implead petition
-
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
-
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
సాక్షి, సచివాలయం: అమరావతి పరిరక్షణ సమితిపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్లో చొప్పించారని, అందుకే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యామన్నారు. రాజధాని బిల్లు పాస్ అయితే కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. (రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం) ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరిని తక్షణం రావాలని ఇబ్బందులు పెట్టొద్దని కూడా విజ్ఞప్తి చేసినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. రాజధాని తరలింపు కోసం 5 వేల కోట్లు అవుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పినట్లు వెల్లడించారు. (అమెజాన్ ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్) -
రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, అమరావతి: రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు పిటిషన్లో 'రాష్ట్ర రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయి. అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం. కొందరి రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారు. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. రాజధాని తరలింపు కు అయ్యే ఖర్చు 70 కోట్ల మాత్రమే. రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించలేదు' అని పిటిషన్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. (రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం: వైఎస్ జగన్) -
ఐటీగ్రిడ్స్ కేసు: నలుగురికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా ఇంప్లీడ్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దని పిటిషనర్ లోకేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రధాన అధికారికి, ఆధార్ అథారిటీ అధికారులుకి, ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు, డేటా ఎన్‌రోలింగ్ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ, లోకేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. (చదవండి: ఐటీగ్రిడ్స్‌పై వాడీవేడి వాదనలు) -
ఎందుకు ఇంప్లీడ్ అవ్వరు?
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ, వరంగల్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఇందుకోసమే హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తుతోందని అన్నారు. టీడీపీ ఓటుకు కోట్లు కేసులో ఇంప్లీడ్ అయిన టీఆర్ఎస్ సర్కారు హైకోర్టు విభజన అంశంలో ఎందుకు ఇంప్లీడ్ అవడం లేదని ఆయన ప్రశ్నించారు. కొంతమంది న్యాయవాదులు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.