తనకంటివారిపల్లె నుంచి ప్రజాసంకల్పయాత్ర | ys jagan prajasankalpa yatra begin at Tanakontivari Palli | Sakshi
Sakshi News home page

తనకంటివారిపల్లె నుంచి ప్రజాసంకల్పయాత్ర

Published Tue, Dec 19 2017 8:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan prajasankalpa yatra begin at Tanakontivari Palli - Sakshi

సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారానికి 39వ రోజుకు చేరింది. ఆయన ఇవాళ ఉదయం ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి 8:30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. రామసాగరం క్రాస్, యడలంకపల్లె క్రాస్ మీదుగా 10 గంటలకు మరల గ్రామానికి చేరుకుని రైతులతో వారి సమస్యలపై చర్చిస్తారు. డీడీ కొట్టాలకు చేరుకున్న అనంతరం 12:30 గంటలకు అక్కడ భోజన విరామం తీసుకుంటారు.

2:45 గంటలకు బుక్కపట్నం నుంచి పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. 3:15 గంటలకు మంగళ మడక క్రాస్ చేరుకుంటారు. అక్కడినుంచి ధర్మవరం నియోజకవర్గంలోని గరుగు తాండ, 4.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్ మీదుగా సాయంత్రం 5 గంటలకు పాముదుర్తి వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement