నోటీసులివ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారు?: వెంకట్రామి రెడ్డి  | ED Remand Report Of Deccan Chronicle Venkatram Reddy | Sakshi
Sakshi News home page

నోటీసులివ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారు?: వెంకట్రామి రెడ్డి 

Published Wed, Jun 14 2023 9:20 PM | Last Updated on Wed, Jun 14 2023 9:20 PM

ED Remand Report Of Deccan Chronicle Venkatram Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, అరెస్ట్‌పై ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. డీసీ వెంకట్రామిరెడ్డి రూ.9వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులతో కలిసి వెంకట్రామిరెడ్డి కుట్ర చేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్‌ చేశాం. బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో​ మనీలాండరింగ్‌ జరిగింది అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. 

ఈడీ రిమాండ్‌ రిపోర్టుపై వెంకట్రామిరెడ్డి స్పందించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. చాలాసార్టు విచారణకు హాజరయ్యాను.. సహకరించాను అని తెలిపారు. కాగా, వెంకట్రామిరెడ్డి అరెస్ట్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. 

ఇదిలా ఉండగా.. కెనరా బ్యాంక్‌, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో వెంకట్రామి రెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామి రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. కాగా  రూ. 8 వేల కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామిరెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీ నగదు, డాక్యుమెంట్స్‌ సీజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement