Secretariat employees union
-
సీఎం జగన్ ను కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
-
సచివాలయ ఉద్యోగులకు.. కొత్త పే స్కేల్ వేతనాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వోద్యోగుల మాదిరిగా తొలిసారి పే–స్కేల్, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన వేతనాలు అందుకోనున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్ట్‌లో పాసైన ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రభుత్వం జూలై 1వతేదీ నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వారంతా జూలై నెలకు సంబంధించిన వేతనాలను ఆగస్టు 1వ తేదీ నుంచి అందుకోబోతున్నారు. పీఆర్సీ కమిటీ చెప్పకున్నా.. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కోసం 2018లో కమిటీ ఏర్పాటు చేసే నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అన్నదే లేదు. 2019 మే నెలాఖరున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. పీఆర్సీ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తమ నివేదికలో ఎలాంటి పెరుగుదలను సూచించలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక జీవో తెచ్చి ప్రొబేషన్ ఖరారైన సచివాలయ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా పే – స్కేల్ అమలు చేసిన దాఖలాలు లేవు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం పొందుతున్నారు. వాటి స్థానంలో పే– స్కేల్‌తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ నెల 20వతేదీ నుంచే ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల బిల్లులను ప్రభుత్వానికి సమర్పించే డ్రాయింగ్, డిస్పర్స్‌మెంట్ ఆఫీసర్స్–డీడీవోలు ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. ఆయా డీడీవోల పరిధిలో ఎంత మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారైంది? ఎంత బిల్లులు అప్లోడ్ అయ్యాయనే వివరాలు సేకరించి ఇబ్బందులుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఇటీవల డీడీవోల బదిలీల కారణంగా బిల్లుల సమర్పించడంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల డీడీవోలు వివిధ కారణాలతో బిల్లులు అందించడం ఆలస్యమైనా 30వతేదీ వరకు వచ్చే బిల్లులను కూడా అనుమతించారు. ఆది నుంచి ఆటంకాలు సృష్టిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచే ప్రతిపక్ష పార్టీలు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించాయి. ఇంటర్వ్యూలు లేకుండా రాతపరీక్ష ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అధికార పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని దుష్ప్రచారం చేశాయి. పోటీ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులే అందులోనిజం లేదని తేల్చారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయటాన్ని సహించలేక అవి తాత్కాలికమేనని, జీతాలు పెరగవంటూ ఉద్యోగులను కించపరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేశారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు విపక్షాలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ప్రతిసారీ సీఎం జగన్ సానుకూల వైఖరే.. ‘సచివాలయాల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు వీలు కాదని ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం చెప్పినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం వారిపై ఉన్న అభిమానంతో పెరిగిన కొత్త వేతనాల ప్రకారమే వారికి జీతాలివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తమకు సంబంధించిన అన్ని అంశాల్లో మేలు చేసేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రొబేషన్ ఖరారు అనంతరం తొలిసారి పే స్కేలు ప్రకారం వేతనాలు అందుకోనున్న ఉద్యోగులకు అభినందనలు’ – కాకర్ల వెంకట్రామిరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు గుండె నిండా అభిమానంతో సెల్యూట్ ‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే జీవిత ఆశయం నెరవేరుతున్న వేళ గుండె నిండా అభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌కు సెల్యూట్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నూతన పేస్కేల్ వర్తింపజేయడంతో ఇన్నాళ్లూ విమర్శలు చేసిన వారి నోర్లు మూగబోయాయి. సచివాలయ ఉద్యోగులకు ఇది శుభవార్త కాగా కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచింది. –ఎం.డి.జాని పాషా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ మేలు మరువలేం.. ఒకేసారి 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు ముఖ్యమంత్రి జగన్. ఆయనకు సచివాలయాల ఉద్యోగులు, వారి కుటుంబాలన్నీ జీవిత కాలం రుణపడి ఉంటాయి. ఈ మేలు ఎప్పటికీ మరువలేం. –భీమిరెడ్డి అంజనరెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ సుతేజ్ (గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్) -
ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధం
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా ఉద్యోగుల సమావేశంలో చెప్పిన వాటినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియాకు చెప్పి అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ‘సీఎస్ మీడియా సమావేశం ఉద్యోగులను రెచ్చగొట్టినట్టయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కడ నష్టం జరుగుతోంది? వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ఆలోచించాలి. మేము ఎక్కువ కోర్కెలు కోరట్లేదు. మేము అనేక అంశాల్లో వెనక్కి తగ్గాం. జీతం తగ్గితే ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. కానీ జీవోలో 2019 నుంచి ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేస్తామంటున్నారు. అసలు మాకు చెప్పిందేమిటి.. చేస్తోందేమిటి? కొందరు అధికారులకు ఉద్యోగులను రెచ్చగొట్టడం తప్ప వేరే ఉద్దేశం లేనట్టుంద’ని మండిపడ్డారు. పీఆర్సీలో డీఏలు కలిపి జీతం పెరిగిందనే మాట చెప్పొద్దన్నారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ 4 శాతం తక్కువ ఇచ్చి, హెచ్ఆర్ఏలో 14 శాతం కోత వేసి.. జీతం పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పీఆర్సీ అమలు సమయంలో ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకోకుండా అధికారులు అత్యుత్సాహంతో ఎలాగైనా అమలు చేసేందుకు తాపత్రయ పడుతున్నారన్నారు. ఉద్యోగుల్లోని ఆందోళన, ఆవేదన గుర్తించి ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారికి మినిమం పే స్కేల్‌ను వర్తింపజేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఏటా వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సోమవారం మరోసారి ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు.. న్యాయమైన పీఆర్సీ కోసం ఒకే కార్యచరణ, ఒకే వాదనతో అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. గురువారం సచివాలయంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పరస్పర అంగీకారంతో ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ప్రతి ఉద్యోగి ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. విభజన దగ్గర నుంచి కరోనా వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొంత ప్రభావం ఉందనేది వాస్తవమేనని, అది ఉద్యోగుల జీతాలు తగ్గించాల్సినంతగా లేదన్నారు. ఉద్యోగులకు ప్రస్తుతం వస్తున్నదాని కంటే తగ్గకుండా జీతాలు ఉండాలని సీఎం సూచించినట్టు అధికారులు అనేకసార్లు చెప్పారన్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన దానికి.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల మధ్య చాలా వైరుధ్యం ఉందని తెలిపారు. ప్రతి ఉద్యోగి తన జీతంలో తగ్గుదలను గ్రహించి ఆందోళనకు దిగారన్నారు. ఎటువంటి భేషజాలకు పోకుండా అంతిమంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం కోసం నాయకులందరూ కలిసి పోరాటం చేస్తున్నట్టు వివరించారు. -
పీఆర్సీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజానికి.. పీఆర్సీ జాప్యంపై ఉద్యోగుల్లో కొంతవరకు అసంతృప్తి ఉన్నా, వారు ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకంగా లేరని ఆయన స్పష్టంచేశారు. కానీ, కొన్ని సంఘాల నాయకులు పదేపదే ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తగదని హితవు పలికారు. సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్‌లోని 92 సంఘాలు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయని.. రెండు సంఘాలు మాత్రమే తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకున్నాయన్నారు. ఆందోళన చేస్తున్న వారు గతంలో సీఎంను మూడుసార్లు కలిసినప్పుడు తమ మాజీ అధ్యక్షుడికి పదవి ఇవ్వమని అడిగారే తప్ప పీఆర్సీ గురించి ప్రస్తావించలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు మద్దతిచ్చారేమో గానీ సదరు నాయకులు కాదన్నారు. వీరు గతంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రచారంచేసి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశారని ఆరోపించారు. సీఎం చెప్పిన సమయం వరకూ వేచి చూడాల్సిన కనీస ధర్మం ఉద్యోగులుగా తమపై ఉందన్నారు. అప్పటికీ జాప్యం జరిగితే తమ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. -
ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ
సాక్షి, అమరావతి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) విషయంలో ఉద్యోగులకు స్పష్టత ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ అమలు ఉంటుందన్నారు. సచివాలయ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రభుత్వంతో చర్చిస్తామని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు చెప్పాయని, దీంతో.. వారంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నివేదికపై స్పష్టత ఇస్తామని సీఎస్ చెప్పారన్నారు. కొన్ని అనివార్య కారణాలతో సీఎం మాట్లాడడం కుదర్లేదని.. దీంతో ఉద్యోగ సంఘాల వినతి మేరకే బుధవారం సాయంత్రం సీఎస్ ముఖ్యమంత్రిని కలిశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో.. గత జేఎస్సీ సమావేశానంతరం పరిణామాలు, సీఎంతో చర్చించిన అంశాలను వివరించేందుకు శుక్రవారం (ఈనెల 12న) మధ్యాహ్నం మరోసారి అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ అమలు సాధ్యంకాదన్నారు. నివేదికపై అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి చర్చించుకుని సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించారు. కేంద్రం హెచ్ఆర్ఏను తగ్గించడం, తెలంగాణ కూడా తక్కువ ఇస్తున్నందున రాష్ట్రంలో హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగులకు నష్టం జరగకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సానుకూల పరిస్థితులను అర్థంచేసుకోకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం, అధికారులపై ఆరోపణలు చేయడం బాధాకరమని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేవలం మైలేజీ పెంచుకునేందుకు అనవసర నిరసనలు చేస్తున్నారన్నారు. తాము పీఆర్సీపై ఆందోళన చెందడంలేదన్నారు. -
AP: ప్రభుత్వంపై విమర్శలు బాధాకరం: వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: రేపు(శుక్రవారం) మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రేపటి సమావేశం తర్వాత పీఆర్సీపై స్పష్టత రానుంది. రిపోర్ట్ ఇవ్వకుండా పీఆర్సీపై మాట్లాడం అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సీఎంతో చర్చించిన తర్వాత రేపు సీఎస్ సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్ పీఆర్సీపై సీఎంను కలిశారన్నారు. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాల విమర్శలు బాధాకరమన్నారు. మైలేజ్ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయన్నారు. పీఆర్సీపై ఉద్యోగులకు క్లారిటీ ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. చదవండి: Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ -
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు గృహవసతి సదుపాయం మరో ఆరు నెలలు పొడిగించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరింది. ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఉచిత గృహవసతి సదుపాయం మరో 6 నెలలు పొడిగించేందుకు అంగీకరించారు అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. -
డీఏ పెంపు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: డీఏ పెంపుపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఏ ఉత్తర్వులు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ సచివాలయ సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించొద్దు
-
తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించొద్దు
సాక్షి, విజయవాడ: కొన్ని మీడియా సంస్థలు.. సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 22ప సచివాలయం తరలింపు అంటూ చేస్తోన్న తప్పుడు ప్రచారంతో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రాజధానులపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని... ఉద్యోగులకు నిర్ణీత సమయం ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నుంచి తరలించినప్పుడు ఇష్టానుసారంగా చేశారని. ఈ ప్రభుత్వం ఉద్యోగుల సానుకూల ప్రభుత్వమని చెప్పారు. ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టేవిధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో రాజధాని కట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. రాజధానికి అమరావతి అనుకూలం కాదని శివరామకృష్ణన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సచివాలయ ఉద్యోగుల అధ్యక్షునిగా మురళీకృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అ«ధ్యక్షునిగా వి.మురళీకృష్ణ ఎన్నికయ్యారు. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన 229 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 1,268 మంది ఓటర్లుండగా.. 1,183 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో మురళీకృష్ణకు 706 ఓట్లురాగా.. ప్రత్యర్థి వెంకట్రామిరెడ్డికి 477 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా జి.రామకృష్ణ, ఉపాధ్యక్షునిగా ఎస్.రమణయ్య, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇందిరారాణి, అదనపు కార్యదర్శిగా ఐపీఐ నాయుడు, సంయుక్త కార్యదర్శిగా ఎన్.ప్రసాద్, మహిళా సంయుక్త కార్యదర్శిగా వి.సూర్యకుమారి, స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీగా ఎన్ఎస్ పవన్‌కుమార్, కోశాధికారిగా బి.రామ్‌గోపాల్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఆర్‌ఎంజే నాయక్ వ్యవహరించారు. అధ్యక్షునిగా ఎన్నికైన మురళీకృష్ణకు పలువురు ఉద్యోగులు పూలమాలలేసి అభినందనలు తెలియజేశారు.