
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్నరెమిడెసివిర్ ఇంజక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వాటిలో గుంటూరు నారాయణ ఆస్పత్రి, విశాఖ ఆరిలోవలోని కుమార్ ఆస్పత్రి, అనంతపురం సాయిరత్న ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment