
సాక్షి, సచివాలయం: అమరావతి పరిరక్షణ సమితిపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్‌లో చొప్పించారని, అందుకే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యామన్నారు. రాజధాని బిల్లు పాస్ అయితే కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. (రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం)
ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరిని తక్షణం రావాలని ఇబ్బందులు పెట్టొద్దని కూడా విజ్ఞప్తి చేసినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. రాజధాని తరలింపు కోసం 5 వేల కోట్లు అవుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పినట్లు వెల్లడించారు. (అమెజాన్ ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్)
Comments
Please login to add a commentAdd a comment