
సాక్షి, అమరావతి: రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు పిటిషన్‌లో 'రాష్ట్ర రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయి. అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుంది.
అమరావతి రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం. కొందరి రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారు. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. రాజధాని తరలింపు కు అయ్యే ఖర్చు 70 కోట్ల మాత్రమే. రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించలేదు' అని పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. (రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం: వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment