సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ఏం జరిగిందంటే..
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.
అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్‌లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment