
సాక్షి,విజయనగరం జిల్లా: వార్డు సచివాలయ ఉద్యోగులకు ఘోర అవమానం జరిగింది. మున్సిపల్ కమీషనర్ తమని అవమానించారని ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం రాత్రి 9 గంటలకు సచివాలయ ఉద్యోగులు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు నివాసానికి వెళ్లారు.
అయితే సచివాలయ ఉద్యోగులు వస్తున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే పూసపాటి అదితి ఇంటి గేట్లు తెరవ వద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో సిబ్బంది ఇంటి గేట్లను మూసి వేశారు.
మున్సిపల్ కమీషనర్ తమని అవమానించారని, ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే అదితి నివాసానికి వచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఏం చేసేది లేక గేటు బయటే పడిగాపులు కాశారు. తమకు కష్టం వచ్చిందని ఎమ్మెల్యే వద్దకు వెళితే, గేటు బయటే ఉంచడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.