venkatarami reddy
-
కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోంది
-
వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు
-
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి ఖండించారు. ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం, నియంతపాలన అనడం దుర్మార్గమని పేర్కొన్నారు.ఈ మేరకు వెంకటరామిరెడ్డి గురువారం చేసిన ప్రకటనలో వెంకటరామిరెడ్డి ఇంకా ఏమని పేర్కొన్నారంటే.. 2014–19 మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డీఏ కేసులు పెట్టడం నిజం కాదా? అందులో మూడు, నాలుగు కులాలకు చెందినవారే 70 శాతానికిపైగా ఉండటం వాస్తవం కాదా? కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి వాటిమీద కమిటీని వేయించింది గుర్తులేదా? ఈ ఐదేళ్లలో డీఏ కేసులతో ఎవరినైనా వేధించారా? గతంలో ఒక మహిళా ఉద్యోగిని పట్టపగలు జుట్టుపట్టుకుని ఈడ్చికొడితే కనీసం కేసు పెట్టారా?కరోనా సమయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడిలో ఉద్యోగులను పరుషంగా మాట్లాడితే ఆయన తరఫున ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా? అసలు గతంలో ఏనాడైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా? ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా? కళ్లముందు ఇన్ని వాస్తవాలు కనపడుతుంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో ఉద్యోగులు గమనించాలి. సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ జస్టిస్‌లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్‌రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై కాకర్ల వెంకట్రామిరెడ్డి ఫైర్
-
ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ
-
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అడుగులు వేస్తే మంచిది
-
సీఎం వైఎస్ జగన్ లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి
-
బాబుకు జీవిత ఖైదు..? న్యాయవాది రియాక్షన్..
-
దర్యాప్తు చేపడితే..బాబు, చినబాబు జైలుకే!
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై దర్యాప్తు సంస్థలు విచారణకు స్వీకరించి నేరం రుజువైతే బాబుతో పాటు ఆయన తనయుడు చిన్నబాబు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రముఖ న్యాయవాది, కార్పొరేట్ న్యాయ నిపుణుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఐటీ నోటీసులపై ఈడీ సుమోటోగా దర్యాప్తు చేపట్టవచ్చన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయొచ్చని వెల్లడించారు. పూర్తి ఆధారాలు, సాక్ష్యాలను ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని.. ఇవి నిజమేనని తేలితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌ను, అందులోని అవినీతిని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా రూ.వందల కోట్లు స్వాహా చేసినట్లు, బాబుకు ఎవరి ద్వారా, ఏ కంపెనీ ద్వారా ఎంతెంత అందింది.. తదితర వివరాలను ఆధారాలతో సహా ఐటీ శాఖ వెల్లడించింది. దీనిపై వెంకటరామిరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. తప్పించుకునే యత్నమెందుకు? ఓ రాజకీయ పారీ్టకి అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులకు బాధ్యతగా వివరణ ఇవ్వాలి. నేరమేమీ చేయనప్పుడు ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే యత్నం ఎందుకో చెప్పాలి. వారడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా.. అసలు తనకు నోటీసులిచ్చే అధికారమే లేదని బాబు పలుమార్లు లేఖ రాయడం చూస్తుంటే నేరం చేసినట్లు భావించాల్సి వస్తోంది. సెక్షన్–127 ప్రకారం నోటీసులిచ్చే అధికారం ఉందని ఐటీ అధికారులు స్పష్టంచేశారు. నేరుగానైనా కావొచ్చు.. తన అనుచరుల ద్వారానైనా కావొచ్చు.. రూ.118.98 కోట్లు బాబుకే అందాయని ఐటీ వివరాలతో సహా కుండబద్దలు కొట్టింది. 2023, ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులో అదే నెల 11న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలన్నారు. దీనిని నేరుగా బాబు నివాసమైన ప్లాట్ నంబర్ 1310, రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్ ఇంటికి పంపారు. ఆయన వద్ద సరైన వివరణ ఉండి ఆ రోజున హాజరై చెప్పి ఉంటే.. ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. కనీసం ఎప్పుడు హాజరై వివరణ ఇస్తారో కూడా చెప్పడంలేదని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొనడం చూస్తుంటే అందులోని అంశాలు పూర్తి వాస్తవమేనని స్పష్టమవుతోంది. బోగస్ కంపెనీలు సృష్టించి.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని, ఐదు కంపెనీల వాళ్లు ఇచ్చిన మెటీరియల్ పేపర్లు, బాబు పీఏ శ్రీనివాస్‌ను పరిచయం చేసిన ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఆ ముగ్గురు భారత్, దుబాయ్, ఇతర చోట్ల నుంచి నగదు తెచ్చి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఉంది. తాము కాంట్రాక్టులు తీసుకుని.. ఎన్నికల నిధుల కోసం ఖర్చుపెట్టేందుకు టీడీపీకి ఇచ్చినట్లు స్టేట్మెంట్లో వెల్లడించారు. నోటీసుల్లో కూడా నగదంతా షాపూర్జీ పల్లోంజీ నుంచి చంద్రబాబుకే అందినట్లు ఉంది. షలక, అన్నై (ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలియా) నుంచి రూ.33,76,18,207, ఎవరెట్ అండ్ నయోలిన్ (షీట్ ఫ్రమ్ విక్కీ మొబైల్) నుంచి రూ.50,43,00,000, పోర్ ట్రేడింగ్ నుంచి రూ.9,42,00,000, హార్డ్రిటన్ షీట్ (లక్స్టోన్ అండ్ కో) నుంచి రూ.10,23,00,000, దుబాయ్ నుంచి రూ.15,13,95,000లు చంద్రబాబుకు అందాయని.. ఇందులో రూ.118.98 కోట్లను మాత్రం ఆదాయంలో చూపలేదని కంపెనీల వారీగా వివరాలు వెల్లడించింది. షాపూర్జీ పల్లోంజీ నుంచి నగదును తీసుకునేందుకు ప్రైవేట్ డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు సృష్టించారు. బోగస్ కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, బోగస్ నామినేషన్లు అంటూ.. ‘బోగస్’ అనే పదాన్ని ఐటీ శాఖ తన నోటీసుల్లో స్పష్టంగా పలుమార్లు పేర్కొంది. సెక్షన్ 132(4), 5(బీ) కింద మనోజ్ స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆయన కూడా అదంతా వాస్తవమేనని సంతకం పెట్టారు. స్టేట్మెంట్లు ఇచ్చిన వారు చంద్రబాబు, అతని పీఎస్ పేరుతో పాటు లోకేశ్ పేరును వెల్లడించారు. విక్కీ అనే వ్యక్తి ద్వారా లావాదేవీలన్నీ జరిగినట్లు, నేరుగా చంద్రబాబు కూడా కొన్ని చెప్పినట్లు ఐటీ తన నోటీసుల్లో పేర్కొంది. అరెస్టు చేసి.. దర్యాప్తు చేపట్టవచ్చు.. ఇప్పటికే ఐటీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదు. ఒకవేళ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందని పక్షంలో పెద్దఎత్తున జరిమానాలు విధించవచ్చు. 25 శాతం అదనపు పన్నుతో పాటు వడ్డీ కూడా విధించవచ్చు. నేరం జరిగినట్లు తేలితే.. రూ.118.98 కోట్లకు 300 శాతం అంటే రూ.356.94 కోట్లు వసూలుచేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. అరెస్టుచేసే అధికారం కూడా ఉంటుంది. దుబాయ్ నుంచి కూడా నగదు అందడం.. పలు కంపెనీల నుంచి డబ్బు స్వీకరించడం.. క్విడ్ ప్రో కోతో పాటు మనీలాండరింగ్ కిందికి వస్తుంది. దీంతో ఈడీ కూడా సుమోటోగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈడీనే కాదు.. పీఎంఎల్ఏ, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయవచ్చు. అంతేకాక.. సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. 2019 తర్వాతవే ఆ రూ.118.98 కోట్లు.. ఇక 2019 తర్వాత వచ్చినవే ఆ రూ.118.98 కోట్లు అయితే.. మరి 2014 నుంచి ఎన్ని డొల్ల కంపెనీలు నెలకొల్పారు.. ఎన్ని వేల కోట్లు ప్రజా ధనం కొల్లగొట్టారు.. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఈ కుంభకోణం వివరాలన్నీ బహిర్గతం కావు. ఇదంతా ప్రజల డబ్బు. దీనిపై ప్రజలెవరైనా కోర్టు ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు కోరవచ్చు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు
-
ఉద్యోగులను సీఎం జగన్ అన్న అని ఎందుకు పిలుస్తారంటే
-
టీడీపీ వాళ్ళకి ఇది కొత్త ఏం కాదు
-
టెక్నాలజీనే నమ్ముకుంటే ప్రమాదమే..
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు లక్షల మంది ఉద్యోగార్ధులకు సంబంధించిన అంశంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టతోనూ ఇమిడి ఉంటాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (2005–11) చైర్మన్‌గా, యూపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరగాళ్లు సులువుగా రూ. కోట్లు కొట్టేస్తున్న రోజుల్లో కీలకమైన ప్రశ్నపత్రాలను కేవలం టెక్నాలజీతో భద్రంగా ఉంచడం ఎంతవరకు సాధ్యమనే సందేహాన్ని ఆయన వెలిబుచ్చారు. సాంకేతికను కొంతవరకు నమ్ముకొని గత విధానాలను అనుసరిస్తే పేపర్ లీక్ వంటి ఘటనలకు తావుండబోదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు అనేక అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... మానవసహిత భద్రతకే ప్రాధాన్యమివ్వాలి... పాస్వర్డ్ లేదా ఓటీపీని తెలుసుకొని కేటుగాళ్లు రూ. కోట్లు కొల్లగొడుతున్న రోజులివి. కంప్యూటర్ యుగంలో రోజుకో సమస్య తెరపైకి వస్తోంది. అలాంటప్పుడు కేవలం సాంకేతికతపై ఆధారపడటం సరికాదేమో. టెక్నాలజీని అనుసరించడం అనివార్యమే అయినప్పటికీ లక్షల మంది జీవితాలతో ముడివడిన ఇలాంటి పరీక్షలపట్ల అప్రమత్తత అవసరం. మానవసహితమైన భద్రత కే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదనేది నా అనుభవం. అప్పట్లో ఏం చేశామంటే.. నేను ఆరేళ్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశాను. నా హయాంలో ఏనాడూ పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోలేదు. అప్పట్లో మేం అనుసరించిన విధానాలు వేరు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలాంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో అనుసరించిన విధానాలు లీక్‌లకు ఆస్కారం లేకుండా చేశాయి. ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు ఎగ్జామినర్లను పిలిచేవాళ్లం. వారిని పూర్తి భద్రత ఉన్న హాలులోకి పంపే ముందే సమగ్రంగా పరీక్షించే ఏర్పాట్లు ఉండేవి. వాళ్ల వద్ద పెన్ను, పెన్సిల్ ఆఖరుకు చిన్న కాగితం ముక్క కూడా లేకుండా జాగ్రత్త పడేవాళ్లం. వారు బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు ఉండేవి. ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశాలనేవీ వారు రాసుకొని వెళ్లేందుకు వీల్లేకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొనేవాళ్లం. ప్రశ్నపత్రం చైర్మన్‌కు కూడా తెలిసేది కాదు... ఒక్కో సబ్జెక్ట్ నిపుణుడు ఒక్కో పేపర్‌ను సెట్ చేశాక దాన్ని సీల్డ్ కవర్లో కమిషన్ సెక్రటరీకి అందజేస్తారు. సెక్రటరీ తనకు అందిన ఐదు పేపర్లనూ కమిషన్ చైర్మన్ ముందు పెట్టేవారు. అందులోంచి ఒక పేపర్‌ను చైర్మన్ ఎంపిక చేశాక నేరుగా ప్రింటింగ్ కేంద్రానికి తరలేది. ఇక్కడ కమిషన్ చైర్మన్ లేదా సెక్రటరీ ప్రశ్నపత్రాన్ని చూసే అవకాశం లేదు. అలాగే ఎంపిక చేసిన పేపర్ ఏమిటనేది దాన్ని సెట్ చేయడానికి వచ్చిన ఐదుగురికి తెలిసే అవకాశమే ఉండదు. ప్రింటింగ్ కేంద్రం నిర్వాహకులకు మాత్రమే ఈ పేపర్ ఏమిటనేది తెలిసే అవకాశం ఉంటుంది. పేపర్ లీక్ అయితే కేవలం ప్రింటర్‌ను మాత్రమే బాధ్యుడిని చేసేలా అప్పట్లో నిబంధనలుండేవి. ఒకవేళ పేపర్ లీక్ అయితే ప్రింటర్‌కు భారీ జరిమానా విధించేలా నిబంధనలు తెచ్చాం. పేపర్ లీక్ అయితే ప్రింటర్ ఆస్తులన్నీ జరిమానా కింద పోయేంత ప్రమాదం ఉండేది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి రిస్‌్కను ప్రింటర్ తీసుకొనే అవకాశం ఉండేది కాదు. ఈ విధానాన్ని అనుసరించడం వల్లే అప్పట్లో పేపర్ లీకేజీలు ఉండేవి కావు. భద్రత ఎంత వరకూ? పేపర్ల లీకేజీపై పత్రికల్లో వస్తున్న కథనాలనుబట్టి ఒక వ్యక్తి పాస్వర్డ్ తీసుకొని ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడున్న టెక్నాలజీపై అనేక అనుమానాలు రావడం సహజమే. ఇది ఎంతవరకు భద్రత ఇస్తుందనేది ఇందులో ప్రధానాంశం. తాత్కాలిక ఉద్యోగులు ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే వాదన అర్థరహితం. ఇప్పుడే కాదు... అప్పట్లోనూ తాత్కాలిక ఉద్యోగులు ఉండేవారు. కేవలం కమిషన్ నిర్వహణలో విశ్వసనీయతే ఇక్కడ ప్రధానం. ఏ వ్యక్తీ ప్రశ్నపత్రం చూసే అవకాశం లేకుండా చేయడమే ఇక్కడ ముఖ్యం. మళ్లీ పరీక్ష అనివార్యమే.. పేపర్ లీకేజీ వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించడం అనివార్యమే. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి వర్గాల మనో వేదన వర్ణనాతీతం. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్న వాళ్లున్నారు. ఎన్నో ఆశలతో ఇదే జీవితమని భావించి చదివిన వాళ్లూ ఉన్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే వారికి సమస్యే. కోచింగ్ కోసం మళ్లీ అప్పులపాలవ్వాల్సిన పరిస్థితి వారికి ఉండొచ్చు. ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు. పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వారి ఆవేదనకు కమిషన్ కారణం కాకుండా చూడొచ్చు. -
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నంద్యాల (అర్బన్): ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాలలో శ్రీనివాస సెంటర్ నుంచి టెక్కె మార్కెట్ యార్డు వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపు 4 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టెక్కె మార్కెట్ యార్డులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 76 ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్లలో 3,798 మంది వీఆర్ఏలకు ప్రభుత్వం వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించిందన్నారు. వీఆర్ఓలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతుల విషయం, ఇతరత్రా ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. 25 ఏళ్లుగా ప్రమోషన్లకు నోచుకోని 230 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీనే ఆబ్కాస్ ద్వారా వేతనాలు.. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు.. త్వరలో ఇంకో 14 వేల పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నో విషయాల్లో ప్రభుత్వం ముందుకు అడుగులు వేసిందని చెప్పారు. రాధాకృష్ణా.. మీ ముత్తాతలు దిగిరావాలి సెక్రటేరియేట్ ఎన్నికల్లో నేను ఓడిపోతానని ‘ఆంధ్రజ్యోతి’లో రాధాకృష్ణ ఎడిటోరియల్ రాశారు. సంపూర్ణ మెజార్టీతో గెలిస్తే.. జగన్ బంటు ఎలా గెలిచారని మరో కథనం రాసి రాక్షసానందం పొందారు. జగన్ బంటునే ఓడించలేని రాధాకృష్ణ.. జగన్‌ను ఓడించగలరా? చెత్త మాటలు.. చెత్త రాతలు. మీ తాత ముత్తాతలు దిగి వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ఈ ఎల్లో మీడియా వైరస్‌ను ప్రభుత్వ ఉద్యోగులు తరిమి కొట్టాలి. అవసరమైనప్పుడు ఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా ఉండాలి. -
సీఎం జగన్ ను కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
-
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి విజయం
-
సీఎం జగన్ గారిది పెద్ద చేయి.. ఆయనను చూసి మాకు చాలా బాధేసింది: వెంకటరామిరెడ్డి
-
వెంకట్రామిరెడ్డి నామినేషన్ స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వెంకట్రామిరెడ్డి సహా టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన పి.వెంకట్రామిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణలు పెండింగ్‌లో ఉండటం తో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఆయన పదవీ విరమణపై నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఆయన నామినేషన్ తిరస్క రించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. -
డీఏ పెంపు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: డీఏ పెంపుపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఏ ఉత్తర్వులు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ సచివాలయ సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
ఉద్యోగుల డీఏ మార్గదర్శకాలపై జీవోకు సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల డీఏకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంవో అధికారులను ఆదేశించినట్టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. వీఆర్వో ల సమస్యలు విని, వారి సర్వీస్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల మేనిఫెస్టోలో పె ట్టి, చెప్పినట్టుగానే సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్న తి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఏపీ వీఆర్వోల సంఘం నేతలు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు జీవో విడుదలకూ సీఎం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలపై ఆందోళన చెందుతున్నారని, పరీక్ష విధానాన్ని, సిలబస్‌ను సులభతరం చేయాలని సీఎంను కోరగా.. దీనిపై అధికారులతో మాట్లాడతానని చెప్పినట్టు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, ఏపీ వీఆర్వోల సం ఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, సంఘ ప్రతినిధులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, అనిల్ పాల్గొన్నారు. -
ఓటమి భయం తోనే చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకున్నారు
-
‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరపవద్దని తాము ఎప్పుడూ అనలేదని.. కరోనా వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయనే చెబుతున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలకు సహకరిస్తామన్నారు. సీఎస్‌ను కలిసి తమ సమస్యలను చెప్తామని. మహిళా ఉద్యోగులను ఎన్నికల నుంచి మినహాయించాలని ఆయన కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. చదవండి: ‘దేశంలో కోరుకుంటున్న మార్పును ప్రభుత్వం చేసింది’ గతంలో ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?. పోలవరం, నవనిర్మాణ దీక్షలకు బస్సులు పెట్టి ఉద్యోగులను తరలించలేదా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్షం తమ గురించి ఏ వ్యాఖ్యలు చేయలేదు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమపై రాజకీయాలు చేయొద్ధని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై తాము ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్ -
రైతు కల్లాల నిర్మాణంలో సిద్దిపేట ప్రథమ స్థానం
గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని సకల హంగులతో సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలీటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ పనుల ప్రగతిపై సైట్ వద్ద సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంపై ఆరా తీశారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కనకరత్నం, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాంచంద్రం, పీఆర్ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, తహశీల్ధార్లు అన్వర్, అరుణ తదితరులు పాల్గొన్నారు. రైతు కల్లాల నిర్మాణంలో జిల్లా ప్రథమం ములుగు(గజ్వేల్): రైతు కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, పల్లె ప్రకృతి వనాలతోగ్రామాల్లో పచ్చదనం వెల్లి విరుస్తుందని కలెక్టర్ వెంకట్రావిమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో శనివారం కల్లం నిర్మాణంతో పాటు పల్లె పకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, కేబీఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ అధికారులను, గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కొన్యాల మమత, సర్పంచ్ కాయితి యాదమ్మ, కేబీఆర్ పౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్‌రెడ్డిలను అభినందించారు. ట్రైనీ కలెక్టర్ దీపక్‌తివారీ, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కలెక్టర్ ప్రకృతి వనంలో మొక్కను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ములుగు ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, వైస్ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, ఉపాథిహామి ఏపీడీ కౌసల్యాదేవి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
సాక్షి, సచివాలయం: అమరావతి పరిరక్షణ సమితిపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్లో చొప్పించారని, అందుకే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యామన్నారు. రాజధాని బిల్లు పాస్ అయితే కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. (రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం) ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరిని తక్షణం రావాలని ఇబ్బందులు పెట్టొద్దని కూడా విజ్ఞప్తి చేసినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. రాజధాని తరలింపు కోసం 5 వేల కోట్లు అవుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పినట్లు వెల్లడించారు. (అమెజాన్ ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్) -
రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, అమరావతి: రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు పిటిషన్లో 'రాష్ట్ర రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయి. అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం. కొందరి రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారు. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. రాజధాని తరలింపు కు అయ్యే ఖర్చు 70 కోట్ల మాత్రమే. రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించలేదు' అని పిటిషన్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. (రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం: వైఎస్ జగన్) -
3 ఏపీపీఎస్సీలను ఏర్పాటు చేయాలి
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడు గౌరవప్రదంగా రాజీనామా చేయాల్సి ఉంటుందని, కానీ ఉదయ్ భాస్కర్ మాత్రం ఇంకా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కుట్ర పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాజధానుల తరహాలోనే మూడు ఏపీపీఎస్సీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే విధానం కొనసాగుతోందన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు
అనగనగా ఓ అమ్మ. అమ్మ ఎక్కడున్నా ప్రత్యేకతే కదా! ప్రతి అమ్మ తన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసమే పరితపిస్తుంది. అయితే ఈ అమ్మ మాత్రం కుటుంబంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం పరితపించింది. అదే ఆమెను అరుదైన వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చేస్తోంది. 87 యేళ్ల వయసులో ఇంతటి ఖ్యాతిని గడించిన ఆమె ఎవరో కాదు.. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ. కేవలం వెంకట్రామిరెడ్డి ఒక్కరే కాదు.. ఆమె భర్త ఎల్లారెడ్డి భీమిరెడ్డితో సహా నలుగురు కుమారులూ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ‘ప్రజాభిమానం దక్కాలంటే నిరంతర శ్రమ ఉండాలి’ అని చెప్పే లలితమ్మ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే... – ఆదోని/గుంతకల్లు ఓ చిన్నపాటి రాచరిక వ్యవస్థనే.. మాది కర్నూలు జిల్లా ఆదోని దగ్గర ఉండే బద్నాల గ్రామం. అక్కడే పుట్టి పెరిగా. అదో చిన్నపాటి రాచరికం లాంటి కుటుంబం. మా తాతగారు తమ్మిరెడ్డి... బ్రిటీష్ వారి కాలంలో రావూబహుద్దూర్ బిరుదు పొందారు. వాళ్ల సంతానమైన హరిశ్చంద్రారెడ్డి అంటే మా నాన్నగారు అదే స్థాయిలో ప్రజా సంబంధాలు నెరిపేవారు. ఆ రోజుల్లో మా తాత వాళ్లు పొరుగూళ్లకు వెళ్లాలనుకుంటే వారు వచ్చేవరకూ బద్నాల వద్ద రైలు కదిలేది కాదు. దానిని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. నాకు పన్నెండేళ్ల వయసులో ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో వివాహమైంది. అప్పటి నుంచి మాకు ప్రత్యేకించి అనంతపురం జిల్లాతో అనుబంధం ఏర్పడింది. మా ఆయనను కర్నూలు జిల్లా రాంపురంలోని పార్వతమ్మ వాళ్లు దత్తత తీసుకోవడంతో రెండు జిల్లాలతో పరిచయ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. నాదెండ్ల వర్గానికి వెళ్లొదన్నా మా రెడ్డి (భర్త భీమిరెడ్డి) సొంతూరు ఉరవకొండ మండలం కొనకొండ్ల గ్రామం. ఆదోని దగ్గర బదెనేహళ్లు వద్ద చాలా పెద్ద ఆస్తి ఉండడం వల్ల ఫ్యాక్టరీల నిర్వహణ చూసుకునేవాడు. 1983లో తెలుగుదేశంలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆరునెలలకే సంక్షోభం రావడంతో మా రెడ్డి నాదెండ్ల వర్గంలో చేరారు. ఆ నిర్ణయాన్ని ఆ రోజుల్లో నేను తీవ్రంగా వ్యతిరేకించాను. కాకపోతే ఎన్టీఆర్ ఒంటెద్దు పోకడలను తాను సహించలేకపోతున్నానని ఆయన అనేవాడు. అబ్బో చెప్పలేను కానీ.. మా రెడ్డికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన కేవలం ఎమ్మెల్యేగా కొంత కాలం మాత్రమే పనిచేశాడు. 1985లో ఆయన చనిపోయిన తర్వాత మా కొడుకులు రాజకీయాల్లోకి వచ్చేశారు. నేను ఎంత చెబితే అంతే .. ఎంతమంది పిల్లలనైనా తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. కానీ తల్లిదండ్రులను చూసుకోవడంలో పిల్లలు శ్రద్ధ తీసుకోవడం లేదు. సాధారణంగా ఇది చాలా మందిలో చూశా. కానీ మా ఇంట్లో పరిస్థితి వేరు. నేను ఏమి చెబితే మా కొడుకులైనా, కోడళ్లయినా, వారి పిల్లలైనా అదే వింటారు. వినాలి కూడా! మా తరం వారికి కాస్తా పట్టుదల ఎక్కువే. ముఖ్యంగా కొడుకులైతే నేను దగ్గరుంటే వారు విజయం సాధిస్తారన్న నమ్మకం బాగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ముగ్గురు కొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చిన్నవాడు వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టి ఎన్నికలకు నెల రోజుల ముందే గుంతకల్లుకు వచ్చేశా. ప్రచారంలో నా సలహాలు తీసుకుని ముందుకుపోయాడు. నిజమైన నాయకుడు రాజన్నే ముందు నుంచి మేము కాంగ్రెస్ వాదులమే. మరో బలమైన సామాజిక వర్గాన్ని ఢీ కొట్టాలంటే మేమైతేనే కరెక్ట్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజలు నమ్మూతూ వచ్చారు. తొలి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం ఎక్కువ. ఆయన కూడా మా పట్ల అభిమానంతో ఉండేవారు. నాయకుడంటే ఎలా ఉండాలో చూపించిన అంత గొప్ప వ్యక్తి మరెవ్వరూ ఉండరు. ఎంత మంది రాజకీయనాయకులున్నా నిజమైన నాయకుడు వైఎస్సారే. జగన్‌ను మరో బిడ్డగానే భావించా జగన్మోహన్రెడ్డి వయసులో చిన్నవాడే.. కానీ ఆలోచనలు, పట్టుదల, అనుకున్నది సాధించడం చూస్తే ఎవరైనా అతని తర్వాతేననిపిస్తుంది. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో వాళ్ల నాన్నను మించిపోయాడు. మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాడు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసేవాడు. ఒక్కరే కాకుండా భార్య భారతీరెడ్డిని కూడా పిలుచుకురావాలని ఒకసారి చెప్పా. అలాగే రాంపురంలో ఉన్నప్పుడు నా కోరిక తీర్చాడు. తన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చాడు. తనను కూడా కొడుకులాగానే భావిస్తున్నానని ఆ రోజుల్లోనే ఆయనకు నేను స్పష్టంగా చెప్పా. కొడుకులంతా ఎమ్మెల్యేలు నాకు మొత్తంగా ఏడుగురు సంతానం. మాకు అనుబంధం ఉన్న రెండు జిల్లాల్లోనూ వారు స్థిరపడ్డారు. మూడవవాడు జయరామిరెడ్డి చనిపోయాడు. పెద్ద కూతురు వరలక్ష్మి గుంతకల్లులోనే ఉంది. మొదటి కొడుకు సీతారామిరెడ్డి రాంపురం ఎంపీపీగా పనిచేశాడు. మూడో కొడుకు శివరామిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రస్తుతం వెంకటరామిరెడ్డి (గుంతకల్లు) సాయిప్రసాద్‌రెడ్డి (ఆదోని), బాలనాగిరెడ్డి (మంత్రాలయం) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చాలా గర్వంగా ఉంటుంది రెండు జిల్లాలోనూ మా బంధు బలగం చాలా పెద్దది. మా ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలున్నారని ఆశ్చర్యంగా అంటుంటే ఒక తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. మా కుటుంబం మొత్తంగా దగ్గర, దూరం చుట్టాలలో దాదాపు పాతిక మంది ప్రజాప్రతినిధులుంటారు. మా వాళ్లకు నేను చెప్పేదొకటే .. ప్రజాభిమానం కావాలనుకుని కలలు కంటే వచ్చేది కాదు. అది నిరంతర శ్రమ. రేపు ఏమవుతుందో చెప్పలేం. ఉన్నన్ని రోజులూ ప్రజలను ఇంటివాళ్లుగా భావించాలి. వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండాలి. దీనినే మా బిడ్డలకు చెబుతూ వచ్చాను. వారు పాటిస్తూ వచ్చారు. పేదసాదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, నూతన వస్త్రాలు అందిస్తుంటారు. ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరమైన వారిని గుర్తించి వారి చదువులకయ్యే ఖర్చు భరిస్తున్నారు. ఇంతకంటే విజయ రహస్యం ఏమీ ఉండదు. తల్లిదండ్రులు చేసిన సత్కార్యాలు పిల్లలకు రక్షణ కవచంలా ఉంటాయి. అది జగన్ విషయంలోనైనా.. మా పిల్లల విషయంలోనైనా ఇది వాస్తమని తేలింది. -
ప్రముఖ నిర్మాత కన్నుమూత
-
విజయా సంస్థల అధినేత కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయ వాహిని సంస్థల వ్యవస్థాపకుడు నాగిరెడ్డి అనంతరం విజయా ప్రొడక్షన్ పై పలు చిత్రాలను నిర్మించిన వెంకట్రామిరెడ్డి కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమంగా మారటంతో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతుండగా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు బార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయా సంస్థల్లో 17 సంవత్సరాల అనంతరం తిరిగి సినిమా నిర్మాణాన్ని చేపట్టిన వెంకట్రామిరెడ్డి విజయా పతాకంపై బృందావనం, బైరవదీపం, కృష్ణార్జునయుద్దం చిత్రాలను నిర్మించారు. అనంతరం తమిళనంలో అజిత్ తో వీరం, విజయ్ తో భైరవ, ధనుష్ తో పడికాదవన్, విశాల్ తో తామ్రభరణి చిత్రాలను నిర్మించారు.ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను ఆయన అందిస్తూ వచ్చారు. కాగా వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.సోమవారం ఉదయం నెసపాక్కంలోని విద్యుత్ దహన వాటికలో వెంకట్రామిరెడ్డికి తుదిక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. -
కులం లేదు.. ఎవరూ పట్టించుకోరు!
సాక్షి, అనంతపురం: ‘మాకు కులం గుర్తింపు లేదు. ఎన్నిమార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. పిల్లలను బడిలో చేర్పించాలంటే కుల ధ్రువీకరణ అడుగుతున్నారు. ఇల్లు మంజూరు చేయాలంటే కులధ్రువీకరణ పత్రం అడుగుతున్నారు. ఏదో ఒక కులంగా గుర్తించమంటే పట్టించుకోవడం లేదు’ అని నగరంలోని బుడ్డప్పనగర్ షికారీలు శివమ్మ, గౌరి, లక్ష్మీ, చిరంజీవి తదితరులు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం 24వ డివిజన్లో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతతో పాటు వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగే పరుశురాం, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు మీసాల రంగన్న, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి తదితరులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ‘నవరత్నాల’æ పథకాల గురించి తెలియజేశారు. కాలువలు శుభ్రం చేయడం లేదు కాలనీలో కాలువలు శుభ్రమే చేయడం లేదని దిల్షాద్ అనే మహిళ వాపోయింది. కార్పొరేటర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఈవైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలపై ‘1100’కు ఫోన్ చేస్తే అమరావతి నుంచి కూడా స్పందిస్తారని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పక్కాఇల్లు మంజూరు చేయాలని ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా ఉపయోగం లేదని వెంకటలక్ష్మి అనే మహిళ నాయకుల దృష్టికి తీసుకొచ్చింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ,తదితరులు పాల్గొన్నారు. నేడు 42వ డివిజన్లో.. నగరంలోని 42వ డివిజన్లో మంగళవారం ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం ఉంటుందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉదయం 7.30 గంటలకు నడిమివంక గంగమ్మ గుడి వద్ద నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ల కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
కుట్రలో బాబూ.. లోకేష్ ఉన్నారేమో’
-
వైఎస్ఆర్ సీపీ నేతలపై ఖాకీల నిర్లక్ష్యం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసుల నిర్లక్ష వైఖరి కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసినా ఖాకీలు కళ్లు తెరవడం లేదు. గుంతకల్లు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి తుపాకీ లైసెన్సును పునరుద్ధరించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువుకు 25 రోజుల ముందే ఆయన దరఖాస్తు చేస్తుకున్నా స్పందించలేదు. తుపాకీ అప్పగించాలని ఆయనకు వజ్రకరూర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. గడువుకు ముందే దరఖాస్తు చేసుకున్నా లైసెన్సు ఎందుకు రెన్యువల్ చేయడం లేదని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి సరికాదని పేర్కొన్నారు. తన తుపాకీ లైసెన్సును రెన్యువల్ చేయాలని కోరారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి తుపాకీ లైసెన్సు రెన్యువల్ చేయకపోవడంతో నిరాయుధిగా ఉన్న ఆయనను ప్రత్యర్థులు ఈ నెల 21 కిరాతంగా హత్య చేశారు. నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపేశారు. -
రేషన్ డీలర్లకు మంత్రి భరోసా
అనంతపురం అర్బన్ : ఆందోళనలు విరమించి ప్రజ లకు ఇబ్బంది కలగకుండా సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, మీకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రేషన్ డీలర్లకు భరోసా ఇచ్చారని రేషన్ డీలర్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. డీలర్ల ఆందోళనపై స్పందించిన మంత్రి సునీత వారితో చర్చించేందుకు నాయకులు కొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి, మరికొందరు నాయకులు హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి తమ డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని, డిమాండ్ల విషయమై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలిస్తున్నారని, వచ్చే మంత్రివర్గ సమావేశంలో మీకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. క్వింటాళ్లుపై రూ. 87 కమీషన్, 100 శాతం తూకాలతో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక డిపో కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా, ఒక్కొక్క డీలర్లకు ప్రతి నెలా రూ. 10 వేలు ఆదాయం కల్పించాలని, తదితర డిమాండ్లపై డీలర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
‘ఇంటిపంట’ల ఉద్యమానికి ప్రోత్సాహం
తెలంగాణ ఉద్యాన శాఖ ఇన్చార్జ్ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక చొరవతో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ‘ఇంటిపంట’ల ఉద్యమం ఆరోగ్యదాయక ఆహారోత్పత్తి దిశగా జరిగిన మంచి ప్రయత్నమని, దీనికి మరింత తోడ్పాటునందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యాన శాఖ ఇన్చార్జి కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సేంద్రియ ఇంటిపంటలపై శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణా శిబిరం నిర్వహిస్తామన్నారు. సామగ్రి, మట్టిమిశ్రమం, సేంద్రియ కూరగాయ విత్తనాలతో కూడిన కిట్లను 2015-16లో కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. పౌరులందరూ ఇంటిపంటల సైన్యంగా తయారుకావాలని పిలుపునిచ్చారు. ఇరవైశాతంఖర్చుతోనే పాలిహౌస్‌లను నిర్మిం చుకొని దేశవాళీ విత్తనాలతో సులభంగా ప్రకృతి సేద్యం చేసే పద్ధతులపై నగరవాసులకు, రైతులకు విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ (బెంగళూరు)కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకర్‌రావు చెప్పారు. -
‘డీసీ’ డెరైక్టర్లకు ఐదు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం పొందారనే కేసులో డీసీ డెరైక్టర్లు వెంకటరామిరెడ్డి, వినాయకరవిరెడ్డిలను కోర్టు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈనెల 23 నుంచి 27 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వారిని కస్టడీలో విచారించేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి వై.వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఐదెకరాల్లోపు భూమి ఉన్న ఓసీలకూ 90 శాతం సబ్సిడీ
సూక్ష్మసేద్యంపై ప్రభుత్వానికి ఉద్యానశాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యంపై ఓసీలకు ఇస్తున్న సబ్సిడీని ఐదెకరాలలోపు భూమి ఉన్న వారికి 90 శాతం అమలు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఉద్యానశాఖ ప్రదర్శన సభలో రైతులు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీసిన సంగతి తెలిసిందే. తమలోనూ చిన్నసన్నకారు రైతులు ఉన్నందున ఐదెకరాల లోపున్న వారికి కూడా 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పోచారం ఆదేశాల మేరకు ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మంగళవారం ప్రతిపాదనలు తయారుచేసి పంపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఉంది. నూతన ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఐదెకరాల లోపున్న ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీ అమలుకానుంది. ఐదెకరాలు మించిన వారికి మాత్రం యథావిధిగా 80 శాతం మాత్రమే సబ్సిడీ ఉంటుంది. 90 శాతం సబ్సిడీ వల్ల అదనంగా 20 వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
పానీపాట్లు
వేసవికి ముందే జనం దాహార్తితో అల్లాడిపోతున్నారు. మడకశిర మండలం నల్లనాయకనపల్లి గ్రామస్తుల నీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. గ్రామంలోని మంచినీటి పథకానికి సంబంధించిన బోరు మోటారు వారం క్రితం చెడిపోయింది. మరో రెండు బోర్లు ఉన్నా వాటికి మోటార్లు అమర్చలేదు. దీంతో ప్రజలు శివారులోని వ్యవసాయ పొలాలు, సి.కొడిగేపల్లి గ్రామం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో 73 కుటుంబాలున్నాయి. 290 మంది నివసిస్తున్నారు. రోజంతా నీరు తెచ్చుకునేందుకే సరిపోతుందని స్థానికులు నవీన్‌కుమార్, ఎర్రప్ప, నరసింహప్ప, వెంకటరామిరెడ్డి, రామాంజనరెడ్డి వాపోయారు. -, మడకశిర రూరల్