da hiked
-
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ వివరాలను వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా వీసీ సజ్జనార్..‘టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది’ అని తెలిపారు. తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు #TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన… pic.twitter.com/nqLnQC3IpM — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 4, 2023 ఇది కూడా చదవండి: TS: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు -
TS: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్‌ను పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో 50, జీవో 51లను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే పైన 2.73 శాతం చొప్పున డీఏ/డీఆర్‌ను ప్రభుత్వం పెంచింది. పెంచిన డీఏ/డీఆర్ జనవరి 2022 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి తాజాగా పెరిగిన డీఏ/డీఆర్‌ను జూలై నెల వేతనంతో కలిపి అందిస్తారు. గతేడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ, డీఆర్ పెంపుదలతో రాష్ట్రవ్యాప్తంగా 7.28 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు సంబంధించిన బకాయిలు రూ.1,380.09 కోట్ల చెల్లింపుపై ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. డీఏ పెరిగిందిలా.. కేటగిరీ ప్రస్తుత డీఏ– పెరిగిన డీఏ - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు: 20.02% నుంచి 22.75%కు పెంపు - యూజీసీ/ఏఐసీటీఈ/ ఎస్ఎన్ జేపీసీ పేస్కేల్స్ (2016): 31% నుంచి 34%కు పెంపు - యూజీసీ/ఏఐసీటీఈ/ ఎఫ్ఎన్ జేపీసీ పేస్కేల్స్ (2006): 196% నుంచి 203%కు పెంపు - ఫుల్ టైమ్/ కంటింజెంట్: 148.068 శాతానికి పెరుగుదల - పార్ట్ టైం/ వీఆర్ఏలు: నెలకు రూ.100 చొప్పున పెరుగుదల (నోట్: డీఆర్ నిబంధన పరిధిలోనికి రాని పెన్షనర్లకు ఎలాంటి సవరణ ఉండదని, డీఆర్ సవరించిన పెన్షనర్లకు తదుపరి రూపాయిని కటాఫ్ గా నిర్ణయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.) ఇది కూడా చదవండి: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు -
డీఏ పెంపు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: డీఏ పెంపుపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఏ ఉత్తర్వులు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ సచివాలయ సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచారు. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. వచ్చే మార్చి నెల జీతాలతో కలిపి డీఏ చెల్లించనున్నారు. బకాయిలను ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.