సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం పొందారనే కేసులో డీసీ డెరైక్టర్లు వెంకటరామిరెడ్డి, వినాయకరవిరెడ్డిలను కోర్టు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈనెల 23 నుంచి 27 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వారిని కస్టడీలో విచారించేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి వై.వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.