వాహనాలను సీజ్ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
పూసపాటిరేగ: నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కుమారుడు తమ్మునాయుడు అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తుండగా సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పూసపాటిరేగలోని సర్వే నంబరు 82–1, 2లో అనుమతి లేకుండా లేఅవుట్‌కు గ్రావెల్ తరలించడంతో ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడటంతో జరిమానా విధించారు. రెల్లివలసలో సర్వే నంబరు 17లో గల నడుపూరు రమేష్‌కు చెందిన వ్యసాయభూమి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా 350 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తరలించడంతో జరిమానా విధించినట్లు విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. పూసపాటిరేగలోని లేఅవుట్‌లో ఉన్న రెండు ట్రాక్టర్లు, జేసీబీ, రోడ్డురోలర్ మొత్తం నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు రవికుమార్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు ఎం.సురేష్‌కుమార్, రాంబాబు, సత్యమూర్తి, సర్వేయర్ తులసి, వీఆర్‌ఓలు అప్పలనాయుడు, దురగాసి రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment