vigilance officials
-
ఏపీ ఆసుపత్రుల్లో మరోసారి విజిలెన్స్ దాడులు
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్నరెమిడెసివిర్ ఇంజక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వాటిలో గుంటూరు నారాయణ ఆస్పత్రి, విశాఖ ఆరిలోవలోని కుమార్ ఆస్పత్రి, అనంతపురం సాయిరత్న ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులు ఉన్నాయి. -
కొమ్మాలపాటి.. అవినీతి కోటి
‘పవర్’ను వాడేశాడు.. ఎమ్మెల్యేగా అధికారాన్ని అడ్డదారుల్లో ఉపయోగించాడు.. నిబంధనల్ని పాతేశాడు.. ప్రభుత్వ ఖజానాకే షాక్ ఇచ్చాడు.. లక్షల రూపాయల విద్యుత్ బకాయిలు కట్టకపోవడమేగాక అక్రమంగా కరెంటు వాడుకున్నాడు.. ఆవైపు చూసినవారి గొంతుల్ని పవర్‌తో నొక్కేశాడు.. పలువురు అధికారుల్ని మేనేజ్ చేశాడు.. పెద్దమనిషిగా చలామణి అవుతూ అవినీతిని కొమ్మలుకొమ్మలుగా విస్తరించాడు.. ఇదీ.. తెలుగుదేశం నాయకుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అవినీతి కథ. సామాన్యుడు ఒక నెల విద్యుత్ బిల్లు కట్టకపోయినా అధికారులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. అలాంటిది కొమ్మాలపాటి శ్రీధర్ అక్రమంగా విద్యుత్ నొక్కేస్తుంటే అధికారులు తెలియనట్లే వ్యవహరించారు. కొందరు అధికారానికి భయపడి, మరికొందరు అవినీతికి పాల్పడి మౌనంగా తలవంచారు. ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి పడుతున్నా తమది కాదుగా.. అన్నట్లు వ్యవహరించారు. సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సుమారు నాలుగేళ్లుగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారు. ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో శ్రీనాగమల్లేశ్వరి స్పిన్‌టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో స్పిన్నింగ్ మిల్లు, గాయత్రి శ్రీనారాయణస్వామి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి సర్వీసు నంబరు జీఎన్టీ 3231కి విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్ 15న అధికారులు తనిఖీ చేశారు. బిల్లు చెల్లించనందుకు డీఫాల్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. రూ.19 లక్షల విద్యుత్ బిల్లు, రూ.ఐదు లక్షల సర్‌చార్జీ మొత్తం రూ.24 లక్షలు పెండింగ్ ఉండటంతో విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. ఆ తర్వాత కూడా కొమ్మాలపాటి ఆ బిల్లును చెల్లించలేదు. అప్పట్లో కొమ్మాలపాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎవరూ ఆయనవైపు చూడలేకపోయారు. భూగర్భంలో అవినీతి లైను జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కొమ్మాలపాటి అక్రమమార్గం ఎంచుకున్నారు. అక్కడికి 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లు నుంచి భూగర్భంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి జిన్నింగ్‌మిల్లుకు కనెక్షన్ ఇచ్చారు. విద్యుత్ మాల్‌ప్రాక్టీస్‌కు తెరతీశారు. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. విద్యుత్ శాఖ మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ఏ ఆర్మ్‌స్ట్రాంగ్ బిల్లు స్టాప్, బిల్లు చెల్లించని కనెక్షన్లను తనిఖీ చేయాలని నవంబర్ 16, 17 తేదీల్లో ఏడీఈలు, ఏఈలను ఆదేశించారు. దీంతో నవంబర్ 23న అధికారులు తనిఖీ చేయగా భూగర్భ విద్యుత్ లైను బయటపడింది. తరువాత 24, 25, 26 తేదీల్లో విజిలెన్స్ అధికారులు కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. భూగర్భ మార్గంలో నుంచి విద్యుత్ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు నాలుగేళ్లుగా ఇలా ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్న కొమ్మాలపాటి అవినీతిని బట్టబయలు చేశారు. జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ కనెక్షన్ కట్‌చేసి నోటీసులిచ్చారు. రూ.1.69 కోట్లు చెల్లిస్తేనే తిరిగి కనెక్షన్ జిన్నింగ్మిల్లును పరిశీలించిన విజిలెన్స్ అధికారులు రూ.1.69 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. పాత బకాయిలు, ఫైను కలిపిన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులపై అనుమానాలు జిన్నింగ్ మిల్లుకు 2016 డిసెంబర్ నుంచి ఇప్పుడు 2020 నవంబర్ వరకు సుమారు నాలుగేళ్లపాటు కోటిరూపాయలకు పైగా విలువైన విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నా ఉన్నతాధికారులకు తెలియలేదంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పిన్నింగ్ మిల్లు నుంచి జిన్నింగ్ మిల్లుకు భూగర్భ లైన్ వేశారంటే విద్యుత్ అధికారుల ప్రమేయం ఉండే ఉంటుందని ఆ శాఖలోని కొందరు చెబుతున్నారు. గతనెలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసినా టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్నతాధికారుల లాలూచీ ఉండొచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై గుంటూరు విజిలెన్స్ ఈఈ విజయకృష్ణను వివరణ కోరగా ఈ విషయాలు బయటకు చెప్పేవి కాదన్నారు. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి రూ.1.69 కోట్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి జరిమానా
పూసపాటిరేగ: నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కుమారుడు తమ్మునాయుడు అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తుండగా సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పూసపాటిరేగలోని సర్వే నంబరు 82–1, 2లో అనుమతి లేకుండా లేఅవుట్‌కు గ్రావెల్ తరలించడంతో ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడటంతో జరిమానా విధించారు. రెల్లివలసలో సర్వే నంబరు 17లో గల నడుపూరు రమేష్‌కు చెందిన వ్యసాయభూమి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా 350 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తరలించడంతో జరిమానా విధించినట్లు విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. పూసపాటిరేగలోని లేఅవుట్లో ఉన్న రెండు ట్రాక్టర్లు, జేసీబీ, రోడ్డురోలర్ మొత్తం నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు రవికుమార్, రాయల్టీ ఇన్స్పెక్టర్లు ఎం.సురేష్‌కుమార్, రాంబాబు, సత్యమూర్తి, సర్వేయర్ తులసి, వీఆర్ఓలు అప్పలనాయుడు, దురగాసి రామకృష్ణ పాల్గొన్నారు. -
ఏపీ ఈఎస్ఐలో కుంభకోణం
-
టీడీపీ నేత లా కాలేజీలో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి చెందిన న్యాయ కళాశాలలో కేంద్ర విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్ విద్యార్థిగా తన న్యాయ కళాశాలలోని సిబ్బంది అడ్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఓ కేసు విచారణలో తమిళనాడుకు చెందిన ఉద్యోగికి టీడీపీ నేత లా కళాశాలలో అడ్మిషన్ ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది. అయితే కోర్టు ఆదేశాలతో కళాశాలలో తనిఖీలు చేపట్టినట్టు కేంద్ర విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. -
అంగన్వాడీ సెంటర్లలో ‘విజిలెన్స్’ తనిఖీలు
తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలను విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజానగరం మండలంలో దివాన్ చెరువు, నెంబర్ 1, 42 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, టాయిలెట్లు లేకపోవడం, పరికరాలు అపరిశుభ్రంగా ఉండడం, హాజరులో తేడాలు గమనించారు. అమలాపురం మండలం కామనగరువు గ్రామంలోని బడుగువారి పేట, చిట్టెమ్మ చెరువు, అంగన్వాడీలను తనిఖీ చేసిన అధికారులు స్టాకు నిల్వల్లో ఉన్న వ్యత్యాసాలు గమనించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, మధ్యాహ్నం అల్పాహారం ఇవ్వడం లేదని గుర్తించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో జగ్గంపేట మండలం కాట్రావుల పల్లి గ్రామంలో 3, సీతానగరంలో 1, రంగాయమ్మ పేట అంగన్ వాడీ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. సీతానగరం అంగన్ వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉండడంతో దానిని ఖాళీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ డివిజన్ పరిధిలో తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో నంబర్ 3, 26, గురజానపల్లి గ్రామంలో 1, 2, 5 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. చొల్లంగిలో 26 నంబర్ అంగన్ వాడీ కేంద్రంలో పాలు లేకపోవడం గమనించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు చింతూరు డివిజన్లోని చింతూరు గొమ్మా 1, ఎర్రంపేట 1, 2, అంగన్ వాడీ కేంద్రాలు తనిఖీ చేశారు. కోడిగుడ్లు ఈ నెలలో అసలు సరఫరా లేకపోవడం, పాలు నిల్వల్లో తేడాలు రావడం, బాత్ రూమ్‌లు సరిగా నిర్వహించకపోవడం గమనించారు. రెడ్డి గంగాధరరావు మాట్లాడుతూ కొన్ని కేంద్రాలు అద్దె గృహాల్లో నిర్వహించడం, కొన్ని శిథిలావస్థలో ఉండడం, బాత్రూమ్లు లేకపోవడం, ఉన్నా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి విషయాలను గమనించామని దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు బి.ఎస్.ఎన్.మూర్తి, వై.సత్యకిశోర్, బి.సాయి రమేష్, టి.రామ్మోహన్ రెడ్డి, పీడీ రత్న కుమార్, జి. గోపాలరావు, భార్గవమహేష్, షేక్‌వలీ, జి.అప్పారావు, సాయిబాబా, సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామకృష్ణ, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
తిరుమలలో మందుబాబు హల్చల్
సాక్షి, తిరుమల: నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయ మాడ వీధుల్లో మంగళవారం అపవిత్ర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరమాడ వీధిలోని ఆదివరాహస్వామి ఆలయం సమీపంలో తమిళనాడుకు చెందిన మణి (35) అనే వ్యక్తి మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. విజిలెన్స్ సిబ్బంది అక్కడే ఉన్నా వారించ కుండా చోద్యం చూడటం గమనార్హం. ఈ మేరకు అందిన సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లగా, వారు చూస్తుండగానే ఆయన దర్జాగా మద్యం సీసా పక్కనే పెట్టుకుని భోజనం చేశాడు. అయినా అతన్ని సిబ్బంది వారించలేదు. ఇంతలో భక్తులందరూ చూస్తుండగానే మణి సీసాæమూత తీసి క్షణాల్లోనే మద్యం సేవించాడు. ఆ తర్వాత నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తు ఎక్కువ అవడంతో మణి స్పృహకోల్పోయాడు. నిందితుడిని రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశామని తిరుమల ఎక్సైజ్ సీఐ మురళీమోహన్ తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసుల వైఫల్యం బహిర్గతమైంది. -
ఆర్టీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
సిద్దిపేట(మెదక్): మెదక్ జిల్లా సిద్దిపేట రవాణాశాఖ అధికారి ప్రాంతీయ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు బ్రోకర్ల వద్ద నుంచి రూ.93వేలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
గుంటూరు కార్పొరేషన్ లో విజిలెన్స్ సోదాలు
గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు కొనసాగాయి. కార్మికుల సెస్సును వసూలు చేయకుండా అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై వారు విచారణ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీలు
పాలకొల్లు సెంట్రల్ (పశ్చిమ గోదావరి) : ఇళ్ల పట్టాల జారీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం విజిలెన్సు అధికారులు సోదాలు జరుపుతున్నారు. విజిలెన్స్ ఏలూరు సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో ఫైళ్ల తనిఖీలు ప్రారంభించారు. స్థానిక లక్ష్మీనగర్‌లో ప్రభుత్వ అందజేసిన ఇళ్లపట్టాలు అనర్హులకు అందాయనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యకు పూనుకున్నారు. -
పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ
గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పత్తి కొనుగోలు కేంద్రంలో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నలుగురు అధికారులతో కూడిన బృందం మంగళవారం గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో పలువురు రైతులను విచారిస్తోంది. రైతుల పేర్లతో వ్యాపారులే సీసీఐకి పత్తిని విక్రయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాటిపత్తి గ్రామంలోని రైతుల నుంచి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు విచారణ ఉంటుందని, రైతులు సహకరించాలని కోరారు. విచారణ అనంతరం ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయన్నది తెలుస్తుందని అధికారులు తెలిపారు. -
కళ్లలో ఇసుక
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా నుంచి ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వే బిల్లులతో అక్రమ రవాణా ఊపందుకుంది. ప్రధానంగా పంచలింగాలతో పాటు పూడూరు ఇసుక రీచ్ నుంచి ఒక కంపెనీ ఈ ఇసుకను తరలిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించి లారీలను పట్టుకున్నారు. ఈ మేరకు మొత్తం 8 లారీల ఇసుకను బుధవారం సీజ్ చేశారు. ఇందులో ఒక లారీ(టీఎస్ 06 యుఏ1449) నుంచి దొంగ వే బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడు లారీల్లో(12, 10 టైర్ల) లోడుకు మించి అదనంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విధంగా దొంగ బిల్లులు, అదనపు లోడు కలిపి ఏకంగా 158 టన్నుల ఇసుకను అక్రమంగా తరలించినట్టు స్పష్టమైం ది. మొత్తం ఇసుకకు ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని తేల్చారు. ఇది కేవలం తనిఖీల్లో పట్టుబడిందేనని.. వాస్తవంగా రోజుకు ఈ విధంగా 50 నుంచి 60 లారీల ఇసుక వే బిల్లులు లేకుండా తరలిపోతోందని సమాచారం. ఒక్కో లారీ ఇసుక హైదరాబాద్‌లో లక్షన్నర వరకు పలుకుతోంది. ఈ లెక్కన జిల్లా నుంచి రోజుకు సుమారు కోటి రూపాయల విలువైన ఇసుక తరలిపోతుంది. మొత్తం వ్యవహారాన్ని రెవె న్యూ యంత్రాంగం కానీ.. చెక్‌పోస్టుల సిబ్బంది కానీ పట్టించుకోకపోవడం గమనార్హం. -
అక్రమ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకున్న విజిలెన్స్ అధికారులు
గోరెంట్ల(అనంతపురం జిల్లా): అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న క్వారీపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలోని కమ్మలవాండ్లపల్లి గుట్ట వద్ద ఈ దాడులు జరిగాయి. అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో క్వారీపై దాడి చేసి దానిని సీజ్ చేశారు. ఇటాచీ, క్రేన్, కంప్రెషనర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘రియల్' ఎగవేతపై విజిలెన్స్
విజయవాడ సిటీ : జిల్లాలో నాలా పన్ను చెల్లించని రియల్ ఎస్టేట్ వెంచర్లపై విజిలెన్స్ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటివరకు సంబంధిత శాఖల అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు వేయడం ద్వారా ఒక్క నూజివీడు డివిజన్‌లోనే ప్రభుత్వానికి రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నాలా పన్ను చెల్లించకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయం జరపడం వెనుక రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం. జిల్లాలో 130 వరకు అనధికారిక లే అవుట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు నూజివీడు డివిజన్లోని పలు రియల్ ఎస్టేట్ వెంచర్లను పరిశీలించగా.. మెజారిటీ వెంచర్లు అనుమతులు లేనివేనని తేలింది. ఎలాంటి అనుమతులూ లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకున్నట్టు గుర్తించారు. తొలుత నూజివీడు ప్రాంతంలో రాజధాని వస్తుందని ప్రచారం జరగడంతో అక్కడ వేసిన వెంచర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అనుమతులు చూసుకోకుండానే పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలు అంటూ హనుమాన్‌జంక్షన్ సమీపంలోనూ పలు వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయం జరిపారు. అనుమతులు తప్పనిసరి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే ముందు ఉడా లేదా డీటీసీపీ అనుమతి విధిగా తీసుకోవాలి. 2006 నాలా చట్టం ప్రకారం వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేసి విక్రయించాలంటే గామీణ ప్రాంతాల్లో భూమికి ప్రభుత్వం ప్రకటించిన విలువ ఆధారంగా ఆరు నుంచి తొమ్మిది శాతం వరకు, పట్టణ ప్రాంతాల్లో ఐదు శాతం నాలా ఫీజును రెవెన్యూకు చెల్లించాలి. వందల సంఖ్యలో రియల్ వెంచర్లలో నాలా ఫీజు చెల్లించకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేశారు. 70 శాతం రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి నాలా ఫీజు చెల్లించకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. ఒక్క నూజివీడు డివిజన్‌లోనే రూ.40 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటే, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విజయవాడ డివిజన్లోని కంకిపాడు, పెనమలూరు, కంచికచర్ల, నందిగామ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిపై కూడా దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమ వెంచర్లలో రెవెన్యూ పాత్ర రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే సమయంలో గ్రామ కార్యదర్శులు విధిగా అనుమతులు పరిశీలించాలి. తగిన అనుమతులు లేని పక్షంలో సంబంధిత తహశీల్దారు ద్వారా నోటీసులు జారీ చేసి నాలా పన్ను వసూలు చేయాలి. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆయా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఉంది. కొందరు గ్రామ కార్యదర్శుల అవినీతి కారణంగా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు లేని వెంచర్లు వెలిసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆయా వెంచర్ల విషయంలో వీరి పాత్రపై కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. -
మూడు గ్రానైట్ లారీలు సీజ్
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి, కదంబాపూర్ గ్రామాల నుండి శనివారం ఓవర్‌లోడ్‌తో వెళుతున్న మూడు గ్రానైట్ లారీలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ సీఐ సుధాకర్‌రావు తెలిపారు. వివరాలు....నిబంధనలకు వ్యతిరేకంగా లారీల్లో గ్రానైట్‌ను రవాణా చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. (సుల్తానాబాద్) -
పేదల బియ్యం.. దళారులకు వరం
జిల్లా నుంచి వేల క్వింటాళ్లు అక్రమంగా తరలింపు కాకినాడ పోర్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా నిఘా ఉన్నా ఆగని అక్రమార్కులు విజిలెన్స్ దాడుల్లో దొరికేది స్వల్పమే.. ! విజయవాడ : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గత నెల 1 నుంచి ఈ నెల 15వ తేదీ మధ్య అక్రమంగా తరలిస్తున్న 1,204 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. కొందరు దళారీలు రేషన్ బియ్యాన్ని కిలో ఆరు రూపాయల చొప్పున డీలర్ల నుంచి కొనుగోలుచేస్తున్నారు. వాటిని పాలిష్ చేసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర కలిగిన బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. కొందరు వందలాది క్వింటాళ్లను పోగుచేసి కాకినాడ పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. డీలర్లకు పెట్టుబడి పెడుతున్న ‘దొంగ’ వ్యాపారులు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు కొందరు దొంగ వ్యాపారులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ముందుగానే రేషన్ డీలర్లకు పెట్టుబడి పెడుతున్నారు. విజయవాడ నగరంలో ఇటువంటి వ్యాపారులు పది మంది వరకూ ఉన్నారు. వీరు పటమట, కృష్ణలంక, భగత్‌సింగ్‌నగర్, వించిపేట, కొత్తపేట, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో ఉంటున్నట్లు విజిలెన్స్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. వీరు దళారుల సాయంతో డీలర్ల నుంచి పోగుచేసిన బియ్యాన్ని లారీలు, ప్యాసింజర్ రైళ్లలో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాల సిబ్బందికి కూడా మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీ డ్రైవర్లు చాకచక్యంగా జిల్లాలోని చెక్‌పోస్టులు దాటించేందుకు క్వింటాకు రూ.7.50 చొప్పున ప్రత్యేకంగా చెల్లిస్తారు. కాకినాడ పోర్టుకు చేరిస్తే క్వింటాకు రూ.15లు ఇస్తున్నట్లు విజిలెన్స్ దాడుల్లో స్పష్టమైంది. భారీగా బ్లాక్‌మార్కెట్‌కు... జిల్లాలో సాధారణ తెల్లకార్డులు 10,83,413 ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన కార్డులు 70,153, అన్నపూర్ణ కార్డులు 636 ఉన్నాయి. అన్నీ కలిపి 11,54,202 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 20,150 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 15వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అయితే భారీగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. అధికారులు నిఘా పెట్టినా అక్రమాలు ఆగటం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణమే అరోపణలు ఉన్నాయి. -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగంలోని పద్మావతి రైస్‌మిల్లుపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.15 లక్షల విలువ చేసే బియ్యం బస్తాలను అధికారులు గుర్తించి ... సీజ్ చేశారు. అనంతరం మిల్లు యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. మిల్లులో బియ్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించారు. -
‘ఖని’లో భూ వివాదంపై విజిలెన్స్ విచారణ
గోదావరిఖని : నగరం నడిబొడ్డున పోచమ్మ మైదానంలో వివాదాస్పదంగా మారిన స్థలంపై సోమవారం విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నట్లు విజిలెన్స్ సీఐ ఎస్.సుధాకర్‌రావు, కానిస్టేబుల్ రాజన్న తెలిపారు. వివాదాస్పదంగా మారిన స్థలం సింగరేణి సంస్థదా, ప్రభుత్వానిదా అనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌ప్లానింగ్ అధికారులను వివాదాస్పద స్థలం గురించి ఆరా తీశారు. స్థలం వద్దకు వెళ్లి హద్దుల విషయంపై ప్రశ్నించారు. మొత్తం 39 గుంటల స్థలంలో 11 గుంటలు రోడ్డు కోసం కేటాయించగా, మిగతా 28 గుంటలు పట్టాదారులకు కేటాయించినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు వివరించారు. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలంపై అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా..? వివాదాస్పదంగా మారిన స్థలం 39 గుంటలేనా..? ఇంకా ఎక్కువగా ఉందా..? అని ఆరా తీశారు. కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి ఈ వివాదంపై విజిలెన్స్ అధికారులకు వివరాలు వెల్లడించారు. కార్పొరేషన్ అధికారుల బంధువుల పేరుపై ఈ స్థలంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వాటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. దీంతో పూర్తి వివరాలను వారు నమోదు చేసుకున్నారు. స్థానికులు జోక్యం చేసుకొని అసలు ఈ స్థలం సింగరేణిదని, 40 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ కూరగాయలు అమ్మేవారని, చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉండేవని తెలిపారు. అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు. వివాదాస్పదంగా మారిన స్థలంలో నిర్మించిన ప్రహరీని అధికారులు ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో సదరు స్థలానికి సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. నిర్మాణాల కోసం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన అధికారుల పేర్లు, వారి హోదాలను సేకరించారు. దీంతో ఈ వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని కార్పొరేషన్ అధికారులు వణుకుతున్నారు. -
తిరుమలలో ప్రైవేట్ పీఆర్వోల హవా
గదులు, శ్రీవారి దర్శనాల పేరుతో దందా టీటీడీ అతిథిగృహాల్లో పీఆర్వోల తిష్ట చూసీచూడనట్టుగా టీటీడీ రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు తిరుమల : తిరుమలలో ప్రైవేట్ పీఆర్వోల హవా నడుస్తోంది. రాజకీయ నేతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. వీరు టీటీడీ అతిథిగృహాల్లో గదులను అనధికారికంగా ఆక్రమించుకున్నారు. శ్రీవారి దర్శనాలు, గదుల పేరుతో దందా జోరుగా సాగిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పాతుకుపోయిన ప్రైవేట్ పీఆర్వోలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తిరుమల కేంద్రంగా ప్రైవేట్ పీఆర్వోల వ్యవస్థ పాతుకుపోయింది. రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఇతర అధికార, అనధికార సంస్థల కేంద్రంగా ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పటికే తిరుమలలో సుమారు వందకు పైగా ప్రైవేట్ అతిథిగృహాలున్నాయి. వీటికి అనుబంధంగా పీఆర్వోలు పనిచేస్తున్నారు. సర్వం వీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వారిలో చాలా మంది తిరుమలకు వచ్చినవారికి గదులు, దర్శనాలు ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. తిరుమల కేంద్రంగా గదులు, దర్శనాల పేరుతో నెలవారీగా పెద్దమొత్తాల్లో చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. దాతలు కట్టించి టీటీడీకి అప్పగించిన అతిథి గృహాల్లో పీఆర్వోలు అనధికారికంగా గదులు ఆక్రమించుకుని ఏకంగా కాపురాలు సాగిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది. టీటీడీలో చక్రం తిప్పుతూ.. దందా టీటీడీలో దీర్ఘకాలికంగా పనిచేసే ఉద్యోగుల కంటే ప్రైవేట్ పీఆర్వోలే చక్రం తిప్పుతున్నారు. అలాంటి వారికే టీటీడీ అధికారులు కూడా ఎర్రతివాచి పరుస్తున్నట్టు విమర్శలున్నాయి. దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించిన అతిథిగృహాల గదులు కేటాయించాల్సిన బాధ్యత రిసెప్షన్ అధికారులదే. వారినే నియంత్రించే స్థాయిలో ప్రైవేట్ పీఆర్వోలు ఉన్నారు. తమ పరిధిలో ఉండే అతిథిగృహంలోని గదులు ఎప్పుడు? ఎవరెవరికి? ఎన్నెన్ని కేటాయించాలో వీరే నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయారు. ఇక దర్శన టికెట్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు విమర్శలున్నాయి. తాము పనిచేసే సంస్థ, యజమాని పేరుతో తాము సిఫారసు చేసిన వారికి ఏ రోజు, ఏ సేవా టికెట్టు కావాలన్నా సాధించి పెట్టడంలో వీరిపాత్ర ప్రధానంగా ఉంటుంది. ఇందుకోసం సంబంధిత టీటీడీ అధికారులపై రాష్ర్ట రాజధాని నుంచే కాదు ఏకంగా ఢిల్లీ స్థాయిలో కూడా తీవ్రస్థాయిలో వత్తిడి తేవడంలోనూ వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. రద్దు చేసినా.. ప్రైవేట్ పీఆర్వోల ఆగడాలు శృతిమించటంతో గతంలోనే ఈ వ్యవస్థను టీటీడీ రద్దు చేసింది. దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించిన అతిథిగృహాల్లో అనధికారికంగా తిష్టవేసిన ప్రైవేట్ పీఆర్వోలను ఖాళీ చేయించారు. వాళ్లు ఆక్రమించుకున్న గదులను కూడా భక్తులకు కేటాయించటంతో టీటీడీకి రాబడి వచ్చింది. కొన్నాళ్లు ఆచరణలో పెట్టినా తర్వాత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రైవేట్ పీఆర్వో పోస్టు కోసం కప్పం కొందరు దళారులు ప్రైవేట్ పీఆర్వోల అవతారం ఎత్తి తిరుమలలో దర్శనాలు, గదులు మంజూరు చేయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. కొందరు ‘ఫలానా సంస్థ, ఫలానా నేత’ పీఆర్వోగా చెప్పుకుంటూ ఇక్కడి కార్యకలాపాలను సాగించేందుకు నెలవారీగా కప్పం కడుతున్నట్టు విమర్శలున్నాయి. ఇలాంటి దళారుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. దీనికి కొందరు పలుకుబడి కలిగిన నేతలు కూడా ఊతం పలుకుతుండటం గమనార్హం. గదులు, దర్శనాలపై టీటీడీలో స్పష్టమైన విధానం రాజ్యాంగ పరిధి హోదా కలిగిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తిరుమలలో గదులు, శ్రీవారి దర్శన కేటాయింపుల్లో టీటీడీకి స్పష్టమైన విధానం ఉంది. సంబంధిత కార్యాలయం నుంచి తిరుమలలోని టీటీడీ జేఈవో కార్యాలయానికి ఫ్యాక్స్ చేస్తే అందుకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంటారు. ఇందుకోసం సుమారు 40 మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, ఇందుకు విరుద్ధంగా కొందరు ప్రైవేట్ పీఆర్వోలను ప్రోత్సహిస్తూ టీటీడీపై వత్తిడి తేవడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇకనైనా టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకుని ప్రైవేట్ పీఆర్వోలు లేకుండా చూడాలని టీటీడీ సిబ్బంది, భక్తులు కోరుతున్నారు. -
తిరుమలలో వదిలేశారు..
ఆడబిడ్డ పుట్టిందని పేగుబంధం తెంచుకున్నారు ఆడ బిడ్డ. నెల కూడా నిండలేదు. వెలుగును కూడా చూడలేని కళ్లు. ముద్దుగొలిపే మోము. ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో? జగాన్ని ఏలే ఆ దేవదేవుని చెంత వదిలి వెళ్లింది. పారిశుద్ధ్య కార్మికురాలు ఆ బిడ్డను స్టేషన్‌కు చేర్చారు. అమ్మలా లాలించారు. ఆప్యాయతను పంచారు. ఈ ఘటన తిరుమలలో మంగళవారం చూపరులను కంటతడి పెట్టించింది. సాక్షి, తిరుమల: తిరుమల 481 ఏఎన్‌సీకాటేజీ మెట్లకింద మంగళవారం నెల రోజులు నిండని ఆడబిడ్డను ఎవరో వదలి వెళ్లారు. బిడ్డ ఏడుస్తుండడంతో ఈ ఘటన వెలుగుచూసింది. బిడ్డ ఏడుపు విని ఏఎన్సీ కాటేజీ వద్ద శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు రామలక్ష్మీ కాటేజీ మెట్ల వద్దకు వెళ్లింది. అక్కడ చీర, తువాలు మాత్రమే చుట్టి ఉంచిన నెలకూడా నిండని ఆడబిడ్డ కనిపించింది. చర్మంపొట్టు కూడా రాలనిస్థితిలో ఉన్న ఆ పసికందు వెక్కివెక్కి ఏడుస్తుండడంతో ఆ కార్మికురాలు చలించిపోయారు. చుట్టూ వెతి కినా కన్నవారెవరూ కనిపించలేదు. విజిలెన్స్ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ పసికందును తిరుమలలోని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బిడ్డ అవసరాలను తీర్చారు. హ గ్గీస్ తొడిగారు. కొత్త పాలసీసా తెప్పించి వెచ్చని పాలు పట్టించారు. వెచ్చగా ఉండే ఉన్ని బట్టలు, గ్లౌజ్ లు తొడిగారు. అమ్మకు దూరమైనా పారిశుద్ధ్య కార్మికురాలు రామలక్ష్మీ అన్నీ తానై సపర్యలు చేశారు. ఆకలి తీరడం, ఉన్ని దు స్తుల వెచ్చదనంలో తల్లిలా లాలించిన రామలక్ష్మి ఒడిలోనే ఆ పసికందు హాయి గా నిద్రపోయింది. ఆడబిడ్డ కావడంతోనే కన్నవారు వది లిపెట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తు న్నారు. బిడ్డను చిత్తూరులోని శిశువిహార్‌కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు. ఆ కాటేజీలో లలిత పేరుతో ఒక మహిళ గది పొందారని, సెల్‌ఫోన్ నెంబరు తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
తమ్ముళ్ల తడాఖా
గుడివాడ అర్బన్ : జిల్లాలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్ముళ్లు తమ తడఖా చూపుతున్నారు. తాజాగా మంగళవారం గుడివాడ మున్సిపల్ అధికారులపై స్థానిక నేతలు బెదిరింపులకు దిగారు. ‘మా మాట వినలేదంటే ఏదో ఒక సాకుతో ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఉసిగొల్పుతాం. మీ సంగతి చూస్తాం..’ అంటూ గుడివాడకు చెందిన టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కమిషనర్, అధికారులను బెదిరించారు. మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కౌన్సిలర్లు చింతల వరలక్ష్మి, యేల్చూరి వేణు, అడుసుమిల్లి శ్రీనివాస్, పొట్లూరి కృష్ణారావు, మరికొందరు నాయకులు కలిసి సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ కార్యాలయంలోని జనన మరణ విభాగానికి సంబంధించి ఒక సమాచారం ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేశారు. మున్సిపాల్టీలోని సహాయ సమాచార అధికారి (మున్సిపల్ మేనేజర్) వీరి దరఖాస్తుకు నిర్ణీత వ్యవధిలో సమాధానం ఇవ్వలేదు. సమాచారం కోసం దరఖాస్తు చేసిన టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను వివరణ కోరగా, అప్పీలేట్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. దీంతో మళ్లీ ఈ నెల ఒకటో తేదీన అప్పీలేట్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సమాచారం ఇచ్చేందుకు అప్పీలేట్ అధికారికి 30 రోజుల సమయం ఉంటుంది. కానీ, టీడీపీ నాయకులు మంగళవారం(21వ రోజు) మున్సిపల్ కార్యాలయానికి వచ్చి హడావుడి చేశారు. తాము దరఖాస్తు చేసినా ఎందుకు సమాచారం ఇవ్వలేదని కమిషనర్ ప్రమోద్‌కుమార్‌తో గొడవకు దిగారు. తనకు అప్పీలేట్ అధికారిగా ఈ నెలాఖరు వరకు సమయం ఉందని, అప్పటిలోపు సమాచారం ఇస్తానని కమిషనర్ చెప్పినా టీడీపీ నాయకులు శాంతించలేదు. ‘మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులకే సమాచారం ఇస్తున్నారు. మాకు ఇవ్వట్లేదు..’ అంటూ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. సమాచార హక్కుచట్టం ప్రకారం సమాచారం ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని కమిషన్ చెప్పారు. సంతృప్తి చెందని టీడీపీ నేతలు కమిషనర్ టేబుల్‌పై బాదుతూ ‘మీ సంగతి తేలుస్తాం..’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ వెళ్లిపోయారు. -
రూ.12 కోట్ల ఎగవేతపై చర్యలేవీ!
అమలాపురం టౌన్ : అమలాపురం పట్టణ, పరిసర ప్రాంతాల్లో రియల్ దందాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సాహసించలేకపోతోంది. అక్రమ లే అవుట్లతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన రియల్టర్లకు ఉన్న రాజకీయ అండదండల ముందు అధికారులు నిస్సహాయులవుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో 31 అక్రమ లే అవుట్లు ఉన్నట్టు, వాటి ద్వారా ప్రభుత్వానికి భూమి బదలాయింపు (కన్వర్షన్) ఫీజు కింద రూ.12 కోట్ల ఎగవేత జరిగిందని జిల్లా విజిలెన్స అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన పది మంది అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు. పది నెలల కిందట అమలాపురంలో దాదాపు రూ.120 కోట్ల విలువ చేసే సుమారు 35 ఎకరాల్లో 31 అక్రమ లే అవుట్లు వేసి, రూ.12 కోట్ల కన్వర్షన్ ఫీజు ఎగవేసినట్లు విజిలెన్స నిర్ధారించింది. ఈ తప్పిదానికి అమలాపురం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులను బాధ్యులని తేల్చింది. అప్పటి మున్సిపల్ కమిషనర్, ఇద్దరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, అమలాపురం తహశీల్దారు, ఆరుగురు రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ, వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అప్పట్లో విజిలెన్స అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదిక పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రభుత్వానికి వెళ్లి పది నెలలు గడుస్తున్నా, దానిపై నేటికీ చర్యలు లేవు. అప్పట్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు విజిలెన్స అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లలో ‘తాము రియల్టర్ల నుంచి ఎగవేసిన రూ.12 కోట్ల సొమ్ములు వసూలు చేస్తామని, లేని పక్షంలో ఆ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. లే అవుట్ల ధ్వంసం ఒక్కపూటే.. విజిలెన్స నివేదికతో మున్సిపల్ అధికారుల్లో కొంత కదలిక వచ్చింది. ఫిబ్రవరి 11న అమలాపురంలోని అక్రమ లే అవుట్లను పొక్లెయిన్లతో ధ్వంసం చేసేందుకు ముహూర్తం పెట్టారు. మెషీన్లతో ఒక్కపూట ధ్వసం చేసి మిన్నుకున్నారు. మరో రెండు రోజుల్లో మళ్లీ లే అవుట్ల ధ్వంసం పనులు చేపడతామన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ చర్యలు చేపట్టలేదు. మళ్లీ దాని ఊసే ఎత్తడం లేదు. అసలు మున్సిపల్ కార్యాలయంలో అక్రమ లే అవుట్ల ఫైలు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో లే అవుట్ల ధ్వంసానికి మెషీన్లు కూడా రాకుండా రియల్టర్లు తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అప్పట్లో మున్సిపాలిటీకి మెషీన్లు అద్దెకు ఇచ్చేందుకు వాటి యజమానులు రియల్టర్లతో ఒత్తిడితో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు పొక్లెయిన్లు దొరకడంలేదన్న సాకుతో ఇక లే అవుట్లను ధ్వంసం చేయాలన్న విషయాన్నే విస్మరించారు. రెండు రోజుల్లో మళ్లీ చేపడతామన్న అధికారులు.. తొమ్మిది నెలలు కావస్తున్నా పట్టించుకోవడం లేదు. అప్పుడూ, ఇప్పుడూ రాజకీయ పైరవీలే.. విజిలెన్స అధికారుల నివేదిక బుట్ట దాఖలయ్యేలా ఇక్కడి రియల్టర్లు చేసిన రాజకీయ ప్రయత్నాలు, పైరవీలు పనిచేశాయి. లే అవుట్లు ధ్వంసం చేస్తున్నప్పుడే రియల్టర్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని జిల్లాకు చెందిన ఓ మంత్రి అడ్డు వేసి వారికి అండగా నిలిచారు. అదే మంత్రి పార్టీ మారి.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధిగా ఉండటంతో రియల్టర్లకు మళ్లీ అండ దొరికినట్టయింది. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేతో రియల్టర్లకు సత్సంబంధాలు ఉండడంతో అక్రమ లే అవుట్ల ధ్వంసం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. చివరకు అమలాపురంలో ప్రైవేటు సెటిల్మెంట్ బ్యాచ్ బెదిరింపులకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఓ రియల్టరు ఉదంతంలో కూడా తెరవెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బంధువులు, అనుచరులు ఉండడం చర్చనీయాంశమైంది. -
ఇసుక లారీలపై ఉక్కుపాదం
- అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల దాడులు - వంద ఇసుక లారీల పట్టివేత - ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాల స్వాధీనం - క్వారీలలోనూ ఆకస్మిక తనిఖీలు - భారీగా జరిమానా విధింపు బాన్సువాడ/బిచ్కుంద: ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు కన్నెర్ర చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు విస్తృతంగా తనిఖీలు చేసి వంద లారీ లను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఏస్గీ క్వారీల నుంచి ఇసుకను తరలిస్తున్న పది టైర్ల భారీ వాహనాలను కూడా నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు గనుల శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి ఆధ్యర్యంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బిచ్కుంద మండలం ఖద్గాం, శెట్లూర్, వాజిద్నగర్, పిట్లం, నిజాం సాగర్, బాన్సువాడ, బిచ్కుందలో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న వంద లారీలను స్థానిక తహసీల్దార్ ధన్వాల్కు అప్పగించారు. ఒక్కో వాహనానికి రూ.20వేల చొప్పున జరిమానా విధించారు. అయితే దాదాపు 35 లారీలకు ఇంకా జరిమానా వేయలేదని సమాచారం. ఒక్కో లారీలో 50 టన్నులు వాస్తవంగా పది చక్రాల లారీలో సుమారు 22 టన్నుల మేర కే లోడ్ నింపాలి. కానీ, సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో లారీ డ్రైవర్లు రెట్టింపు బరువు అంటే, దా దాపు 50 టన్ను ల ఇసుకను నింపి వివిధ ప్రాంతాల కు తరలి స్తున్నా రు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, లారీ లలో సామర్థ్యానికి మించిన బరువుతో ఇసుకను రవాణా చే స్తుండడంతో రహదారులు చెడిపోతున్నాయని బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఇటీవల న్యాయవాదులు కోర్టులో కేసు కూడా వేశారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తక్షణమే ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని విన్నవించారు. రెవెన్యూ, గనులు, పోలీస్, రవాణా శాఖ అధికారుల వైఖరికి నిరసనగా ఒక రోజు బిచ్కుంద బంద్ చేయించి, ధర్నా చేశారు. ఓవర్‌లోడ్ వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలూ గాలిలో కలిసిన సంఘటనలూ ఉన్నాయి. ఇటీవలే నిజాంసాగర్ మండలం కోమలంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ కింద పడి ఒక వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర ప్రాం తం నుంచి వస్తున్న భారీ వాహనాలను బోధన్-బాన్సువాడ-ఎల్లారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఒక్కొక్క భారీ వాహనంలో 30 నుంచి 40 టన్నుల ఇసుకను తరలిస్తున్న ఇసుక వ్యాపారులు వాటిని హైదరాబాద్ నగరానికి తర లించి సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లారీ ద్వారా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుండ డంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎట్టకేలకు అధికారులు స్పందించి బుధవారం రాత్రి ఇసుక లారీలపై దాడులు చేశారు. హోం మంత్రి వస్తున్నారనేనా! హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గురువారం మ ద్నూర్ ప్రాంతంలో పర్యటించారు. ఇసుక లారీల వ్య వహారం మంత్రి దృష్టికి రాకూడదనే పోలీసు అధికారులు భావించి ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. క్వారీని పరిశీలించిన అధికారులు ఖత్గాం, వాజిద్నగర్ గ్రామాలలో కొనసాగుతున్న ఇసుక క్వారీలను తహసీల్దార్ ధన్వాల్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధం గా ఇసుకను తవ్వుతున్నారా లేదా అని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి గనుల శాఖ అధికారుల కు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అక్కడి నుం చి అనుమతులు వచ్చే వరకు ఇసుక రవాణాను నిలి పివేయాలని క్వారీ నిర్వాహకులకు సూచించారు. -
బయో ఉత్పత్తుల గోడౌన్‌పై విజిలెన్స్ దాడులు
గుంటూరు క్రైం : బయో ఉత్పత్తులను విక్రయించే కోస్టల్ జిల్లాల బ్రాంచి కార్యాలయం గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా విక్రయాలు కొనసాగిస్తుండడాన్ని గుర్తించారు. రూ.60 లక్షల విలువచేసే 13రకాల బయో ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసి సీజ్‌చేశారు. ఆయా ఉత్పత్తుల శాంపిళ్లను సేకరించారు. బెంగళూరులో తయారైన బయో ఉత్పత్తులకు సంబంధించి కోస్తా జిల్లాలకు సిమ్బయాసిస్ ఆగ్రోమేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచి కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో ఉండగా.. ఆర్.అగ్రహారంలో సమీపంలో గోడౌన్ ఉంది. ఈ గోడౌన్లో అక్రమంగా బయోఉత్పత్తులు నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావుకు సమాచారం అందడంతో అధికారులను అప్రమత్తం చేశారు. గోడౌన్‌పై దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నిల్వచేసివున్న వివిధ రకాల బయోఉత్పత్తులను పరిశీలించారు. మొత్తం 40 రకాలు ఉండగా వీటిలో రూ.60 లక్షల విలువచేసే 13 రకాల బయో ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతి లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆయా బయో ఉత్పత్తుల విక్రయాలను నిలుపుదలచేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో కె.వెంకట్రావు మాట్లాడుతూ బయో ఉత్పత్తుల తయారీ జరిగిన అనంతరం తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అనుమతి పొందాల్సివుంటుందని ైహైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను సైతం సదరు కంపెనీ ఉల్లంఘిస్తూ అక్రమ విక్రయాలు కొనసాగిస్తోందన్నారు. సేకరించిన శ్యాంపిళ్లను హైదరబాద్‌లోని ల్యాబరేటరీకి పంపుతామని, అవి నాణ్యతాలోపంగా ఉన్నాయని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దాడుల్లో సీఐ ఎ.కిషోర్‌బాబు, ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ శ్రీరాములు, వ్యవసాయాధికారి పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు. -
ఎరువుల గుట్టు..విభేదాలతో రట్టు
నంద్యాల: ఎరువుల అక్రమ నిల్వలు వెలుగులోకి రావడం వెనుక అధికార పార్టీకి చెందిన వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మద్దతు దారుడుగా కొనసాగుతున్న దియ్యాల మధుసూదనరావు వ్యవసాయ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 1175 టన్నుల ఎరువులను ఈ నెల 24న విజిలెన్స అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. వీటి విలువ రూ.2.09 కోట్లు ఉంటుందని విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు. నంద్యాల పట్టణంలో ఏటా దాదాపు రూ.15 కోట్లు విలువ చేసే ఎరువులను స్థానిక వ్యాపారులు విక్రయిస్తుంటారు. పట్టణంలోని వ్యాపారులు స్థానిక రైతులకే కాకుండా శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లోని 10 మండలాలకు ఎరువులను విక్రయిస్తుంటారు. అయితే ఐదారుగురు వ్యాపారులు మాత్రం స్థానిక రైతులకు విక్రయించడం కంటే సీజన్‌ను బట్టి నెల్లూరు, కడప, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు తరలించి భారీ ఎత్తున ఆదాయాన్ని గడిస్తుంటారు. పది సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలోని ఎరువుల వ్యాపారులు అధికార పార్టీకి అండదండలను అందిస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగించుకుంటున్నారు. వీరిపై దాడులు నిర్వహించడానికి కూడా అధికారులు వెనుకడుగు వేసేవారు. దాడికి వెళ్లే సమయంలోనే అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఫోన్లు వచ్చేవి. పక్కా సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు ధైర్యంగానే దాడులు కొనసాగించి అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులు 1175 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయం కోసం ఆధిపత్య పోరు.. ఎరువుల వ్యాపారులు కొందరు తమ ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రత్యర్థిపై అధికారులకు పక్కా సమాచారం అందించి వారిని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దియ్యాల మధుసూదనరావు పట్టణంలో ఎరువుల వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈయన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డికి తలలో నాలుకలాగా వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎరువుల కంపెనీలు కూడా ఈయన కనుసన్నల్లోనే స్టాక్‌ను ఇతర వ్యాపారులకు కేటాయిస్తుంటారు. ఏ వ్యాపారి దగ్గర లేనన్న నిల్వలు దియ్యాల దగ్గర ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు ఎరువుల అక్రమ నిల్వలపై పక్కా సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది.