తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించొద్దు | Secretariat Employees Union President Venkatram Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించొద్దు

Published Tue, Jan 7 2020 5:42 PM | Last Updated on Tue, Jan 7 2020 7:04 PM

Secretariat Employees Union President Venkatram Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: కొన్ని మీడియా సంస్థలు.. సచివాలయ ఉద్యోగుల్లో  గందరగోళం సృష్టిస్తున్నాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 22ప సచివాలయం తరలింపు అంటూ చేస్తోన్న తప్పుడు ప్రచారంతో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రాజధానులపై  ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని... ఉద్యోగులకు నిర్ణీత సమయం ఇస్తుందని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నుంచి తరలించినప్పుడు ఇష్టానుసారంగా చేశారని. ఈ ప్రభుత్వం ఉద్యోగుల సానుకూల ప్రభుత్వమని చెప్పారు. ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టేవిధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో రాజధాని కట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. రాజధానికి అమరావతి అనుకూలం కాదని శివరామకృష్ణన్‌ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement