
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: వచ్చే అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తయినట్లు ప్రకటించేందుకు జిల్లాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారి వివరాలతో పాటు వారి పోలీసు వెరిఫికేషన్, డిపార్ట్‌మెంట్ టెస్ట్ ఉత్తీర్ణత వివరాలను సిద్ధం చేసుకుని వాటిని నిర్ణీత ఫార్మాట్‌లో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తెలియజేయాలని అజయ్ జైన్ కలెక్టర్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment