సచివాలయ ఉద్యోగుల అధ్యక్షునిగా మురళీకృష్ణ | Murali Krishna President Of employees Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల అధ్యక్షునిగా మురళీకృష్ణ

Published Fri, Feb 10 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

సచివాలయ ఉద్యోగుల అధ్యక్షునిగా మురళీకృష్ణ

సచివాలయ ఉద్యోగుల అధ్యక్షునిగా మురళీకృష్ణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అ«ధ్యక్షునిగా వి.మురళీకృష్ణ ఎన్నికయ్యారు. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన 229 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 1,268 మంది ఓటర్లుండగా.. 1,183 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో మురళీకృష్ణకు 706 ఓట్లురాగా.. ప్రత్యర్థి వెంకట్రామిరెడ్డికి 477 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా జి.రామకృష్ణ, ఉపాధ్యక్షునిగా ఎస్‌.రమణయ్య, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇందిరారాణి, అదనపు కార్యదర్శిగా ఐపీఐ నాయుడు, సంయుక్త కార్యదర్శిగా ఎన్‌.ప్రసాద్, మహిళా సంయుక్త కార్యదర్శిగా వి.సూర్యకుమారి, స్పోర్ట్స్‌ జాయింట్‌ సెక్రటరీగా ఎన్‌ఎస్‌ పవన్‌కుమార్, కోశాధికారిగా బి.రామ్‌గోపాల్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఆర్‌ఎంజే నాయక్‌ వ్యవహరించారు. అధ్యక్షునిగా ఎన్నికైన మురళీకృష్ణకు పలువురు ఉద్యోగులు పూలమాలలేసి అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement