సచివాలయ ఉద్యోగులకు కేటరింగ్‌ పనులు | Catering works for Secretariat employees: Andhra pradesh | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులకు కేటరింగ్‌ పనులు

Published Thu, Oct 31 2024 4:03 AM | Last Updated on Thu, Oct 31 2024 4:03 AM

Catering works for Secretariat employees: Andhra pradesh

పదవీ విరమణ విందులో 

ఏ ఉద్యోగి ఏం వడ్డించాలో పేర్కొంటూ ఆదేశాలు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయా­ల ఉద్యోగులకు భోజ­నాలు వడ్డించే బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. అన్నమయ్య జిల్లా­లో ఓ మండలాధి­కారి పదవీ విరమణ సందర్భంగా మండల పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో భోజనాలు వడ్డిం­చేం­దుకు గ్రామ సచివాలయాల ఉద్యోగులను వినియోగించారు. విస్తర్లు వేసేందుకు, మటన్, పప్పు, సాంబారు వంటి పదార్థాలను వడ్డించే బాధ్యతలను 12 మంది సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఈ మేరకు అధికారులు లిఖితపూర్వక ఆదేశాలు సైతం జారీ చేశారు.  

ఏ పనైనా వారికే.. 
మచిలీపట్నంలో ధాన్యం సేకరణ నిమిత్తం వెహి­కల్‌ మూమెంట్‌ మోనిటరింగ్‌ పేరుతో వార్డు సచివాల­యా­ల్లో పనిచేసే 31 మంది  ఉద్యోగులను వివిధ మిల్లుల వద్ద కాపలా కాసే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తహసీల్దార్‌ ఉత్త­ర్వులు జారీ చేశారు. అంతకుముందు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజు­లైన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన స్టిక్క­­ర్లను ఇంటింటా అతికించే బాధ్య­తల్ని సైతం ప్రభు­త్వం గ్రామ, వార్డు సచివాల­యాల ఉద్యోగులకు అప్ప­గించిన విషయాన్ని విదితమే.

 సచివాలయాల ఉద్యోగులకు అధి­కా­రులు అప్పగిస్తున్న బాధ్య­­తలతో వారంతా సిగ్గు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి చదువులు చదివిన వారే అధికం.  ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు స్థానిక అధికారులు ప్రతి పనికీ ఉపయోగించుకుంటూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నా­రని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement