సాక్షి, అమరావతి: డీఏ పెంపుపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఏ ఉత్తర్వులు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ సచివాలయ సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment