటి రాజేష్, ఏలూరు వెంకటాపురం రామానగర్ కాలనీకి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ కెల్లా పూర్ణచంద్రరావు, ఏలూరు జాలిపూడికి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ డొల్ల సుధాకర్, ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కార్డియాలజీ టెక్నీషియన్ గూడపాటి సురేష్, ఏలూరు కంకణాలవారి వీధికి చెందిన సెక్యూరిటీ గార్డ్ కడగాల అనురాధ, ఏలూరు పవర్‌పేట గంగానమ్మగుడి ప్రాంతానికి చెందిన శీలవలస రమణను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 27 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, రెమ్‌డెసివిర్ ఖాళీ వయల్స్ 15, రూ.1.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హెచ్చరిక: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్ తీసుకోవద్దు
న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ‘హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు, జాగ్రత్తలు’ అనే అంశంపై ఎయిమ్స్ డాక్టర్లు నీరజ్ నిశ్చల్, మనీష్‌లు శనివారం ఒక వెబినార్‌లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఆక్సిజన్ స్థాయిలను పరీక్షిస్తున్నపుడు పేషెంట్ వయసు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ►ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ... లక్షణాలు అలాగే కొనసాగితే మరోసారి టెస్టు చేయించుకోవాలి. ►ఐసోలేషన్ ఉన్నవారు మందులను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడితేనే ఉపయోగం ఉంటుంది. ►ఐసోలేషన్‌లో వాడే ఏ మందులైన డాక్టర్ల సలహా మేరకే వాడాలి. ►బీపీ, షుగర్, గుండెజబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 ఏళ్లకు పైబడిన పేషెంట్లు డాక్టర్లను సంప్రదించాకే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ►హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు తప్పకుండా మూడు పొరల మాస్క్‌ను వాడాలి, ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి దాన్ని మార్చాలి. ►ఒకరికొకరు ఎదురుపడాల్సిన పరిస్థితుల్లో పేషెంట్, సహాయకుడు ఇద్దరూ ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ►అజిత్రోమైసిన్ టాబెట్ల వాడొద్దని కోవిడ్ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
నకిలీ రెమ్‌డెసివర్ బాధితులే.. కానీ కోవిడ్‌ను జయించారు
భోపాల్: కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశంలో రెమ్‌డెసివర్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో. అవసరం ఉన్నా లేకపోయిన ప్రతి ఒక్కరికి రెమ్‌డెసివర్ సిఫారసు చేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఈ ఇంక్షన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని ముఠాలు ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఎక్కువ ధరకు విక్రయిస్తూ.. ప్రజలను దోచుకుంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు వసూలు చేసి కూడా నకిలీ ఇంజక్షన్లను అంటగడుతున్నారు. రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో పలువురు నిపుణులు కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి ఈ ఇంజక్షన్ అవసరం లేదని.. అనవసరంగా హైరానా పడి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు. తాజాగా దేశంలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో రెమ్‌డెసివర్ అతి వినియోగం కూడా ఓ కారణమని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఓ సంఘటన వీరి సూచనలను బలపరుస్తుంది. రాష్ట్రంలో నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 90 మందికిపైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం 100 మందికిపైగా నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇవ్వగా వీరిలో 10 మంది మరణించారు.. 90మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారని దర్యాప్తులో తెలిసింది. ఆ వివరాలు.. తాజాగా ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ తీసుకున్న పది మంది కోవిడ్ బాధితుల మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక తక్షణ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు సరఫరా చేసిన గుజరాత్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా గ్లూకోజ్-ఉప్పు కలిపిన నీటిని రెమ్‌డెసివర్ ఇంజక్షన్లుగా జనాలు అమ్మారు. అయితే ఈ నకిలీ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 10 మంది చనిపోగా.. 90 మందికి పైగా కోలుకున్నట్లు తెలిసింది. చనిపోయిన వారిని దహనం చేయడంతో ఈ నకిలీ ఇంజక్షన్ వల్ల కలిగిన దుష్ప్రభావాల గురించి అధ్యయనం చేసే అవకాశం లేదన్నారు పోలీసులు. ఇంకా ఎంతమందికి ఈ నకిలీ ఇంజక్షన్ వినియోగించారనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కేంద్రం కూడా తీవ్రమైన కేసుల్లో రెమ్‌డెసివర్ వాడితే ఆస్పత్రులో చేరే అవకాశాన్ని తగ్గిస్తుందని తెలిపింది. అయితే ఇది మరణాలను తగ్గిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. చదవండి: కరోనాకు ఇస్తున్న మందులు, చికిత్సతో సమస్య జటిలం -
రెమిడిసివిర్ ఎక్కువగా వాడితే బ్లాక్‌ఫంగస్ వచ్చే ఛాన్స్: డీఎంఈ రమేశ్‌రెడ్డి
-
ఏలూరులో ‘రెమ్‌డెసివిర్’ ముఠా గుట్టురట్టు
ఏలూరు టౌన్: ప్రభుత్వాస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు దొంగిలించి.. బయట అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న లావణ్య, రాయల వెంకటలక్ష్మితో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, రూ.40 వేల నగదు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరును కేంద్రంగా చేసుకున్న మూడు ముఠాలు.. కరోనా బాధితులకు అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఎస్పీ దిలీప్‌కిరణ్ నేతృత్వంలో టూటౌన్ సీఐ ఆదిప్రసాద్ బృందం రంగంలోకి దిగింది. పక్కా ఆధారాలతో ఏలూరు జీజీహెచ్‌లో పనిచేసే స్టాఫ్ నర్సులు లావణ్య, రాయల వెంకటలక్ష్మి, ఎంఎన్‌వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్య, గోగులమూడి అశోక్‌తో పాటు ఏలూరు కొత్తపేటకు చెందిన విష్ణుసాయికుమార్, కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రేడియాలజిస్ట్ ఏకాంబరేశ్వర అలియాస్ బాబి, విజయవాడ సన్‌రైజ్ ఆస్పత్రిలోని కార్డియాలజీ టెక్నీషియన్ గుమ్మల సాయిబాబు, ఏలూరు సత్రంపాడుకు చెందిన గండేపల్లి సుబ్బారావు, గ్లోబల్ మెడికల్స్‌లో పనిచేసే నారాయణ సాయి మోహన్, సూర్య మెడికల్స్‌లో పనిచేసే ముక్కాల సుధీర్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
కరోనాకు ఇస్తున్న మందులు, చికిత్సతో సమస్య జటిలం
సాక్షి, హైదరాబాద్: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు కరోనా బాధితులకు అందిస్తున్న మందులు, అనుసరిస్తున్న చికిత్స పద్ధతుల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్. భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్)లో పనిచేసిన ఆయన ఎప్పటికప్పుడు కరోనా ప్రబలిన తొలినాళ్లలో ఈ వైరస్‌కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో ప్రపంచానికి తెలియజేసేవారు. గతేడాది జూన్‌లో ఆయన పదవీ విరమణ చేశారు. తాజాగా కరోనా వైరస్, అందిస్తున్న చికిత్స పద్ధతులపై కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ వెబ్ పోర్టల్ ‘ది ప్రింట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విచ్చలవిడి చికిత్సల వల్లే.. ‘కోవిడ్ చికిత్సకు పనికిరావని నిర్ధారణ అయిన చికిత్స పద్ధతులను విచక్షణరహితంగా వాడటం వల్ల వైరస్ రూపాంతరం చెందడమే కాకుండా.. మరింత శక్తిమంతం అవుతుంది. తేలికపాటి లక్షణాలున్న వారికి కూడా రెమిడెస్విర్ వాడటం, మోస్తరు నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి ప్లాస్మా ఇస్తే వైరస్ బలం పుంజుకునే ప్రమాదం ఉంది. ఈ రకమైన చికిత్స పద్ధతులు, మందులు వాడొద్దని వైద్యులు, ఆస్పత్రులకు ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. లేదా వాటిని సహేతుకమైన పద్ధతిలో వాడటమైనా అలవాటు చేయాలి. భారత్‌లో రూపాంతరం చెందిన వైరస్లు ఎక్కువ కావడం ఇతర దేశాలకూ ఆందోళనకరమైన అంశం. అస్పష్టమైన చికిత్సలు, మందుల వాడకం ద్వారా టీకాలకు లొంగని రూపాంతరాలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఏదైనా కొత్త వ్యాధిని ఎదుర్కొనేందుకు పురాతన కాలంలో ప్లాస్మాను ఉపయోగించేవారు. భారత్‌లో ప్రస్తుతం దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నాం. వైరస్ సోకిన ఏడో రోజు తర్వాత ప్లాస్మా అస్సలు ఇవ్వకూడదు. వైరస్లలో లోపాలతో కూడిన పునరుత్పత్తి ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి కారణంగానే జన్యుపరమైన మార్పులు జరుగుతుంటాయి. వైరస్‌తో కూడిన కణాలు ఎన్ని ఎక్కువసార్లు విభజితమైతే.. రూపాంతరం చెందేందుకు, జన్యుమార్పులను పోగేసుకునేందుకు అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఈ జన్యు మార్పులన్నీ ప్రమాదకరం కాకపోయినా అసమర్థమైన, అహేతుకమైన యాంటీవైరల్ మందుల వాడకం లేదా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఒత్తిడి పెంచేందుకు ప్లాస్మాను ఉపయోగించినా వైరస్ అప్రమత్తమవుతుంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఆ క్రమంలో వైరస్ మరింత సమర్థ, శక్తిమంతంగా మారొచ్చు.’ చదవండి: (వ్యాక్సిన్ విదేశాలకు ఎందుకంటే..) రెమిడెసివిర్‌తో ఇలా జరగొచ్చు.. ‘వైరస్ పునరుత్పత్తి ఎంజైమ్లన్నింటిపై కాకుండా ఏదో ఒకదానిపై రెమిడెసివిర్ ప్రభావం చూపుతుంది. ఇదికాస్తా మందు పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని జన్యుమార్పులు చేసి నకళ్లు సృష్టించేందుకు వైరస్‌కు అవకాశం కల్పిస్తుంది. ప్లాస్మా చికిత్స వాడిన వారిలో వైరస్ 4 రెట్లు ఎక్కువ వేగంతో రూపాంతరం చెందుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రవి గుప్తా అధ్యయనంలో తేలింది. మన దేశంలో రెమిడెసివిర్తోనూ ఆ రకమైన ఫలితాలే ఇవ్వొచ్చు. ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేని కారణంగా దేశంలో కరోనా బాధితులకు ఎప్పుడు, ఏ చికిత్స వాడాలన్న విషయంలో స్పష్టత లేదు. ఈ సమాచారం ఉంటే రోగుల బంధువులు పలానా చికిత్స కావాలంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం రావు. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వొద్దు. రెమిడెసివిర్ ఇస్తే ఆస్పత్రిలో ఉండే సమయం కొంత తగ్గొచ్చు. తేలికపాటి లక్షణాలున్న వారికి ఈ యాంటీవైరల్ డ్రగ్ ఇవ్వడం సరికాదు. కరోనా వైరస్ తీవ్రమయ్యే దశలో కొన్ని చికిత్సలు సక్రమంగా పనిచేయవని చాలా మందికి తెలియదు. సామాజిక మాధ్యమాల్లో లేదా వేరే మార్గాల ద్వారా తెలుసుకుని పలానా చికిత్స ఇవ్వాలని ఆస్పత్రులకు వెళ్లడం బాధాకరం.’అని డాక్టర్ గంగ ఖేడ్కర్ వివరించారు. -
'రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. సమావేశంలో ముఖ్యాంశాలుగా..మందుల నిల్వ, పంపిణీపై చర్చించామని కేటీఆర్ అన్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత రాకుండా ఉండాలని ప్రతీరోజు ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సరిపడ రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదన్నారు. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఇంటింటికి సర్వే చేస్తూ అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయిందన్నారు. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ అందజేసినట్లు తెలిపారు. రానున్న రెండు వారాలు కరోనా కట్టడికి చాలా కీలకమని, ప్రజలు తప్పక నివారణ చర్యలను పాటించాలని సూచించారు. రెమిడెసివర్‌కు మార్కెట్ విపరీతంగా ఉండంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా రెమిడెసివిర్ వాడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. వీటిని త్వరలోనే అరికడతామని ఆయన అన్నారు. కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలు కేంద్రానికి వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్‌ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రెమ్‌డెసివిర్ లాంటి మందుల నిల్వలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. దీనికి అవసరమైన మందులను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్లు, మందుల సేకరణ, సరఫరాను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం మంత్ర కేటీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, వికాస్ రాజ్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజేశేఖర్ రెడ్డి, లైఫ్‌సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ భేటీలో పాల్గొన్నారు. ( చదవండి: ‘కోవిడ్ మరణాలు , కేసులను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోంది’ ) -
‘రెమ్‌డెసివిర్’ల బ్లాక్‌మార్కెట్‌పై నిఘా
సాక్షి, అమరావతి: రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. తమకు వస్తున్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ తనిఖీల్లో పలు విషయాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి సిబ్బందే రెమ్డెసివిర్లు ఎత్తుకెళ్లి.. ప్రైవేటు మెడికల్ షాపులకు అమ్ముతున్నట్టు తేలిందన్నారు. అనంతపురం జిల్లాలో 16 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పెద్దాసుపత్రిలోని ఇద్దరు సిబ్బంది తీసుకెళ్లి.. రెండు మెడికల్ షాపులకు విక్రయించగా అధికారులు పట్టుకున్నారు. గుంటూరులోనూ ఆస్పత్రి సిబ్బంది బయట అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని వార్డుల్లో నిఘా పెంచినట్టు ఔషధ నియంత్రణ శాఖ పేర్కొంది. కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. ఖాళీ బాటిళ్లు సేకరించి సెలైన్ నింపి.. మార్కెట్లోకి నకిలీ రెమ్డెసివిర్లు కూడా వచ్చినట్టు ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం అందింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాడిన ఒరిజినల్ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల ఖాళీ బాటిళ్లను సేకరించి.. మూతను గమ్‌తో అతికించి తిరిగి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సెలైన్ లేదా డిస్టిల్డ్ వాటర్ నింపుతున్నట్టు సమాచారం. వీటిని స్టాఫ్ నర్సులు గానీ, డాక్టర్లు గానీ కొద్దిగా పరిశీలిస్తే.. నకిలీవో, ఒరిజినల్‌వో తెలుసుకోవచ్చని ఔషధ నియంత్రణ శాఖ తెలిపింది. ఒరిజినల్ ఇంజెక్షన్‌కు అయితే అల్యూమినియంతో మెషిన్లో చేసిన క్లోజ్డ్ ప్యాకింగ్ ఉంటుందని, నకిలీకైతే గమ్‌తో అతికించినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఇంజెక్షన్లు వేసే నర్సులు, వైద్యులు వీటిపై అప్రమత్తంగా ఉండాలని డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సూచించారు. ప్రతి ఆస్పత్రిపైనా నిఘాపెట్టాం ప్రతి ఆస్పత్రిపైనా, మెడికల్ షాపుపైనా నిఘా పెట్టాం. రెమ్‌డెసివిర్‌లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా.. అడ్డదారిలో వాటిని షాపులు కొన్నట్లు వెల్లడైనా తక్షణమే లైసెన్సులు రద్దు చేస్తాం. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 104కు ఫిర్యాదు చేసినా లేదా డ్రగ్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
Covid 19: ఓవైపు భర్త మరణం.. మరోవైపు అటెండర్ అసభ్య ప్రవర్తన
పట్నా: ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నారు. ఓ వైపు కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే కొంతమంది వైద్య సిబ్బంది మాత్రం రోగుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్‌లోని భాగల్పూర్లో ఓ ఆసుపత్రి సిబ్బంది మహిళ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్లోకల్ హాస్పిటల్ వైద్యులు, మరో ఇద్దరు సిబ్బంది లైంగిక వేదింపులకు పాల్పడినట్లు సదరు మహిళ పేర్కొన్నారు. నగరంలోని గ్లోకల్, మాయాగంజ్ ఆసుపత్రి సిబ్బంది తన భర్తకు చికిత్స అందించడానికి నిరాకరించారని 12 నిమిషాల వీడియోలో పేర్కొంది. ‘‘నేను, నా భర్త నోయిడాలో ఉంటాం. హోలి పండుగ జరుపుకోవడానికి బిహార్ వచ్చాం. ఏప్రిల్ 9న నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో రెండుసార్లు కరోనా టెస్ట్ చేయిస్తే నెగెటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ప్రయత్నిస్తే.. నోయిడాలోని ఓ వైద్యుడు సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. స్కానింగ్‌లో ఊపిరితిత్తులు 60శాతం దెబ్బతిన్నాయని తేలింది. మరుసటి రోజు నా భర్త, నా తల్లిని భాగల్పూర్ ఆసుపత్రిలో చేర్పించాం. నా తల్లి పరిస్థితి బాగుంది. కానీ ఆ సమయంలో నా భర్త మాట్లాడలేపోయారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆక్సిజన్ అందించడానికి కూడా నిరాకరించారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ కొన్నా ఫలితం దక్కలేదు. గ్లోకల్ ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ జ్యోతి కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. చున్నీ పట్టుకుని లాగుతూ వికృతంగా నవ్వాడు. ఆ సమయంలో నాకు భయం వేసింది. కానీ నా భర్త గురించిన ఆలోచనే ఉంది. మా అమ్మ, భర్త ఉన్నారు కదా అని ధైర్యం చెప్పుకొన్నాను. నిజానికి ఆసుపత్రి సిబ్బంది కనీసం మంచంపై బెడ్ షీట్స్ మార్చడానికి అనుమతించ లేదు. కోవిడ్-19 చికిత్స కోసం ఉపయోగించే రెమ్‌డెసివిర్ మందును వృథా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా భర్త ప్రాణాలు కోల్పోయారు ’’ అని ఆమె తన ఆవేదన వెళ్లగక్కింది. కాగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా వల్ల ప్రభావితమైన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,000 కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. ఇప్పటి వరకు బిహార్‌లో 5.91 లక్షల కేసులు నమోదు కాగా..4.77 లక్షల మంది కోలుకోగా.. 3,282 మంది మరణించారు. ఇక దేశంలో 2.27 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా..1.87 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ కారణంగా 2.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!) -
గూగుల్‌లో ఈ పదాల కోసం తెగ వెతుకుతున్న తెలుగు ప్రజలు
సాక్షి, హైదరాబాద్: ఇదివరకు గూగుల్‌లో సెర్చింగ్ అంటే.. హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా క్రికెట్ ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి చూసే వాళ్లం. కానీ దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రజల అలవాట్లే కాదు గూగుల్‌లో సెర్చ్ చేసే పదాలను కూడా కరోనా మార్చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు రెమిడెసివిర్ ఇంజక్షన్ గురించి గూగుల్‌లో తెగ గాలిస్తున్నారు. రెమిడెసివిర్నే ఎందుకు వెతుకుతున్నారు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రెమిడెసివిర్ వైరస్ పై ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు తెలిపారు. ఇక అప్పటి నుంచి మార్కెట్లో ఈ ఇంజక్షన్ కు విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఇంజక్షన్ బహిరంగ మార్కెట్లో దొరక్క బ్లాక్ మార్కెట్లో వేలు పోసి కొంటున్నారు. బయట అందుబాటులో లేకపోవడం, ఎక్కడా చూసినా ఈ ఇంజక్షన్ పేరే వినపడడంతో దీని గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో ఇలా గాలిస్తున్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే.. కర్ణాటక, ఢిల్లీ టాప్ రెండు స్థానాల్లో ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడు,నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నగరాల పరంగా .. కర్ణాటకలోని విజయపురా, బీదర్, హసన్, కాలాబురగి, బెంగళూరు.. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఉన్నాయి. ఇక ఆంధ్రా లో గుంటూరు, విజయవాడ, ఓంగోలు, విజయనగరం ఉన్నాయి. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత వలనే ప్రజలు ఇంతలా వాటి కోసం గూగుల్ లో చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక విపరీతంగా గూగుల్‌లో చూస్తున్న రెండో పదంగా ఆక్సిజన్ ఉంది. కరోనా వీర విహారం చేస్తున్న నేపథ్యంలో దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సహజంగా ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలో అనే విషయంపై తెగ వెతుకుతున్నారు. ఇందులో ఢిల్లీ టాప్‌లో ఉండగా హర్యానా, యూపీ, గోవా,కర్ణాటక వరుసగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ( చదవండి : కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ ) -
రెమ్‌డెసివిర్ తయారీకి రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతి
అగనంపూడి (గాజువాక): దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణంలోని రెడ్డీస్ ల్యాబ్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మం జూరయ్యాయి. ఈ మేరకు దువ్వాడ వీఎస్ఈజెడ్ పరిపాలనా భవనంలో నిర్వహించిన యూనిట్ అప్రూవల్ కమిటీ (యూఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూఏసీ చైర్మన్, వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆవుల రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డీస్ ల్యాబ్‌తోపాటు మరో సంస్థ ఫ్ట్రాక్సీ దరఖాస్తు చేశాయని, ముందుగా రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతిచ్చామని తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్ జూన్ నాటికి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తుందన్నారు. నెలకు వంద మిల్లీ లీటర్ల సామర్థ్యంతో 3.5 లక్షల బాటిళ్లు, 5 వందల మిల్లీలీటర్ల సామర్థ్యంతో 7 లక్షల ఇంజక్షన్లు తయారు చేసేలా యూనిట్‌ను సిద్ధం చేస్తున్నట్టు రెడ్డీస్ ల్యాబ్ హెడ్ మీనన్ చెప్పారని తెలిపారు. ఇప్పటికే నక్కపల్లి సెజ్‌లోని హెట్రో డ్రగ్ ద్వారా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నారని, అలాగే ఏపీసెజ్‌లోని లారస్ కంపెనీ 38.3 మిలియన్ హెచ్‌సీక్యూ టాబ్లెట్లను అమెరికా, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెనడా, బెల్జియమ్, మయన్మార్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయన్నారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నక్కపల్లిలోని ఆనర్ ల్యాబ్‌కు వంద కేజీల మాల్నూపిరవీర్ మందుల తయారీకి అనుమతులిచ్చినట్లు ఆయన తెలిపారు. -
ఏపీ ఆసుపత్రుల్లో మరోసారి విజిలెన్స్ దాడులు
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్నరెమిడెసివిర్ ఇంజక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వాటిలో గుంటూరు నారాయణ ఆస్పత్రి, విశాఖ ఆరిలోవలోని కుమార్ ఆస్పత్రి, అనంతపురం సాయిరత్న ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులు ఉన్నాయి. -
బాబోయ్ కల్తీ కరోనా వ్యాక్సిన్లు..నీళ్లు పోసి అమ్మేస్తున్నారు?
చండీగఢ్: దేశంలో రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు లక్షల్లో నమోదవుతుంటే వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో దేశంలో కరోనా వ్యాప్తిని,మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దీన్ని అదునుగా భావించిన కేటుగాళ్లు కల్తీ కరోనా వ్యాక్సిన్లతో సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం రూప్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న భాక్రా డ్యామ్ కెనాల్ లో రెమిడెసివిర్ కరోనా వ్యాక్సిన్లను గుర్తించినట్లు సాలెంపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ చంకౌర్ సాహిబ్ స్థానిక ఎస్సై, డ్రగ్ ఇన్ప్సెక్టర్, సీనియర్ మెడికల్ అధికారులను ఘటనస్థలానికి పంపి సోదాలు జరిపించారు. ఈ సోదాల్లో నకిలీ కరోనా వ్యాక్సిన్ రెమిడెసివిర్‌తో పాటు మరో ప్రాంతంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వినియోగించే సెఫోఫెరాజోస్ డ్రగ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూప్ నగర్ "సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామస్తుల సమాచారంతో సెఫోపెరాజోన్, రెమెడిసివర్ లు కలిపి మొత్తం 1200 వ్యాక్సిన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాం. అయితే డ్రగ్ అధికారులు పరిశీలించగా నకిలీ వ్యాక్సిన్లని తేలింది. కేటుగాళ్లు కావాలనే ధనార్జనే కోసమే నకిలీ వ్యాక్సిన్లను తయారు చేశారు. మేం దాడులు చేస్తామని తెలుసుకొని భాకక్రా డ్యామ్ లో పడేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తాం. కరోనా బాధితులు వ్యాక్సిన్ కొనుగోలు చేసే సమయంలో ఒరిజినలా? నకిలీవా"అనేది గుర్తించాలని అన్నారు. ఇది చదవండి : కోవిడ్ నిర్ధారణకు స్వాబ్ ఇస్తున్నారా? ఈ వీడియో చూడండి ఇది చదవండి : కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ -
Remdesivir: ఏపీకి 2.35 లక్షలు; తెలంగాణకు 1.45 లక్షలు
ఢిల్లీ: రాష్ట్రాల వారీగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను శుక్రవారం కేంద్రం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 53 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు కేటాయించగా.. అందులో మహారాష్ట్రకు 11.57 లక్షలు, ఏపీకి 2.35 లక్షలు, తెలంగాణకు 1.45 లక్షల ఇంజక్షన్లను కేటాయింపులు చేసింది. రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇంజక్షన్లు అందేలా చూడాలని.. గుర్తింపు పొందిన ప్రైవేటు డిస్టిబ్యూటర్ల ద్వారా కూడా తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడికి ప్రయత్నాలు ఫలించడం లేదు. దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు నమోదు కాగా, 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,76,12,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,34,083 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 36,45,164 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌లోనే 49 శాతం కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. చదవండి: వ్యాక్సినేషన్ నెమ్మదించొద్దు.. రాష్ట్రాలకు ప్రధాని సూచన