న్యాయవాది కారును ఢీకొన్న కానిస్టేబుల్‌ కారు | Lawyer car collision with Constable car | Sakshi
Sakshi News home page

న్యాయవాది కారును ఢీకొన్న కానిస్టేబుల్‌ కారు

Published Mon, Dec 19 2016 12:31 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Lawyer car collision with Constable car

= పోలీస్‌ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు 
ధర్మవరం అర్బన్‌ : కర్నూలుకు చెందిన న్యాయవాది నాగమణి  అద్దె వాహనంలో పుట్టపర్తికి వచ్చి తిరిగి వెళ్తుండగా ధర్మవరంలోని సబ్‌జైలు సమీపంలో  రూరల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ కారుతో వచ్చి ఆదివారం సాయంత్రం ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో న్యాయవాది ప్రయాణిస్తున్న కారు డోరు డ్యామేజీ అయ్యింది. న్యాయవాదితోపాటు డ్రైవర్‌ శ్రీనివాసులు సదరు కానిస్టేబుల్‌ను నిలదీశారు.

ఆయన స్పందించకపోవడంతో బాధితులు పట్టణ సీఐ హరినాథ్‌కు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వాహనాన్ని నడపడమే కాకుండా కారును ఢీకొన్నాడని బాధితులు పట్టణ సీఐకు తెలియజేశారు. సీఐ కేసు విచారిస్తున్నారు. తమకు రాత్రి 9 గంటలైనా న్యాయం చేయలేదని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement