తరలింపు ఎప్పుడో స్పష్టంగా చెప్పండి | Secretariat employees demand | Sakshi
Sakshi News home page

తరలింపు ఎప్పుడో స్పష్టంగా చెప్పండి

Mar 20 2016 2:14 AM | Updated on Sep 3 2017 8:08 PM

తరలింపు ఎప్పుడో స్పష్టంగా చెప్పండి

తరలింపు ఎప్పుడో స్పష్టంగా చెప్పండి

కొత్త రాజధానికి తరలింపు ఎప్పుడనే విషయాన్ని మార్చి 25 నాటికి స్పష్టంగా ప్రకటించాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానికి తరలింపు ఎప్పుడనే విషయాన్ని మార్చి 25 నాటికి స్పష్టంగా ప్రకటించాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము ఇచ్చిన గడువులోగా స్పష్టత ఇవ్వకుంటే.. పూర్తిస్థాయి తరలింపును 2017 వేసవికి వాయిదా వేయాలన్నారు.

కొత్త రాజధానికి స్వచ్ఛందంగా తరలివెళ్లే ఉద్యోగులను తప్ప, మిగతా వారిని బలవంతంగా తరలించే యత్నాలను అంగీకరించబోమన్నారు. శనివారం సచివాలయంలో ఉద్యోగులు సమావేశమై తరలింపు అంశంపై చర్చించారు. ప్రభుత్వం స్పష్టంగా ఏదీ చెప్పకపోవడం, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం పట్ల సమావేశంలో ఆగ్రహం వ్యక్తమయింది. అనంతరం ఉద్యోగుల ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement