ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్: ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం తుంపర్తి, కనంపల్లి రోడ్ల నిర్మాణాలకు ఆయన భూమి పూజచేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతు గతంలో తుంపర్తి గ్రామం పెనుకొండ తాలూకాలో వుండేదన్నారు. దీంతో గ్రామం అభివృద్ధికి నోచుకోక రోడ్డు సౌకర్యం ప్రధాన సమస్యగా వుండేదన్నారు. సమస్య పరిష్కారానికి రూ.22 లక్షలు వెచ్చించి రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. మొదట డబ్ల్యూబీఎం రోడ్డు వేసి, అనంతరం తారు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కంకర రోడ్డు వేసిన తర్వాతే తాడు రోడ్డు వేస్తారన్నారు. ఈ విషయాలు తెలిసినా టీడీపీ నాయకులు గ్రామస్తులను మభ్య పెడ్తున్నారన్నారు. రూ.22 లక్షలతో గ్రామంలో తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు నిధులను మంజూరు అయ్యాయని, త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తారన్నారు. అనంతరం రూ. 23 లక్షల వ్యయంతో చేపడుతున్న కనంపల్లి రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో గ్రామానికి ఏ ఎమ్మెల్యే వచ్చిన దాఖలాలు లేవన్నారు. త్వరలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గ్రామస్తులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. గ్రామంలో అభిమానులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సమస్యలపై ఆరా తీశారు.
గ్రామస్తుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇంజనీర్ మల్లిఖార్జున, సర్పంచ్‌లు రామాంజనేయులు, ఉమాదేవి, క్రిష్ణారెడ్డి, కె. వెంకటరామిరెడ్డి, ధనకొండ, గంగాధర్, నారాయణరెడ్డి, ఎస్. వెంకటరామిరెడ్డి, హనుమంతరెడ్డి, నారాయణస్వామిరెడ్డి , మాజీ డీలర్ వెంకటరామిరెడ్డి, శేషంరాజు, రవీంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆది, శంకర్‌రెడ్డి, ప్రబావతి, వెంకట్రామిరెడ్డి, శివారెడ్డి, పోతిరెడ్డి, లక్ష్మినారాయణ, రామాంజినేయులు, నిమ్మలకుంట శ్రీనివాసులు, మారుతిరాజు, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహానికి భూమి పూజ
పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో నిర్మిస్తున్న బీసీ బాలుర వసతి గృహానికి ఎమ్మెల్యే భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతు విద్యతోపాటు క్రీడలలోనూ రాణించేలా అధ్యాపకులు విద్యార్థులను తీర్చి దిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి, అధ్యాపకులు చాంద్ బాషా, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
Published Sun, Feb 2 2014 2:41 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement