రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేశారు. సచివాలయంలోని రెండు గేట్ల ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, హైదరాబాద్‌పై తామందరికీ హక్కు ఉందని ఉద్యోగులు తెలిపారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ కావాలనే తమను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. ఉద్యోగులుగా హైదరాబాద్ నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని, కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఉద్యమంలో పాల్గొంటారని వారు తెలిపారు.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
Published Mon, Aug 5 2013 2:09 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement