dharamavaram
-
రెచ్చిపోయిన కూటమి శ్రేణులు.. ధర్మవరంలో ఉద్రికత్త..కేతిరెడ్డి వాహనాన్ని
శ్రీ సత్యసాయి, సాక్షి: ఏపీలో కూటమి శ్రేణులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ధర్మవరం సబ్జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పరామర్శించారు. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దాడుల్ని కవర్ చేస్తున్న సాక్షి ప్రతినిధులపై దాడి చేశారు. ఫోన్లను లాక్కొని ధ్వంసం చేశారు. అయితే కూటమి శ్రేణులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి : తిరుమలలో భూమన ప్రమాణం -
ఫ్లిఫ్‌కార్టులో నిద్రమాత్రలు కొని...
సాక్షి, ధర్మవరం: ఫేస్బుక్ స్నేహం ప్రాణం మీదకు తెచ్చింది.. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో.. ముగ్గురు స్నేహితులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో వారు బ్రతికి బయపటపడ్డారు. ధర్మవరం పట్టణంలో కలకలం రేపిన ఈ సంఘటనపై డిఎస్పీ రామాకాంత్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు డిగ్రీ చదివే విద్యార్థులు తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి తల్లిదండ్రులు బు«ధవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆ విద్యార్థిణిల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు వారు పట్టణంలోని సవేరా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వారిని పోలీసులు విచారించగా జరిగిన వివరించారు. ఫేస్బుక్ పరిచయంతో అప్పుచేసి: డిగ్రీ చదువుతున్న ముగ్గురమ్మాయిలలో ఒకరికి పట్టణంలోని మారుతీ నగర్‌కు చెందిన పూజారి మహేష్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం రెండో అమ్మాయికి రూ.20వేలు నగదు అప్పుగా తీసుకుంది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌తో మూడో అమ్మాయితో సదరు మహేష్ పరిచయం పెంచుకోవడంతో మొదటి అమ్మాయికి మహేష్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మొదటి అమ్మాయి ద్వారా రెండవ అమ్మాయికి ఇచ్చిన అప్పును తిరిగి ఇచ్చేయాలని, అందుకు వడ్డీ కూడా చెల్లించాలని ఒత్తిడి చేశాడు. వారిద్దరినీ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ మొత్తాన్ని తిరిగి మహేష్‌కు ఇచ్చేందుకు తర్జనబర్జనపడుతూ వస్తున్నారు. రోజురోజుకూ మహేష్ నుంచి వారికి ఒత్తిడి అధికమవ్వడంతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మెసేజ్ చేసి ముగ్గురూ బస్సెక్కి అనంతపురం బయలుదేరి వెళ్లారు. అనంతపురం బస్టాండ్‌లో బస్సు దిగి తమ వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను వారు మింగేశారు. అప్పటికే కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్న ధర్మవరం పట్టణ పోలీసులు అనంతపురం బస్టాండులో ముగ్గురు అమ్మాయిలు అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కామర్స్ ద్వారా నిద్రమాత్రలు కొనుగోలు: ఆ ముగ్గురమ్మాయిలకు అన్ని నిద్రమాత్రలు ఎలా వచ్చాయని పోలీసులు విచారించగా వాటిని ఫ్లిఫ్‌కార్టులో కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాటిని ముగ్గురమ్మాయిలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి, ఆత్మహత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై వేధింపుల కేసు నమోదు:–ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నానికి కారణమైన మహేష్‌పై వేధింపుల కేసు నమోదు చేనట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ ఈ ఫేస్బుక్ వాట్సప్‌ల మాయలో పడొద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. అభినందన: కాగా ముగ్గురమ్మాయిల మిస్సింగ్ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ అస్రార్ బాషా, ఎస్సై శ్రీహర్ష, హెడ్‌కానిస్టేబుళ్లు డోనాసింగ్, శ్రీధర్ ఫణి, కానిస్టేబుళ్లు ప్రసాద్, శీనానాయక్, శ్రీనివాసులుల ను డీఎస్పీ అభినందించారు. వారికి రివార్డుకోసం ఎస్పీకి సిఫార్స్ పంపామని తెలిపారు. -
ధర్మవరంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
-
తనకంటివారిపల్లె నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారానికి 39వ రోజుకు చేరింది. ఆయన ఇవాళ ఉదయం ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి 8:30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. రామసాగరం క్రాస్, యడలంకపల్లె క్రాస్ మీదుగా 10 గంటలకు మరల గ్రామానికి చేరుకుని రైతులతో వారి సమస్యలపై చర్చిస్తారు. డీడీ కొట్టాలకు చేరుకున్న అనంతరం 12:30 గంటలకు అక్కడ భోజన విరామం తీసుకుంటారు. 2:45 గంటలకు బుక్కపట్నం నుంచి పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. 3:15 గంటలకు మంగళ మడక క్రాస్ చేరుకుంటారు. అక్కడినుంచి ధర్మవరం నియోజకవర్గంలోని గరుగు తాండ, 4.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్ మీదుగా సాయంత్రం 5 గంటలకు పాముదుర్తి వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు. -
'నీ కర్మపో.. వదిలేసెయ్.. వెయిట్ అండ్ సీ'
సాక్షి, అనంతపురం : ధర్మవరం పట్టణంలో పోలీసుల బెదిరింపులు కొత్తమీకాదు. చిన్నపాటి విషయాలను సైతం పెద్దవి చేస్తూ డబ్బు దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఓఎస్ఐ పనితీరు పోలీసు ఉన్నతాధికారులు సైతం తలదించుకునేలా చేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే ఆయన ఎస్ఐ భాగోతం ఉన్నతాధికారులకు తెలిసినా మార్పు రాకపోవడం. ఎస్ఐ ఫోన్లో బెదిరించడం మొత్తం రికార్డు చేసిన బాధితుడు దానిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసినా ఎస్ఐలో మార్పు రాలేదు. తన వేధింపులు యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. అసలు జరిగిందేమిటంటే.. ధర్మవరానికి చెందిన ఓ పెద్ద చేనేత వ్యాపారస్తుడి వద్ద పనిచేసే కార్మికుడు రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. అయితే ఈ ఘటనకు వ్యాపారస్తుడే కారణమంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లోని ఓఅధికారి వ్యాపారస్తుడిని బెదిరించాడు. నెల రోజులుగా నయానో భయానో సొమ్ము చేసుకోవాలని చూశాడు. ఎలాంటి సంబంధం లేకున్నా రోజూ ఫోన్లో బెదిరించసాగాడు. అటు మృతిచెందిన చేనేత కార్మికుని కుటుంబ సభ్యులు ఎవరూ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోయినా సదరు పోలీసు అధికారి సుమోటోగా కేసు నమోదు చేస్తానంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. రోజూ తన సిబ్బందిని ఇంటి వద్దకు పంపడం, సెటిల్ చేసుకుంటావా లేదా కేసు పెట్టమంటావా అంటూ ఫోన్లో బెదిరించడంతో, సదరు వ్యాపారి దిక్కుతోచక జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేశాడు. అయినా కూడా సదరు పోలీసు అధికారి ఆ వ్యాపారకి ఫోన్ చేసి బెదిరించిన తీరు పట్టణంలోని అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఫోన్లో వ్యాపారితో ఎస్ఐ సంభాషణ వారి మాటల్లోనే ఇలా.. – పోలీసు అధికారి : హలో.. – మాస్టర్ వీవర్ : నమస్తే సార్.. – పోలీసు అధికారి : అయితే నువ్వు మొత్తానికి పట్టించుకోవు. అంతేకదా. – మాస్టర్ వీవర్ : పట్టించుకోవడం కాదు సార్. దాంట్లో నాకు సంబంధంలేదు సార్. – పోలీసు అధికారి : సరే ఓకే నీ ఫైనల్ డెసిజన్ అదే కదా. అంతే కదా. – మాస్టర్ వీవర్ : పట్టించుకోవడం కాదుసార్. దాంట్లో నేను ఏమి చేయలేదు సార్. – పోలీసు అధికారి : సరే అదే నీ ఫైనల్ డెసిజన్ అదే కదా. లేదు కదా.. అదే నీ ఫైనల్ డెసిజన్ కదా అంటున్నా అంతే. – మాస్టర్ వీవర్ : నిజంగా నాకు సంబంధంలేదు సార్. – పోలీసు అధికారి : నీ ఇన్వాల్మెంట్లేదు కదా. రైట్ ఓకే.. ఓకే .. నీ కర్మపో.. వదిలేసెయ్.. వెయిట్ అండ్ సీ.. చూడు. వెయిట్ చేసి చూడు. నీ కర్మకు నీవే బాధ్యుడు అవుతావ్. – మాస్టర్ వీవర్ : అది కాదు సార్. నాకు ఎలాంటి సంబంధంలేదు సార్ – పోలీసు అధికారి : ఏయ్ నువ్వు ఎవరెవరినో నమ్ముకుని వాడొస్తాడు, వీడొస్తాడు, చేస్తాడని వారిని నమ్ముకుని ఉన్నావు కదా. వెయిట్ చేసి చూడు. ఏమిలేదు కదా వెయిట్ అండ్ సీ.. – మాస్టర్ వీవర్ : లేదు సార్. అలా ఎందుకంటారు సార్. నాకు సంబంధంలేదు సార్. – పోలీసు అధికారి : నీ కర్మకు నీవే బాధ్యుడు అవుతావ్. వెయిట్ అండ్ సి. రైట్... – మాస్టర్ వీవర్ : దేవుడు పెట్టినట్లు అయితుందిలే సార్... ప్రజల సమస్యలను పరిస్కరించాల్సిన పోలీసులే వసూళ్ల పేరుతో వేధించుకు తింటుంటే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని నేతన్నలు వాపోతున్నారు. -
అంతర్రాష్ట్ర దారిదోపిడీ ముఠా అరెస్ట్
ధర్మవరం రూరల్: జాతీయ రహదారిపై దారి దోపిడీలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్ల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 8న ధర్మవరం మండలం శీతారాంపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఐచర్‌ను ఆపి, డ్రైవర్ మహేంద్ర మూత్రం పోయడానికి రోడ్డు పక్కకు వెళ్లాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన బళ్లారికి చెందిన శ్యాం, పూసల పంజు, కనేకల్లు మండలం ఎర్రగుంటకు చెందిన సింహాద్రి, శ్రీనివాసులు లారీ డ్రైవర్‌పై దాడి చేసి, రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి లాక్కెళ్లారు. కత్తితో బెదిరించి రూ.11 వేలు నగదు, చేతి గడియారం, సెల్ ఫోన్ లాక్కున్నారు. రూరల్ సీఐ మురళీ కృష్ణ, ధర్మవరం రూరల్ ఎస్ఐ యతీంద్ర, బత్తలపల్లి ఎస్ఐ హారున్‌బాషా, ఏఎస్ఐ నాగప్ప, కానిస్టేబుళ్లు శివ, నరేష్, వేణు, నల్లప్ప, సాయి, చక్రధర్, లాలూ, సురేష్‌లు ప్రత్యేక బృందంగా ఏర్పడి, దోపిడీ ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఇది వరకే నిందితుడిగా ఉన్న శ్యాంను అరెస్ట్ చేయగా, అప్పట్లో పూసల పంజు, సింహాద్రి, శ్రీనివాసులు పారిపోయారు. వీరిని ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి టార్చిలైట్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
న్యాయవాది కారును ఢీకొన్న కానిస్టేబుల్ కారు
= పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు ధర్మవరం అర్బన్ : కర్నూలుకు చెందిన న్యాయవాది నాగమణి అద్దె వాహనంలో పుట్టపర్తికి వచ్చి తిరిగి వెళ్తుండగా ధర్మవరంలోని సబ్‌జైలు సమీపంలో రూరల్ పోలీస్ కానిస్టేబుల్ కారుతో వచ్చి ఆదివారం సాయంత్రం ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో న్యాయవాది ప్రయాణిస్తున్న కారు డోరు డ్యామేజీ అయ్యింది. న్యాయవాదితోపాటు డ్రైవర్ శ్రీనివాసులు సదరు కానిస్టేబుల్‌ను నిలదీశారు. ఆయన స్పందించకపోవడంతో బాధితులు పట్టణ సీఐ హరినాథ్‌కు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వాహనాన్ని నడపడమే కాకుండా కారును ఢీకొన్నాడని బాధితులు పట్టణ సీఐకు తెలియజేశారు. సీఐ కేసు విచారిస్తున్నారు. తమకు రాత్రి 9 గంటలైనా న్యాయం చేయలేదని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్ : ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లాకాలువకు చెందిన ఎం.రామిరెడ్డి అనే రైతు 2012 ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన మెటీరియల్ మంజూరు కాగా, వాటిని రైతుకు ఇచ్చేందుకు ట్రాన్స్‌కో ఏఈ పశువుల మల్లయ్య రూ.4 వేలు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెప్పడంతో రూ. 3,500 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న రైతు, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న విద్యుత్ ఉపకేంద్రంలో కాపుగాసిన ఏసీబీ సిబ్బంది మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా, ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో సీఐలు గిరిధర్, ప్రభాకర్, మధ్యవర్తులుగా కార్మిక శాఖ ఉద్యోగులు సూర్యనారాయణ, రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్: ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం తుంపర్తి, కనంపల్లి రోడ్ల నిర్మాణాలకు ఆయన భూమి పూజచేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతు గతంలో తుంపర్తి గ్రామం పెనుకొండ తాలూకాలో వుండేదన్నారు. దీంతో గ్రామం అభివృద్ధికి నోచుకోక రోడ్డు సౌకర్యం ప్రధాన సమస్యగా వుండేదన్నారు. సమస్య పరిష్కారానికి రూ.22 లక్షలు వెచ్చించి రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. మొదట డబ్ల్యూబీఎం రోడ్డు వేసి, అనంతరం తారు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కంకర రోడ్డు వేసిన తర్వాతే తాడు రోడ్డు వేస్తారన్నారు. ఈ విషయాలు తెలిసినా టీడీపీ నాయకులు గ్రామస్తులను మభ్య పెడ్తున్నారన్నారు. రూ.22 లక్షలతో గ్రామంలో తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు నిధులను మంజూరు అయ్యాయని, త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తారన్నారు. అనంతరం రూ. 23 లక్షల వ్యయంతో చేపడుతున్న కనంపల్లి రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో గ్రామానికి ఏ ఎమ్మెల్యే వచ్చిన దాఖలాలు లేవన్నారు. త్వరలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గ్రామస్తులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. గ్రామంలో అభిమానులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. గ్రామస్తుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇంజనీర్ మల్లిఖార్జున, సర్పంచ్‌లు రామాంజనేయులు, ఉమాదేవి, క్రిష్ణారెడ్డి, కె. వెంకటరామిరెడ్డి, ధనకొండ, గంగాధర్, నారాయణరెడ్డి, ఎస్. వెంకటరామిరెడ్డి, హనుమంతరెడ్డి, నారాయణస్వామిరెడ్డి , మాజీ డీలర్ వెంకటరామిరెడ్డి, శేషంరాజు, రవీంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆది, శంకర్‌రెడ్డి, ప్రబావతి, వెంకట్రామిరెడ్డి, శివారెడ్డి, పోతిరెడ్డి, లక్ష్మినారాయణ, రామాంజినేయులు, నిమ్మలకుంట శ్రీనివాసులు, మారుతిరాజు, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహానికి భూమి పూజ పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో నిర్మిస్తున్న బీసీ బాలుర వసతి గృహానికి ఎమ్మెల్యే భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతు విద్యతోపాటు క్రీడలలోనూ రాణించేలా అధ్యాపకులు విద్యార్థులను తీర్చి దిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి, అధ్యాపకులు చాంద్ బాషా, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.