కత్తితో బెదిరించి రూ.11 వేలు నగదు, చేతి గడియారం, సెల్ ఫోన్ లాక్కున్నారు. రూరల్ సీఐ మురళీ కృష్ణ, ధర్మవరం రూరల్ ఎస్‌ఐ యతీంద్ర, బత్తలపల్లి ఎస్‌ఐ హారున్‌బాషా, ఏఎస్‌ఐ నాగప్ప, కానిస్టేబుళ్లు శివ, నరేష్, వేణు, నల్లప్ప, సాయి, చక్రధర్, లాలూ, సురేష్‌లు ప్రత్యేక బృందంగా ఏర్పడి, దోపిడీ ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఇది వరకే నిందితుడిగా ఉన్న శ్యాంను అరెస్ట్ చేయగా, అప్పట్లో పూసల పంజు, సింహాద్రి, శ్రీనివాసులు పారిపోయారు. వీరిని ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి టార్చిలైట్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
అంతర్రాష్ట్ర దారిదోపిడీ ముఠా అరెస్ట్
Published Mon, Mar 6 2017 12:27 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
ధర్మవరం రూరల్: జాతీయ రహదారిపై దారి దోపిడీలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్ల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 8న ధర్మవరం మండలం శీతారాంపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఐచర్‌ను ఆపి, డ్రైవర్ మహేంద్ర మూత్రం పోయడానికి రోడ్డు పక్కకు వెళ్లాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన బళ్లారికి చెందిన శ్యాం, పూసల పంజు, కనేకల్లు మండలం ఎర్రగుంటకు చెందిన సింహాద్రి, శ్రీనివాసులు లారీ డ్రైవర్‌పై దాడి చేసి, రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి లాక్కెళ్లారు.

Advertisement
Advertisement