
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ విషయంలో హేతుబద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసింది. చికిత్సతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సీనియర్ వైద్యుడు సూచిస్తేనే రోగికి ఈ డ్రగ్ వాడాలని నిర్దేశించింది. ఇకపై రెమ్‌డెసివిర్‌ను ఆసుపత్రులే సమకూర్చాల్సి ఉంటుంది. బయటి నుంచి తీసుకురావాలంటూ రోగి సంబంధీకులను ఒత్తిడి చేయడానికి వీల్లేదు. రెమ్‌డెసివిర్ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
రాత్రిపూట, సీనియర్ వైద్యుడు అందుబాటులో లేని సమయంలో రోగికి ఈ డ్రగ్ ఇవ్వాల్సి వస్తే డ్యూటీ డాక్టర్ సీనియర్ వైద్యుడిని ఫోన్‌లో సంప్రదించాలి. స్పెషలిస్టును లేదా యూనిట్ ఇన్‌చార్జిని కూడా సంప్రదించవచ్చు. వారి సలహాతోనే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి. వారు రాతపూర్వకంగా తమ సమ్మతిని తెలియజేయాలి. ఇందులో వారి స్టాంప్, సంతకం ఉండాలి. రెమ్‌డెసివిర్ వాడకాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రతి ఆసుపత్రి యాజమాన్యం స్పెషల్ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
(చదవండి: ఓటు ఎక్కడో.. వ్యాక్సిన్ అక్కడే )
Comments
Please login to add a commentAdd a comment