రెచ్చిపోయిన కూటమి శ్రేణులు.. ధర్మవరంలో ఉద్రికత్త..కేతిరెడ్డి వాహనాన్ని | TDP and BJP Activists Attack on Kethireddy Venkatarami Reddy at Dharmavaram | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన కూటమి శ్రేణులు.. ధర్మవరంలో ఉద్రికత్త..కేతిరెడ్డి వాహనాన్ని

Published Mon, Sep 23 2024 6:57 PM | Last Updated on Tue, Sep 24 2024 1:58 PM

TDP and BJP Activists Attack on Kethireddy Venkatarami Reddy at Dharmavaram

శ్రీ సత్యసాయి, సాక్షి: ఏపీలో​ కూటమి శ్రేణులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలు దౌర్జన్యానికి దిగారు.
 
ధర్మవరం సబ్‌జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పరామర్శించారు. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 

అడ్డొచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దాడుల్ని కవర్‌ చేస్తున్న సాక్షి ప్రతినిధులపై దాడి చేశారు. ఫోన్లను లాక్కొని ధ్వంసం చేశారు. అయితే కూటమి శ్రేణులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

చదవండి : తిరుమలలో భూమన ప్రమాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement