
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఆవిర్భావ సభ.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఒకే సారి లక్షా 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు సచివాలయాలు ఏర్పాటు నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట..
Comments
Please login to add a commentAdd a comment