జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.వెంకట్‌రామిరెడ్డి (85) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన స్వగ్రామమైన జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వెంకట్రాంరెడ్డి స్వాతంత్య్ర సమర యో ధుడు. ఆర్మూర్ ప్రాంతం నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారిలో వెంకట్రాంరెడ్డి మొట్టమొదటి వ్యక్తని చెబుతారు. ఆయన రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. వారిని తరిమికొట్టి, తొర్లికొండ గుట్టపై జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయా రు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లో స్పోర్ట్స్ డెరైక్టర్‌గా పనిచేశారు. స్పోర్ట్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ముప్పై ఏళ్లు కొనసాగారు. ప్రస్తుతం రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వాలీబాల్ అసోసియేషన్‌కు నలభై ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు.
వెంకట్‌రామిరెడ్డి శిక్షణ సలహాలతోనే..
తొర్లికొండలో మొట్టమొదటగా నలుగురు పీఈటీలుగా ఎంపికయ్యారు. సీనియర్ పీడీలు జానకీరాం, మల్లేశ్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్‌లు వెంకట్‌రామిరెడ్డి శిష్యులే. అలాగే వెంకట్‌రామిరెడ్డి సలహాలు సూచనలతోనే గ్రామానికి చెందిన 32 మంది పీఈటీలయ్యారు. పీఈటీల గ్రామంగా తొర్లికొండకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాక ఈ గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వాలీబాల్‌పోటీల్లో ఎందరో పాల్గొన్నారు. వెంకట్రాంరెడ్డి భార్య లక్ష్మీదేవి గతంలోనే మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారు లు, ఒక కూతురు ఉన్నారు.
సంతాపం
నిజామాబాద్ స్పోర్ట్స్ : వెంకట్‌రామిరెడ్డి మరణంపై జిల్లాకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్‌శర్మ, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాగిర్తి బాగారెడ్డి, లక్ష్మణ్, బొబ్బిలి నర్సయ్య, వివిధ క్రీడా సంఘా ల సభ్యులు సంతాపం తెలిపారు.
వాలీబాల్ అంటేనే వెంకట్‌రామిరెడ్డి
జిల్లాలో, రాష్ట్రంలో వాలీబాల్ అంటేనే వెంకట్‌రామిరెడ్డి అని పేరు తెచ్చుకున్నారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో జిల్లానుంచి ఎందరో ఆటగాళ్లు జాతీయ స్థాయికి ఎదిగారు. ఆయన స్వగ్రామంనుంచి 32 మంది పీఈటీలు తయారు కావడానికి ఆయన ప్రోత్సాహమే కారణం.
-ఉమామహేశ్వర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి
సేవలు మరువలేనివి
ఒలింపిక్ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్‌లకు వెంకట్‌రామిరెడ్డిఎంతో సేవ చేశారు. ఆయన కృషి వల్లే జిల్లా ఒలింపిక్ సంఘానికి ఒక నీడదొరికింది. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క వాలీబాల్ క్రీడాభివృద్ధికి ఆయన కృషి చేశారు. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.
-బాగారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
రజాకార్లను ఎదురించిన యోధుడు
Published Sat, Jan 4 2014 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement