సచివాలయ అధికారులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది. బాత్రూమ్‌లు మినహా కారిడార్లు, ఉద్యోగులు పనిచేసే క్యాబిన్లు, క్యాంటీన్లు.. చివరకు కంప్యూటర్లలో సైతం కెమెరాలు అమర్చారు. ఎటు కదిలినా కెమెరాలు వెంటాడుతుండటంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తప్పులేదు గానీ.. తమను అవమానించేలా ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టడమేమిటని మండిపడుతున్నారు. కంప్యూటర్లలో సైతం మైక్రో కెమెరాలు ఏర్పాటు చేశారని.. దీంతో పక్కనున్న సహ ఉద్యోగులతో మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం ఇంత అనుమానంతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. తమ ప్రతి కదలికపైనా నిఘా పెట్టడం దారుణమన్నారు.
సచివాలయమా..బిగ్‌బాస్‌షోనా
Published Mon, Oct 30 2017 10:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement