
తోపులాట..
తమకు తెలియకుండా సచివాలయంలో ఎలా సమావేశమవు తారంటూ టీఎన్జీవోల మీటింగ్‌ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. తెలం గాణ సచివాలయ ఉద్యోగుల నేత ప్రోద్బలంతోనే ఏపీ అధికారులు దొడ్డిదారిలో తిరిగి రాష్ట్ర సచివాలయం లో చేరేందుకు పావులు కదుపుతున్నారని, అందుకే తమ మీటింగ్‌ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నా రని టీఎన్జీవో నేతలు ఆరోపించారు. దీనిపై పరస్పరం ఇరు వర్గాలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ çఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ కోరారు.