Secretariat employees
-
పోరుబాటకు సిద్దమవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు
-
పబ్లిక్ డే నాడు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు షాక్
-
వైఎస్ జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను దెబ్బతీసేలా ప్రభుత్వం కుట్రలు
-
ఉద్యోగులకు వేధింపులు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ రెసిడెన్సీ హోటల్లో వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వివి«ద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ఫెడరేషన్‌ను కాపాడుకుంటామని ఉద్యోగులు ముక్త కంఠంతో ప్రకటించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న హామీని నెరవేర్చ లేదన్నారు.పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలుకు పెంచుతామన్న హామీని తుంగలోకి తొక్కి వారి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గత సర్కారు ఇచ్చిన జీవోలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వందలాది మందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చిందన్నారు. పెండింగ్ బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి సారించి సంఘాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వీఆర్ఏలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కరువు.. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎంను కోరిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేవారని, నేరుగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చి చాలా వరకు పరిష్కరించామని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కరువైందని, అందువల్ల మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తెస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక్క సమస్యనుగానీ, హామీనిగానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. ఉద్యోగులను మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సచివాలయ ఉద్యోగులకు అడుగడుగునా అవమానం
-
కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ కట్..
-
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన
-
సచివాలయంలో ‘ఫేషియల్’ హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. సచివాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గురువారం నుంచి తమ అటెండెన్స్‌ను ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం సచివాలయంలోని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. సచివాలయ హాజరు విధానంలో కచ్చిత త్వం, సవర్థత, భద్రతను పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగి్నషన్ అటెండెన్స్ యంత్రాల ముందు కొన్ని క్షణాల పాటు ఉద్యోగులు నిలబడితే, వారి ముఖకవలికలను గుర్తించి హాజరును నమో దు చేస్తాయి. ఉద్యోగులు, అధికారులందరి వివరాలను ఇప్పటికే ఆ యంత్రాల్లో రికార్డు చేశారు. సచివాలయంలోకి ప్రవేశించే సమయంలో, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో అటెండెన్స్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో సాంకేతిక సమస్యలొచ్చే అవకాశం ఉండడంతో శనివారం వరకు ఫిజికల్ అటెండెన్స్ విధానాన్ని సైతం కొనసాగించాలని సీఎస్ సూచించారు. త్వరలో జిల్లా, మండల కార్యాలయాల్లో సైతం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయా లని, సచివాలయం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న కొత్తలో సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలో అమల్లోకి తీసుకురాగా, త్వరలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సైతం ఫేషియల్ రికగి్నషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. -
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్‌మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్‌లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దుశ్చర్య
-
సచివాలయ ఉద్యోగులకు కేటరింగ్ పనులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు భోజనాలు వడ్డించే బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. అన్నమయ్య జిల్లాలో ఓ మండలాధికారి పదవీ విరమణ సందర్భంగా మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో భోజనాలు వడ్డించేందుకు గ్రామ సచివాలయాల ఉద్యోగులను వినియోగించారు. విస్తర్లు వేసేందుకు, మటన్, పప్పు, సాంబారు వంటి పదార్థాలను వడ్డించే బాధ్యతలను 12 మంది సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఈ మేరకు అధికారులు లిఖితపూర్వక ఆదేశాలు సైతం జారీ చేశారు. ఏ పనైనా వారికే.. మచిలీపట్నంలో ధాన్యం సేకరణ నిమిత్తం వెహికల్ మూమెంట్ మోనిటరింగ్ పేరుతో వార్డు సచివాలయాల్లో పనిచేసే 31 మంది ఉద్యోగులను వివిధ మిల్లుల వద్ద కాపలా కాసే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన స్టిక్కర్లను ఇంటింటా అతికించే బాధ్యతల్ని సైతం ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించిన విషయాన్ని విదితమే. సచివాలయాల ఉద్యోగులకు అధికారులు అప్పగిస్తున్న బాధ్యతలతో వారంతా సిగ్గు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి చదువులు చదివిన వారే అధికం. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు స్థానిక అధికారులు ప్రతి పనికీ ఉపయోగించుకుంటూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. -
‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే.. ’
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. ఏం చేస్తాం? ఒక పక్క నుంచి పీక్కుంటూ వస్తున్నాం. ఒకరా.. ఇద్దరా ఆపడానికి. వారం ఆగితే అందరినీ రిమూవ్ చేస్తాం. వారం పదిరోజుల్లో మొత్తాన్ని తీసి పారనూకుతాం. వాళ్లిష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ పోయారు. మనోళ్లకు రాలేదు. వాడి మీద ఫిర్యాదు పెట్టు.. వాడి జాబ్ తీయించి పారనూకుతాను’ అంటూ సచివాలయ ఉద్యోగుల గురించి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆ పార్టీ కార్యకర్తతో చేసిన ఫోన్ సంభాషణ. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుట్రలో భాగంగానే హల్చల్పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కిషోర్ మాజీ కార్పొరేటర్ రామయ్యకు ఫోన్ చేసి.. వరద నష్ట పరిహారం అందలేదని చెప్పాడు. ఫలానా వాళ్లకు రూ. 1.25లక్షలు పడ్డాయి. మన వాళ్లు మొత్తం కోల్పోయినా రూ. 3వేలు పరిహారం ఇచ్చారంటూ రామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి రూ. లక్ష, రెండు లక్షలు వేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఏమీ ఇవ్వలేదు. ఇదేం న్యాయమంటూ రామయ్యను అడిగాడు. దీంతో రామయ్య ఒక్కసారిగా.. సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లేనంటూ రెచ్చిపోయాడు. ఫోన్ సంభాషణతో నియోజకవర్గంలోని సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ సంభాషణలో వాడిన భాష, సచివాలయ ఉద్యోగులను వాడు వీడు అంటూ మాట్లాడిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి ఆడియోలు రికార్డు చేసి వాటిని వైరల్ చేయడం రామయ్యకు అలవాటేనని, సచివాలయ ఉద్యోగులంతా వైఎస్సార్ సీపీ వాళ్లేనంటూ బెదిరించి వారిని తన ఆధీనంలో పెట్టుకునే కుట్రలో భాగంగానే ఆడియో వైరల్ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో వాళ్ల పార్టీ నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయని నాయకులు చర్చించుకుంటున్నారు. -
సచివాలయ ఉద్యోగుల్ని అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే అదితి
సాక్షి,విజయనగరం జిల్లా: వార్డు సచివాలయ ఉద్యోగులకు ఘోర అవమానం జరిగింది. మున్సిపల్ కమీషనర్ తమని అవమానించారని ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం రాత్రి 9 గంటలకు సచివాలయ ఉద్యోగులు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు నివాసానికి వెళ్లారు.అయితే సచివాలయ ఉద్యోగులు వస్తున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే పూసపాటి అదితి ఇంటి గేట్లు తెరవ వద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో సిబ్బంది ఇంటి గేట్లను మూసి వేశారు.మున్సిపల్ కమీషనర్ తమని అవమానించారని, ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే అదితి నివాసానికి వచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఏం చేసేది లేక గేటు బయటే పడిగాపులు కాశారు. తమకు కష్టం వచ్చిందని ఎమ్మెల్యే వద్దకు వెళితే, గేటు బయటే ఉంచడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా.. తిరిగి వారిపైనే కత్తి దూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ (సెక్రటేరియట్) ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం చేసింది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరింది. – సాక్షి, అమరావతిఉద్యోగులకు మధ్యంతర భృతితోపాటు క్రమం తప్పకుండా డీఏ ఇస్తామని, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ఆ విషయంపై ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణచివేసే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.70 ఏళ్ల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణంఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ హోదాలో కాకర్ల వెంకట్రావిురెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో ఆర్టీసీ ఉద్యోగులను కలిశారు. ఎలాంటి సమావేశం, ప్రెస్‌మీట్ పెట్టకపోయినా కొన్ని పత్రికలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు వార్తలు రాయడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై నాలుగు కేసులు పెట్టించారు. దీంతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఇపుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం గుర్తింపును రద్దు చేసేందుకు సిద్ధపడింది. విచారణ నివేదికలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం పేరు కూడా లేదు. అయినా కేవలం వెంకట్రావిురెడ్డిపై కక్షతో 70 ఏళ్ల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.అప్పట్లో ఉద్యోగ సంఘాలను వాడుకుని..2019 ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి.. వారితో నల్లచొక్కాలు తొడిగించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిట్టించారు. బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వబోమని, ఏపీ నుంచి బీజేపీని తరిమి తరిమి కొడతామని పెద్దఎత్తున ప్రకటనలు కూడా అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ఇప్పించారు. 2019 ఎన్నికల తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దమనసుతో వ్యవహరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ పనులు చేయించుకునేందుకు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం సహజమేనని, అలాంటి చిన్నచిన్న విషయాలకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఉద్యోగులెవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ఎలాంటి సంబంధం లేని ఘటనను సాకుగా చూపించి.. సంఘాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వ సంఘాల సమాఖ్య చైర్మన్ హోదాలో వెంకట్రావిురెడ్డి తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలి తప్ప సంఘాన్ని నాశనం చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదని వారంతా పేర్కొంటున్నారు. -
సచివాలయ ఉద్యోగులకూ బదిలీలు!
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రభుత్వ పాలనను అత్యంత చేరువ చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన విషయం విదితమే. అయితే ప్రస్తుత చంద్రబాబునాయుడి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సైతం రంగం సిద్ధం చేసింది. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా వివిధ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకేచోట ఐదేళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా ఐదేళ్లు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. అయితే, నిర్ణీత నిబంధనల మేరకు బదిలీ కావాలని కోరుకునే వారికి బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు.. అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా బదిలీ చేసే అవకాశం ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.మార్గదర్శకాలివే.. » బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల 27లోగా దరఖాస్తులు చేసుకోవాలి » దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఈ నెల 29, 30 తేదీలో ఆఫ్‌లైన్ (వ్యక్తిగతంగా హాజరయ్యే విధానం)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిక్వెస్టు బదిలీల ప్రాధాన్యత క్రమం.. » మొదట దివ్యాంగులకు, మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో కనీసం రెండేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్య, భర్తలకు, పరసర్ప అంగీకార బదిలీలకు క్రమ పద్ధతిలో వీలు కల్పించనున్నారు. » గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఉద్యానవన అసిస్టెంట్లు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, మహిళా పోలీసు ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్లు బదిలీల అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు.» విలేజీ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జేడీలు, సెరికల్చర్ అసిస్టెంట్లకు జిల్లా సెరికల్చర్ అధికారులు, ఏఎన్ఎంలకు జిల్లా డీఎంహెచ్‌వో, ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కంల ఎస్ఈ అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు బదిలీల అ«దీకృత అధికారులుగా ఉంటారు. » 50 ఏళ్ల లోపు వయస్సు ఉద్యోగులనే గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు. » ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకుని, నిరీ్ణత తేదీలో కౌన్సెలింగ్‌కు హాజరు కాని పక్షంలో ఆ ఉద్యోగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
ఇదేం శాడిజం.. పింఛన్ పంపిణీకి తంటాలు
విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది... వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. మోసపోయాం: వలంటీర్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా. ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా!చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్‌దారులు నానా ఇబ్బందులు పడ్డారు. -
ఇదేనా పొదుపు..! టీడీపీ కట్టించిన సచివాలయం వారికే నచ్చడం లేదు..
-
పింఛన్లపై పెత్తనం.. మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో 94 మంది లబ్ధిదారులకు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదుతో ఈ నెల ఫించన్లు నిలిచిపోయాయి. ఇన్నాళ్లూ ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటివద్దే నిశ్చింతగా కోవిడ్ కష్టకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిన ఫించన్లు ఈసారి కొన్నిచోట్ల ఉదయం 8 గంటలు దాటుతున్నా చేతికి అందకపోవడంతో పలుచోట్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్ల మంజూరు మొదలు పంపిణీ దాకా రాజకీయాలకు అతీతంగా, ఎవరి సిఫారసులు అవసరం లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లను అందచేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నంగా తాజాగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. గ్రామాల్లోనూ, వార్డులోనూ సచివాలయాల ఉద్యోగుల వెంట స్థానిక టీడీపీ, జనసేన నాయకులు మోహరించారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందచేస్తూ పోటాపోటీగా నేతలు ఫోటోలు దిగారు. విజయనగరం తదితర చోట్ల తమ అధిపత్యం నిరూపించుకునేందుకు జనసేన – టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూటమి నేతలు కొన్ని చోట్ల తమ ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో పలువురు పింఛన్లను తొలగించినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో పెదంచలలో వైఎస్సార్ సీపీకి ఓటు వేసినందుకు తమ పింఛన్లు నిలిపివేశారంటూ కొందరు లబ్ధిదారులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. కాగా నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 29వ వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి (32) సోమవారం రాత్రి తన ఇంట్లో బాత్రూమ్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. వారం క్రితం స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాతో పాటు సచివాలయ ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సుధారాణి సోమవారం టీడీపీ నేతలతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అనంతరం అనుమానాస్పద రీతిలో మరణించారు.తొలిరోజు 95 శాతం.. మొత్తం 64.75 లక్షల మంది లబ్ధిదారులకుగానూ తొలి రోజు సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి 61 లక్షల మంది (దాదాపు 95 శాతం)కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వలంటీర్లతో సంబంధం లేకుండా పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వలంటీర్లు వారి వెంట వెళ్లి పంపిణీలో పాల్గొన్నారు. ఉదయం కొద్దిసేపు సాంకేతికపరమైన అవాంతరాలు తల్తెత్తడంతో వాటిని సరిదిద్ది ప్రక్రియ కొనసాగించారు.జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నేతల దాడిపింఛన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్‌లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పింఛన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. చాలాసేపు సద్దుమణగకపోవడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశతో వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పింఛను అందించారని గుర్తు చేసుకున్నారు.వృద్ధులు ఉసూరు..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని వార్డుల్లో లబ్ధిదారులను నిర్దేశిత ప్రాంతానికి రావాలని ఆదేశించడంతో వృద్ధులు, దివ్యాంగులు నానా పాట్లు పడి అక్కడకు చేరుకున్నారు. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో ఐరిస్‌తో ప్రయత్నించారు. చివరకు సరిపోలడం లేదని, ఫించన్ ఇవ్వలేమని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పలువురు వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మరికొన్ని వార్డుల్లో సచివాలయాలకు తాళం వేసి సిబ్బంది పింఛన్ల పంపిణీకి వెళ్లి పోవడంతో సమాచారం తెలియక పలువురు అక్కడకు చేరుకుని ఇబ్బందులు పడ్డారు.మొదటి నెలలోనే చుక్కలు...– సత్యనారాయణ, 5వ వార్డు, తాడేపల్లిగూడెంఅధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మా వార్డులో పంపిణీకి ఇంటికి రాలేదు. ఎక్కడ ఇస్తున్నారో తెలియదు. సచివాలయానికి వెళితే తాళం వేసి ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.సచివాలయాలకు పరుగు ఉదయం 8 గంటలు దాటుతున్నా సచివాలయ సిబ్బంది జాడ లేకపోవడం, పింఛన్ తీసుకోకుంటే వెనక్కి వెళ్లిపోతుందనే ఆందోళనతో విజయనగరంలో లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు తీశారు. సర్వర్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరంలోని తోటపాలెం సచివాలయంలో ఈ పరిస్థితి కనిపించింది. ఫించన్లపై ఫిర్యాదులు..శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ప్రకాశంలో పడిగాపులు..ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన పింఛన్లను ప్రకాశం జిల్లాలో ఆలయాలు, స్కూళ్లు, ప్రైవేటు స్థలాల వద్దకు రప్పించడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరకు సర్వర్ పనిచేయడంలేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎక్కువ చోట్ల గ్రామాల్లో రచ్చబండ వద్ద కూర్చొని పింఛన్లు పంపిణీ చేశారు.కష్టాలు మొదలయ్యాయిఇన్నాళ్లూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 1వ తేదీ ఉదయం పింఛన్ అందుకున్నాం. ఈసారి మాకు పింఛన్ అందలేదు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల తరువాత గాని మాకు అందే పరిస్థితి లేదు. మాకు కష్టాలు మొదలయ్యాయి.పుట్టా ఫిర్యాదుతో 94 మందికి ఆగిన ఫించన్లువైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో గత నెల వరకు పింఛన్లు పొందిన 94 మంది లబ్ధిదారులకు ఈదఫా డబ్బులు అందలేదు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదులే దీనికి కారణం. మడూరులో 40, అన్నవరంలో 28, టీఓపల్లెలో 26 మందికి పించన్లపై పునర్విచారణ చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 94 మందికి పింఛన్లను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తమ పింఛన్లను ఆపారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే ఇలా చేశారని, విచారణ జరిపి అర్హత ఉంటేనే తమకు పింఛన్ ఇవ్వాలని బాధితులు పేర్కొన్నారు.ఒంటరి మహిళ ఇక్కట్లు..భర్తకు పొగొట్టుకుని వితంతు పింఛన్ పొందుతున్నా. గత ఐదేళ్లుగా టంఛన్‌గా ఇచ్చారు. ఈసారి రాలేదు. డబ్బుల కోసం పంచాయతీ అధికారి వద్దకు వెళితే నీ పింఛన్ ఆపమన్నారని చెప్పారు. అర్హత పత్రాలు పరిశీలించిన తర్వాత అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పింఛన్ డబ్బులే నాకు జీవనాధారం.కారు వద్దే పింఛన్ల పంపిణీఓ సచివాలయ ఉద్యోగి తన కారు వద్దకే లబ్ధిదారులను రప్పించుకుని పింఛన్ పంపిణీ చేపట్టిన ఘటన రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. 16వ డివిజన్ పరిధిలోని 41వ వార్డు సచివాలయం ఎమినిటీ సెక్రటరీ వీవీడీ ప్రసాద్‌కు వాంబే కాలనీలో పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించారు. బ్లాక్–1 వద్ద దివ్యాంగులు, వృద్ధులు, వితంతవులు తన కారు వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక లబ్ధిదారులు అక్కడ బారులు తీరారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు, వైఎస్సార్ సీపీ నేత సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి దీన్ని వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు గంటల తరువాత ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.సాయంత్రం వరకు ఇవ్వలేదు..గతంలో వలంటీర్లు వేకువజామునే మా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ నగదు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే మీకు ఇప్పుడే ఇవ్వమన్నారని చెప్పారు. ఎందుకయ్యా? అని అడిగితే.. ఏమో టీడీపీ వాళ్లు చెప్పారని అంటున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, ప్రాంతం ఇవేమీ చూడకుండా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు. – రాజేంద్రరెడ్డి, మల్లారెడ్డికండ్రిగ గ్రామం, విజయపురం మండలం, నగరి నియోజకవర్గం. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇవ్వొద్దుఅనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వెంగన్నపల్లె, పుప్పాల గ్రామాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్ల పంపిణీ చేపట్టిన పంచాయతీ కార్యదర్శి వసుంధరను అడ్డగించారు. పుప్పాల గ్రామంలో 35, వెంగన్నపల్లెలో 50 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకూడదంటూ టీడీపీ సర్పంచులు దేవన్న, నాగమునిరెడ్డి తమ వర్గీయులతో కలసి అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ జరగలేదు. టీడీపీలో ఆధిపత్య పోరుపింఛన్ల పంపిణీ టీడీపీలో వర్గ పోరుకు వేదికగా మారింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో సుగవాసి సుబ్రమణ్యం వర్గం పంపిణీ చేపట్టగా అదే ప్రాంతంలో పార్లమెంటరీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు వర్గీయలు కూడా దీన్ని ప్రారంభించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా దుద్యాల గ్రామంలో టీడీపీ నాయకుడు కోటేశ్వర్ రెడ్డి మీ అంతు చూస్తానంటూ సచివాలయ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. పంచేందుకు కుమ్ములాట..కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పచ్చ కండువాతో మెప్మా ఆర్పీ..రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్(ఆర్పీ) పచ్చ కండువా మెడలో ధరించి పింఛన్లు పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రామారావు కాలనీకి చెందిన మెప్మా ఆర్పీ జాఫరున్నీసా టీడీపీ నాయకురాలిలా మెడలో పచ్చ కండువా వేసుకుని పింఛన్లు పంపిణీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనిపై శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని టీఎంసీ రవి తెలిపారు. -
AP Pension: రూ.500 ఇస్తేనే పెన్షన్ ఇస్తా!
అమరావతి, సాక్షి: ఎండనక, వాననక.. సుదూర ప్రాంతాల్ని సైతం లెక్కచేయక.. ఆఖరికి కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే చంద్రబాబు ప్రభుత్వం నిశ్చయించుకుంది. మరోవైపు పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవక ముందే.. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు బయటకు వస్తున్నాయి. (గమనిక: పైన ఫొటోలో పెన్షన్ పంపిణీ చేస్తున్న షేక్ కరిష్మా విజయనగరంలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రంగానే ఆ ఫొటోను వాడటం జరిగింది. కింది ప్రచురితమైన పల్నాడు వార్తకు.. ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం)పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్‌దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఆరోపణలపై నాయక్‌ను సస్పెండ్ చేశారు. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంఇంకోవైపు.. పెన్షన్ ఇస్తున్నట్లు ఫొటో దిగిన సచివాలయ సిబ్బంది, సర్వర్ సమస్యలున్నాయని, సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకే క్యూ కడుతున్నారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంరాజకీయ జోక్యాలుఏపీ వ్యాప్తంగా ఈ ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది పార్టీ ఈవెంట్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంసంబంధిత వార్త: టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!పింఛన్ నగదు చోరీ?వైఎస్సార్: ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పింఛన్ పంపిణీ కోసం తెచ్చిన నాలుగు లక్షలు చోరీకి గురయ్యాయి. సచివాలయం సిబ్బంది మురళీ మోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా.. కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బైక్ మీద నుంచి కళ్లు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లారని మురళీ మోహన్ అంటున్నారు. అయితే పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథరెడ్డి, సీఐ వెంకట రమణ ఆరా తీసి.. దర్యాప్తునకు ఆదేశించారు. -
నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ గురువారం నుంచి ఆరంభం కానుంది. కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరికొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దృష్ట్యా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభుత్వం రేషనలైజేషన్ ఉద్యోగుల సర్దుబాటుకు పూనుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయగా.. జిల్లాలో సర్దుబాటు ప్రక్రియకు సంబంధి«ంచిన తేదీల వారీగా షెడ్యూల్‌ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ ధ్యాన్‌చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు ఇలా.. ♦ గురువారం (22వ తేదీ)కల్లా జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు.. 8 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందిస్తారు. ♦ ఈ నెల 24వ తేదీకల్లా 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగి రి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు. ♦ ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పనిచేసే అవకాశం ఉన్నంతవరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు. ♦ సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి, సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపడతారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వా ర్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సర్దుబాటు ప్రక్రియలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు స్థానచలనం కలిగే పరిస్థితి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ♦ మరోవైపు సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే.. ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయా ల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పిస్తారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగానూ, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవ కాశం కల్పించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
పదోన్నతుల పరంపర
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా... తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఏడీహెచ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ 17 కేటగిరీలకు సంబంధించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు పశు వైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయితే వాటిలో 40శాతం పోస్టులను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 మందికి ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అపోహలు.. అభూత కల్పనల నుంచి పదోన్నతుల వరకు.. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం... ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం... ఆ తర్వాత పట్టించుకోకపోవడం.. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి సాగిన చరిత్ర నాలుగేళ్ల క్రితం వరకు ఉంది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఏకంగా 1.34లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఒకేసారి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఉంటాయో... ఊడుతాయో.. అని భయపెట్టాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సచివాలయ ఉద్యోగులకు మేలు చేస్తోంది. ప్రొబేషన్ ఖరారు చేసి అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలుతో కూడిన వేతనాలు అందిస్తోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా శాఖల్లో పోస్టింగ్‌లు కూడా ఇస్తోంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. -
సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు
పేరు కె.పూర్ణచంద్ర. నాలుగేళ్ల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు సచివాలయం గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. నెల క్రితం రాయచోటి మండలంలో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2019 ఉద్యోగ నియామక రాత పరీక్షలో సంబంధిత కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం కోటప్పనగర్కు చెందిన పులి శ్రీధర్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 2019లో బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. 20 రోజుల క్రితం తెనాలి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. తాను పీహెచ్డీ చేస్తున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందని, అప్పట్లో ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావని కొందరు బెదరగొట్టారని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తు చేసుకోవడంతో మంచి జరిగిందన్నారు. తన భార్య కూడా గ్రామ ఉద్యాన సహాయకురాలిగా పనిచేస్తోందన్నారు. కాగా, అప్పట్లో ఇతను రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పదోన్నతులు పొందారు. సాక్షి, అమరావతి : నాలుగేళ్ల కిందట సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్ (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్)గా నియామకమైన వారిలో కొందరు నెల కిత్రం అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. కొత్త బాధ్యతల్లో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 53 ఖాళీ ఉండగా, ఆ పోస్టులన్నింటినీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతో భర్తీ చేసే ప్రక్రియను ఉద్యానవన శాఖ నెల రోజుల క్రితమే చేపట్టింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన.. శ్రీకాకుళం జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితమే పదోన్నతులు పొందగా, మిగిలిన జిల్లాల్లోనూ 35 మందికి పదోన్నతుల ప్రక్రియ పురోగతిలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అంటే.. ఆ 17 కేటగిరి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించిన బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడగానే, ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుంది. మిగిలిన రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు తుది దశలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మండల వ్యవస్థలో 13 ఏళ్లకు ఎంపీడీవో నియామకం నాలుగేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకం చేపట్టినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు ఇవేవీ శాశ్వత ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఊడతాయేమోనని భయపెట్టాయి. ఆ మాటలు నమ్మని నిరుద్యోగులు అప్పట్లో ఏకంగా 21 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో దాదాపు అందరూ ఏడాది కిందట ప్రొబేషన్ ఖరారు కూడా పూర్తి చేసుకొని అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలుతో కూడిన వేతనం అందుకుంటున్నారు. వీరిలో ఇంకొందరు మండల స్థాయిలో పని చేసేందుకు పదోన్నతులు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఆ మండలాల్లో పని చేసేందుకు ఉద్దేశించిన కీలక స్థాయి ఎంపీడీవోల ఉద్యోగాలకు తొలివిడత 13 ఏళ్ల తర్వాత 1999లో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఎంపీడీవోలు పదోన్నతులు పొందడానికి సంబంధించిన సర్వీసు రూల్స్‌కు సైతం 2022 వరకు అతీగతీ లేదు. అప్పడు ఎంపీడీవోగా నేరుగా ఉద్యోగం పొందిన వారికి సైతం 23 ఏళ్ల తర్వాత గానీ పదోన్నతి దక్కలేదు. ఉద్యోగాల భర్తీ ఓ రికార్డు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం ఒక రికార్డు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేయడం మరో రికార్డు. ప్రభుత్వ స్థాయిలో ఒక కొత్త శాశ్వత పోస్టు మంజూరు చేయాలంటే నెలలు, ఏళ్లు పడుతుంది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,524 కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేయడం.. ఒకే విడతలో వాటి భర్తీకి నోటిఫికేషన్.. ఏకంగా 21,69,529 మంది దరఖాస్తు.. 35 రోజుల్లోనే రాత పరీక్షల నిర్వహణ.. ఆ తర్వాత 11 రోజులకే ఫలితాల వెల్లడి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. సమస్యల పరిష్కారంపై దృష్టి గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఆయా శాఖల ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో అంత పెద్ద సంఖ్యలో పని చేస్తున్న 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. – లక్ష్మీశ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్ సక్సెస్
సాక్షి, విజయవాడ: జగనన్న సురక్ష సర్వే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి 51.14 లక్షల వినతులకు గ్రామ సచివాలయ ఉద్యోగులు పరిష్కారం చూపారు. జులై 11న అత్యధికంగా ఒకేరోజు 6.25 లక్షల వినతులను పరిష్కరించడంతో.. ప్రజా వినతుల పరిష్కారంలో ‘జగనన్న సురక్ష’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 17 రోజుల్లోనే 9,721 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి చేశారు. లక్ష 73 వేల క్లస్టర్లలో 84.11 లక్షల ఇళ్లను వలంటీర్లు సందర్శించారు. దీంతో ఏపీ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ మరో అరుదైన ఘనత సాధించింది. కాగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఏ సంక్షేమ పథకమైనా, ధ్రువపత్రామైనా అందని అర్హులకు అండగా నిలిచే సేవా యజ్ఞాన్ని చేపట్టింది. ‘జగనన్న సురక్ష’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడటంతోపాటు జనన, మరణ, కుల, ఆదాయ, సీసీఆర్సీ, రేషన్‌కార్డు విభజన వంటి 11 రకాల ధ్రువపత్రాలను జగనన్న సురక్ష గ్రామసభల ద్వారా అందిస్తున్నారు. ఫలితంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బదిలీలకు సీఎం జగన్ ఆమోదం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే.. -
ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వారి సొంత ఊళ్లలోనే ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవల వివరాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ నిబంధనల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వివిధ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అన్ని వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సేవల గురించి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంటింటా వివరించి చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు
-
AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారు అనంతరం దాదాపు రెట్టింపు జీతం అందుకుంటారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి (అంటే జూన్ ఒకటిన ఉద్యోగులకు అందే జీతం) అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. 1.34 లక్షల మందికి కొత్త ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజల గడపవద్దకే ప్రభుత్వపాలన తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్ జారీచేశారు. నాలుగు నెలల్లోనే రాత పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్ ద్వారా 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా.. అందులో నిబంధల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. వారందరికీ గత ఏడాది జూలై ఒకటి నుంచి పే–స్కేలుతో కూడిన వేతనాలను ఇస్తోంది. మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే 2020లో నోటిఫికేసన్ జారీ చేయగా, మరో 12,837 మంది ఉద్యోగాలు పొందారు. వీరు ఇప్పుడు ప్రొబేషన్ పొంది మే 1 నుంచి పే స్కేలుతో కూడిన వేతనాలు అందుకోబోతున్నారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్ పొందుతారని అధికారులు వెల్లడించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు సృష్టించి ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సీఎం జగన్‌కు మేమెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్. కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ సీఎం జగన్ రుణం తీర్చుకుంటాం.. ఉద్యోగ సంఘాల హర్షం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండోవిడత ఉద్యోగాలు పొందిన వారికీ ప్రొబేషన్ ఖరారు చేసినందుకు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి జగన్‌కున్న అభిమానానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా సచివాలయాల ఉద్యోగులు కష్టపడి పని చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకుంటారని చెప్పారు. చదవండి: ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్కాల్స్ వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్ రెండో విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, ఉపాధ్యక్షులు జి.హరీంద్ర, కె.రామకృష్ణా రెడ్డి, కె.కిరణ్ -
ఉద్యోగులను సీఎం జగన్ అన్న అని ఎందుకు పిలుస్తారంటే
-
సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు సంతృప్తికరంగా లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. సమయపాలన పాటించమని అనేకసార్లు ఆదేశాలు జారీచేసినా ఫలితం ఉండటం లేదని పేర్కొంది. ఏపీ సచివాలయ ఆఫీస్ మాన్యువల్ నిబంధనల మేరకు కార్యాలయాలకు హాజరవడంలో సమయపాలన పాటించడం లేదని తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి సమయపాలన నిర్ధారించే బాధ్యత సంబంధిత విభాగాలపై ఉంటుందని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల అన్ని శాఖలకు జారీచేసిన మెమోలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శాఖలోనే ఓపీ సెక్షన్ ఇన్చార్జి రోజూ మధ్యాహ్నం 2 గంటల్లోపు సిబ్బంది హాజరును ఏకీకృతం చేయాలని మెమోలో సూచించింది. ఆ ఫైలును అదేరోజు సంబంధిత కార్యదర్శికి సమర్పించాలని పేర్కొంది. సమయపాలన పాటించనివారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ కార్యదర్శికి సూచించింది. ప్రస్తుతం సచివాలయంలో వారానికి ఐదురోజుల పనిదినాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం5.30 గంటల వరకు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాల్లో ఉండాల్సి ఉంది. అయితే సోమవారం, శుక్రవారాలైతే సిబ్బందితో పాటు అధికారులు సమయపాలన సంతృప్తికి చాలా దూరంగా ఉంది. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సిబ్బంది, అధికారుల హాజరు నమోదు చేస్తుండగా చాలా ఆశ్చర్యకర అంశాలు వెల్లడవుతున్నాయి. ఉదయం 11 గంటలకు 70 నుంచి 75 శాతం ఉంటున్న సచివాలయ ఉద్యోగుల హాజరు సాయంత్రం 5 గంటలకు 40 నుంచి 45 శాతానికి మించి ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే సాధారణ పరిపాలన శాఖ మధ్యాహ్నం 2 గంటలకే హాజరు వివరాలను సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలని, సమయపాలన పాటించని ఉద్యోగులపై కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్న సీఎస్ సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరును పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సాధారణ పరిపాలన శాఖ జారీచేసిన మెమోలో తెలిపింది. -
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి విజయం
-
గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు: బొప్పరాజు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఆవిర్భావ సభ.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఒకే సారి లక్షా 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు సచివాలయాలు ఏర్పాటు నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. -
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు వాళ్లు. సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్ ఇవాళ్టి(బుధవారం) సమావేశంలో మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. ఈ క్రమంలో.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఇదీ చదవండి: వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్ యాత్ర -
అక్టోబర్ 2న ‘సెల్యూట్ సీఎం సర్’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్‌తో కూడిన కొత్త జీతాలు వచ్చాయని, ఈరోజు తమకు శుభ దినమని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 1.30 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఇది చెరగని చరిత్ర అని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపచేయడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూగబోయాయని అన్నారు. ఇంత మందికి మంచి జరగడం సహించని వారు ఈ ఉద్యోగాలు పర్మినెంట్ కాదని, తాత్కాలికమేనని, రూ.15 వేలకు మించి జీతం పెరగదంటూ ఉద్యోగులను కించపరిచేలా అనేక అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. పేస్కేల్స్‌తో జీతం ఇవ్వడం తమకు వరమైతే కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచిందన్నారు. సీఎం మాట నిలబెట్టుకున్నారు: చంద్రశేఖర్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని సీఎం మాట ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైందని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జూలై ఒకటి నుంచి సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ ప్రకారం జీతం అందించారని కొనియాడారు. నవ చరిత్రకు నాంది: బండి శ్రీనివాసరావు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ సీఎం చేయని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశారని, నవ చరిత్రకు నాంది పలికారని తెలిపారు. ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించి యువతకు శాశ్వత భరోసా కల్పించడం గొప్ప విషయమన్నారు. తమ కలలు సాకారమైన వేళ గుండెలు నిండా అభిమానంతో ఈ సమావేశంలో పలువురు సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘సెల్యూట్ సీఎం సర్’ అంటూ నినాదాలు చేశారు. -
థాంక్యూ సీఎం సార్ అంటూ ర్యాలీ చేసిన నెల్లూరు సచివాలయ ఉద్యోగులు
-
AP: వారానికి ఐదు రోజుల పని.. మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: మీకు తెలుసా?.. చెప్పింది చేస్తే.. నష్టపోవాల్సిందే! వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
AP: ప్రొబేషన్ డిక్లరేషన్‌పై హర్షం
సాక్షి, అమరావతి/మద్దిలపాలెం: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు మరిచిపోలేమంటూ కృతజ్ఞతలు తెలియజేశాయి. ఆదివారం విశాఖలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అస్కారరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే లక్షలాది మందికి ఉద్యోగాలివ్వడం గొప్ప విషయమన్నారు. వారి సర్వీసును రెండున్నరేళ్లలోనే క్రమబద్ధీకరించడం చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువు పొడిగించాలని.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. జీవో 64ను రద్దు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్‌లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 117ను రద్దు చేయాలని టీచర్లు చేపడుతున్న ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు చెప్పారు. సంఘం నాయకులు ఎస్వీ రమణ, జవహర్లాల్, శ్రీకాంత్‌రాజు పాల్గొన్నారు. కాగా, ప్రొబేషన్ డిక్లరేషన్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
AP: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్ డిక్లేర్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లర్ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజనరెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్ఆర్ కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్, కృష్ణా భార్గవ్, సుతేజ్ తదితరులు వెంకటరామిరెడ్డి వెంటవెళ్లి సీఎం జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పిపించేలా రీ–ఆర్గనైజ్ చేసి 410 పోస్టులకు అప్‌గ్రేడ్ ప్రమోషన్ అవకాశాలు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. సర్వే డిపార్ట్మెంట్లో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారమైందన్నారు. అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలోనే డీజీపీ రాజేంద్రనా«థ్‌రెడ్డిని కలిసి మహిళా పోలీసుల సమస్యలను వివరించిందని చెప్పారు. -
AP: సమయానికి రాకపోతే ‘సెలవే’
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమ యంలోగా కార్యాలయానికి రావాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్–19 తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్ల సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ పని దినాల్లో ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి రావాలని, సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా రాని అధికారులకు, ఉద్యోగులకు ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. ఆయన ఆదేశాలు ఇవీ.. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ►ఉదయం 10 నుంచి 10.10 గంటల్లోపు తప్పనిసరిగా విధులకు హాజరవడం తోపాటు పనిచేయడం ప్రారంభించాలి ►ఉదయం 10.10 నుంచి 11 గంటల్లోపు ఆలస్యంగా హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అనుమతి. ►ఒక పూట హాజరును ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిగణిస్తారు ►ఉదయం 11 గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం 1 గంటలోపే వెళ్లిపోయినా లేదా నిర్ణీత సమయంలోగా వచ్చి మధ్యా హ్నం 1 గంటకన్నా ముందే వెళ్లిపోయినా ఒక పూట సెలవుగా పరిగణిస్తారు ►మధ్యాహ్నం 1 గంట తరువాత హాజరైతే ఆ రోజు సెలవుగా లేదా గైర్హాజరుగా పరిగణిస్తారు ►ఉదయం 10 గంటలకు హాజరై సాయంత్రం 5.30 తరువాత కార్యాలయం నుంచి వెళ్తే పూర్తి రోజు హాజరైనట్లు ►ఉద్యోగులు ముందుగా అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంవల్ల పని వాతావరణం దెబ్బతింటోంది. ఇక నుంచి సెలవుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా సెలవు పెడితే అనధికార గైర్హాజరుగా పరిగణిస్తారు. ఒక పూట సెలవు కోసం ముందస్తు సమాచారం ఇవ్వాలి. ►అధికారులు, ఉద్యోగులందరూ పనివేళ లను కచ్చితంగా పాటించాలి. క్రమశిక్షణను, పని వాతావరణాన్ని నెలకొల్పాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రావత్ స్పష్టం చేశారు. ►కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్
సాక్షి, అమరావతి: ప్రజల సౌకర్యార్థం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేయబోతుంది. మొత్తం 19 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు మినహా మిగిలిన వారికి యూనిఫామ్ అందిస్తోంది. పురుష ఉద్యోగులు లైట్ బ్లూ కలర్ చొక్కా, క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు లైట్ బ్లూ కలర్ టాప్, క్రీమ్ కలర్ పైజామా, క్రీమ్ కలర్ చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌ను యూనిఫామ్‌గా నిర్ణయించింది. ఒక్కొక్కరికి మూడు జతల కోసం 7.50 మీటర్ల చొక్కా క్లాత్, 4.05 మీటర్ల ప్యాంట్ క్లాత్‌ను.. మహిళ ఉద్యోగులకు టాప్ కోసం 7.50 మీటర్లు, పైజామాకు 7.25 మీటర్లు, చున్నీకి మరో 7.50 మీటర్ల క్లాత్‌ను పంపిణీ చేస్తున్నారు. మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు మినహా 1,00,104 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 95 వేల మందికి ఇప్పటికే యూనిఫామ్ వస్త్రాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీకల్లా మిగిలిన వారికీ అందజేస్తామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు సులభంగా గుర్తించేందుకు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, విధుల పట్ల నిబద్ధతతను పెంపొందించేందుకు యూనిఫామ్ ఉపయోగపడుతుందని, ప్రజలు కూడా వీరిని సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుందని అధికారులు వివరించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలనే ఆదేశాలను ప్రభుత్వం ఇంకా జారీ చేయలేదని.. ప్రజల సౌకర్యార్థం భవిష్యత్‌లో తప్పనిసరి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. -
త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్
నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ఇష్టంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు త్వరితగతిన ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేసి పీఆర్సీ అమలు చేయనున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. నెల్లూరులో పలువురు సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి, తమకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలంటూ స్థానిక కలెక్టరేట్లో అజయ్‌జైన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యపాలన తీసుకుని రావడంలో భాగంగా రాష్ట్రంలో ఒకే దఫా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసేందుకు లెక్కలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్ష పాసయిన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని చెప్పారు. ఎక్కువ శాఖల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జూన్‌నాటికి డిక్లేర్ చేస్తామని తెలపగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంకా ముందుగా వీలైనంత త్వరగా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంలో తప్పులేదని, విధులు బహిష్కరించి రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదని చెప్పారు. ఎవరో రెచ్చగొడితే ఇలా రోడ్డెక్కితే అంతిమంగా సచివాలయ ఉద్యోగులకే నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా విధులకు హాజరై ప్రజలకు మంచిగా సేవలందించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వందశాతం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. -
‘గ్రామ సచివాలయ ఉద్యోగులను టీడీపీ రెచ్చగొడుతోంది’
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగులను టీడీపీ రెచ్చగొడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారీగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు తప్పుడు మాటలను నమ్మే పరిస్థితి లేదని జోగి రమేష్ దుయ్యబట్టారు. చదవండి: ఏపీ నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు, మళ్లీ ఎప్పటి నుంచి అంటే? -
AP: లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు మేలు!
తల్లి గర్భంలో పురుడు పోసుకునే పిండం ఈ లోకంలోకి రావాలంటే నవమాసాలూ నిండాల్సిందే!! అమ్మకు ప్రసవ వేదన, బిడ్డకు ఆరాటం తప్పవు..ఆదుర్దా ఎంత ఉన్నా.. కాల పరీక్షలో నెగ్గాల్సిందే!! పక్వానికి వచ్చిన కాయను ముందుగానే కోసేస్తే..? చేదు అనుభవాన్ని చవిచూడక తప్పదు!! సచివాలయ ఉద్యోగుల 25 నెలల నిరీక్షణ మరి కొద్ది నెలల్లోనే ఫలించనుంది... చెప్పాలంటే నిండా ఐదు నెలలు కూడా లేవు.1.14 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ప్రొబేషన్‌లో ఉత్తీర్ణత సాధించారు. మిగతావారికీ జూన్ కల్లా పూర్తి కానుంది.. ఇంతలోనే హైరానా ఎందుకు మరి? ఒకేసారి చేరిన ఉద్యోగుల్లో అంతరాలను సృష్టించడం సబబేనా? కొంతమందికే కొత్త పే స్కేల్ వర్తింప చేయడం ఏం ధర్మం?.. బంతి భోజనంలో కొందరికి మాత్రమే వడ్డించి మిగతావారు ఆకలి కళ్లతో చూస్తుంటే బాగుంటుందా? ప్రభుత్వ ఉద్యోగికి ప్రొబేషన్, అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.. ఐఏఎస్‌లైనా ఇందుకు మినహాయింపు కాదు.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని చట్టం కూడా అనుమతించదు. రెచ్చగొట్టే వారి మాయలో పడిపోయి చిక్కుల్లో ఇరుక్కుంటే ఎవరు బాధ్యులు? సచివాలయాల వ్యవస్థ.. ముఖ్యమంత్రి మానస పుత్రిక. ఉద్యోగుల ప్రొబేషన్‌పై అధికారులకు ఆయన డెడ్‌లైన్ విధించారు. ఇందుకు విరుద్ధంగా వెళ్లే అవకాశమే లేదు.. అలాంటప్పుడు మరి కొద్ది నెలల్లో ముగిసే ప్రక్రియకు ఆదుర్దా ఎందుకు? సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు స్థాయిలో ఒకేసారి కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యంతోపాటు పరిపాలనను పల్లె ముంగిటికే తెచ్చారు. ఉద్యోగుల్లో భేద భావాలు తలెత్తకుండా అందరి మేలును కాంక్షిస్తూ, ఒకేసారి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రొబేషనరీపై నిర్ణయం తీసుకున్నారు. కొందరిలో మాత్రమే సంతోషాన్ని నింపి మిగతావారిని నిరాశకు గురి చేయకుండా ఒకేసారి విధుల్లో చేరిన వారంతా సంతృప్తి చెందాలనే ప్రభుత్వం భావిస్తోంది. ఒకరిద్దరికి మాత్రమే కాకుండా.. ఒకే సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరిద్దరు మాత్రమే కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు తీసుకుంటూ మిగతా నలుగురు ప్రొబేషనరీ పూర్తి కాక మనోవ్యధకు గురి కారాదనే జూన్‌కల్లా అందరికీ ప్రొబేషనరీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రొబేషన్ తరువాత వెంటనే ఇతర ఫార్మాలిటీస్, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి కొత్త పే స్కేల్ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే కొన్ని శక్తులు సచివాలయాల ఉద్యోగులను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి 1.34 లక్షల ఉద్యోగాలను కల్పించింది. విద్యుత్ అసిస్టెంట్ ఉద్యోగులు కాకుండా 1,14,092 మంది సచివాలయాల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు 60,385 మంది ఉద్యోగ ప్రావీణ్యతపై శాఖాపరంగా నిర్వహించే అంతర్గత (డిపార్ట్మెంట్) పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఏఎస్ అధికారులు మొదలు ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగి వరకు డిపార్ట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే విధానం ఉంది. 2019లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ప్రకారమే సచివాలయాల ఉద్యోగులు అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు వారిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవంటూ పోలీసుల ద్వారా ఆయా శాఖలు అంతర్గతంగా తెప్పించుకునే యాంటిసిడెంట్ నివేదిక కీలకం. మిగిలిన వారూ అర్హత సాధించేలా.. కుగ్రామాల్లో నివసించే ప్రజలు సైతం సొంతూరి దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశంలోనే వినూత్నంగా సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో సచివాలయాల భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. తన మానస పుత్రిక లాంటి సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరూ ఒకేసారి ప్రొబేషనరీకి అర్హత జూన్ కల్లా సాధించేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 14 వేల మందికి పైగా ఉన్న మహిళా పోలీసులకు డిపార్ట్మెంట్ పరంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మిగిలిన కేటగిరీలోనూ గతంలో డిపార్ట్మెంట్ పరీక్షలు రాయని వారు, రాసినా ఉత్తీర్ణులు కానివారికి మరో విడత నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియ జూన్ కల్లా పూర్తై మరింత ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం ఉందని వెల్లడించారు. మళ్లీ ఆ శక్తుల పనే!? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును ఆదినుంచి వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ప్రొబేషనరీని బూచిగా చూపిస్తూ రెచ్చగొడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వలంటీర్లను కూడా గౌరవ వేతనాలపై రెచ్చగొట్టిన ఉదంతాన్ని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు విపక్ష టీడీపీ నిరుద్యోగ యువతలో అపోహలు రేకెత్తించేలా దుష్ప్రచారానికి దిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో 19.20 లక్షల మంది నిరుద్యోగులు అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు తావు లేకుండా ఇంటర్వ్యూలు కాకుండా రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టినప్పుడు కూడా టీడీపీ తప్పుడు ప్రచారానికి పాల్పడింది. ఇప్పుడు కూడా అదృశ్య శక్తులు సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై క్షుణ్నంగా విచారణ జరపాలని కొందరు అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. -
సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ ప్రకటనపై గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన, అపోహలకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ అని, అందులో పనిచేసే ఉద్యోగులపై ఆయనకు ఎంతో అభిమానం ఉందని చెప్పారు. శనివారం విజయవాడలోని ఎన్జీఓ హోమ్‌లో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైందని చెప్పారు. దీన్ని చూసి పలు రాష్ట్రాలు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్‌లోపు పూర్తి చేసి జులై నుంచి పే స్కేల్స్ ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. కొందరు ఉద్యోగులు గత అక్టోబర్ 2 నుంచే పే స్కేల్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారంతా సంయమనం పాటించాలని కోరారు. అందరికీ ఒకేసారి ప్రొబేషన్ ప్రకటించి, ఆ తర్వాత పే స్కేల్స్ అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 23 శాతం ఫిట్మెంట్ వల్ల జీతాలు తగ్గుతాయనే ప్రచారం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం గొప్ప విషయమని తెలిపారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు: జానీ బాషా గ్రామ సచివాలయ ఉద్యోగులెవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా చెప్పారు. ప్రొబేషన్‌పై సీఎం న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అన్నారని, వారిని పీఆర్సీలో చేర్చడం ద్వారా ఇలాంటి అనుమానాలు పోయాయని తెలిపారు. -
క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌లో వెసులుబాటు
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, డైరెక్టర్ షాన్‌మోహన్‌లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్‌జైన్ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్‌డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్ చార్టు రూపొందించని సెరికల్చర్ అసిస్టెంట్ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు భేటీ.. ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్‌జైన్ చెప్పారు. ప్రమోషన్ చానల్‌పై స్పష్టత కోరాం ఉద్యోగుల ప్రమోషన్ చానల్‌ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క ల్పించాలని కోరామన్నారు. -
ఆంధ్రప్రదేశ్ ‘సచివాలయ’ ఉద్యోగులకు బొనాంజా..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ ప్రకటించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని.. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ పీఆర్సీ ‘సచివాలయా’ల ఉద్యోగులకు వర్తించే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ సమయంలో వారిని వదిలి వేయడం సబబు కాదన్న ఉద్దేశంతో తుదకు ఆయా ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ సిఫార్సులను వర్తింపజేయాలన్న ప్రతిపాదన చేస్తున్నట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రొబేషనరీ ప్రకటన అనంతరం ‘సచివాలయ’ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 1,800 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో వివరించింది. 19 రకాల క్యాడర్ ఉద్యోగులకు రెండు రకాల పే స్కేల్ నిర్ణయం... ► గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. ► గ్రామ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రేడ్–2 అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్‌ర్ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. (చదవండి: ఆర్టీసీలో అదృష్టవంతులు) ► వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్–డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వెల్ఫ్‌ర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. (చదవండి: ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు) సలాం సీఎం సర్ 11వ పీఆర్సీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానం కల్పించడం అత్యంత గొప్ప విషయం. రూ.1,800 కోట్ల ఆర్థిక భారాన్ని సైతం ఖాతరు చేయకుండా ఉద్యోగులకు మేలు చేయాలన్న ఆలోచన చరిత్రాత్మకం. సీఎం జగన్ 15,004 సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి జీవితంలో మరువలేని మేలు చేశారు. సచివాలయ ఉద్యోగులపై చిన్నచూపు చూసిన రాజకీయ పక్షాలకు ప్రభుత్వ ప్రకటన చెంపపెట్టు. ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని సచివాలయ ఉద్యోగులు నిలబెట్టుకుంటారు. – ఎండీ జానీపాషా, అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ -
ఏపీ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు
సాక్షి, విజయవాడ: ప్రజాపాలనలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిందని గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్రంలో 3.2 కోట్ల మందికి సేవలు అందించిన సచివాలయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు కొత్త నిర్వచనంగా నిలిచాయని తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్లలోనే 15,004 సచివాలయల ద్వారా 543సేవలు, 34సంక్షేమ పథకాల అమలవుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయాలు పని తీరును ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. చదవండి: ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ 99శాతం సేవలను సీఎం వైఎస్ జగన్ చెప్పిన సమయంలోనే అందిస్తున్నామని అన్నారు. త్వరలో సచివాలయంలో 150 కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. 500 సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభించామని తెలిపారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలో ప్రారంభిస్తామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ వ్యవస్థను పరిశీలించాయని అజయ్ జైన్ తెలిపారు. -
‘సచివాలయ’ సిబ్బంది వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: వచ్చే అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తయినట్లు ప్రకటించేందుకు జిల్లాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారి వివరాలతో పాటు వారి పోలీసు వెరిఫికేషన్, డిపార్ట్మెంట్ టెస్ట్ ఉత్తీర్ణత వివరాలను సిద్ధం చేసుకుని వాటిని నిర్ణీత ఫార్మాట్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తెలియజేయాలని అజయ్ జైన్ కలెక్టర్లను కోరారు. -
‘కేసీఆర్ ఆదేశాలను సీఎస్ పట్టించుకోవడం లేదు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్కే భవన్లో సీఎస్ చాంబర్ ముందు ఉద్యోగులు గురువారం ఆందోళన నిర్వహించారు. సచివాలయంలో తమకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కసారి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను సీఎస్ పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సచివాలయ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఇవీ చదవండి: గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. -
వార్డు సచివాలయానికి మారు వేషంలో డిప్యూటీ కలెక్టర్
చిత్తూరు అర్బన్(చిత్తూరు జిల్లా): ఓ మహిళ శనివారం ఉదయం చిత్తూరులోని 36వ వార్డు సచివాలయంలో అడుగుపెట్టింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వద్దకు వెళ్లి తనకు సొంతిల్లు లేదని వాపోయింది. ఏడాది కిందట తిరుపతి నుంచి చిత్తూరుకు వచ్చానని తెలిపింది. దరఖాస్తు చేసి.. ఇల్లు మంజూరు చేయించాలని కోరింది. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సచివాలయానికి రావడంతో విషయం బయటపడింది. తమ ముందు నిల్చొని ఉన్నది డిప్యూటీ కలెక్టర్, గృహ నిర్మాణ ప్రత్యేకాధికారి పల్లవి అని తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు అవాక్కయ్యారు. చిత్తూరు డివిజన్ గృహ నిర్మాణ ప్రత్యేకాధికారిగా ఉన్న పల్లవి.. లక్ష్యం మేరకు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలని ఇటీవల ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు సామాన్యురాలిగా శనివారం ఆమె రంగంలోకి దిగారు. 36వ వార్డు సచివాలయానికి వెళ్లి.. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ అనే విషయం బయటపడిన తర్వాత.. సచివాలయంలోని రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రజలకు సొంతిళ్లు నిర్మించడమే లక్ష్యంగా పని చేయాలని వారిని ఆదేశించారు. -
ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖలోని సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే అభియోగంపై ఆ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులైన శ్రీనుబాబు, వరప్రసాద్‌తో సహా అసిస్టెంట్ కార్యదర్శి వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
మాస్క్ ధరించమన్నందుకు దాడి, సెల్‌ఫోన్ ధ్వంసం
తిరుపతి తుడా: మాస్కులు ధరించకపోవడంతో రూ.100 జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో కొందరు సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక అమెరికన్ బార్ సమీపంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దాడిలో పగిలిపోయిన ప్రభుత్వ ఫోన్ తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కమిషనర్ గిరీషా ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది రంగంలోకి దిగారు. మాస్కులు లేకుండా ముగ్గురు ప్రజల మధ్య తిరుగుతుండడం గుర్తించి మాస్కు ధరించాలని సచివాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో రూ.100 జరిమానా విధిస్తామని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంమత్తులో ఉన్న వారు సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్పై దాడి చేశారు. జరిమానా విధించే ప్రభుత్వ మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. శానిటరీ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధితులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదు: సజ్జల
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని.. అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు. డిపార్ట్మెంట్ టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. -
‘సచివాలయ’ ఉద్యోగులకు రాత పరీక్ష!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల తొలి బ్యాచ్ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీకి రెండేళ్ల సర్వీసు పూర్తవుతోంది. నిబంధనల ప్రకారం వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేలు అమలు చేయనున్నారు. దీనికి ముందు వారికి శాఖ పరంగా æక్రెడిట్ బేస్ అసెస్మెంట్ పరీక్షను సెప్టెంబర్ 11 – 17 తేదీల మధ్య ఒక రోజు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. 90 నిమిషాల్లో వంద ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, నాలుగు నెలల్లోనే వాటి భర్తీ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. వీరిలో 1.21 లక్షల మంది 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో తొలి బ్యాచ్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు శాఖలవారీగా సిలబస్‌ను నిర్ధారించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆయా శాఖలకు శుక్రవారం లేఖలు రాశారు. ఏవైనా శాఖలు 65 ప్రశ్నల కేటగిరీలో రాతపరీక్షకు బదులు కేవలం ప్రాక్టికల్స్ నిర్వహించాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల వెల్లడి బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్టు అజయ్‌జైన్ పేర్కొన్నారు. -
ఏడు వ్యాక్సిన్ వయల్స్ స్వాధీనం
నరసరావుపేట: ఓ ఆర్ఎంపీ వైద్యుడు కరోనా వ్యాక్సిన్లను అనధికారికంగా సంపాదించి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులు శనివారం దాడి చేసి ఏడు వ్యాక్సిన్ వయల్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఉదంతం జరిగింది. నరసరావుపేట వన్‌టౌన్ సీఐ కె.ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అరండల్‌పేటకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కె.శ్రీను కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు నిఘా వేసి, అరండల్‌పేటలోని ఓ ఇంట్లో దాచిన ఏడు వ్యాక్సిన్ వయల్స్ అంటే డెబ్బై డోసుల వ్యాక్సిన్లను పట్టుకున్నారు. ఖాళీగా ఉన్న మరో ఐదు వయల్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు పరారీ కాగా, అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో డోస్‌ను రూ.2 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ కె.ప్రభాకరరావు ఆ వ్యాక్సిన్లను స్వాదీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
రాజ్యసభ సచివాలయ ఉద్యోగులకు నివాసాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాల నిర్మాణానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం ఆన్లైన్ వేదిక ద్వారా శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం సెక్టార్-12లో రూ.46 కోట్లతో ఈ నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. 2003లోనే విలువైన ఈ స్థలాన్ని రాజ్యసభ సచివాలయానికి కేటాయించినప్పటికీ ఆ తర్వాత వివిధ అడ్డంకుల కారణంగా ఆలస్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల విషయంలో తీవ్ర కొరత ఉందన్న ఆయన, రెండేళ్ళుగా ఈ అంశం మీద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పురి సహా, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో విస్తృత సమావేశాల తర్వాత ఈ అంశం కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఈ విషయం మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా మాట్లాడామన్నారు. (రాహుల్‌తో భేటీ.. సొంతగూటికి పైలట్?!) టైప్ -3, టైప్ -4 క్వార్టర్ల కొరత తీవ్రంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, ఆర్కేపురం నిర్మాణ సముదాయంలో మొదటి దశలోనే ఈ తరహాకు చెందిన 32 క్వార్టర్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కార్యాలయానికి దగ్గరగా గృహనిర్మాణం వల్ల ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబరిచే దిశగా ప్రేరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. నాటి పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్ – 2016ను అమలు చేయడంలో తీసుకున్న చొరవను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి మరిన్ని గృహాల నిర్మాణానికి చేయూతనివ్వాలని పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి సూచించారు. దీని అమలులో భాగస్వాములందరు తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. (ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్) శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ... రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల కొరత తీర్చేందుకు, మూడేళ్లలో ఈ నివాస సముదాయ నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ‘రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు ఈ గృహ సముదాయ నిర్మాణం కోసం తీసుకున్న చొరవ, చేపట్టిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ కారణంగానే సమస్యలు చాలావరకూ తొలగి, ఇవాళ ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైందని కేంద్రమంత్రి తెలిపారు. (ప్లాస్మా దానం చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం) పట్టణ ప్రాంతాల్లో అందరికీ నివాస గృహాలు అందించాలన్న లక్ష్యంతో 2016లో ప్రారంభించిన హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్ కింద ఇప్పటికే 1.07 కోట్ల నివాస గృహాల మంజూరు జరిగిందని, ఇప్పటికే లక్ష ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనం చేశామని, మరో 65 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 1.12 కోట్ల నివాస గృహా మంజూరు లక్ష్యాన్ని 2022 కంటే ముందుగానే చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ, కార్యదర్శి డాక్టర్ పీపీకే రామాచార్యులు, ఎన్బీసీసీ సీఎండీ పీకే గుప్తా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ,రాజ్యసభ సచివాలయ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
తరలింపును సంఘాలేవీ వ్యతిరేకించట్లేదు
సాక్షి, అమరావతి: పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని ఏ ఉద్యోగుల సంఘమూ వ్యతిరేకించడం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవన్నారు. ప్రజల్లో తమ సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తూ సమితి పిటిషన్ దాఖలు చేసిందన్నారు. రాజధాని తరలింపు వల్ల ఖజానాపై రూ.5,116 కోట్ల మేర భారం పడుతుందన్న వాదనలో వాస్తవం లేదని, ఇందులో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ మంగళవారం అనుబంధ పిటిషన్ వేశారు. ఆ వివరాలివీ... మాకెలాంటి ఆశ చూపలేదు... ► పలు ప్రయోజనాలను ఆశగా చూపి తరలింపు విషయంలో పురపాలకశాఖ ఉద్యోగులను ఒప్పించినట్లు అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్లో పేర్కొనటాన్ని ఖండిస్తున్నాం. విశాఖకు తరలింపు విషయంలో ప్రభుత్వం మాకెలాంటి ప్రయోజనాలను ఆశగా చూపలేదు. ఈ ఏడాది మార్చి 18న జరిగిన ఉద్యోగుల సంఘం సమావేశంలో తరలింపు ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉంటుంది? పిల్లల చదువులపై చర్చ జరిగింది. తరలిం పుపై ప్రభుత్వం మాకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమితి పేర్కొనడం అబద్ధం. ఇళ్ల స్థలాలు ఆనవాయితీ.... ► ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై రూ.5,116 కోట్ల భారం పడుతుందన్న సమితి ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడమే. రూ.2 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినందునే ఉద్యోగులు తరలింపుపై అంగీకరించారని సమితి మాపై ఆరోపణలు చేసింది. కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనవాయితీ. గత సర్కారు అమరావతిలో ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు 500 గజాల చొప్పున స్థలం ఇచ్చింది. రూ.70 కోట్లకు మించదు... ► ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూ.25 లక్షలను రుణంగా ఇవ్వడం వల్ల రూ.2,500 కోట్లు నష్టం వాటిల్లుతుందంటూ అమరావతి పరిరక్షణ సమితి తన పిటిషన్లో అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చింది. సర్వీసును బట్టి ప్రతి ఉద్యోగి గరిష్టంగా రూ.12 లక్షల గృహ రుణం పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులు జీతభత్యాల్లో ఇది భాగం. ఉద్యోగి బదిలీ అయినప్పుడు రవాణా, షిఫ్టింగ్ భత్యం ఇస్తారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం కూడా చెల్లించింది. తరలింపు ఖర్చు రూ.70 కోట్లకు మించదు. ► గత ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో భాగంగా 62 ప్రాజెక్టుల కోసం రూ.52,837 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించిందని సమితి చెబుతోంది. రూ.11 వేల కోట్లతో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది. 20 శాతం నిధులతో 70 శాతం పనులను పూర్తి చేశామని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. -
హైదరాబాద్ నుంచి ఏపీకి సచివాలయ ఉద్యోగులు
-
సచివాలయ ఉద్యోగులకు రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరు కార్యాలయ పనివేళలకు ముందుగానే తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తమ పరిధిలో పర్యటించి ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలతో పాటు ఇతర సేవలన్నీ వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందించే లక్ష్యంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జాబ్ చార్ట్‌లను కూడా రూపొందించింది. జాబ్ చార్ట్ ఇలా... - క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య పనులు, పారిశుధ్య కార్మికుల హాజరు, పనితీరును పరిశీలించాలి. - మంచినీటి సరఫరా, వీధిలైట్ల పనితీరు, స్పందనలో అందిన వినతులు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. - క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలపై మధ్యాహ్నం నుంచి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ వివరాలతో పాటు వలంటీర్ల పనితీరు గురించి తెలుసుకోవాలి. - ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉద్యోగులు సచివాలయ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి. - ఉద్యోగులు రోజువారీ డైరీని నిర్వహించాలి. - ఉద్యోగులంతా పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు హాజరవ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. - నవరత్నాలతోపాటు ఇతర సేవలను ప్రజల ముంగిటకు సమర్థంగా, సకాలంలో చేర్చడంపై గ్రామ సచివాలయం దృష్టి సారించాలి. - నవరత్నాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అభ్యర్థనలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలి. - ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి. - 1956 కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. - తూనికలు, కొలతల్లో అక్రమాలను నిరోధించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, దశలవారీగా మద్యనిషేధం, గృహ హింస చట్టం అమలుకు కృషి చేయాలి. - వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీపై సమీక్షించాలి. - లే అవుట్లు, తాగునీటి కనెక్షన్లు, వ్యాపార లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను తనిఖీ చేయాలి. -
ఇన్సైడర్ కిరికిరిలో దొరికిపోయి మాటలా..!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 'రాజధాని ప్రాంతంలో జరుగుతోన్న పరిణామాలకు నిరసనగా తన కుటుంబం ఈ సారి సంక్రాంతి పండుగ చేసుకోదని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపునే సంప్రదాయం తమ కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచించాడు. ఇన్ సైడర్ కిరికిరిలో దొరికిపోయి ఈసారి పండగ బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోందని' విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరం’ మరో ట్వీట్లో సచివాలయం ఉద్యోగులు సంక్రాంతి సెలవులు తీసుకోకుండా విధుల్లోకి రావాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 'చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడు. తన స్వార్థం కోసం, బినామీల కోసం అందరూ వీధుల్లోకి రావాలట. నేను పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇళ్లలో కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడేమో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆస్తుల ధర పడిపోకుండా అంతా అడ్డం నిల్చోవాలట' అంటూ ఎద్దేవా చేశారు. -
ఏపీ సచివాలయానికి సంక్రాంతి సంబరాలు
-
ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు, హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల నృత్యాలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. సచివాలయానికి మరింత సంక్రాంతి శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘనంగా సంబరాలు జరుపుకున్నామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి ముందుగానే వచ్చిందని.. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’
నరసన్నపేట (శ్రీకాకుళం): తన పొలంలో మురుగు కాలువ నిర్మించినందుకు చాలా కాలంగా అభ్యం తరం చెబుతున్న ఓ రైతు మహిళ పంచాయతీ కార్యదర్శిని చంపేసి తానూ చచ్చిపోతానని బెదిరించాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసు కునే ప్రయత్నం చేయడంతో రైతు భరోసా గ్రామ సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మం డలం దూకలపాడులో బుధవారం వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకొచ్చిన అల్లు జగన్మోహనరావు అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా.. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా’ అంటూ దూషించాడు. ‘నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తా.. నేనూ పెట్రోల్ పోసుకుంటా’ అంటూ బ్యాగ్‌లోంచి పెట్రోల్ బాటిల్ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్ పడింది. అగ్గిపుల్ల తీయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో మహిళా అధికారులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్షించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫోన్లో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి అధైర్యపడవద్దని చెప్పారు. నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
సచివాలయ ఉద్యోగులకు రేపు నియామక పత్రాలు
సాక్షి, అమరావతి: పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్తారు. తిరుపతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
30న సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు
సాక్షి, అమరావతి: సచివాలయాల ఉద్యోగులకు 30న అపాయిమెంట్ ఆర్డర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తారని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వార్డు సచివాలయాల్లో 10 మంది ఉద్యోగులు ఉంటారని.. గ్రామ,వార్డు సచివాలయాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రజా పాలన సచివాలయాల ద్వారానే జరుగుతుందన్నారు. అక్టోబర్ 2 నుంచి సచివాలయాల్లో పౌరసేవలు అందిస్తామని తెలిపారు. 72 గంటల్లో పూర్తయ్యే 10 సేవలను తక్షణమే అమలు చేస్తామన్నారు. తర్వాత ఆ సేవలను పెంచుకుంటూ వెళ్తామన్నారు. పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు 72 గంటల్లో ఇస్తామని వెల్లడించారు. డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలు వెంటనే ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతీరోజు వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, పింఛన్లు, ఫీజు రియింబర్స్‌మెంట్ తదితర పథకాలను సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని తెలిపారు -
ఉద్యోగులకు సీఎం వరాల జల్లు
నెల్లూరు(పొగతోట): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లుకురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (ఇంటెరిమ్ రిలీఫ్) ఇస్తామని సీఎం ప్రకటించారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. సోమవారం అమరావతిలో జరిగే కేబినెట్లో 27 శాతం ఐఆర్, సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దుపై నిర్ణయం తీసుకుంటారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు, ఉద్యోగులందరికీ నివాసస్థలాలు కేటాయింపు అమలు చేస్తే సీఎం జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు అమలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు తిరుగు ఉండబోదని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ సకాలంలో ప్రకటించలేదు. ప్రతి ఐదేళ్లకు ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం 2018 జూలై నుంచి ఐఆర్ అమలు చేయాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు మాజీ సీఎం చంద్రబాబునాయుడు 20 శాతం ఐఆర్ ప్రకటించాడు. ప్రకటించిన 20 శాతం ఐఆర్ వచ్చే నెల నుంచి అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నూతన సీఎం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించి అమలు చేసేలా నేడు కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఐదేళ్లుగా ఉద్యోగుల పోరాటం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయమని ఉద్యోగులు ఐదేళ్ల నుంచి పోరాటాలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే సీపీఎస్ రద్దుపై నిర్ణయం ప్రకటిస్తామని ఉద్యోగులకు తెలియజేశారు. ప్రభుత్వ శాఖల్లో వందల మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి కాంట్రాక్Šట ఉద్యోగులకు పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీలైనంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచేలా నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాస స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. -
కారు బోల్తా.. ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి
సాక్షి, కోదాడ: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆరుగురు ఏపీ సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారం సెలవులు ముగించుకుని.. సోమవారం విధులకు హాజరుకావడానికి అమరావతికి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కోదాడ మండలం దొరకుంట వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు రోడ్డు దిగి దాదాపు 50 మీటర్లు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులను భాస్కర్ రావు, హరికృష్ణలుగా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కోదాడలోని విజయ హాస్పిటల్‌కు తరలించారు. మరో ఉద్యోగి విజయలక్ష్మీ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైఎస్ జగన్ సంతాపం.. రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగులు మృతిచెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభా కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ సచివాలయ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. -
ఆ జీవో నిజం కాకపోతే ఈ వేధింపులేంటి?
-
ఆ జీవో నిజం కాకపోతే ఈ వేధింపులేంటి?
ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించే ఆలోచనే లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ముసాయిదా జీవో పత్రం రూపొందించ లేదని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇదివరకు స్పష్టీకరించారు. ఇదే నిజమైతే ఈ ముసాయిదా జీవో పత్రాన్ని లీకు చేశారని, దొంగిలించారని ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు ఎలా వేశారు? అంటే ముసాయిదా జీవోను రూపొందించినట్లు ప్రభుత్వం అంగీకరించినట్లే కదా? సీఎం, మంత్రి అబద్ధాలు చెప్పారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – ఉద్యోగ వర్గాల డిమాండ్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ పెద్దల అసహనం పెరిగిపోతోంది. తమకు నచ్చని పని చేసే వారిని టార్గెట్ చేస్తూ వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ సచివాలయంలో వారం క్రితం ఓ ఉద్యోగిపై, తాజాగా మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తమకు సరిపడని అధికారులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడున్నరేళ్లలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. సీఎంకు బంధువైన ఎంవీఎస్ మూర్తికి చెందిన గీతం మెడికల్ కాలేజీకి డీమ్డ్ హోదా ఇవ్వడానికి నిరాకరించారనే నెపంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను యువజన సర్వీసు శాఖకు ప్రభుత్వం మార్చేసింది. పురపాలక శాఖలో పనిచేస్తున్న ఎ.గిరిధర్ కూడా ప్రభుత్వ ఒత్తిళ్లను భరించలేక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆర్థిక శాఖలో పని చేస్తున్న సీనియర్ అధికారి పి.వి.రమేష్‌ను ఉద్దేశ పూర్వకంగా అటవీ శాఖకు పంపడంతో ఆయన కూడా ఢిల్లీ బాట పట్టారు. విశాఖ భూ కుంభకోణాలకు అనుకూలంగా వ్యవహరిం చలేక, ముఖ్య నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అప్పటి కలెక్టర్ యువరాజ్, లవ్ అగర్వాల్, ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు రాష్ట్రాన్ని వీడి కేంద్ర సర్వీసులకు వెళ్లిన వారే. కొన్ని నెలల కిందట సుమితాదావ్రా కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆమె పట్ల మంత్రి అనుచితంగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయారు. ఇక్కడి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేకే ఆంధ్రప్రదేశ్‌ను వీడుతున్నట్లు వీరు ఆయా సందర్భాలలో వెల్లడించిన విషయం విదితమే. సివిల్ సర్వీసులకు చెందిన అధికారులే కాకుండా తహశీల్దారు స్థాయి అధికారులను కూడా ప్రభుత్వ ముఖ్యులు, అధికార టీడీపీకి చెందిన నేతలు వదలడంలేదు. తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షి అంశమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కార్యదర్శి ఎన్.బాలసుబ్రమణ్యంపై విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులు దాదాపు దాడి చేసినంత పని చేశారు. దుర్భాషలాడారు. ఈ పరంపరలో రిటైర్ అవుతున్న అధికారులనూ వదలడం లేదనేందుకు భన్వర్‌లాల్ ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని తగ్గించడానికి జరుగుతున్న లోగుట్టు ప్రయత్నాలు బట్టబయలు కావడాన్ని సాకుగా చూపుతూ ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై వేటు వేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రతిపాదనే లేకపోతే దానిని ఎలా దొంగిలిస్తా ‘ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించే ముసాయిదా జీవో ప్రతిపాదనే లేదని ప్రభుత్వం చెప్పింది. అలాంటపుడు ఆ జీవో ప్రతులను దొంగిలించానని నాపై ఆరోపణలు మోపుతూ నన్ను సస్పెండ్ చేయడం ఎంత వరకు న్యాయం? ఒక ఉన్నతాధికారి అహాన్ని సంతృప్తి పరిచేందుకు మాపై సస్పెన్షన్ వేటు వేశారు. నిజాలు విచారణలో తేలుతాయి. ఈ సస్పెన్షన్ల వ్యవహారాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ దృష్టికి తీసుకెళ్లాము. ఇప్పటికైతే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. రెండు రోజుల్లో వారి స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపడతాం’ అని వెంకట్రామిరెడ్డి మీడియాకు వివరించారు. ముసాయిదా జీవోను పత్రికలకు చేరవేశారట ఉద్యోగులను 50 సంవత్సరాలకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ వారం క్రితం న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను న్యాయశాఖ కార్యదర్శి సస్పెన్షన్ చేయడం మరవక ముందే బుధవారం జలవనరుల శాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డిని ఆదే కారణంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సస్పెండ్ చేస్తూ ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ముసాయిదా జీవో (విజిలెన్స్ ఫైల్) సమాచారాన్ని దొంగిలించి పత్రికలకు చేరవేశారని వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగులందరూ వెంకట్రామిరెడ్డికి బాసటగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం ఒక పక్క రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుండగా, మరో పక్క సచివాలయం మూడో బ్లాకు వద్ద ఉద్యోగులందరూ సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉద్యోగులు మండిపడ్డారు. -
సచివాలయమా..బిగ్‌బాస్‌షోనా
-
బాత్రూమ్లలో తప్ప అన్ని చోట్లా కెమెరాలు
సాక్షి, అమరావతి: సచివాలయ అధికారులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది. బాత్రూమ్లు మినహా కారిడార్లు, ఉద్యోగులు పనిచేసే క్యాబిన్లు, క్యాంటీన్లు.. చివరకు కంప్యూటర్లలో సైతం కెమెరాలు అమర్చారు. ఎటు కదిలినా కెమెరాలు వెంటాడుతుండటంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తప్పులేదు గానీ.. తమను అవమానించేలా ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టడమేమిటని మండిపడుతున్నారు. కంప్యూటర్లలో సైతం మైక్రో కెమెరాలు ఏర్పాటు చేశారని.. దీంతో పక్కనున్న సహ ఉద్యోగులతో మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం ఇంత అనుమానంతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. తమ ప్రతి కదలికపైనా నిఘా పెట్టడం దారుణమన్నారు. సచివాలయమా.. బిగ్‌బాస్’ షోనా! ఇది సచివాలయమా ‘బిగ్‌బాస్’షోనా అని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 60 కెమెరాలైతే ఇక్కడ ఏకంగా 240 కెమెరాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కంప్యూటర్లలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ప్రశాంతంగా ఎలా పనిచేయగలమని ప్రశ్నించారు. ఏ అధికారి వద్దకు.. ఎవరు వచ్చి వెళ్తున్నారనే వివరాలను తెలుసుకునే రీతిలో కెమెరాల ఏర్పాటు చేశారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలకు ముందు మారిన మనిషినని చంద్రబాబు పదేపదే చెప్తే సంతోషించామని, కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు పేరుతో ఉద్యోగుల పనితీరు పట్టించుకోకుండా.. హాజరు మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. తాము సమయంతో సంబంధం లేకుండా పనిచేస్తామని, ఇప్పుడు ఈ–ఆఫీస్ వల్ల సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అలాంటి తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబుకు మొదట్నుంచీ ఉద్యోగులంటే ద్వేష భావం ఉందని.. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులను వేధించడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు డీఏ ఇవ్వకుండా ఏడిపించేవారని, ఇప్పుడు డీఏలు ప్రకటించి.. ఆ తర్వాత పెండింగ్‌లో పెట్టి తమతో ఆడుకుంటున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు 50 ఏళ్లకే బలవంతంగా పదవీ విరమణ చేయించి ఇంటికి పంపించే చర్యలు కూడా చేపట్టారని వాపోయారు. -
తోపులాట..
సచివాలయంలో సెక్రటేరియట్ ఉద్యోగులు– టీఎన్జీవోల బాహాబాహీ సాక్షి, హైదరాబాద్: రోజు మాదిరిగానే సచివాలయంలో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా అరుపులు వినపడటంతో ఉద్యోగులు బయటకొచ్చి జరిగింది చూసి ముక్కన వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల క్రితం ఏపీ స్థానికత ఉన్న 24 మంది సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. వారిని ఏపీ ప్రభుత్వం చేర్చుకోకపోవడంతో తిరిగి తెలంగాణకు వచ్చే ప్రయత్నంలో ఉన్న ఆ ఆఫీసర్లతో సచివాలయం లో టీఎన్జీవోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమకు తెలియకుండా సచివాలయంలో ఎలా సమావేశమవు తారంటూ టీఎన్జీవోల మీటింగ్‌ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. తెలం గాణ సచివాలయ ఉద్యోగుల నేత ప్రోద్బలంతోనే ఏపీ అధికారులు దొడ్డిదారిలో తిరిగి రాష్ట్ర సచివాలయం లో చేరేందుకు పావులు కదుపుతున్నారని, అందుకే తమ మీటింగ్‌ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నా రని టీఎన్జీవో నేతలు ఆరోపించారు. దీనిపై పరస్పరం ఇరు వర్గాలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ çఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ కోరారు. -
గణతంత్రమా....స్వాతంత్య్ర దినోత్సవమా..?
జీఏడీ ఆదేశాలపై ఉద్యోగుల విస్మయం సాక్షి, అమరావతి: జనవరి 26న గణతంత్ర దినోత్సవమని...ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవమని ఊహ తెలిసిన ప్రతి ఒక్కరు ఇట్టే చెబుతారు. కానీ..రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ (ప్రొటోకాల్ విభాగం) అధికారులకు ఈ రెండింటికీ మధ్య తేడాలు తెలియకపోవడం పలువురి ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జనవరి 26న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలకు హాజరు కావాలంటూ ఆశాఖ అధికారులు బుధవారం అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం..గణతంత్ర దినోత్సవాల మధ్య తేడా తెలియని సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) అధికారుల తీరుపై పలువురు ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
7,810 మంది ఉద్యోగులు రావాల్సి ఉంది
-ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తుళ్లూరు(గుంటూరు జిల్లా) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాల్సిన ఉద్యోగులు 7810 మంది ఉన్నారని, వారు కాకుండా ఒక్క సచివాలయం ఉద్యోగులే 2000 మంది ఉన్నారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. సోమవారం కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా ఉద్యోగాలు చేయాలని, సచివాలయంలో పనులు పూర్తిచేసి ఉద్యోగులు విధులు నిర్వహించుకునే వీలు కల్పిస్తే ఇక్కడినుంచి పాలన చేయడానికి వెనుకాడబోమని చెప్పారు. ఈ మేరకు తాత్కాలిక సచివాలయంలో ఇంకా ఏర్పాట్లు పూర్తికావాల్సి ఉందని వివరించారు. ప్రభుత్వం కూడా వేగవంతంగా పనులు పూర్తిచేసే విధంగానే ముందుకెళుతుందని తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ కూడా వ్యక్తం చేశారు. -
ముంచుకొస్తున్న ముహూర్తం
* పూర్తికాని తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు * పలుచోట్ల కుంగిన ఫ్లోరింగ్.. ఉద్యోగుల్లో ఆందోళన సాక్షి,అమరావతి: సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌నుంచి అమరావతి తరలివచ్చేందుకు ముఖ్యమంత్రి పెట్టిన ముహూర్తం ముంచుకొస్తోంది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వేలాదిమంది కూలీలతో రేయింబవళ్లు పనిచేయిస్తున్నా 27నాటికి పూర్తయ్యేలా కనిపించడంలేదు. మరోవైపు తాత్కాలిక సచివాలయం ఆరు బ్లాకుల్లో రెండు భవనాల్లో ఫ్లోరింగ్ కుంగిపోవడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న మందడం గ్రామంలో ఓ భవనం కుంగితే యజమాని దాన్ని జాకీలతో పైకిలేపి అత్యాధునిక పద్ధతులతో అడుగు భాగాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు కుంగడం సచివాలయ ఉద్యోగుల్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. నాలుగో బ్లాక్‌లో ఫ్లోరింగ్ కుంగడంతో దాన్ని పగులగొట్టి పునర్నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని అధికారులు, ఇంజినీర్లు ధ్రువీకరించకపోయినా అక్కడ పనిచేసే కూలీలు మాత్రం రెండు, మూడుచోట్ల నిర్మాణాలు కుంగినట్లు తెలిపారు. ఈనెల 22న సచివాలయ పనులు పరిశీలించి రోడ్‌మ్యాప్ ప్రకటిస్తానని సరిగ్గా వారం కిందట సీఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే సీఎం పర్యటనను 23కి వాయిదా వేశారు. ఆ పర్యటన కూడా వాయిదా పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, హైదరాబాద్ నుంచి ఈ నెల 27న తరలిరానున్న అధికారులు తాత్కాలిక సచివాలయం పనుల పరిస్థితిని తెలుసుకుని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నుంచి కొందరు ఉద్యోగులు వచ్చి పనులు పరిశీలించారు. అమరావతి ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఏమాత్రం సాధ్యం కాదని నిపుణులు మొదటి నుంచీ చెబుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. వెలగపూడి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలు ఎక్కడా కుంగలేదని సీఆర్డీఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలంగా ఉన్నచోటే పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటు మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఎక్కడా రాజీలేకుండా భవనాలను నిర్మిస్తున్నామని, నేల కుంగలేదని, ఆందోళన చెందవద్దని సూచించారు. -
స్థానికత ఆధారంగా విభజన చేయండి
సచివాలయంలోని ‘డి’ బ్లాక్‌లో ఉద్యోగులు ధర్నా సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలంటూ సచివాలయ ఉద్యోగులు ‘డి’ బ్లాక్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీ స్థానికత కలిగిన 83 మంది సెక్షన్ అధికారులు, 15 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులను తెలంగాణకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంట పాటు ఆందోళన చేశారు. ‘తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల పెత్తనమా..సిగ్గు సిగ్గు’, ‘ఏఎస్‌ఓలకు వెంటనే ఎస్‌వోలుగా పదోన్నతులు కల్పించాలి’, అని ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కొందరు ఉన్నతాధికారులు సీఎంని తప్పుదోవ పట్టించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులకు కొత్త రిక్రూట్మెంట్, పదోన్నతులు లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. -
పిల్లల చదువు అక్కడా.. ఇక్కడా?
సాక్షి, హైదరాబాద్: ‘సోమవారం నుంచి స్కూళ్లు తెరుస్తారు.. పిల్లలను హైదరాబాద్‌లో స్కూలుకు పంపాలా లేక నూతన రాజధానిలో స్కూలు చూసుకుని చేర్చాలో తెలియడం లేదు.. జూన్ 27 నుంచి వెలగపూడి వెళ్లి పని చేయాల్సిందేనని ఒక పక్క సీఎం బాబు చెబుతున్నారు.. మరోవైపు తరలింపునకు సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.. సీఎస్ శనివారం నుంచి తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.. ఆయన ఇంటి నుంచే విధు లు నిర్వర్తిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేద’ని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. సీఎస్ చెప్పినట్లు వెలగపూడిలో భవనాల నిర్మాణం పూర్తి కావడం ఆధారంగా దశల వారీగా తరలింపు ఉంటుంది. అయితే 27న ఏ శాఖలు వెళ్లాలో ముందుగా తెలపక పోవడంతో పిల్లలను ఎక్కడ చదివించాలో తెలియడం లేదని ఆర్థిక శాఖ లోని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరలింపు ఉత్తర్వులు ఇవ్వనందున సోమవారం నుంచి హైదరాబాద్‌లో స్కూళ్లకే పిల్లలను పంపిస్తామని, ఆ తర్వాత 27లోగా ఉన్నట్టుండి తరలి వెళ్లాలని ఉత్తర్వులు ఇస్తే మా పరిస్థితేంటని మరో ఉద్యోగి ప్రశ్నించారు. ఏ శాఖలు వెళ్లాలో ఇప్పటికే చెప్పామని సీఎం చెబుతున్నా సచివాలయంలో ఏ శాఖకూ అలాంటి సమాచారం లేదంటున్నారు. జల వనరుల శాఖను ఎప్పుడు తరలిస్తారో చెప్పాలి జల వనరుల శాఖను ఏ తేదీన తరలిస్తారో స్పష్టంగా చెప్పాలి. అందుకనుగుణంగా పిల్లల చదువులు, కుటుంబం తరలింపుపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మా పాప మూడో తరగతి చదువుతోంది. 27న తరలింపులో జల వనరుల శాఖ ఉంటే మా పాపను అమరావతి వద్ద స్కూల్లో చేర్పిస్తాను. - వెంకట్రామిరెడ్డి, జలవనరుల శాఖాధికారి -
'మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు'
హైదరాబాద్: తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే అమరావతికి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని సచివాలయ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అంతేకాక స్థానికత, హెచ్ఆర్, రోడ్ మ్యాప్ పై వెంటనే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో సచివాలయ ఉద్యోగులు కృష్ణయ్య, వెంకట్ రాంరెడ్డి, భావన తదితరులు మీడియాతో మాట్లాడారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అయోమయం సృష్టిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోయారు. కాగా, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సౌకర్యాలు లేవని హైదరాబాద్ లో ఉంటే కుదరదని ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీ సచివాలయం అదనపు పనుల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్
- రూ.350 కోట్ల విలువైన వసతుల టెండర్లూ ఆ రెండు కంపెనీలకే - మళ్లీ ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీకే ఖరారు సాక్షి, విజయవాడ బ్యూరో: వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి సంబంధించిన రూ.350 కోట్ల విలువైన అదనపు పనులను ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు కుమ్మక్కై సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు సీఆర్డీఏ టెండర్లు ఖరారు ప్రక్రియను గోప్యంగా ఉంచి.. ఆ రెండు సంస్థలకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడంతో వాటి పని సులభమైంది. మొత్తం ఐదు ప్యాకేజీల్లో మూడింటిని ఎల్ అండ్ టీ సొంతం చేసుకోగా, రెండింటిని షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. వెలగపూడిలో ఆరు భవనాలకు గాను రెండింటిని షాపూర్జీ పల్లోంజీ, నాలుగింటిని ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అవే భవనాల్లో అంతర్గత పనులను మూడు ప్యాకేజీలుగా, సముదాయంలో అంతర్గత రోడ్లు, అనుసంధాన రహదారి, మురుగునీటి శుద్ధి కేంద్రం, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి 20 రోజుల క్రితం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సుమారు రూ.350 కోట్ల విలువైన ఈ ఐదు ప్యా కేజీలకు దాఖలైన టెండర్లను శుక్రవారం తెరిచారు. అయితే వీటన్నింటికీ షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వాటి ప్రైస్ బిడ్లను శనివారం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో తెరిచి తక్కువ కోట్ చేసిన కంపెనీకి టెండర్లు ఖరారు చేశారు. ఇప్పటికే వెలగపూడిలో ఏ కంపెనీ ఏ బ్లాకును నిర్మిస్తుందో అదే కంపెనీ అదే బ్లాకుకు సంబంధించిన అంతర్గత పనులను దక్కించుకోవడం గమనార్హం. దీన్నిబట్టి రెండు కంపెనీలు ముందే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని తమకు కావాల్సిన మొత్తాలకు టెండర్లు కోట్ చేశాయనేది విదితమవుతోంది. షాపూర్జీ పల్లోంజీ ప్రస్తుతం తాను నిర్మిస్తున్న రెండు భవనాలకు.. నిబంధనల మేరకు టెండర్లు దాఖలు చేయగా, అవే భవనాలకు ఎల్ అండ్ టీ ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసింది. దీంతో ఆ రెండు టెండర్లు షాపూర్జీకి దక్కాయి. ఇలాగే ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగు భవనాలకు ఆ కంపెనీ కచ్చితంగా వచ్చేలా టెండర్లు వేయగా.. షాపూర్జీ కంపెనీ ఎక్సెస్‌కు టెండర్లు వేసింది. దీంతో ఎల్ అండ్ టీ టెండర్లు ఖరారయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం ఐదు ప్యాకేజీలకు ఐదు శాతం ఎక్సెస్‌కు టెండర్లు వేయగా వాటిని ఆమోదించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీఆర్డీఏ మీడియా సహా ఎవరికీ తెలియకుండా నిర్వహించింది. గతంలోనూ 12 శాతం ఎక్సెస్‌కు ఆమోదం.. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఇప్పటికే నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాల టెండర్లను మూడు నెలలక్రితం రూ.202 కోట్లకు దక్కించుకున్నాయి. అప్పట్లోనూ 12 శాతం ఎక్సెస్‌కు కోట్ చేసినా కేబినెట్ ఆమోదంతో వాటిని ఖరారు చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని పెంచి రూ.240 కోట్లకు ఆరు భవనాల నిర్మాణ పనులను రెండు కంపెనీలకు అప్పగించారు. తాజాగా అదనపు పనులు, అంతర్గత పనులన్నీ కలిపి రూ.350 కోట్ల విలువైన టెండర్లను మళ్లీ వాటికే అప్పగించారు. దీంతో రూ.590 కోట్ల పనులను ఆ రెండు సంస్థలకు అప్పగించినట్లయింది. ఈ నెల 27వ తేదీకల్లా హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు రావాలని అల్టిమేటం ఇచ్చిన ప్రభుత్వం మౌలిక వసతుల పనులను మాత్రం శనివారం ఖరారు చేయడం గమనించాల్సిన అంశం. నిబంధనల ప్రకారం ఈ పనులను మూడు నెలల్లోపు పూర్తి చేసే అవకాశాన్ని ఆ కంపెనీలకిచ్చారు. కానీ అనధికారికంగా పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. -
27న వెళ్లాల్సింది హెచ్ఓడీలే..
ఉద్యోగులకు సీఎస్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఈనెల 27న వెళ్లాల్సింది హెచ్ఓడీలు మాత్రమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం తన ఛాంబర్ ఎదుట భైఠాయించిన సచివాలయ ఉద్యోగుల వినతి పత్రం స్వీకరించిన తర్వాత ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై వివరణ ఇచ్చారు. శాఖాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాల ఉద్యోగులు మాత్రమే ఈ నెల 27వ తేదీలోగా కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉంటుందని సర్క్యులర్ ఇచ్చామన్నారు. అయితే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని, అవి సిద్ధమైన తర్వాతే సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం మీద 60 రోజుల్లో సచివాలయాన్ని పూర్తి స్థాయిలో తరలిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తరలింపుపై రెండు మూడు రోజుల్లో రోడ్ మ్యాప్ ఖరారు చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని పరిశీలించేందుకు సచివాలయం ఎల్ బ్లాక్ ఏడో అంతస్తులో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అమరావతికి వెళ్లడానికి ఇబ్బందులున్న వారు హెల్ప్‌డెస్క్‌లో వినతులు ఇవ్వవచ్చన్నారు. సిద్ధపడిన వాళ్లనే తరలించాలి..:ఏపీ కొత్త రాజధాని అమరావతికి వెళ్లడానికి సిద్ధపడిన వాళ్లను మాత్రమే తీసుకువెళ్లాలని సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడు, ఏపీ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి కోరారు. సీఎస్‌కు వినతి పత్రం సమర్పించిన తర్వాత సచివాలయం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకం కాదని.. అయితే కనీస వసతులు కల్పించాలని కోరుతున్నట్లు సచివాలయం గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. తరలింపు అంశంతో చాలా సమస్యలు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలతో పాటు ఇక నుంచి ఉద్యోగస్తుల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉందని సచివాలయం ఉద్యోగ సంఘం నేత బాబూరావు సాహెబ్ ఆందోళన వ్యక్తం చేశారు.