
సాక్షి, అమరావతి: సచివాలయాల ఉద్యోగులకు 30న అపాయిమెంట్ ఆర్డర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తారని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వార్డు సచివాలయాల్లో 10 మంది ఉద్యోగులు ఉంటారని.. గ్రామ,వార్డు సచివాలయాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రజా పాలన సచివాలయాల ద్వారానే జరుగుతుందన్నారు.
అక్టోబర్ 2 నుంచి సచివాలయాల్లో పౌరసేవలు అందిస్తామని తెలిపారు. 72 గంటల్లో పూర్తయ్యే 10 సేవలను తక్షణమే అమలు చేస్తామన్నారు. తర్వాత ఆ సేవలను పెంచుకుంటూ వెళ్తామన్నారు. పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు 72 గంటల్లో ఇస్తామని వెల్లడించారు. డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలు వెంటనే ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతీరోజు వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, పింఛన్లు, ఫీజు రియింబర్స్‌మెంట్ తదితర పథకాలను సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment