Venkatram Reddy
-
ఆ జీవోను వెంటనే ఆపెయ్యండి
-
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్‌మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్‌లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్‌జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర!
సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో శుక్రవారం కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో పార్టీకి చెందిన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులతో సుధీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం కేసీఆర్ ఈ మేరకు వెంకట్రాంరెడ్డికి మెదక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేరు ఖరారైన విషయం విధితమే. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మారిన నిర్ణయం వెనుక.. మెదక్ ఎంపీ టికెట్‌కు ముందుగా గజ్వేల్‌కు చెందిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డికి దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన నియోజకవర్గంలో ఎన్నికల పనిలో కూడా నిమగ్నమయ్యారు. పార్లమెంట్ స్థానం పరిధిలోని పటాన్చెరు తదితర అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో కూడా వంటేరు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ తదితరులు ఆశించారు. అయినప్పటికీ వంటేరు ప్రతాప్‌రెడ్డికి దాదాపు ఖాయమైందని గులాబీ పార్టీ వర్గాలు భావించాయి. అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా వెంకట్రాంరెడ్డికి ఈ టికెట్ ఖరారు చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట మాజీ కలెక్టర్‌గా.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన వెంకట్రాంరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాలో సన్నిహిత సంబంధాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిద్దిపేట కలెక్టర్‌గా ఆయన సుమారు ఐదేళ్ల పాటు పని చేశారు. అంతకు ముందు ఉమ్మడి మెదక్ జిల్లా డ్వా మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. జాయింట్ కలెక్టర్‌గా, అదనపు కలెక్టర్‌గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు. మధ్యలో కొన్ని రోజులు మెదక్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా కూడా బాధ్యతల్లో కొనసాగారు. 2021లో కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రాంరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వెంకట్రాంరెడ్డికి అనూహ్యంగా మెదక్ అభ్యర్థిత్వం దక్కడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా బలమైన నేత కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, ఉన్నతాధికారిగా ఉమ్మడి మెదక్ జిల్లాతో సంబంధం ఉన్న వెంకట్రాంరెడ్డికి రాజకీయంగా పెద్దగా సంబంధాలు లేవు. 2021 నవంబర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై నప్పటికీ.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకటీ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిగా అధినేత నియమించినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాలు తక్కువ. కానీ ఆర్థికంగా బలమైన నేతగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవి చదవండి: రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం! : ఎంపీ గోడం నగేశ్ -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్‌సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!
మెదక్: నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాలు. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పెంటపర్తి బాపురెడ్డి కుమారుని వివాహం ఇటీవలే జరిగింది. ఈమేరకు ఆదివారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బాపురెడ్డి తన బావ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్‌పేటకు చెందిన సిరికొండ లింగారెడ్డి, తోడల్లుడు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ముత్యాల వెంకట్రాంరెడ్డితో కలిసి కారులో జంగరాయి నుంచి రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో జప్తి శివునూర్‌వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి (55) అక్కడిక్కడే మృతిచెందగా, లింగారెడ్డి (48) రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన బాపురెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ప్రమాదాలకు గురైన వాహానాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియక్ చేయించారు. ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ప్రమాదంలో మృతిచెందిన లింగారెడ్డి బీఆర్ఎస్ అంబర్‌పేట గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోటీసులివ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?: వెంకట్రామి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, అరెస్ట్‌పై ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. డీసీ వెంకట్రామిరెడ్డి రూ.9వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులతో కలిసి వెంకట్రామిరెడ్డి కుట్ర చేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశాం. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ జరిగింది అని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈడీ రిమాండ్ రిపోర్టుపై వెంకట్రామిరెడ్డి స్పందించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చాలాసార్టు విచారణకు హాజరయ్యాను.. సహకరించాను అని తెలిపారు. కాగా, వెంకట్రామిరెడ్డి అరెస్ట్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో వెంకట్రామి రెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామి రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామిరెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీ నగదు, డాక్యుమెంట్స్ సీజ్! -
AP: ప్రభుత్వంపై విమర్శలు బాధాకరం: వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: రేపు(శుక్రవారం) మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రేపటి సమావేశం తర్వాత పీఆర్సీపై స్పష్టత రానుంది. రిపోర్ట్ ఇవ్వకుండా పీఆర్సీపై మాట్లాడం అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సీఎంతో చర్చించిన తర్వాత రేపు సీఎస్ సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్ పీఆర్సీపై సీఎంను కలిశారన్నారు. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాల విమర్శలు బాధాకరమన్నారు. మైలేజ్ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయన్నారు. పీఆర్సీపై ఉద్యోగులకు క్లారిటీ ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. చదవండి: Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ -
సిద్దిపేట కలెక్టర్‌గా మళ్లీ వెంకట్రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పి.వెంకట రామిరెడ్డి మళ్లీ నియమితులయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ను సిద్దిపేట జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు గత నెలలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తి కావడంతో ఆయనను సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే మెదక్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఎన్నికలకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్‌గా వెళ్లిన సంగారెడ్డి కలెక్టర్ ఎం.హన్మంతరావును మళ్లీ సంగారెడ్డికి బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు సిద్దిపేట కలెక్టర్‌గా స్థానచలనం పొందిన మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికెరిని తిరిగి మంచిర్యాలకు బదిలీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నుంచి సిక్తా పట్నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌గా అదనపు బాధ్యతల నుంచి శశాంకను రిలీవ్ చేస్తూ ఆమె స్థానంలో హోళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి ఆ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించొద్దు
-
తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించొద్దు
సాక్షి, విజయవాడ: కొన్ని మీడియా సంస్థలు.. సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 22ప సచివాలయం తరలింపు అంటూ చేస్తోన్న తప్పుడు ప్రచారంతో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రాజధానులపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని... ఉద్యోగులకు నిర్ణీత సమయం ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నుంచి తరలించినప్పుడు ఇష్టానుసారంగా చేశారని. ఈ ప్రభుత్వం ఉద్యోగుల సానుకూల ప్రభుత్వమని చెప్పారు. ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టేవిధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో రాజధాని కట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. రాజధానికి అమరావతి అనుకూలం కాదని శివరామకృష్ణన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలోని 499 గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికను సమగ్రంగా అమలుచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. బుధవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో 30 రోజుల ప్రణాళికపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు 30 రోజుల ప్రణాళిక అమలవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ ప్రణాళికను ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులతో కూడిన 121 బృందాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖలు గ్రామాల అభివృద్ధికి ప్రతీ నెల రూ.339 కోట్లు అందిస్తుందన్నారు. ఈజీఎస్‌లో భాగంగా జిల్లాలో 27 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ సర్పంచ్ పాలకవర్గం సమన్వయంతో మరిన్ని రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో చెట్లకు నీళ్లు పోయడం వల్ల ట్యాంకర్ యజమాని అకౌంటులో డబ్బులు జమ అయ్యేవని, ఇక నుంచి గ్రామ పంచాయతీ అకౌంటులో జమ అవుతాయన్నారు. గ్రామంలో çప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతీ అధికారి ఉదయం 6 గంటలకు గ్రామాలకు చేరకొని పనులు చేపట్టాలన్నారు. పనులకు గ్రేడింగ్ అన్ని జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తారని, జిల్లా స్థాయిలో మండలాలకు, మండల స్థాయిలో గ్రామాలకు గ్రేడింగ్ ఇస్తారని తెలిపారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు మంజూరు చేయడం ఉండదని స్పష్టం చేశారు. గ్రామాలో పనిచేసే పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం పెంచినట్లు పేర్కొన్నారు. పంచాయతిలో ఒక్కొక్కరికి రూ.1,600 చొప్పున సుమారు రెండు వేల మంది ఉంటే రూ.32 లక్షలను గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తలపెట్టిన 30 రోజుల ప్రణాళికలో తను పాల్గొంటానని తెలిపారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిదులు చొరవ చూపాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో 30 రోజుల ప్రణాళికలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అధికారులు, పాల్గొన్నారు. -
నిర్మాత వెంకట్రామి రెడ్డి మృతి
విజయా–వాహినీ సంస్థల అధినేత, నిర్మాత బి.నాగిరెడ్డి కుమారుడు, ప్రొడ్యూసర్ వెంకట్రామి రెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. విజయ బ్యానర్‌పై తమిళంలో అజిత్, విజయ్, విశాల్, ధనుష్ వంటి హీరోలతో సినిమాలను నిర్మించారాయన. తెలుగులోనూ ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం, బృందావనం, భైరవద్వీపం’ వంటి విజయవంతమైన సినిమాలను రూపొందించారు వెంకట్రామి రెడ్డి. ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతి ఏడాది ఆయన పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఆయనకు భార్య భారతీరెడ్డి, కుమార్తెలు ఆరాధన, అర్చన, కుమారుడు రాజేశ్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఉదయం 7:30 గంటలకు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట్రామి రెడ్డి మృతిపట్ల ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
‘జగన్‌పై హత్యాయత్నం కుట్రలో బాబూ.. లోకేష్ ఉన్నారేమో’
సాక్షి, అనంతపురం : వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రమేయం లేదనుకుంటే సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరిస్తారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. నటుడు శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ పై టీడీపీ సర్కార్ ఎందుకు విచారణకు అంగీకరించడం లేదని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అంపశయ్య పై ఉందని, చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్నిఅస్థిరపరచాల్సిన అగత్యం తమకు లేదన్నారు. రాజకీయంగా వైఎస్ జగన్ బలపడడంతో నేరుగా ఎదుర్కొనలేకనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. వారికి ముందే తెలుసు.. సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్‌పై హత్యాయంత్నం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్‌పై దాడి జరుగనుందని ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతల డ్రామాలన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. సాక్షి, ఒంగోలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి అనంతరం పరామర్శించాల్సిన చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి అనంతరం నాటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచి ఏకంగా ధర్నా చేశారని గుర్తు చేశారు. -
‘గజ్వేల్’ మా రోల్ మోడల్
అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన వివిధ జిల్లాల కలెక్టర్లతో గజ్వేల్ ఆదివారం కళకళలాడింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నవ్వుతూ..ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పనులకు తన సహచరులకు వివరించారు. పర్యటన అనంతరం ఇక్కడ అమలవుతున్న హరితహారం పనులను తాము ఆదర్శంగా తీసుకుంటామని బృందం సభ్యులు ప్రకటించారు. ఎడ్యుకేషన్ హబ్ అద్భుతమని కొనియాడారు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న అభివృద్ధి తీరుపైఆశ్చర్యం వ్యక్తం చేశారు. గజ్వేల్: సీఎం ఇలాకా గజ్వేల్‌లో సాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించేదుకు వచ్చిన కలెక్టర్లతో గజ్వేల్ కళకళలాడింది. పర్యటన అనంతరం మా జిల్లాల్లోనూ ఇదే తరహా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతాం అంటూ జిల్లా కలెక్టర్ల బృందం ప్రకటించింది. నియోజకవర్గంలో చేపట్టిన అటవీ సహజ పునరుద్ధరణ(ఏఎన్ఆర్), కృత్రిమ పునరుద్ధరణ(ఏఆర్)తీరుపై రాష్ట్రంలోని రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు మినహా మిగతా వారంతా బస్సులో యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా, హరితహారం ఓఎస్డీ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, సీసీఎఫ్ ఏకే సిన్హాలతో కలిసి కలెక్టర్ల బృందం ఇక్కడ పర్యటించింది. హైద్రాబాద్‌లో శనివారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న హరితహారం, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించాల్సిందిగా సూచించిన నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. ముందుగా ‘హారితహారం’.. మొదట ములుగు మండలం నర్సంపల్లిలో ఏఎన్ఆర్(యాడెడ్ నేచురల్ రీ–జనరేషన్), ఏఆర్(ఆర్టిఫిషియల్ రీ–జనరేషన్)బ్లాక్‌లను వారు పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్ రేంజ్ పరిధిలో 439 హెక్టార్లలో ఏఎన్ఆర్, 370హెక్టార్లలో ఏఆర్ విధానంలో మొక్కల పెంపకం జరిగిందని పీసీసీఎఫ్ పీకే ఝా కలెక్టర్లకు వివరించారు. 2015–16లో 70 లక్షల మొక్కలు, 2016–17లో కోటి 21లక్షల మొక్కలు, 2017–18లో కోటి 57లక్షల మొక్కలు ఉద్యమస్థాయిలో నాటినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ల బృందం గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై నిర్మించిన ‘మిషన్‌భగీరథ’ హెడ్‌వర్క్స్ ప్రాంతం నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతున్న తీరును కలెక్టర్లు ఈఈ రాజయ్యను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే నం.1 గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్వివరించిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అనంతరం గజ్వేల్‌లో బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించారు. 3వేల మంది బాలురు, 2500మంది బాలికలకు విద్యను అందిస్తూ.. హాస్టల్‌తో పాటు అన్ని రకాల వసతులు కల్పించిన తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. ఇలాంటి హబ్ దేశంలో ఎక్కడా లేదని.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కలెక్టర్ల బృందానికి వివరించారు. రూ. 153కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో ఈ హబ్‌ను నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా పేదల కోసం నిర్మించిన 1250 ‘డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీని కలెక్టర్ల బృందం పరిశీలించింది. 156 బ్లాకులుగా ఒక్కో బ్లాకులో 8 ఇళ్ల చొప్పున కాలనీని నిర్మించామని, కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీళ్లు, పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్‌హాల్ వంటి వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఏసీ, ఇతర అధునాతన వసతులతో చేపట్టిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి బృందానికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..గజ్వేల్‌లో అమలవుతున్న హరితహారం తో పాటు వినూత్న పద్ధతుల్లో జరిగిన అభివృద్ధిని అధ్యయనం చేయడానికి కలెక్టర్ల బృందం రావడం హర్షణీయమన్నారు. పర్యటన ద్వారా మిగతా జిల్లాల్లో సైతం ఇదే తరహాలో అభివృద్ధికి బాటలు పడే అవకాశముందన్నారు. పాత టీంను పలకరించిన రోనాల్డ్ ప్రస్తుత మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులను పేరు పెట్టి పిలుస్తూ ఆకట్టుకున్నారు. లంచ్‌కు వెళ్ళే సమయంలో రోనాల్డ్‌రోస్ ములుగు మండలంలోని అటవీ అతిథిగృహానికి తన వాహనంపై నుంచి డ్రైవర్‌ను దింపేసి సెల్ఫ్ డ్రైవింగ్ చేశారు. కలెక్టర్లంతా బస్సులో ప్రయాణించగా...‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్ వద్ద రోనాల్డ్‌రోస్ ఇలా సెల్ఫ్ డ్రైవింగ్‌తో వెళ్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది. గజ్వేల్అభివృద్ధి అదుర్స్.. గజ్వేల్ డెవలప్మెంట్ ఎక్సలెంట్. హరితహారం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టారు. మా జిల్లాలో కూడా హరితహారంలో ముందంజలో ఉన్నాం. అభివృద్ధి పనుల తీరు బాగుంది. గజ్వేల్ విజిట్ సంతోషంగా ఉంది.– ఆమ్రపాలి, వరంగల్ అర్బన్ కలెక్టర్ -
ఆశలు నెరవేర్చుకున్న 'సహన'...
సహన అక్కల బాధ్యత తీసుకున్న సర్వ నీడీ వాలంట్రీ ఆర్గనైజేషన్ మారేడుపల్లి : నిరుపేద చిన్నారి సహనపై ‘సాక్షి’లో వచ్చిన కథనం పలువురి మనసులను కదిలించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆ చిన్నారి మనసులో ఆనందం వెల్లివిరిసేలా చేసేందుకు ముందుకు వచ్చారు. ఆసుపత్రికి తప్ప ఇంటి నుంచి బయటకు రాని సహనను ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి బయటకు తీసుకువచ్చారు. చిన్నారి తన ఆలోచనలను వారితో పంచుకుంది. తన పుట్టిన రోజు జరుపుకొని, దీపావళి కాంతులను చూసి, ఆ దేవుని దర్శనం చేసుకోవాలని ఉందని వారికి తన కోర్కెలను తెలియజెప్పింది. సహనను వారి కుటుంబ సమేతంగా కార్ఖాన జూపిటర్ కాలనీలోని సర్వ నీడీ ఆర్గనైజేషన్‌కు శుక్రవారం తీసుకువెళ్లారు ఆర్గనైజేషన్ ప్రతినిధులు. ఫౌండేషన్‌లోని చిన్నారులుమొదట కొత్త వస్త్రాలతో ఆమెను అలంకరించారు. కేక్ కట్ చేయాలన్న సహన కోరిక మేరకు న్యూ ఇయర్ వేడుకలనే ఆమె పుట్టిన రోజుగా మార్చారు. అనంతరం కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డే కేక్ కట్‌చేసింది. దీపావళి క్రాకర్స్ కాల్చి న ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. అనంతరం దగ్గర్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెక్కాడితే కాని డొక్క నిండని వారి పరిస్థితిపై చలించిన ఆర్గనైజేషన్ డెరైక్టర్ గౌతమ్‌లు సహన అక్కయ్యలు మేఘన, సంధ్యరాణి బాధ్యతలను తీసుకున్నారు. వారి చదువుతోపాటు సర్వ నీడీ ఫౌండేషన్లోనే ఉండేందుకు వారికి రూంను ఏర్పాటు చేశారు. సహన ఆపరేషన్ అనంతరం తమ వద్దకు వస్తే ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పుతామని హామీ ఇచ్చారు ఆర్గనైజేషన్ నిర్వహకుడు వెంకట్ రామరెడ్డి. సహన పుట్టిన రోజు వేడుకల్లో ఆమె కుటుంబసభ్యులతో పాటు ఆర్గనైజేషన్ నిర్వహకులు లలిత, అనుప, హిందు పాల్గొన్నారు. -
మేలు చేసినోళ్లకే..
వానొస్తేనే పైరు, లేకపోతే దేశాలు పట్టుకుని తిరగాలి. ‘ఎండైన, వానైనా, గాలిలా ఇట్టా ఉండడం వండుకు తినడం, పనులకు పోవడం. ఎక్కడ పనులుంటే అక్కడికిపోయి వలస బతుకులు బతుకుతున్నాం. పొద్దున ఆరుకు పోతే రాత్రి ఏడుకు వచ్చేది. శనిక్కాయ చేలల్లో పనులకు పోతున్నాం. మనిషికి 100 నుంచి 150 రూపాయలు కూలీ వస్తాది. మా ఊరిలో ఉపాధి పనులు లేవు. వానొస్తే సొద్ద, కంది పండుతాయి. లేకుంటే ఒట్టి భూములే. పిల్లలను చదివించుకునేందుకు లెక్క ఉంటే గదా? వైఎస్ హయాంలో బాగా చేసినాడు. ఆయన్నే తలుచుకుంటుంటాం. బియ్యం, పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఇచ్చాడు. ఆయన పోతానే పించన్ తీసేసిండు. ఉపాధి కట్ చేశారు. ఆయన టైంలో వంద రూపాయలు కూలీపడేది. ఇప్పుడేమో 30 రూపాయలు కూడా రావడం లేదు. దీంతోనే దేశాలు పట్టుకుని తిరుగుతున్నాం. జగన్ బాగా చేస్తాడనే నమ్మకముంది. ఈయనకే ఓటేయాలనుకుంటున్నాం. ఓయమ్మ చంద్రబాబా!! ఆయన మాటలు నమ్మలేం. నమ్మితే మనుషులను ఇతర దేశాల్లో అయినా అమ్మనైనా అమ్ముతాడు. ఆయన హయాంలో ఏమీ జరగలేదు. ఓ. వెంకట్రామిరెడ్డి,కడప ‘‘కోనసీమను తలపించే ప్రాంతం...పెన్నానదికి ఆవల, ఈవల గట్టు వెంబడి ఉన్న గ్రామాలు...పచ్చటి పైర్లతో కళకళలాడే పంట పొలాలు....నేడు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇందుకు నీరులేక కాదు...కరెంటు కోతలతోనే. కనీసం తాగునీటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన దుస్థితిలో గ్రామాలున్నాయి. ‘సాక్షి’ బృందం రాజంపేట నియోజకవర్గం లోని సిద్దవటం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల్లో పొలాల్లో పనులు చేసుకుంటున్న అన్నదాత కష్టాలను తెలుసుకుంది. 80 ఏళ్ల వయసులో సైతం పూట గడవక పొలం పనులు చేసుకుంటున్న అవ్వాతాతలు వారి కష్టాన్ని పంచుకున్నారు. గ్రామాల్లో చిన్నచిన్న బంకుల వద్ద సమావేశమై మాట్లాడుకుంటున్న వారితో మాట కలిపింది. పశువులు మేపుకుంటున్న కాపరుల అంతరంగాన్ని తెలుసుకుంది. ఉపాధిలేక వేరే ఊరికి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీల వ్యధను... ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీల అవస్థలు.. బుట్టలు అల్లుకుని జీవించే ఎస్టీల బాధలను, వారి స్థితిగతులను అడిగి తెలుసుకుంది.’’ వారందరి మాట ఒక్కటే... మేలు చేసేవాళ్లకే ఓటు వేస్తామని తన మనసులోని మాట చెప్పారు. ‘పెద్దాయన’ పాలనతో మాకు నమ్మకం కుదిరింది. కళ్లబొల్లి మాటలు, వెన్నుపోటు పొడిచే వారి మాటలు, చెప్పేవారి పాలనను చూశాం. వెన్నుపోటు పొడిచే నాయకులను నమ్మం. పెద్దాయన కుమారుడు యువ నాయకుడు మంచి చేస్తాడనే నమ్మకముంది. మా కష్టాలు.. కన్నీళ్లు తుడిచే నాయకుడు ఆయనేనని ఆశ ఉంది. ఆయనకే ఓట్లు వేస్తామని చెప్పారు. గూడు కట్టిన దేవుడు రాజశేఖర్‌రెడ్డిహయాంలో ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. బుట్టలు అల్లుకోవాలె. దీంతోనే తిండికిపోవాలా, పొదుపులు చెల్లించాలా. బీదరికాలే చెడ్డవి. ఉపాధి పనులు ఎప్పుడు పెడతారో తెలీదు. మాబోటోళ్ల కష్టాల గురించి పట్టించుకునే వాళ్లకే ఓటేస్తాం! - సుబ్బలక్షుమ్మ, నాగమ్మ పనిచేయకపోతే బువ్వ ఎట్టా? పనిచేయకపోతే బువ్వ ఎట్టా నాయనా? రూ. 200 పింఛన్ ఇస్తే ఏమైతాది? వక్క పేడు, ఆకు రావు. ఆ యాలకు రూ.70 పింఛన్ వస్తుండే. రాజశేఖర్‌రెడ్డి రూ. 200కు పెంచినాడు. ఇప్పుడు సరిపోవడం లేదు. జరగనపుడు పొలం పని చేయాల్సిందే..తప్పదు....అంటూ 80 ఏళ్ల నాగమునెమ్మ గోడు వెళ్లబోసుకుంది. చంద్రబాబుపై నమ్మకం లేదు.. చంద్రబాబునాయుడి పాలన చూశాం...ఆయన తొమ్మిదేళ్లలో కొన్నన్నా మంచి పనులు చేసివుంటే నమ్మేటోళ్లం. ఆయన ఏమీ చేయలేదు. కరెంటు బిల్లులతో కుళ్ల బొడిచినాడు. ఇప్పుడేమో తొమ్మిది గంటల కరెంటు అంటున్నాడు. ఆయన్ను నమ్మం. పెద్దాయన కొడుకు జగన్‌పైనే నమ్మకం ఉంది. జగన్ మాటమీద నిలబడతాడని నమ్మకం ఉంది. - శేషారెడ్డి, రైతు, సంటిగారిపల్లె కరెంటు కష్టాలు తప్పడం లేదు మాకు మూడెకరాల పొలం ఉంది. కరెంటు ఎప్పుడు పోతుందో, వస్తుందో తెలీడం లేదు. పొలం బీడు పెట్టుకున్నాం. పొద్దుతిరుగుడు కట్టెలను ఇప్పుడు కాలుస్తున్నాం. కరెంటు సరిగా ఉంటే ఈ పాటికి ఈ పొలంలో పైరు పెట్టే వాణ్ణి. - గుజ్జెల శ్రీనివాసులురెడ్డి, మాచుపల్లె -
జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంది: అనంత
-
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్: ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం తుంపర్తి, కనంపల్లి రోడ్ల నిర్మాణాలకు ఆయన భూమి పూజచేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతు గతంలో తుంపర్తి గ్రామం పెనుకొండ తాలూకాలో వుండేదన్నారు. దీంతో గ్రామం అభివృద్ధికి నోచుకోక రోడ్డు సౌకర్యం ప్రధాన సమస్యగా వుండేదన్నారు. సమస్య పరిష్కారానికి రూ.22 లక్షలు వెచ్చించి రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. మొదట డబ్ల్యూబీఎం రోడ్డు వేసి, అనంతరం తారు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కంకర రోడ్డు వేసిన తర్వాతే తాడు రోడ్డు వేస్తారన్నారు. ఈ విషయాలు తెలిసినా టీడీపీ నాయకులు గ్రామస్తులను మభ్య పెడ్తున్నారన్నారు. రూ.22 లక్షలతో గ్రామంలో తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు నిధులను మంజూరు అయ్యాయని, త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తారన్నారు. అనంతరం రూ. 23 లక్షల వ్యయంతో చేపడుతున్న కనంపల్లి రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో గ్రామానికి ఏ ఎమ్మెల్యే వచ్చిన దాఖలాలు లేవన్నారు. త్వరలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గ్రామస్తులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. గ్రామంలో అభిమానులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. గ్రామస్తుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇంజనీర్ మల్లిఖార్జున, సర్పంచ్‌లు రామాంజనేయులు, ఉమాదేవి, క్రిష్ణారెడ్డి, కె. వెంకటరామిరెడ్డి, ధనకొండ, గంగాధర్, నారాయణరెడ్డి, ఎస్. వెంకటరామిరెడ్డి, హనుమంతరెడ్డి, నారాయణస్వామిరెడ్డి , మాజీ డీలర్ వెంకటరామిరెడ్డి, శేషంరాజు, రవీంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆది, శంకర్‌రెడ్డి, ప్రబావతి, వెంకట్రామిరెడ్డి, శివారెడ్డి, పోతిరెడ్డి, లక్ష్మినారాయణ, రామాంజినేయులు, నిమ్మలకుంట శ్రీనివాసులు, మారుతిరాజు, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహానికి భూమి పూజ పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో నిర్మిస్తున్న బీసీ బాలుర వసతి గృహానికి ఎమ్మెల్యే భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతు విద్యతోపాటు క్రీడలలోనూ రాణించేలా అధ్యాపకులు విద్యార్థులను తీర్చి దిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి, అధ్యాపకులు చాంద్ బాషా, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రజాకార్లను ఎదురించిన యోధుడు
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.వెంకట్రామిరెడ్డి (85) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన స్వగ్రామమైన జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వెంకట్రాంరెడ్డి స్వాతంత్య్ర సమర యో ధుడు. ఆర్మూర్ ప్రాంతం నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారిలో వెంకట్రాంరెడ్డి మొట్టమొదటి వ్యక్తని చెబుతారు. ఆయన రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. వారిని తరిమికొట్టి, తొర్లికొండ గుట్టపై జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయా రు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లో స్పోర్ట్స్ డెరైక్టర్‌గా పనిచేశారు. స్పోర్ట్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ముప్పై ఏళ్లు కొనసాగారు. ప్రస్తుతం రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వాలీబాల్ అసోసియేషన్‌కు నలభై ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు. వెంకట్రామిరెడ్డి శిక్షణ సలహాలతోనే.. తొర్లికొండలో మొట్టమొదటగా నలుగురు పీఈటీలుగా ఎంపికయ్యారు. సీనియర్ పీడీలు జానకీరాం, మల్లేశ్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్‌లు వెంకట్రామిరెడ్డి శిష్యులే. అలాగే వెంకట్రామిరెడ్డి సలహాలు సూచనలతోనే గ్రామానికి చెందిన 32 మంది పీఈటీలయ్యారు. పీఈటీల గ్రామంగా తొర్లికొండకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాక ఈ గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వాలీబాల్‌పోటీల్లో ఎందరో పాల్గొన్నారు. వెంకట్రాంరెడ్డి భార్య లక్ష్మీదేవి గతంలోనే మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారు లు, ఒక కూతురు ఉన్నారు. సంతాపం నిజామాబాద్ స్పోర్ట్స్ : వెంకట్రామిరెడ్డి మరణంపై జిల్లాకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్‌శర్మ, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాగిర్తి బాగారెడ్డి, లక్ష్మణ్, బొబ్బిలి నర్సయ్య, వివిధ క్రీడా సంఘా ల సభ్యులు సంతాపం తెలిపారు. వాలీబాల్ అంటేనే వెంకట్రామిరెడ్డి జిల్లాలో, రాష్ట్రంలో వాలీబాల్ అంటేనే వెంకట్రామిరెడ్డి అని పేరు తెచ్చుకున్నారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో జిల్లానుంచి ఎందరో ఆటగాళ్లు జాతీయ స్థాయికి ఎదిగారు. ఆయన స్వగ్రామంనుంచి 32 మంది పీఈటీలు తయారు కావడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. -ఉమామహేశ్వర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సేవలు మరువలేనివి ఒలింపిక్ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్లకు వెంకట్రామిరెడ్డిఎంతో సేవ చేశారు. ఆయన కృషి వల్లే జిల్లా ఒలింపిక్ సంఘానికి ఒక నీడదొరికింది. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క వాలీబాల్ క్రీడాభివృద్ధికి ఆయన కృషి చేశారు. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. -బాగారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు